వినీత్ మనోచా హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌! | New Twist Revealed in Uttar Pradesh Kanpur Vineet Manocha Case | Sakshi
Sakshi News home page

వినీత్ మనోచా హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌!

Sep 25 2026 10:40 AM | Updated on Sep 25 2026 11:49 AM

New Twist Revealed in Uttar Pradesh Kanpur Vineet Manocha Case

లక్నో: కాన్పూర్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ వ్యాపారి వినీత్ మనోచా హత్య కేసులో ఒక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన తండ్రి ఆస్తులను వేరే మహిళకు రాసిస్తారనే భయంతోనే ఆయన కుమారుడు సుబ్రత్ మనోచా  ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు.  

వినీత్ మనోచా వ్యక్తిగత జీవితంలో వేరే మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నారని, భవిష్యత్తులో ఆయన తన ఆస్తులన్నింటినీ ఆ మహిళ పేరు మీద బదిలీ చేస్తారనే భయంతోనే కుమారుడు సుబ్రత్ ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు. సుబ్రత్ బెట్టింగ్, మద్యానికి అలవాటు పడి సుమారు రూ.40 లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు. తండ్రి ఇస్తున్న డబ్బులు సరిపోకపోవడం, ఆస్తులు తనకు పూర్తిగా దక్కవనే దురాశతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  

ఈ హత్య కేసులో తొలుత పోలీసులు వినీత్ కోడలు (సుబ్రత్ భార్య) షాలును, సుపారీ కిల్లర్లను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల లోతైన విచారణలో అసలు కుట్రదారుడు సుబ్రత్ అని, తనను పోలీసుల నుంచి కాపాడుకోవడానికి భార్య షాలు పేరు చెప్పాలని కిల్లర్‌కు సుబ్రత్ ముందే సూచించినట్లు తేలింది.  

హంతకుడు విశాల్ గౌతమ్‌తో సుబ్రత్ నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కాల్ డిటైల్ రికార్డ్‌పై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో తేటతెల్లమైంది. హత్యకు ముందు ఇద్దరి మధ్య వందలాది సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఆధారాల ఆధారంగా పోలీసులు కుమారుడు సుబ్రత్ మనోచాను అరెస్ట్ చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.   

ఇదీ చదవండి : మలయాళం సినిమాను తలపించే ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement