సాక్షి, తాడేపల్లి: మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్, వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మరణంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
కాగా, వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గురువారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజశేఖర్ వైఎస్సార్‌సీపీకి అంకితభావంతో పనిచేశారని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించారని వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు.
మా పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గారి ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన లేని లోటు పార్టీకి, వ్యక్తిగతంగా నాకు ఎప్పటికీ పూడ్చలేనిది. రాజశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ తీరని శోకాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ… pic.twitter.com/WU401YZvz0
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 24, 2026
రాజశేఖర్ ఆకస్మిక మరణం బాధాకరమని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అయితే, గతంలో లిడ్‌క్యాప్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన రాజశేఖర్, ప్రస్తుతం పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి: ఏపీలో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం


