ఈ వినాయకుడ్ని దర్శిస్తే..ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతుందట! | What Is The History Of Madhur Ganapathi Temple? | Sakshi
Sakshi News home page

Madhur Ganapathi Temple: ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకున్నా టిప్పుసుల్తాను..కానీ ఏం జరిగిందంటే

Published Mon, Sep 18 2023 11:26 AM | Last Updated on Mon, Sep 18 2023 1:27 PM

What Is The History Of Madhur Ganapathi Temple? - Sakshi

అన్ని విఘ్నాలనూ తొలగించే... తొలిపూజలందుకునే దేవుడిగా ప్రసిద్ధికెక్కిన గణపయ్యకు ఎన్నో రూపాలున్నాయి. వింతకాంతులతో వెలుగుతూ చిత్ర విచిత్ర రూపాలతో భాసించే ఆ దేవుణ్ణి అందరూ ఆరాధిస్తారు. గుడికట్టి పూజిస్తారు. ఆ గణనాథుణ్ణి మామూలుగా అందరికీ తెలిసిన ఆకారంలో గాకుండా విశిష్టంగా కనిపించే రూపాలతో దేశవిదేశాలలో అనేక ఆలయాలున్నాయి. వినాయక చవితి సందర్భంగా అరుదైన రూపంతో అగుపించే గణపతి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. 

ఆంధ్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుని గురించి తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అక్కడి గణపయ్య విగ్రహం నానాటికీ పెరిగిపోతోందని స్థానికులు చెబుతారు. ఇక్కడే కాదు, మన భారతదేశంలో కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో విగ్రహాలు పెరుగుతాయని భక్తులు విశ్వాసం. కాణిపాకంలో లాగే కర్నూలు జిల్లా యాగంటిలో కూడా నంది విగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని భక్తుల నమ్మకం. అలాగే కేరళలోని కాసర్‌ గోడ్‌ జిల్లాలోని మధుర్‌ గ్రామంలోని శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం కూడా పెరుగుతోందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఉత్త్తర కర్నాటకలో కాసర గోడ్‌ సమీపంలో మధుర్లో అనేక ఆలయాలున్నాయి ఇందులో మహాశివ ఆలయం, మహాగణపతి ఆలయం ముఖ్య మైనవి.

ప్రకృతి ఒడిలోకి చేరినట్లు కనిపించే కేరళ... కర్నాటక బార్డర్లో కేరళ కొసన కసార్‌గాడ్‌ అనే పట్టణం ఉంది. ఈ పట్టణానికి అతి సమీపంలో మధుర్‌ మహాగణపతి అనే ఆలయం ఉంది. ఈ ఆలయం ఆవిర్భావం, చరిత్ర అన్నీ విశేషమే! నిజానికి చెప్పాలంటే ఈ ఆలయంలోని మూలవిరాట్టు ఆ పరమేశ్వరుడు. ఈ శివుని విగ్రహం కూడా ఓ స్వయంభువు గా వెలసినదని చెబుతారు. మధుర్‌ స్థలపురాణం ప్రకారం మధుర అనే ఒక స్త్రీ పెరుగుతున్నగణపతిని కనుగొన్నది. ఆమె పేరు మీదగానే ఈ ఆలయం మధూరాలయంగా మరియు ’మధుర్‌ మహాగణపతి ఆలయం’గా ప్రసిద్ది చెందింది. విగ్రహాన్ని ఆమె తొలిసారి చూసింది కనుక ప్రస్తుతం తొలి దర్శనాన్ని ప్రత్యేకించి మహిళకే కల్పిస్తున్నారు. మరి అంతటి మహిమల గల ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం

స్థల పురాణం ప్రకారం ఒక పురాణగాథ స్థల పురాణం ప్రకారం ఒక పురాణగాథ ఉంది. మధుర్‌ గణపతి ఆలయ పూజారి పిల్లవాడు ఒక సారి ఈ శివాలయానికి వచ్చాడు. ఆడుకుంటూ, ఆడుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళి, అక్కడి దక్షిణంవైపు ఉన్న గోడమీద వినాయకుని రూపాన్ని సరదాగా చెక్కాడు. ఆ పిల్లవాడి భక్తికి మెచ్చాడో...తండ్రి చెంత తను కూడా ఉండాలనుకున్నాడో కానీ..ఆ బొమ్మ నుండి ఒక వినాయకుని రూపం ఆవిర్భవించడం మొదలైంది. అంతే కాదు..అలా మొదలైన ఆ రూపం నానాటికీ పెరుగుతోందని, అందుకే ఆ వినాయకుడిని బొడ్డ గణపతి అని పిలుస్తున్నారు. బొడ్డ గణపతి అంటే బొజ్జగణపయ్య అని అర్థం.మధుర్‌ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా మధుర్‌ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా కనబడుతుంది. మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఉంటుంది. ఏనుగు వెనుక భాగంలాగా కనిపించే ఇలాంటి నిర్మాణాలని గజప్రిస్త’గోపురాలని పిలుస్తారు. ఆలయంలోని చెక్క మీద మహాభారత, రామాయణ ఘట్టాలని తలపించే శిల్పాలని చెక్కడం చూడవచ్చు.

ఆలయ సమయాలు: ఈ ఆలయాన్ని ప్రతి రోజూ ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది. ఇక్కడికి ఆదివారం నాడు భక్త జన సందోహం ఎక్కువ గా రావటం విశేషం.ఈ ఆలయం చరిత్రకు మరో విశేషం కూడా ఉంది. ఈ ఆలయం చరిత్రకు మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే టిప్పుసుల్తాను దాడి. ఒకసారి టిప్పు సుల్తాను తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ దిశగా వచ్చాడట. తిరుగుముఖంలో ఇక్కడి ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడట. కానీ ఈ ఆలయంలోని మంచినీరు తాగిన వెంటనే ఆయన మనసు మారిపోయిందట. అయితే తన సైనికుల తృప్తి కోసం నామకార్థంగా తన ఖడ్గంతో ఆలయం గోడ మీద ఒక వేటు వేసి వెళ్లిపోయాడట. ఇప్పటికీ ఆలయం గోడ మీద టిప్పు సుల్తాను తన ఖడ్గంతో మోదిన గుర్తుని చూడవచ్చు.

ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టం ఏదైనా కొత్త పనిని ఆరంభించేటప్పుడు, అనుకున్న పనికి అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు..... ఈ ఆలయాన్ని దర్శిస్తే తప్పక ఫలితం దక్కుతుందన్నది భక్తుల నమ్మకం. ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టమట. అందుకనే ఈ స్వామిని దర్శించుకుని ఆయనకు అప్పాలను ప్రసాదంగా సమర్పిస్తే... ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతాయని అంటారు. సహస్రాప్పం పేరుతో స్వామివారికి వేయి అప్పాలను నివేదించే ఆచారమూ ఇక్కడ కనిపిస్తుంది.ఈ ఆలయం కేరళలో ఉన్నా, కర్ణాటకకి కూడా ఇది చేరువే అవుతుంది. ఈ ఆలయం కేరళలో ఉన్నా, కర్ణాటకకి కూడా ఇది చేరువే అవుతుంది. కర్ణాటకలోని మంగళూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో కన్నడిగులు కూడా వేలాదిగా ఈ స్వామివారిని దర్శించుకుంటారు. గోకర్ణం దగ్గర నుంచి సాగే ఆరు వినాయకుని క్షేత్రదర్శనంలో మధుర్‌ మహాగణపతి ఆలయం కూడా ఓ భాగమే!
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement