14 అరైవల్, 19 డిపార్చర్‌ విమానాలు రద్దు | The number of cancellations of flights from Shamshabad Airport is increasing due to the war | Sakshi
Sakshi News home page

14 అరైవల్, 19 డిపార్చర్‌ విమానాలు రద్దు

Mar 1 2026 4:33 AM | Updated on Mar 1 2026 4:33 AM

The number of cancellations of flights from Shamshabad Airport is increasing due to the war

శంషాబాద్‌: పశ్చిమాసియా దేశాల్లో కొనసాగు­తున్న యుద్ధ ప్రభావంతో శంషాబాద్‌ ఎయిర్‌­పోర్టు నుంచి రాకపోకలు సాగించే విమానాల రద్దు సంఖ్య పెరుగుతోంది. రాత్రి 9 గంటల వరకు గల్ఫ్‌తో పాటు ఆసియా దేశాల నుంచి రావాల్సిన మొత్తం 14 విమానాలు రద్దు కాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి గల్ఫ్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లాల్సిన 19 విమానాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. 

యుద్ధం కారణంగా దోహా, బహ్రెయిన్‌ల గగనతలం మూసివేయడంతో శంషాబాద్‌ విమానాశ్రయా­నికి రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దయ్యాయి. ఇందులో హైదరాబాద్‌ నుంచి దోహా, షార్జా, కువైట్, ధమామ్, అబుదాబి, రస్‌ అల్‌ఖైమాకు వెళ్లే విమానాలతో పాటు సింగపూర్, మలేషియా, బ్యాంకాక్‌కు చెందిన విమానాలు కూడా ఉన్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement