హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు మరియు హుస్సేన్ సాగర్ తీరం వద్ద గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా పరిసర ప్రాంతాలకు కిలోమీటర్ల మేర విగ్రహాల క్యూ కట్టింది.
భక్తుల రద్దడిని దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ (GHMC) ఆధ్వర్యంలో భారీ క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలలో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు మరియు మళ్లింపులు చేపట్టారు.


