సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో అనుమానంతో ఓ యువతిపై ప్రియుడు దాడికి పాల్పడ్డాడు. మహాలక్ష్మి అనే యువతిపై చిన్నారావు కొడవలితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి.
గత కొంతకాలంగా మహాలక్ష్మి, చిన్నారావు ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. అయితే మహాలక్ష్మిపై అనుమానం పెంచుకున్న చిన్నారావు.. ఆమెపై కొడవలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు మహాలక్ష్మిపై దాడి చేసిన అనంతరం చిన్నారావు అదే ప్రాంతంలోని ఓ భవనం పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి


