సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సత్యవేడులోని శ్రీ సిటీలో ఉన్న భారీ టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో పేలుడు ధాటికి పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది.
నైట్ షిఫ్ట్ నుంచి విధుల్లో ఉన్న పలువురు కార్మికులు పేలుడులో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎంతమంది ఉన్నారు? మరెవరైనా గాయపడ్డారా? అనే వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: విశాఖ విషాదం.. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం


