మద్యం మత్తులో తోబుట్టువుల ఘాతుకం | Tragic Incidents in Nellore and Krishna districts | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో తోబుట్టువుల ఘాతుకం

Oct 3 2026 5:38 AM | Updated on Oct 3 2026 5:38 AM

Tragic Incidents in Nellore and Krishna districts

ఒకచోట అన్నను చంపిన తమ్ముడు

మరోచోట తమ్ముడిని హతమార్చిన అన్న 

నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఘటనలు

మర్రిపాడు/దేవరకోట (ఘంటసాల): తోడబుట్టిన వారే కాలయముళ్లుగా మారి ప్రాణాలు తీసిన రెండు వేర్వేరు ఘటనలు నె­ల్లూ­రు, కృష్ణా జిల్లాల్లో కలకలం రేపాయి. శ్రీపొట్టిశ్రీరాములు నె­ల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని నాగరాజుపాడుకి చెంది­న కుంభగిరి రాజగోపాల్‌ (46)కు అతడి తమ్ముడు గోపీకి మధ్య పాత గొడవలున్నాయి. గతంలో తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో గోపీ అంగవైకల్యానికి గురయ్యాడు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య వివాదం ఉంది. గురువారం రాత్రి మద్యం మత్తులో అన్నతో గోపీ గొడవపడ్డాడు. కోపంతో బండతో రాజ­గోపాల్‌పై దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందాడు. అనంత­రం పోలీసులకు గోపీ లొంగిపోయాడు. రాజగోపాల్‌ భార్య గతంలో మృతిచెందగా.. కుమారుడు, కుమార్తె అనాథలయ్యారు.

క్షణికావేశంలో తమ్ముడిని హత్యచేసిన అన్న
అలాగే, కృష్ణాజిల్లా ఘంటసాల మండలం దేవరకోటలో గురువారం రాత్రి సీహెచ్‌. రాజ్‌కుమార్‌ (40) మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్నాడు. అతడి అన్న విజయ్‌కుమార్‌ తమ్ముడిని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇరువురు మధ్య గొడవ జరగ్గా ఆగ్రహించిన విజయ్‌కుమార్‌ క్షణికావేశంలో తమ్ముడు రాజ్‌కుమార్‌ తలపై అక్కడే ఉన్న రాయితో బలంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే విజయ్‌కుమార్‌ విజయవాడ పారిపోయాడు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు రాజ్‌కుమార్‌ను చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. విజయ్‌కుమార్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. రాజ్‌కుమార్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్ల క్రితమే ఇతడు భార్యతో విడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement