12 ఏళ్ల కొడుకు గొంతు నులిమి? కష్టాల్లో ప్రముఖ నటి | Halle Berry Ex Olivier Martinez Reveals that she choked her 12 year old son | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల కొడుకు గొంతు నులిమి? కష్టాల్లో ప్రముఖ నటి

Oct 2 2026 3:50 PM | Updated on Oct 2 2026 4:03 PM

Halle Berry Ex Olivier Martinez Reveals that she choked her 12 year old son

ప్రముఖ  హాలీవుడ్‌  నటి హాలీ బెర్రీ (Halle Berry) మరో వివాదంలో ఇరుక్కున్నారు.  ఇప్పటికే భర్తతో విడి తన 12 ఏళ్ల కుమారుడు మాసియో (Maceo)ని గొంతు నులిమి అమానుషంగా  ప్రవర్తించారనే వార్త   తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.  తాజా నివేదిక ప్రకారం,  తన కుమారుడితో జరిగిన వాగ్వాదంలో  ఆమె అతనిపై భౌతిక దాడికి పాల్పడిందని ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో 12 ఏళ్ల మాసియో తన తండ్రి, హాలీ మాజీ భర్త ఆలివర్ మార్టినెజ్ (Olivier Martinez)కి ఫోన్ చేసి తనను తీసుకెళ్లమని కోరాడంటూ కోర్టును ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో, మార్టినేజ్ తన కుమారుడికి కస్టడీ కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేశారు.  ఈ సందర్బంగా  గతంలో జరిగిన మరికొన్ని సంఘటనల గురించి కూడామార్టినెజ్ ప్రస్తావించారు. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం హాలీ తన  మైనర్ కొడుకువర్చువల్-రియాలిటీ గేమ్ ఆడుతుండగా  పట్ల హింసాత్మకంగా ప్రవర్తించింది.  సెప్టెంబర్ 26 నాటి తీవ్ర వాగ్వాద సమయంలో హాలీ తన కుమారుడి గొంతు నులిమిందని ఆలివర్ ఆరోపించారు. దీంతో భయపడిన కుమారుడు  తనను తీసుకెళ్లమని ఫోన్ చేశాడు. అంతేకాదు ఈ సందర్భంగా  హాలీ బెర్రీ పంపిన వ్యక్తిగత టెక్స్ట్ మెసేజ్‌ను కూడా కోర్టుకు ఆధారంగా చూపించారు. ఆమెను దూరంగా ఉండేలా (restraining order) కోరుతూ మార్టినెజ్ దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ సందేశాల స్క్రీన్‌షాట్‌లతోపాటు, అనేక ఇన్‌కమింగ్ ,అవుట్‌గోయింగ్ కాల్స్ సాక్ష్యాలుగా సమర్పించారు.

ముఖ్యంగా తనను తీసుకెళ్లమని కుమారుడి నుండి ఫోన్ వచ్చిందని మార్టినెజ్  చెప్పినప్పుడు, లేదు  ఇది  నచ్చలేదు..తను తన తల్లితోనే గొడవపడాలనుకుంటున్నాడా?? మనం ఎలాంటి బిడ్డను పెంచుతున్నాం అని  హ్యారీ చెప్పిందన్నారు. "ఇది తప్పు, ఆలివర్. నేను వాడి తల్లిని, ఇది తప్పు! వాడికి తన తల్లిపై గౌరవం లేదు, తండ్రిగా నీకు ఇది సరైంది కాదు అని  అని సమాధానమిచ్చిన స్క్రీన్‌‌షాట్‌ను ఆయన షేర్‌ చేశారు. అయితే బెర్రీ ఇంట్లో ఏం జరుగుతుందో తనకు తెలియదని మార్టినెజ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ ఇద్దరీ మధ్య  పెద్ద  గొడవే జరుగుతోందని తెలుస్తోందన్నారు. అయితే మాసియో ప్రవర్తన తన పట్ల సరిగ్గా లేదని, అతను అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడని బెర్రీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మార్టినెజ్ తెలిపారు.

హాలీ బెర్రీ స్పందన
నాలుగోసారి పెళ్లికి సిద్ధమవుతోంది హాలీ.  మాజీ భర్తతో మార్టినెజ్‌ కుమారుడిపై ప్రస్తుతం సంయుక్త కస్టడీని కలిగి ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొడుకు భద్రత రీత్యా మార్టినెజ్ ఇందులో మార్పులు కోరుతున్నారు, ప్రస్తుతానికి బెర్రీకి, మాసియోకి మధ్య ఎలాంటి కలయికలు ఉండకూడదంటూ. తనకు కస్టడీ కావాలంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను పాక్షికంగా ఆమోదించి, పాక్షికంగా తిరస్కరించింది. బెర్రీ అతని నుండి కనీసం 100 గజాల దూరంలో ఉండాలని ఆదేశించింది. ఈ ఆరోపణలపై హాలీ వాదనలను తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని  తన న్యాయవాది మెరీనా బెక్ ద్వారా స్పందించింది.

ఇదీ చదవండి: అన్ని ఉరిశిక్షలకు బ్రేక్‌ : ప్రాణాలతో బైటపడిన క్రిస్టా ఇపుడెలా ఉంది?

కాగా హాలీ బెర్రీ 1993లో డేవిడ్ జస్టిస్‌ను వివాహమాడింది. వీరు 1997లో విడిపోయారు. ఆ తరువాత 2021లో ఎరిక్ బెనెట్‌ను పెళ్లిచేసుకోగా, 2005లో విడాకులు తీసుకున్నారు. 2013లో ఒలివర్ మార్టినెజ్‌తో పెళ్లి,  కానీ 2016లో వీరు అధికారికంగా విడిపోయారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ సంగీత కారుడు వాన్ హంట్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement