-
సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి పూజలు.. లడ్డూ వేలం
సింగపూర్‌లో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుని జయజయద్వానాల మధ్య భక్తి శ్రద్దలతో, ఎంతో అద్యాత్మిక శోభతో ఘనంగా జరిగింది. సుమారు వందమంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించబడి ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దిన గణనాధుని ప్రధాన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పూజనంతరం వినాయకచవితి లడ్డు వేలం ఆసక్తికరంగా సాగింది. ఇందులో వీరగ్రూపు లడ్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి..పూజలో పాల్గొన్న పిల్లలందిరికి మట్టితో చేసిన గణపతి విగ్రహాలు అందించారు. అనంతరం 800 మందికి అన్నిరకాల 21 పత్రిని ఉచితంగా పంచిపెట్టారు. ఈ పూజా కార్యక్రమాన్ని సుమారు 500 ప్రత్యక్షంగా, 5000 మంది అంతర్జాలం ద్వారా వీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఇలాంటి ఆలయం దేశంలో మరెక్కడా లేదు.. దీని విశిష్టత ఇదే
ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూణెలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కతంలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయంప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం కింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పకర్లెద్దు. తొమ్మిది రోజులు పూణె చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్ నడిపిస్తోంది. -
మహారాష్ట్రలోని అష్టగణపతి ఆలయాల గురించి మీకు తెలుసా?
గణపతి ఉపాసనకు మహారాష్ట్ర పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో గణపతి క్షేత్రాలు కోకొల్లలు. వాటన్నిటిలోకి అష్టగణపతి క్షేత్రాలుగా ప్రాముఖ్యం సంతరించుకున్న ఎనిమిది క్షేత్రాలు గణాధిపత్యులకు ముఖ్యమైనవి. ఈ ఎనిమిదీ ‘అష్టగణపతి క్షేత్రాలు‘గా ప్రసిద్ధికెక్కాయి. 1. మయూరేశ్వర గణపతి – పూనా జిల్లాలో పూనా నుండి నలభై మైళ్ళ దూరంలో నున్న ’మోరగావ్’లో మయూరేశ్వర గణపతి ఆలయం ఉంది. 2. చింతామణి గణపతి – పూనా నుండి పధ్నాలుగు మైళ్ళదూరంలో నున్న ’థేపూర్’ చింతామణి గణపతి క్షేత్రం. 3. గిరిజాత్మజ గణపతి – పూనా నుండి అరవై మైళ్ళదూరంలో నున్న ’లేహ్యాద్రి’ అనే స్థలంలో గిరిజాత్మజ గణపతి క్షేత్రం వెలిసింది. 4. శ్రీ విఘ్నేశ్వర గణపతి – లేహ్యాద్రి సమీపంలోనే ’ఓఝల్’ స్థలంలో ’శ్రీవిఘ్నేశ్వర’ క్షేత్రం వెలిసింది. 5. మహోత్కట గణపతి – పునానుండి 32 మైళ్ళ దూరంలో ’’రాజన్గావ్’’లో మహోత్కట గణపతి ఆలయం ఉంది. 6. భల్లాలేశ్వర గణపతి – మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో ’పాలీ’ అనేచోట భల్లాలేశ్వర గణపతి క్షేత్రం ఉంది. 7. వరదవినాయకుడు – కులాబా జిల్లాలో ’’మహర్’’ అనే స్థలంలో ’’వరదవినాయక’’ ఆలయం ఉంది. 8. సిద్ధివినాయకుడు – అహ్మద్ నగర్ జిల్లాలో ’’సిద్ధటేక్’’ అనే స్థలంలో సిద్ధివినాయక క్షేత్రం వెలిసింది...!! -
ఈ వినాయకుడ్ని దర్శిస్తే..ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతుందట!
అన్ని విఘ్నాలనూ తొలగించే... తొలిపూజలందుకునే దేవుడిగా ప్రసిద్ధికెక్కిన గణపయ్యకు ఎన్నో రూపాలున్నాయి. వింతకాంతులతో వెలుగుతూ చిత్ర విచిత్ర రూపాలతో భాసించే ఆ దేవుణ్ణి అందరూ ఆరాధిస్తారు. గుడికట్టి పూజిస్తారు. ఆ గణనాథుణ్ణి మామూలుగా అందరికీ తెలిసిన ఆకారంలో గాకుండా విశిష్టంగా కనిపించే రూపాలతో దేశవిదేశాలలో అనేక ఆలయాలున్నాయి. వినాయక చవితి సందర్భంగా అరుదైన రూపంతో అగుపించే గణపతి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుని గురించి తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అక్కడి గణపయ్య విగ్రహం నానాటికీ పెరిగిపోతోందని స్థానికులు చెబుతారు. ఇక్కడే కాదు, మన భారతదేశంలో కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో విగ్రహాలు పెరుగుతాయని భక్తులు విశ్వాసం. కాణిపాకంలో లాగే కర్నూలు జిల్లా యాగంటిలో కూడా నంది విగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని భక్తుల నమ్మకం. అలాగే కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలోని మధుర్ గ్రామంలోని శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం కూడా పెరుగుతోందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఉత్త్తర కర్నాటకలో కాసర గోడ్ సమీపంలో మధుర్లో అనేక ఆలయాలున్నాయి ఇందులో మహాశివ ఆలయం, మహాగణపతి ఆలయం ముఖ్య మైనవి. ప్రకృతి ఒడిలోకి చేరినట్లు కనిపించే కేరళ... కర్నాటక బార్డర్లో కేరళ కొసన కసార్‌గాడ్ అనే పట్టణం ఉంది. ఈ పట్టణానికి అతి సమీపంలో మధుర్ మహాగణపతి అనే ఆలయం ఉంది. ఈ ఆలయం ఆవిర్భావం, చరిత్ర అన్నీ విశేషమే! నిజానికి చెప్పాలంటే ఈ ఆలయంలోని మూలవిరాట్టు ఆ పరమేశ్వరుడు. ఈ శివుని విగ్రహం కూడా ఓ స్వయంభువు గా వెలసినదని చెబుతారు. మధుర్ స్థలపురాణం ప్రకారం మధుర అనే ఒక స్త్రీ పెరుగుతున్నగణపతిని కనుగొన్నది. ఆమె పేరు మీదగానే ఈ ఆలయం మధూరాలయంగా మరియు ’మధుర్ మహాగణపతి ఆలయం’గా ప్రసిద్ది చెందింది. విగ్రహాన్ని ఆమె తొలిసారి చూసింది కనుక ప్రస్తుతం తొలి దర్శనాన్ని ప్రత్యేకించి మహిళకే కల్పిస్తున్నారు. మరి అంతటి మహిమల గల ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్థల పురాణం ప్రకారం ఒక పురాణగాథ స్థల పురాణం ప్రకారం ఒక పురాణగాథ ఉంది. మధుర్ గణపతి ఆలయ పూజారి పిల్లవాడు ఒక సారి ఈ శివాలయానికి వచ్చాడు. ఆడుకుంటూ, ఆడుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళి, అక్కడి దక్షిణంవైపు ఉన్న గోడమీద వినాయకుని రూపాన్ని సరదాగా చెక్కాడు. ఆ పిల్లవాడి భక్తికి మెచ్చాడో...తండ్రి చెంత తను కూడా ఉండాలనుకున్నాడో కానీ..ఆ బొమ్మ నుండి ఒక వినాయకుని రూపం ఆవిర్భవించడం మొదలైంది. అంతే కాదు..అలా మొదలైన ఆ రూపం నానాటికీ పెరుగుతోందని, అందుకే ఆ వినాయకుడిని బొడ్డ గణపతి అని పిలుస్తున్నారు. బొడ్డ గణపతి అంటే బొజ్జగణపయ్య అని అర్థం.మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా కనబడుతుంది. మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఉంటుంది. ఏనుగు వెనుక భాగంలాగా కనిపించే ఇలాంటి నిర్మాణాలని గజప్రిస్త’గోపురాలని పిలుస్తారు. ఆలయంలోని చెక్క మీద మహాభారత, రామాయణ ఘట్టాలని తలపించే శిల్పాలని చెక్కడం చూడవచ్చు. ఆలయ సమయాలు: ఈ ఆలయాన్ని ప్రతి రోజూ ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది. ఇక్కడికి ఆదివారం నాడు భక్త జన సందోహం ఎక్కువ గా రావటం విశేషం.ఈ ఆలయం చరిత్రకు మరో విశేషం కూడా ఉంది. ఈ ఆలయం చరిత్రకు మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే టిప్పుసుల్తాను దాడి. ఒకసారి టిప్పు సుల్తాను తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ దిశగా వచ్చాడట. తిరుగుముఖంలో ఇక్కడి ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడట. కానీ ఈ ఆలయంలోని మంచినీరు తాగిన వెంటనే ఆయన మనసు మారిపోయిందట. అయితే తన సైనికుల తృప్తి కోసం నామకార్థంగా తన ఖడ్గంతో ఆలయం గోడ మీద ఒక వేటు వేసి వెళ్లిపోయాడట. ఇప్పటికీ ఆలయం గోడ మీద టిప్పు సుల్తాను తన ఖడ్గంతో మోదిన గుర్తుని చూడవచ్చు. ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టం ఏదైనా కొత్త పనిని ఆరంభించేటప్పుడు, అనుకున్న పనికి అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు..... ఈ ఆలయాన్ని దర్శిస్తే తప్పక ఫలితం దక్కుతుందన్నది భక్తుల నమ్మకం. ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టమట. అందుకనే ఈ స్వామిని దర్శించుకుని ఆయనకు అప్పాలను ప్రసాదంగా సమర్పిస్తే... ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతాయని అంటారు. సహస్రాప్పం పేరుతో స్వామివారికి వేయి అప్పాలను నివేదించే ఆచారమూ ఇక్కడ కనిపిస్తుంది.ఈ ఆలయం కేరళలో ఉన్నా, కర్ణాటకకి కూడా ఇది చేరువే అవుతుంది. ఈ ఆలయం కేరళలో ఉన్నా, కర్ణాటకకి కూడా ఇది చేరువే అవుతుంది. కర్ణాటకలోని మంగళూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో కన్నడిగులు కూడా వేలాదిగా ఈ స్వామివారిని దర్శించుకుంటారు. గోకర్ణం దగ్గర నుంచి సాగే ఆరు వినాయకుని క్షేత్రదర్శనంలో మధుర్ మహాగణపతి ఆలయం కూడా ఓ భాగమే! -
Ganesh Chaturthi 2023: మనం కొలిచే తొలి దైవం ఆయనే..ఆనాటి నుంచే ఆచారం
సమస్త విఘ్నాలను పోగొట్టి,సర్వ విజయాలను,సత్వర ఫలాలను అందించే విఘ్ననాయకుడు వినాయకుడి పండుగను సభక్తి పూర్వకంగా జరుపుకోవడం అఖండ భారతీయులకు అనాదిగా వస్తున్న ఆచారం.మనం పూజించే తొలి దైవతం ఆయనే. ఎంతటి నాయకుడైనా వినాయకుడి ముందు సాగిలపడాల్సిందే.తమ ఇచ్ఛలు తీరాలంటే ఈ దేవుడిని కొలవాల్సిందే.భిన్న మతాలు,జాతులు కులాలు,సంస్కృతుల సంగమమైన భారతదేశాన్నిఏకం చేసింది,ఈ నేలపై జీవించేవారినందరినీ ఐక్యంగా నిలిపిందీ సనాతన ధర్మం.సహనం,సమ భావనందానికి ఆధారం."సర్వేజనా సుఖినో భవంతు"అన్న ఆర్యవాక్కులు దానికి మూలాధారం.సర్వజనులు బాగుండాలనే మంచితనం మనవారి రక్షణ కవచం.ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో వచ్చి,మనల్ని దురాక్రమించారు. వందల ఏళ్ళు ఈ రాజ్యం పరాయి పాలనలో సాగింది.ఎన్నో భాషా సంస్కృతులు వచ్చి చేరాయి.చాలా సంపదను కోల్పోయాం,విష కౌగిళ్ళ మధ్య నలిగిపోయాం.తుచ్ఛ సంస్కృతి వీధుల్లో ఏరులై పారింది.వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డాం.మన ఉనికిని కాపాడుకున్నాం.మనదైన సంప్రదాయం మృగ్యమవకుండా చూసుకున్నాం.ప్రపంచ దేశాలలో భారత్ ను విశిష్టంగా గౌరవింప చేసింది,వివేకానంద వంటి మహనీయులు ప్రసంగిస్తుంటే ఆంగ్లేయులు సైతం మ్రాన్పడి వినేలా చేసింది మనదైన సంస్కారం.ఈ విశిష్ట విధానమే మన జీవనశైలి,మన పెంపకం.కలిసిమెలిసి వుండే కుటుంబ బంధాలు,గొప్ప వివాహ వ్యవస్థ మన దేశాన్ని సర్వోన్నతంగా నిలిపాయి.అదే మన సనాతన ఆచారంలోని ఔన్నత్యం. ఆచారం అంటే ఆచరించేది.హంగూ అర్భాటాలతో ప్రదర్శించేది కాదు.ఆత్మశుద్ధితో సాగే ఆరోగ్య స్రవంతి.పండుగలు మన జీవితంలో భాగం.హృదయంగమంగా జరుపుకోవడం ఒక యోగం.ఇంతటి ఉదాత్త విధానాల రూపమైన పండుగలు,ఆచారాలు రాజకీయాలకు వేదికలుగా మారడం మారుతున్న సమాజానికి, అడుగంటుతున్న విలువలకు అద్దం పట్టే విషాదం.అనంత కాలప్రవాహంలో,లక్షలాదిసంవత్సరాల మానవ జీవన పయనంలో కరోనా కాలం ఎంతో బాధించింది.ఇప్పుడు నిఫా వైరస్ అంటున్నారు.గతంలోనూ ఇటువంటివి ఎన్నో వచ్చి వెళ్లిపోయాయి.రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.మంచిరోజులు వస్తాయి.భక్తి ప్రదర్శన కాదు.ఆత్మగతమైన అనుభూతి,బుద్ధిని ప్రక్షాళనం చేసే సద్గతి,అని మన పూర్వులు చెప్పారు.అఫ్ఘాన్ వంటి దేశాలను చూస్తేవారి రాక్షస ప్రవృత్తే వారిని ఏకాకులను చేసింది. డబ్బు పరంగా అగ్రరాజ్యమనే పేరున్నా,అమెరికాపై ప్రపంచ దేశాలకు విశ్వాసం లేదు.తుపానులా పైకి లేచిన చైనాను ఎవ్వరూ నమ్మరు.మూలక్షేత్రానికే దెబ్బకొడదామని చూసే పాకిస్తాన్ పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు.క్షణక్షణానికి బంధాలు మార్చుకుంటున్న రష్యా తీరూ అంతే.ఒకప్పుడు అనంతమైన సంపదకు,సర్వ విద్యలకు నెలవుగా ఉన్న భారతదేశం,నేటికీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నప్పటికీ,ప్రపంచం మనల్ని విశ్వసిస్తోంది,గౌరవిస్తోంది.ప్రపంచ తత్త్వశాస్త్రాలను -భారత తత్త్వ సిద్ధాంతాలను తులనాత్మకంగా విశ్లేషించి,భారతీయమైన ఔన్నత్యాన్ని ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో వివరిస్తూ, ప్రసంగం సాగిస్తే! మేధోసమాజమంతా ఆయనకు,ఆయనలోని భారతీయతకు మోకరిల్లింది. భారతీయ తత్త్వం తెలిసినవారే పాలకులుగా ఉండాలన్నది సర్వేపల్లివారి సంకల్పం.కులాలు,మతాలు, ప్రాంతాలు దాటి రాజకీయాలు సాగే పరిస్థితులు నేడు లేనే లేవు.వినాయకచవితి పండుగ ఎలా జరుపుకోవాలో వాళ్లే నిర్దేశిస్తున్నారు.ఒకరికి నచ్చినది ఇంకొకరికి నచ్చదు.ప్రజలను తదనుగుణంగా తమవైపు తిప్పుకొని రాజకీయమైన లబ్ధి పొందాలనే దృష్టి తప్ప,సంప్రదాయంపై,ఆచార వ్యవహారాలపై ప్రేమ కాదని తెలుస్తూనే ఉంటుంది.వివాదాలకు కావాల్సినంత ప్రచారం జరుగుతూనే ఉంటుంది.పండుగలను వివాదాలకు,ఆచారాలను రాజకీయాలకు వేదికగా మారని సమాజాన్ని చూడాలన్నది విజ్ఞుల హృదయం.సర్వజనులకు జయావహం,ప్రియంవదమైన వాతావరణం రావడమే పర్వదినం. సర్వ విఘ్నాలను తొలగించి,సకల జనులకు సకల జయాలను కలిగించి,ముప్పులకు ముగింపు పలికి,ప్రగతి ప్రయాణానికి ముహూర్తం పెట్టాలని విఘ్ననాయకుడికి విజ్ఞప్తి చేసుకుందాం.సనాతన ధర్మం, భారతీయత అందించిన సదాచారాల మధ్య,సమభావనతో,సోదర తుల్యంగా సహజీవనం చేద్దాం.పర్వదినం అంటే? సర్వులకు మంచిరోజు.పర్యావరణ హితంగా పండుగ జరుపుకుందాం. సరికొత్త సంకల్పాలకు శ్రీకారం చుడదాం.సిద్ధి దిశగా కృషి సాగిద్దాం. --మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement