బెంగళూరు: భూ వివాదానికి సంబంధించి జరిగిన గొడవలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితులతో దొడ్డ గ్రామీణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నవీన్‌కుమార్ దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా మీడియా ముందు ఫోజు కొడితే తాట తీస్తా.. ఈడియట్స్ అంటూ చిందులు తొక్కారు.
ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. దొడ్డ తాలూకా గజ్జగదహళ్లిలో భూ వివాదం నేపథ్యంలో గొడవ జరిగింది. బాధితులు న్యాయం కోసం దొడ్డ గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలో సీఐ నవీన్ కుమార్ బెదిరించడం వివాదాస్పందగా మారింది.


