దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను పలు కష్టాలు ఒక్ సారిగా చుట్టుముట్టాయి. ఇండిగో విమానాలకు గురువారం కొన్ని గంటల్లోనే రెండు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో మదీనా-హైదరాబాద్ విమానాన్ని దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ అయిందో లేదో మరో బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన 300కి పైగా విమానాల రద్దుతో విమాన ఆలస్యాన్ని, ప్రయాణికుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది ఇండిగో. తాజాగా మరో బాంబు బెదిరింపు కాల్ రావడంతో షార్జా నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానం షార్జా నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్తుండగా, గాలిలో ఉండగానే బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ,ముంబై విమానాశ్రయానికి చేరుకుని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి సహాయం చేశారు. రెండవ బాంబు బెదిరింపుపై అధికారులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.

గురువారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు రావడంతో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సౌదీ అరేబియాలోని మదీనా నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న విమానం అహ్మదాబాద్‌కు మళ్లించాల్సి వచ్చింది. విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
#WATCH | Ahmedabad, Gujarat: Atul Kumar Bansal, DCP Zone-4, Ahmedabad City, says, "Today, an Indigo flight from Medina to Hyderabad made an emergency landing at Ahmedabad Airport. This was because a threatening email about the flight was received at Hyderabad Airport. All… https://t.co/MtCKwk7fCv pic.twitter.com/TxPdRdDVfC
— ANI (@ANI) December 4, 2025


