కడప డీఎస్పీగా రామకృష్ణుడు | Ramakrishnudu Takes Charge as Kadapa DSP | Sakshi
Sakshi News home page

కడప డీఎస్పీగా రామకృష్ణుడు

Oct 3 2026 8:18 AM | Updated on Oct 3 2026 8:18 AM

Ramakrishnudu Takes Charge as Kadapa DSP

కడప అర్బన్‌: కడప డీఎస్పీగా పి.రామకృష్ణుడును నియమిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నెల్లూరు ఏసీబీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై కడప డీఎస్పీగా రానున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 1995 బ్యాచ్‌కు చెందిన పి. రామకృష్ణుడు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఎస్‌ఐగా, సీఐగా పలు ప్రాంతాల్లోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో పని చేశారు. 

కడప తాలూకా పోలీస్‌స్టేష¯Œన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో 2008లో సీఐగా పదోన్నతి పొందారు. అనంతరం జిల్లాతోపాటు, రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో పని చేశారు. డీఎస్పీగా పదోన్నతి పొందిన తరువాత ప్రస్తుతం నెల్లూరు ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయనను కడప డీఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement