సాక్షి, హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. కువైట్ నుంచి శంషాబాద్‌కు ఈ ఉదయం(మంగళవారం) రావాల్సిన విమానానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. అయితే..
షెడ్యూల్ ప్రకారం గత అర్ధరాత్రి 1.30గం. కువైట్ నుంచి 6ఈ1234 విమానం హైదరాబాద్‌కు బయల్దేరింది. ఉదయం 8.10గం.కి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే బాంబ్ బెదిరింపు మెయిల్‌తో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు.
అటువిమానం ముంబైలోనూ ఇంకా ల్యాండ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.


