Viral Video: పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తల వీరంగం | Tdp Activists Warn To Police In Tirupati Rural Police Station | Sakshi
Sakshi News home page

Viral Video: పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తల వీరంగం

Sep 24 2026 6:39 PM | Updated on Sep 24 2026 7:02 PM

Tdp Activists Warn To Police In Tirupati Rural Police Station

సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే పోలీసులకే వార్నింగ్‌ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు.. తిరుపతి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో వీరంగం సృష్టించారు. పోలీసులకు ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు వార్నింగ్‌ ఇస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ నెల 20న తిరుపతి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరగ్గా.. పోలీసులకు టీడీపీ కార్యకర్తలు వార్నింగ్‌ ఇస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

టీడీపీ నేత చిట్టి రాయల్‌ అనుచరుడు గిరి, చిట్టి రాయల్‌ తల్లి హేమలత వీరంగం సృష్టించారు. తమవాళ్లను ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులపై బెదిరింపులకు దిగారు. తాను ఎమ్మెల్యే పులివర్తి అనుచరుడునంటూ వీరంగం సృష్టించిన గిరి.. లోకేష్‌తో చెప్పి అందరినీ సస్పెండ్‌ చేయిస్తానని పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చాడు. వీడియో తీస్తున్న ఓ పోలీసును కొట్టడానికి టీడీపీ కార్యకర్త గిరి దూసుకెళ్లాడు. చంద్రబాబుకు చెప్పిన భయపడేది లేదంటూ గిరి రెచ్చిపోయారు.

ఇదీ చదవండి: కడుపు మండి.. జనసేన నేతపై గన్‌తో దాడి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement