‘నేచర్ ఆస్కార్ అవార్డ్స్’లో బెస్ట్ యాక్టర్ ఇన్స్ సర్వైవల్ డ్రామా ట్రోఫీ ఎవరికి దక్కాలంటే, సందేహమే లేదు, ఒపాసమ్‌కే వస్తుంది! ఎందుకంటే ఈ చిన్న జంతువు సస్పెన్స్ థ్రిల్లర్ లెవెల్‌లో యాక్టింగ్ చేస్తుంది. ప్రమాదం ఎదురైతే ఒక్కసారిగా నేలపై పడిపోతుంది, శరీరాన్ని పూర్తిగా శవంలా మార్చేసుకుని, కళ్ళు మూసేసుకుని చచ్చిపోయినట్లు నటిస్తుంది.
అంతే కాదు, తనను వేటాడటానికి వచ్చిన జంతువులకు తాను చచ్చినట్లు నమ్మకం కలిగించడానికి కుళ్లిన శవం వాసన కూడా విడుదల చేస్తుంది. దీన్ని ఆ పరిస్థితిలో చూసిన క్రూరమృగాలు ‘ఇది చచ్చిపోయింది, పైగా కుళ్లిపోతోంది కూడా!’ అని అనుకుని వెనక్కి తగ్గిపోతాయి. ఈ సీక్రెట్ సర్వైవల్ ట్రిక్‌నే ‘ప్లేయింగ్ పోసమ్’ అంటారు. ప్రకృతి ఇచ్చిన ఈ సహజ రక్షణ పద్ధతితో, శత్రువు వెళ్లిపోయాక మన ఒపాసమ్ నెమ్మదిగా కళ్లు తెరచి, డ్రామా పూర్తయ్యిందని తెలుసుకుని, సైలెంట్‌గా జంగిల్‌లోకి జారిపోతుంది!


