breaking news
flight cancellations
-
ఇండిగో సీఈవోపై ప్రశ్నల వర్షం
ముంబై/న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు తో తలెత్తిన సంక్షోభంపై సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ విచారణ కొనసాగుతోంది. డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు శుక్రవారం వరుసగా రెండో రోజూ పీటర్ ఎల్బర్స్‌ను దాదాపు ఏడుగంటలపాటు ప్రశ్నించారు. ఇండిగో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇసిడ్రోను కూడా ఐదుగంటలపాటు విచారణ జరిపారు. అదేవిధంగా, విమానాల రాకపో కలను పర్యవేక్షించడంలో లోపాలను గుర్తించిన డీజీసీఏ అధికారులు అందుకు బాధ్యులైన నలుగురు ఫ్లయిట్ ఆప రేషన్స్ ఇన్స్పెక్టర్లను తొలగించారు. ప్రయా ణికులకు పరిహారంగా రూ.10వేల చొప్పున ట్రావెల్ వోచర్లు ఇస్తే, సంస్థపై రూ.500 కోట్ల వరకు భారం పడుతుందని ఇండిగో శుక్రవా రం తెలిపింది. అంతేకాదు, విమాన రాకపో కల్లో మూల కారణాన్ని తెలుసుకునేందుకు వైమానిక రంగ నిపుణుడిని నియమిస్తున్నట్లు తెలిపింది. రివైజ్డు తగ్గింపు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం 2 వేలకు పైగా విమానాలను నడిపినట్లు తెలిపింది. -
ఇండిగోపై దూకుడు పెంచిన డీజీసీఏ
న్యూఢిల్లీ/ముంబై: వేలాదిగా విమాన సర్వీసు లను రద్దు చేసి, తీవ్ర సంక్షోభానికి తెరలేపిన ఇండిగోపై అధికారులు సమీక్ష పెంచారు. ఇండిగో ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అధికారులు ఆ సంస్థ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. ప్రయాణికులకు టిక్కెట్ల రుసుమును వాపసు చేయడంపైనా సమీక్ష జరిపారు. అదేవిధంగా, ఈ శీతాకాల సీజన్లో ఇండిగో నడపాల్సిన 2,300 విమానాల్లో 10 శాతం మేర కోత విధిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. ఇలా ఉండగా, విమానాల రద్దుతో ఇబ్బందులు పడిన ప్రయాణికులకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పరిహారాన్ని ట్రావెల్ వోచర్ల రూపంలో అందజేస్తామని ఇండిగో గురువారం ప్రకటించింది. వీటిని ఏడాదిలోగా వాడుకోవచ్చంది. అయితే, ఈ వెసులుబాటును ఎందరికి ఇస్తున్నదీ వివరించలేదు. అదేసమయంలో, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన 200కు పైగా విమాన సర్వీసులను గురువారం రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. తాము సుమారు 3 లక్షల ప్రయాణికుల కోసం 1,950 విమానాలను నడపగలమని పేర్కొంది. సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను డీజీసీఏ ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ గురువారం ప్రశ్నించింది. శుక్రవారం కూడా విచారణకు రావాలని ఆదేశించింది. భారీ సంఖ్యలో విమానాల రద్దుకు దారితీసిన వాస్తవ పరిస్థితులపై మరింత లోతుగా ఈ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఇండిగోలో పైలట్ల షెడ్యూల్ నిర్ణయం, రోస్టర్ విధానంలో లోపాలు, పైలట్ల కోసం కేంద్రం జారీ చేసిన నిబంధనల అమలుకు ఇండిగో చేపట్టిన సన్నద్ధతా చర్యల వంటి వాటిపై కమిటీ క్షుణ్నంగా పరిశీలన జరపనుంది. -
ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్ ఏంటంటే..
సాక్షి,ముంబై: తీవ్ర సంక్షోభం, గందరగోళం మధ్య విమానయాన సంస్థ ఇండిగో బాధిత ప్రయాణికుల స్వల్ప ఊరట నిచ్చింది. వరుస విమానాల రద్దు, ప్రయాణీకుల ఇక్కట్లు , డీజీసీఏ చీవాట్లు నేపథ్యంలో విమాన రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందించనుంది. ఈ మేరకు డిసెంబర్ 11 గురువారం ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది.డిసెంబర్ 3, 4 మరియు 5 తేదీలలో విమాన అంతరాయాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తామని ఎయిర్‌లైన్ తెలిపింది. విమాన ఆలస్యాలు , రద్దుల కారణంగా ప్రయాణికులకు ఎయిర్‌లైన్ చెల్లించాల్సిన వాపసులు, ప్రభుత్వం నిర్దేశించిన పరిహారానికి ఇండిగో ప్రకటించిన ఈ ఆఫర్ అదనం. రాబోయే 12 నెలల్లో ఇండిగోతో భవిష్యత్తులో చేసే ఏదైనా ప్రయాణానికి వోచర్లను రీడీమ్ చేసుకోవచ్చని తెలిపింది.రద్దు చేయబడిన అన్ని విమానాలకు రీఫండ్ల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు ఇండిగో తెలిపింది. రీఫండ్లు ఇప్పుడు కస్టమర్ ఖాతాలో క్రెడిట్అయ్యాయనీ, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తున్నామని తెలిపింది. ట్రావెల్ ప్లాట్‌ఫామ్ భాగస్వాముల ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్ల రీఫండ్లు కూడా ప్రారంభమైనట్టు పేర్కొంది. మరోవైపు విమాన టికెట్ల చార్జీల రీఫండ్‌తోపాటు, ప్రస్తుత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, బయలుదేరే సమయం నుండి 24 గంటలలోపు విమానాలు రద్దు చేయబడిన వినియోగదారులకు, విమానం బ్లాక్ సమయం ఆధారంగా ఇండిగో రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు పరిహారాన్ని అందిస్తుంది. ఇదీ చదవండి: రూ. 9.1 కోట్లు ఉంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ మీదే! ఎలా అప్లయ్ చేయాలి? -
మరో 220 విమానాలు రద్దు
న్యూఢిల్లీ: ఇండిగో విమానాల సంక్షోభం కొనసాగుతూనే ఉంది. బుధవారం 220 విమానాలు రద్దయ్యాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటిదాకా 4,000కుపైగా విమానాలు రాకపోకలు సాగించలేదు. ఎక్కడికక్కడ ఎయిర్‌పోర్టుల్లోనే ఆగిపోయాయి. ఇండిగో నిర్వాకం వల్ల వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే, పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోందని, రద్దవుతున్న విమానాల సంఖ్య తగ్గిపోతోందని ఇండిగో వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇండిగో కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇండిగో ప్రధాన కార్యాలయంలో తమ సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇద్దరు ప్రభుత్వ అధికారులతో సహా ఎనిమిది మంది సీనియర్ కెపె్టన్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇండిగో గుర్గావ్ కార్యాలయంలో మకాం వేసి విమానాల రాకపోకలు, రద్దు, సిబ్బంది కొరత వంటి అంశాలను స్వయంగా పర్యవేక్షించనుంది. అలాగే డీజీసీకే నిత్యం నివేదిక సమరి్పస్తుంది. సీఈఓకు డీజీసీఏ సమన్లు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ డీజీసీఏ సమన్లు జారీ చేసింది. గురువారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సంక్షోభంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు 11 ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ఆపరేషన్లను స్వయంగా తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇందుకోసం నియమించిన ప్రత్యేక సిబ్బంది రాబోయే రెండు మూడు రోజుల్లో ఆయా ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేస్తారని వెల్లడించింది. సవరించిన విమానాల షెడ్యూల్‌ను ఇండిగో ఇప్పటికే డీజీసీఏకు సమరి్పంచింది. పరిహారం ఇవ్వాలి: ఢిల్లీ హైకోర్టు ఇండిగో విమానాల సంక్షోభంపై వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరిస్థితి చెయ్యిదాటిపోయే దాకా ఎందుకు వేచి చూశారని ఆక్షేపించింది. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. విమానాల రద్దు వల్ల నష్టపోయిన ప్రయాణికులకు తగిన పరిహారం ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఇందుకోసం చర్య లు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఇండిగో యా జమాన్యాన్ని ఆదేశించింది. విచారణ కమిటీ నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని స్పష్టంచేసింది. క్షమాపణ కోరిన ఇండిగో చైర్మన్ ఇండిగో విమానాల రద్దు, ఆలస్యంగా రాకపోకలు, ప్రయాణికుల ఇబ్బందులపై తమ ఎయిర్‌లైన్స్ బోర్డు పూర్తిస్థాయిలో అధ్యయనం చేయబోతున్నట్లు ఇండిగో చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా బుధవారం తెలిపారు. ఈ మేరకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. సంక్షోభానికి మూల కారణం ఏమిటో తెలుసుకుంటామని, ఇందుకోసం టెక్నికల్ నిపుణుల సహాయం తీసుకుంటామని చెప్పారు. ప్రయాణికులను క్షమాపణ కోరుతున్నానని వ్యాఖ్యానించారు. వారి అంచనాలకు తగ్గట్టుగా తాము పని చేయలేకపోయామని అంగీకరించారు. వారం రోజుల్లో తమపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయని, అందులో కొన్ని సరైనవి, మరికొన్ని సరైనవి కానివి ఉన్నాయని విక్రమ్ సింగ్ మెహతా పేర్కొన్నారు. విమానాల రద్దు అనేది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు. -
తప్పని తిప్పలు
న్యూఢిల్లీ/ముంబై: ఇండిగో విమానాల రద్దు సంక్షోభం కొనసాగుతోంది. సోమవారం సైతం 562 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లోని ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానాల రద్దు పర్వం ఏడోరోజూ కొనసాగింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 250కిపైగా విమానాలు, బెంగళూరులో 150 ఇండిగో విమానసర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్‌లో 112, ముంబైలో దాదాపు 100, చెన్నైలో 56 విమానాలు రద్దయ్యాయి. వందల విమానాల రద్దుతో కీలక నగరాల్లోని ఎయిర్‌పోర్టుల్లో అప్పటికే చేరుకున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కీలకమైన శస్త్ర చికిత్సలు, పెళ్లిళ్లు, బిజినెస్ మీటింగ్‌లు, విహార యాత్రల కోసం టికెట్ బుక్‌చేసుకుని పిల్లాపాపలతో వచ్చిన వందలాది మంది ప్రయా ణికులు సోమవారం సైతం విమానాశ్రయాల్లో చేదు అనుభవాలను చవిచూడాల్సి వచ్చింది. దీంతో హడావుడిగా వేరే కంపెనీల విమానాల కోసం రెట్టింపు ధరలకు టికెట్లు కొనాల్సిన దురవస్థను ఏడో రోజూ విమానప్రయాణికులు ఎదుర్కొన్నారు.అస్పష్ట వివరణ ఇచ్చిన ఇండిగోవందల విమానాల రద్దుకు కారణాలను సోమవారం సాయంత్రంకల్లా చెప్పాలంటూ ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీఓఓ ఇసిడర్ పోర్వెరస్లకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షోకాజ్ నోటీస్ జారీచేసింది. దీనికి స్పందనగా పీటర్, ఇసిడర్లు సోమవారం ఒక వివరణను ఇచ్చారు. అస్పష్టంగా చేతులు దులిపేసుకునే ధోరణిలోనే ఆ వివరణ ఉండటం గమనార్హం. ‘‘ చిన్న చిన్న సాంకేతిక సమస్యల కారణంగా ఈ సమస్యకు అంకురార్పణ జరిగింది. శీతాకాలపు ప్రయాణికుల రద్దీతో మేం మార్చేసిన షెడ్యూల్, విపత్కర వాతావరణ పరిస్థితులు, రెండో దశవిమాన విధుల కాల పరిమితి(ఎఫ్డీటీఎల్) నిబంధనల అమలుతో పైలట్ల రోస్టర్ విధానం సమగ్ర అమలులో వైఫల్యాలు.. ఇవన్నీ జత కలిసి డిసెంబర్ తొలి వారంలో మా విమానరాకపోకల రేటింగ్‌ను కిందకు దిగజార్చాయి. మొత్తం ఉదంతానికి సంబంధించిన అసలు కారణాలను ఇప్పుడే చెప్పలేం. అయినా డీజీసీఏ సూచించిన ఎఫ్డీటీఎల్ నిబంధనలు మాకు పెద్ద సవాల్‌గా నిలిచాయి. దీంతో గతిలేక డిసెంబర్ ఐదో తేదీన అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాం. మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రీబూట్ చేశాం. దీంతో వందలాది విమానాలను రద్దుచేయాల్సి వచ్చింది. ఈ విషయంలో మాత్రం ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నాం. మా కంపెనీ కార్యకలాపాలు ఎంతో సంక్లిష్టమైన, విస్తృతమైన స్థాయిలో ఉంటాయి. అందుకే సమగ్ర స్థాయిలో మూల కారణాల విశ్లేషణ(రూట్ కాజ్ అనాలసిస్) చేయడానికి మాకు మరికొంత సమయం కావాలి. డీజీసీఏ జారీచేసిన షోకాజ్ నోటీస్ ప్రకారం చూసినా మేం ప్రతిస్పందన తెలియజేసేందుకు 15 రోజుల గడువు ఇంకా ఉంది.’’ అని పీటర్, ఇసిడర్ వివరణ ఇచ్చారు. ఈ పొడిపొడి వివరణతో డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తగు చర్యలు తీసుకుంటాం: డీజీసీఏ‘‘షోకాజ్ నోటీస్‌కు స్పందనగా ఇండిగో ఇచ్చిన వివరణను పరిశీలిస్తున్నాం. తలబిరుసుతనంతో చేయాల్సిందంతా చేసేసి మొసలి కన్నీరు కార్చినట్లుగా ఈ వివరణ ఉంది. సమగ్ర దర్యాప్తు తర్వాత అసలు కారణాలు తెలిశాక కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇండిగో వివరణను కూలంకషంగా పరిశీలిస్తున్నామని డీజీసీఏ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వివరణతో అసంతృప్తిగా ఉన్న డీజీసీఏ నలుగురు సభ్యుల ప్యానెల్.. ఇండిగో సీఈఓ, సీఓఓలను బుధవారం నేరుగా తమ ఎదుట హాజరై సంజాయిషీ ఇవ్వాలని కోరాలని భావిస్తోంది.సగం బ్యాగులు వెనక్కిచెకిన్ సందర్భంగా ప్రయాణికుల నుంచి అందుకున్న వేలాది బ్యాగులను తిరిగి అప్పగించే పనిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసున్నట్లు ఇండిగో ప్రకటించింది. 9,000 బ్యాగులను తీసుకున్నాం. వీటిలో ఇప్పటికే 4,500 లగేజీ బ్యాగులను తిరిగి ఇచ్చేశాం. వచ్చే 36 గంటల్లోపు మిగతా బ్యాగులనూ ముట్టచెప్తాం. ఇప్పటిదాకా టికెట్ల బుకింగ్‌కు సంబంధించి రూ.827 కోట్ల నగదును రీఫండ్ చేశాం. నవంబర్ 21–డిసెంబర్ 7 తేదీల మధ్య 9,55,591 టికెట్లను రద్దుచేశాం ’’అని ఇండిగో సోమవారంపేర్కొంది. -
ఆరో రోజు 650 విమానాలు
ముంబై: ఇండిగో సంక్షోభం ఆరో రోజు సైతం కొనసాగింది. ఆదివారం ఒక్కరోజే మరో 650 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 118, ముంబైలో 121 విమానాలు రద్దయ్యాయి. శుక్రవారం, శనివారంతో పోలిస్తే పరిస్థితి చాలావరకు అదుపులోకి వచ్చినట్లు ఇండిగో వర్గాలు వెల్లడించాయి. అయితే ఆరో రోజు ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. విమానాల సంక్షోభం క్రమంగా కుదుటపడుతున్న సంకేతాలు కనిపించాయి. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి మొత్తం 2,300 విమానాలకుగాను ఆదివారం 1,650 విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ నెల 10వ తేదీ కల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, విమానాలు యథాతథంగా రాకపోకలు సాగిస్తాయని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశాయి. ప్రయాణికులతోపాటు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఇండిగో యాజమాన్యం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. పరిస్థితిని చక్కదిద్దడానికి నడుం బిగించింది. ఇండిగో సిబ్బందిని ఉద్దేశించి సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఒక్కో అడుగు వేసుకుంటూ సాధారణ స్థితికి చేరుకుంటున్నామని తెలిపారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్(సీఎంజీ)ను ఏర్పాటు చేసింది. ఇండిగో విమానాల రాకపోకలకు సంబంధించి తాజా పరిణామాలను ఈ గ్రూప్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. త్వరలో పార్లమెంటరీ కమిటీ విచారణ! ఇండిగో సంక్షోభంపై ఆ సంస్థ ప్రతినిధులతోపాటు డీజీసీఏ అధికారులను, విమానయాన శాఖ అధికారులను పిలిపించి విచారించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్ణయించింది. త్వరలో వారికి సమన్లు జారీ చేయబోతున్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని పట్ల సంజయ్ ఝా నేతృత్వంలో రవాణా, పర్యాటకం, సంస్కృతిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయా అధికారులను పిలిపించి ప్రశ్నించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంక్షోభానికి మూల కారణాలపై విశ్లేషణ ప్రారంభించినట్లు ఇండిగో వర్గాలు పేర్కొన్నాయి. రాజస్తాన్ పర్యాటకానికి ఎదురుదెబ్బ రాజస్తాన్‌కు ప్రతిఏటా డిసెంబర్లో పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. ఇండిగో సంక్షోభం వల్ల గత ఆరు రోజులుగా ప్రముఖ పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. విమానాలు అందుబాటులో లేక పర్యాటకులు రావడం లేదు. చాలామంది తమ పర్యటనలు రద్దు చేసుకున్నారు. కొందరు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, పర్యాటకులు రాకపోవడంతో చాలా నష్టపోతున్నాయని రాజస్తాన్‌లోని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, దుకాణాలు, రవాణా రంగాల్లో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీరందరికీ దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులే జీవనాధారం. ఇండిగో విమానంలో పావురం కలకలం ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అందులో పావురం కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. బెంగళూరు నుంచి వడోదరకు బయలుదేరిన విమానంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాజాగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సరిగ్గా టేకాఫ్‌కు ముందు పావురం విమానంలో ఎగరడం చూసి ప్రయాణికులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. దాన్ని పట్టుకోవడానికి ప్రయతి్నంచారు. వారి చేతికి చిక్కకుండా చాలాసేపు అటుఇటూ ఎగురుతూ కనిపించింది. బయటపడేందుకు ప్రయత్నించింది. ప్రయాణికుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని చిత్రీకరించి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీనిపై నెటిజట్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండిగోకు బ్యాడ్‌టైమ్ కొనసాగుతోందని కొందరు పేర్కొన్నారు. పావురానికి ‘బర్డింగ్ పాసు’ ఉంది కాబోలు, అందుకే లోపలికి వచ్చిందని ఒకరు చమత్కరించారు. ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ రద్దయిన, ఆలస్యంగా నడిచిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు ఇండిగో యాజమాన్యం శనివారం నాటికి రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లు విమానయాన శాఖ ఆదివారం వెల్లడించింది. అలాగే బ్యాగేజీని కూడా వెనక్కి ఇచ్చినట్లు తెలిపింది. ప్రయాణికులకు టిక్కెట్ల సొమ్మును ఆదివారం రాత్రి 8 గంటలకల్లా పూర్తిగా చెల్లించాలని ఇండిగోను కేంద్ర ప్రభుత్వం ఆదేశించి సంగతి తెలిసిందే. అలాగే బ్యాగేజీని 48 గంటల్లోగా అందజేయాలని పేర్కొంది. సంక్షోభంపై వివరణ ఇవ్వడానికి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్, అకౌంటబుల్ మేనేజర్ ఇసిడ్రో పోర్కిరస్కు మరికొంత సమయం ఇవ్వాలని డీజీసీఏ ఆదివారం నిర్ణయించింది. సోమవారం సాయంత్రంకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. -
‘ఈజ్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్’ ఇదేనా?
న్యూఢిల్లీ: ఇండిగో విమాన సర్విసుల మూకుమ్మడి రద్దుతో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రా ్ఛలను సంధించింది. ప్రధాని మోదీ ‘ఈజ్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్’అని వాగ్దానం చేస్తూ ‘సీజ్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్’ను కానుకగా ఇచ్చారని ఎద్దేవా చేసింది. ఇలాంటి అనూహ్య పరిస్థితులకు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యత వహిస్తారని అని ప్రశ్నించింది. ఇండిగో సంక్షోభం అనుకోకుండా జరిగింది కాదన్న కాంగ్రెస్ పార్టీ.. ఈ రంగంలో రెండు సంస్థలకే పెత్తనం ఉండేలా బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితమని అభివరి్ణంచింది. వైమానిక రంగ భద్రతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనటానికి ఇదే నిదర్శనమని తెలిపింది. పైలట్లకు విరామం కలి్పంచేందుకు ఉద్దేశించిన ప్రమాణాలను ఉపసంహరించుకోవడం బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు, అత్యంత దారుణం. తద్వారా, బీజేపీ ప్రభుత్వం ప్రయాణీకుల భద్రతను ప్రమాదంలోకి, విమాన సిబ్బంది శ్రేయస్సును అనిశి్చతిలోకి నెట్టివేసింది’అని కాంగ్రెస్ మండిపడింది. -
పెళ్లిళ్లకు వెళ్లలేక!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సామెత. ఇండిగో దేశీయ విమాన సర్వీసుల నిలిపివేత తాలూకు సంక్షోభం నిజంగానే ఎన్నెన్నో పెళ్లిళ్లను నిజంగానే చావుదెబ్బ తీస్తోంది. పెళ్లి అంటేనే చెప్పలేనన్ని పనులుంటాయి. నెలల తరబడి ప్లానింగ్ చేసినా అంతా సజావుగా ముగిసేదాకా పెళ్లంటే ఇరు పక్షాలకూ కత్తిమీద సాము తరహా వ్యవహారమే. అలాంటిది, ఇండిగో దేశీయ విమాన సేవల సంక్షోభం కారణంగా నవ దంపతులు ఏకంగా తమ సొంత పెళ్లి విందు వేదికకే చేరుకోలేక చివరికి వర్చ్యువల్‌గా హాజరు కావాల్సిన విచిత్రమైన పరిస్థితి తలెత్తడం తెలిసిందే. ఈ సీజన్లో, అంటే నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 నడుమ దేశవ్యాప్తంగా ఏకంగా 46 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అంచనా. అలాంటి సీజన్ మంచి పీక్‌లో ఉండగా ఇండిగో విమాన సేవల అంతరాయం పెళ్లిళ్లపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఆ దెబ్బకు కొన్ని వందల పెళ్లిళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బ్యాచిలర్స్ పార్టీ గోవిందా ముంబైకి చెందిన వర్షా అగర్వాల్‌కు వచ్చే జనవరిలో పెళ్లి జరగనుంది. ఈలోపు తన బెస్ట్ ఫ్రెండ్స్ ఆరుగురికి కోల్‌కతాలో ఘనంగా బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వాల ని అంతా పక్కాగా ప్లాన్ చేసుకుంది. తను ముంబై నుంచి ఎయిరిండియా విమానంలో ముందుగానే కోల్‌కతా చేరుకుని వారికోసం ఎదురు చూడసాగింది. కానీ ఢిల్లీ, హైదరాబాద్ నుంచి రావాల్సిన తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాస్తా కర్మ కాలి ఇండిగోలో టికె ట్లు బుక్ చేసుకున్నారు. తెలియక వారు చేసిన ఈ ఒక్క పొరపాటు చివరికి బ్యాచిలర్స్ పారీ్టకే పురిట్లోనే సంధి కొట్టింది. ఢిల్లీ నుంచి వరుసగా రెండు రోజుల పాటు కోల్‌కతాకు ఇండిగో తన విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసేసింది. దాంతో ఒక స్నేహితురాలితో పాటు వర్షా కూడా హతాశురాలైంది. ఇక హైదరాబాద్ నుంచి రావాల్సిన మిత్రురాలిది మరో వ్యథ. ఆమె సకాలానికి విమానాశ్రయానికి చేరుకున్నా డిస్ ప్లే బోర్డుపై ఎంతకూ కోల్‌కతా విమానం జాడేకన్పించని పరిస్థితి. ఇండిగో సిబ్బంది నుంచి కూడా అరకొ ర సమాచారమే. చివరికి విమానం ఆలస్యమన్నారు. అలా రెండు మూడుసార్లు జరిగి ఐదారు గంటలు గడిచాక, విమానం రద్దయిందంటూ చావు కబురు చల్లగా చెప్పారు. ‘‘చివరికి నా బ్యాచిలర్స్ పార్టీని ఒకే ఒక్క ఫ్రెండ్‌తో ఏదో అయిందనిపించి ముంబై తిరిగొచ్చా. ఇండిగో నాకు మర్చిపోలేని చేదు అనుభవం మిగిల్చింది’’అంటూ మండిపడుతోంది వర్షా. జనవరిలో పుణేలో జరిగే తన పెళ్లికి ఎట్టి పరిస్థితు ల్లోనూ ఇండిగో సేవలను నమ్ముకునేది లేదని తెగేసి చెబుతోంది. వీలైతే అసలు జీవితంలో ఎన్నడూ ఇండిగో విమానమే ఎక్కబోనని కూడా అంటోంది! రేడియో ఆరెంజ్‌లో ఆర్జేగా చేసే గౌరిదీ అలాంటి వ్యథే. ఆఫీసు వ్యవహారంతో పాటు సన్నిహితుల్లో ఒకరు పెళ్లికి కూడా వెళ్లొచ్చని ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకుందామె. కానీ తీరా చూస్తే అది కాస్తా చివరి నిమిషంలో రద్దయింది. అది కూడా తాను విమానాశ్రయానికి చేరుకున్నాక ఇండిగో సిబ్బంది చాలాసేపటికి తీరిగ్గా వెల్లడించారు. తొలుత విమానం ఆలస్యమైందంటూ రెండుమూడుసార్లు దాటవేస్తూ వచ్చారు. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి! సిలిగురికి చెందిన వ్యాపారవేత్త అనీశ్ సింఘానియా ది కూడా ఇలాంటి బాధే. ఇండిగో నిర్వాకం వల్ల ఏకంగా తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికే వెళ్లలేకపోయానంటూ వాపోతున్నారాయన. ‘‘డిసెంబర్ 4న ముంబై వెళ్లేందుకు ఇండిగోను నమ్ముకున్నా. తీరా చూస్తే ఆ సంస్థ కాస్తా నన్ను నట్టేట ముంచి చేతులు దులుపుకుంది. పోనీ ఇతర సంస్థల విమానాల్లో వెళ్దామంటే అవి కూ డా ఈ దుస్థితిని వీలైనంతగా సొమ్ము చేసుకుని నా ఆశలపై నీళ్లుజల్లాయి. పదేసి రెట్లు పెరిగిన విమాన ధరలు చెల్లించలేక అసలు ప్రయాణమే మానుకు న్నా. ఇండిగోకు నాలాంటివారి ఉసురు తగిలి తీరుతుంది’’అంటూ శాపనార్థాలు పెడుతున్నారు అనీశ్. దౌత్యాధికారికీ తప్పని తిప్పలు సాధారణ దేశీయ ప్రయాణికులకు మాత్రమే కాదు, భారత్‌లో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్కూ ఇలాంటి చేదు అనుభవాన్నే రుచిచూపింది ఇండిగో. తన దౌత్య సిబ్బందిలో ఒకరి పెళ్లి నిమిత్తం ఢిల్లీ నుంచి దేవగఢ్‌కు ఇండిగోలో టికెట్ బుక్ చేసుకున్నారాయన. ‘‘ఆ పొరపాటు చేసినందుకు ప్రయాణం రద్దై ఏమీ చేయలేక తీరని బాధకు లోనైన వేలాది మంది ఇండిగో ప్రయాణికుల్లో నేనూ ఒకనిగా మిగిలాను. నా కొలీగ్‌కు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడం మినహా ఇంకేం చేయగలను?’’అంటూ ఎక్స్‌లో వాపోయారాయన! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇండిగో ఇంకా నేల మీదే!
సాక్షి, న్యూఢిల్లీ/ముంబై: దేశంలో ఇండిగో సంక్షోభం వరుసగా ఐదో రోజుకు చేరుకుంది. ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. శనివారం ఒక్కరోజే 800కుపైగా విమానాలు రద్దు కావడంతో ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్న దృశ్యాలే కనిపించాయి. పైలట్ల విధులు, విశ్రాంతి విషయంలో పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల నుంచి తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. తగిన సంఖ్యలో పైలట్లు, విమాన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. శుక్రవారం వెయ్యికిపైగా విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంపై నాలుగు రోజులపాటు మౌనం పాటించిన ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్ ఎట్టకేలకు స్పందించారు. ప్రయాణికులను క్షమాపణ కోరారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. అసౌకర్యానికి మన్నించాలని విజ్ఞప్తి చేశారు. అతిత్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని, ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అన్ని శ్లాబుల్లో టికెట్ల లభ్యత గురించి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం అందించాలని ఎయిర్‌లైన్స్ సంస్థలకు పౌర విమానయాన శాఖ సూచించింది. డిమాండ్ పెరిగిన రూట్లలో అవసరమైతే విమానాల సంఖ్య పెంచాలని సూచించింది. ఏదైనా నగరానికి విమానాన్ని రద్దు చేస్తే ఆ మార్గంలో ఏ ఇతర సంస్థ కూడా చార్జీలు పెంచకూడదని ఆదేశించింది. విమానం రద్దు లేదా ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులో ఉన్న ప్రయాణికులకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని పేర్కొంది. సాధ్యమైన ప్రతి చోటా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టంచేసింది. తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని విమానయాన సంస్థలను హెచ్చరించింది. విమాన రుసుములపై నియంత్రణ ఇండిగో సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు చక్కగా సొమ్ము చేసుకుంటున్నాయి. విమాన చార్జీలను భారీగా పెంచేశాయి. ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. విమానయాన సంస్థల తీరుపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు ఊరట కలి్పస్తూ విమాన చార్జీలపై పరిమితి విధించింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. దూరాన్ని బట్టి చార్జీలను ఖరారు చేసింది. ఇవి రూ.7,500 నుంచి రూ.18,000 దాకా ఉన్నాయి. సంక్షోభం ముగిసేదాకా ఇవే చార్జీలు అమల్లో ఉంటాయని ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. టికెట్లను విమానయాన సంస్థల అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసినా లేక ప్రైవేట్ సంస్థల ఆన్లైన్ వేదికల నుంచి కొనుగోలు చేసినా ఈ చార్జీలనే వసూలు చేయాలని ఆదేశించింది. యూజర్ డెవలప్మెంట్ ఫీజు(యూడీఎఫ్), ప్యాసింజర్ సరీ్వసు ఫీజు(పీఎస్ఎఫ్), టిక్కెట్లపై పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బిజినెస్ క్లాస్ ప్రయాణాలు, ఉడాన్ విమానాలకు ఈ చార్జీల నియంత్రణ వర్తించదని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. కేవలం ఆదేశాలతో సరిపెట్టకుండా విమాన చార్జీల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తేల్చిచెప్పింది. ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు, ఎయిర్‌లైన్స్ డేటాను రియల్ టైంలో గమనిస్తామని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా.. ప్రజా ప్రయోజనాల దష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నేడు రాత్రి 8 గంటల్లోగా రీఫండ్ చేయండి రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికు లకు టికెట్ల రుసుమును తిరిగి చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ఇండిగోను పౌర విమానయాన శాఖ ఆదేశించింది. టికెట్ రీఫండ్ ఆదివారం రాత్రి 8 గంటల్లోగా పూర్తి కావాలని తేల్చిచెప్పింది. రీఫండ్ విషయంలో ఆదేశాలు పాటించకపోయినా, ఆలస్యం చేసినా చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని శనివారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. రీషెడ్యూలింగ్ విమానాల విషయంలో ప్రయాణికుల నుంచి అదనంగా చార్జీలు వసూలు చేయకూడదని సూచించింది. ప్రయాణికులకు సహకరించడానికి ప్రత్యేకంగా రీఫండ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇండిగోను ఆదేశించింది. సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా ఈ కేంద్రాలను కొనసాగించాలని వెల్లడించింది. ఒకవేళ ప్రయాణికుల నుంచి బ్యాగేజీ తీసుకొని ఉంటే రెండు రోజుల్లోగా తిరిగి అందజేయాలని పేర్కొంది. నిబంధనల ప్రకారం అవసరమైన చోట ప్రయాణికులకు పరిహారం అందించాలని వెల్లడించింది. ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధులు, దివ్యాంగులైన ప్రయాణికులు, విద్యార్థులు, రోగులు, అత్యవసర ప్రయాణం అవసరమయ్యే వారందరికీ సరైన సౌకర్యాలు కల్పించడానికి పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేసినట్లు తెలిపింది. ఇండిగో సీఈఓపై వేటు పడుతుందా! దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికుల ఆగచాట్లకు కారణమైన ఇండిగో విమానాల రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్ అలసత్వమే ఈ సంక్షోభానికి దారి తీసినట్లు భావిస్తోంది. ఆయనపై వేటు వేయాలని దాదా పు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇండిగో సీఈఓ పదవి నుంచి పీటర్‌ను అతి త్వరలోనే తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఈవోకు డీజీసీఏ షోకాజ్ నోటీస్ ఇండిగోతో తలెత్తిన సంక్షోభం, విమానాల రాకపోకలకు అంతరాయం కలగడంపై వివరణ ఇవ్వాలని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శనివారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ‘పెద్ద సంఖ్యలో విమానాల రద్దుకు విపరీతమైన నిర్వహణా వైఫల్యాలు, ప్రణాళికా లోపమే కారణ మని భావిస్తున్నాం. సీఈవోగా మీరు, సంస్థ సమర్థ నిర్వహణకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే, కార్యకలాపాల నిర్వహణ, ముందు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించడమనే విధి నిర్వహణలో విఫలమయ్యారు’అని నోటీసులో పేర్కొంది. ఎఫ్డీటీఎల్ (ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్)ను సజావుగా అమలు చేయడానికి, సవరించిన నిబంధనలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లను చేయకపోవడమే అంతరాయాలకు ప్రధాన కారణమని భావిస్తున్నట్లు తెలిపింది. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఎల్బర్స్‌ను ఆదేశించింది.రీఫండ్‌కు అధిక ప్రాధాన్యం: ఇండిగో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఇండిగో శనివారం వెల్లడించింది. శుక్రవారంతో పోలిస్తే రద్దయిన విమానాల సంఖ్య శనివారం తగ్గినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. 850 కంటే తక్కువ విమానాలే రద్దయ్యాయని తెలిపింది. టికెట్ రీఫండ్ విషయంలో ప్రయాణికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. రీఫండ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, టికెట్ల చార్జీలు కచ్చితంగా తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఇందుకోసం వెబ్సైట్ లేదా కస్టమర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించాలని సూచించింది. మరికొద్ది రోజుల్లోనే ఇబ్బందులు తొలగిపోతాయని వెల్లడించింది. విమానాల షెడ్యూళ్లలో స్థిరీకరణ, ఆలస్యాన్ని తగ్గించడం, ప్రయాణికులకు సహకరించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఇండిగో తెలియజేసింది. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు ఇండిగో విమానాల రద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడానికి 84 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ శనివారం ప్రకటించింది. దేశమంతటా అన్ని జోన్లలో ఈ రైళ్లను ప్రారంభించినట్లు తెలియజేసింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పటా్న, హౌరా తదితర నగరాల మధ్య రైళ్లు ప్రారంభమయ్యాయని వివరించింది. ఇవి 104 ట్రిప్పులు నడుస్తాయని పేర్కొంది. ప్రయాణికుల అవసరాలను బట్టి ప్రత్యేక రైళ్ల సంఖ్య, ట్రిప్పుల సంఖ్యను మరింత పెంచనున్నట్లు వెల్లడించింది. లక్షలాది మందిని వారి గమ్యస్థానాలకు చేరవేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశామని రైల్వే బోర్డు ఉన్నతాధికారి దిలీప్ కుమార్ తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు, రాకపోకల సమయాన్ని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ప్రదర్శిస్తున్నారు. -
ఇండిగో విమానాల రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్
-
బాధ్యత లేదా..! రామ్మోహన్ నాయుడుపై మోదీ ఆగ్రహం
-
Aviation Minister: ఇలా జరుగుతుంది అనుకోలేదు అసలు తప్పంతా.
-
Karumuri Venkat : రీల్స్ మీద ఉన్న శ్రద్ద ప్రజల మీద లేదా?
-
Flight Cancellations: నిన్న శంషాబాద్.. నేడు విశాఖ అసలేం జరుగుతోంది?
-
విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ
అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో విమానాల రద్దు గందరగోళం కొనసాగుతోంది. శుక్రవారం వరకు సుమారు 1,000 పైగా విమాన సర్వీసులు రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇండిగోలో తలెత్తిన విమానాల రద్దు సంక్షోభంపై దాని సీఈవో సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. అంతర్గతంగా తమ అన్ని వ్యవస్థలను, షెడ్యూళ్లను "రీబూట్" చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పారు. శనివారం నాటికి విమానాల రద్దు సంఘటనలు తగ్గుతాయని హామీ ఇచ్చారు. రాబోయే 5-10 రోజుల్లో అంటే డిసెంబర్ 10-15 నాటికి క్రమంగా కోలుకుని కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందన్నారు.సిబ్బంది పని గంటలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనలను అమలు చేయడంలో ప్రణాళిక అంతరాల కారణంగా ఈ సంక్షోభం ఉద్భవించిందని వివరణ ఇచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఈ నిబంధనలను సమీక్ష పెండింగ్ లో ఉంచింది. -
Bengaluru: ఆన్లైన్లో రిసెప్షన్ చేసుకున్న కొత్త దంపతులు
-
కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్
విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం పట్టి కుదిపేస్తోంది. ఉన్నట్టుండి టికెట్లు బుక్ చేసుకున్న విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకరికి ఉద్యోగం, మరొకరికి అనారోగ్యం, మరొకరికి వేరొక అత్యవసర పరిస్థితి కారణంగా విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటే, చివరి నిమిషంలో విమానాల రద్దుతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితంగా ఒక కొత్త జంట సొంత రిసెప్షన్‌కు హాజరు కాలేని పరిస్థితి. వేరే దారి లేక ఆన్లైన్లో రిసెప్షన్‌కు హాజరయ్యారంటే ఈ సంక్షోభం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇండిగోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.కొత్త ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తన రోస్టర్ ప్లానింగ్‌లో తగినంత మార్పులు, పైలట్ల కొరత కారణంగా ఈ వారం భారతదేశం అంతటా వందలాది విమానాలను రద్దు చేసింది. దీంతో కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఊహించని పరిణామం వెలుగులోకి వచ్చింది. నూతన వధూవరులు తమ సొంత రిసెప్షన్‌కు వర్చువల్‌గా హాజరు కావాల్సి వచ్చింది. A newly wed techie couple forced to attend their own reception online after their Indigo flights from Bhubaneswar-Hubbali were cancelled. The bride’s parents having already invited relatives decided to broadcast their live feed on a big screen. #IndigoDelay #FlightCancellations pic.twitter.com/jO7lTgm8lZ— Deepak Bopanna (@dpkBopanna) December 5, 2025 బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హుబ్బళ్లికి చెందిన మేధా క్షీర్సాగర్ , ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన సంగమ దాస్ నవంబర్ 23న భువనేశ్వర్‌లో వివాహం చేసుకున్నారు. బుధవారం వధువు స్వస్థలంలో అధికారిక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. హుబ్బళ్లిలోని గుజరాత్ భవన్లో జరగాల్సి ఉంది.వీరు భువనేశ్వర్ నుండి బెంగళూరుకు అక్కడినుంచి హుబ్బళ్లికి వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. డిసెంబర్ 2న భువనేశ్వర్ నుండి బెంగళూరుకు , తరువాత హుబ్బళ్లికి టిక్కెట్లు బుక్ చేసుకున్న వధూవరులు, మంగళవారం ఉదయం 9 గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు విమానాలు పదేపదే ఆలస్యం కావడంతో చిక్కుకుపోయారు. చివరికి డిసెంబర్ 3న విమానం రద్దైంది. వీరితోపాటు భువనేశ్వర్-ముంబై-హుబ్బళ్లి మీదుగా ప్రయాణించే అనేక మంది బంధువులకు ఇదే ఇబ్బంది తప్పలేదు. మరోవైపు రిసెప్షన్ వేదిక వద్ద చుట్టాలు, పక్కాలు అందరూ విచ్చేశారు. సన్నాహాలన్నీ పూర్తి చేసుకుని బంధుమిత్ర సపరివార సమేతంగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో విమానాల రద్దు వార్త అశనిపాతంలా తాకింది. ఇక చేసేదేమీ లేకవధువు తల్లిదండ్రులు రంగంలోకి దిగి ఆన్లైన్లోనే తంతు ముగించారు. రిసెప్షన్ కోసం సిద్ధం చేసుకున్న దుస్తులతో వధూవరులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రిసెప్షన్లో చేరారు. టీవీ స్క్రీన్‌మీదే ఆన్లైన్లోనే నూతన దంపతులను ఆశీర్వదించారు.వారు వస్తారని ఆశించాం కానీ వారు రాలేకపోయారు. బంధువులందర్నీ పిలుచుకున్నాం, కానీ ఇలా జరగడం బాధనిపించింది. అలాగని అన్నీ ఏర్పాట్లు చేశాక, ఈవెంట్‌ను రద్దు చేయలేం. అందుకే అందరితోనూ చర్చించి రిసెప్షన్‌కు ఆన్లైన్లో హాజరు కావాలని వారి భాగస్వామ్యాన్ని స్క్రీన్‌పై ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నామని వధువు తల్లి చెప్పారు.ఇండిగో విమానాలు రద్దుఢిల్లీ, జైపూర్, భోపాల్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఇతర నగరాల్లోని విమానాశ్రయాలలో ఇండివిమాన కార్యకలాపాలు స్థంభించి పోయాయి. వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. గురువారం, రోజుకు దాదాపు 2,200 విమానాలను నడుపుతున్న ఇండిగో గురువారం 500 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది, ఇది దాని 20 సంవత్సరాల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి కార్యకలాపాలు పూర్తిగా స్థిరీకరించే అవకాశం ఉందని అంచనా. విమాన విధి నిబంధనలలో తాత్కాలిక సడలింపులను కోరిందని ఏవియేషన్ వాచ్డాగ్ DGCAకి తెలిపింది. -
ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇవన్నీ ఇవ్వాల్సిందే..!
దేశంలో విమానాల రద్దు సంఘటనలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి. ముఖ్యంగా దేశీయ సర్వీసుల్లో ఇవి ఎక్కువ ఉంటున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ ఇండిగో.. భారీగా విమానాల రద్దుతో వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో విమానాలు క్యాన్సిల్ అయినప్పుడు విమానయాన సంస్థల బాధ్యతలు ఏంటి.. డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. ప్రయాణికులుగా మనకు ఎటువంటి హక్కులు ఉంటాయి.. ఈ కథనలో తెలుసుకుందాం..భారతదేశంలో విమానాలు రద్దు అయినప్పుడు డీజీసీఏ (DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు ప్రయాణికులకు రిఫండ్, ప్రత్యామ్నాయ విమానం, భోజనం/హోటల్ సౌకర్యం వంటి బాధ్యతలు వహించాలి. అలాగే ప్రయాణికులకు పాసింజర్ ఛార్టర్ ఆఫ్ రైట్స్ ద్వారా కొన్ని స్పష్టమైన హక్కులు కల్పించారు.విమానయాన సంస్థల బాధ్యతలుసమయానికి సమాచారం ఇవ్వాలి: విమానం క్యాన్సిల్ అయితే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ముందుగానే తెలియజేయాలి. ప్రత్యామ్నాయ విమానం: అదే గమ్యస్థానానికి మరో విమానం ఉచితంగా ఏర్పాటు చేయాలి. రిఫండ్: ప్రయాణికుడు కోరుకుంటే పూర్తి టికెట్ ధర రిఫండ్ చేయాలి. భోజనం/హోటల్ సౌకర్యం: విమానం క్యాన్సిల్ లేదా 2 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్రయాణికులకు భోజనం, రిఫ్రెష్మెంట్ వసతి కల్పించాలి. అదే 24 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే హోటల్ వసతితోపాటు ట్రాన్స్ఫర్(స్థానిక రవాణా) సౌకర్యం కల్పించాలి.ప్రయాణికుల హక్కులు ఇవే..విమానం క్యాన్సిల్ అయితే ప్రయాణికులు ఛార్జీలు రిఫండ్ తీసుకోవచ్చు లేదా మరో విమానంలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఓవర్‌బుకింగ్ వల్ల ప్రయాణికుడికి సీటు దొరకకపోతే టికెట్ పూర్తి రిఫండ్‌తోపాటు పరిహారం పొందవచ్చు.లగేజీని విమానయాన సంస్థలు పోగొడితే నిబంధనల ప్రకారం ప్రయాణికులు పరిహారం పొందవచ్చు.విమానాల ఆలస్యం లేదా క్యాన్సిలేషన్‌పై స్పష్టమైన సమాచారం పొందే హక్కు ప్రయాణికులకు ఉంటుంది.డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..ప్రయాణికులు 7 రోజులు ముందే విమాన టికెట్ బుక్ చేసి, 24 గంటలలోపు రద్దు చేస్తే పూర్తి రిఫండ్ పొందవచ్చు. విమానాలు 2 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా భోజనం, రిఫ్రెష్మెంట్ సౌకర్యం కల్పించాల్సిందే.24 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా హోటల్ వసతి, స్థానిక రవాణా ఏర్పాట్లు చేయాలి.విమానాల క్యాన్సిలేషన్ సందర్భంలో పూర్తి రిఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలి. అయితే సేఫ్టీ కారణాలు (వాతావరణం, టెక్నికల్ సమస్యలు) రీత్యా విమానాలు ఆలస్యం లేదా రద్దు అయితే రిఫండ్/రీబుకింగ్ తప్పనిసరి. కానీ అదనపు పరిహారం ఇవ్వకపోవచ్చు. -
ఇండిగో చరిత్రలో చెత్త రికార్డు.. ఒక్కరోజే 550 విమానాలు రద్దు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ అయిన ఇండిగోలో విమానాల రద్దు పరంపర గురువారం సైతం కొనసాగింది. బుధవారం 200 విమానాలు రద్దుకాగా గురువారం ఒక్కరోజే మరో 550కుపైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. సాంకేతిక సమస్యలు, అననుకూల వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల రద్దీ, విమాన విధుల సమయ కాలపరిమితి(ఎఫ్డీఐఎల్) నిబంధనల అమలు వంటి సమస్యల ధాటికి ఇండిగో విమాన సర్వీసులను కంపెనీ రద్దుచేయక తప్పలేదు. సిబ్బంది కొరత, మెరుగైన జీతభత్యాల కోసం కొందరు పైలట్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సెలవులు పెట్టి వేరే చోట్ల ఇంటర్వ్యూలకు హాజరవడం వంటి మరెన్నో కారణాలు జతకలిసి ఇండిగో విమానసర్వీసులను మరింత ఆలస్యంచేస్తున్నాయి. దీంతో గురువారం దేశంలోని చాలా విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. సమయానికి రాకపోకలను సూచించే ఆన్‌టైమ్ పంక్చువాలిటీ(ఓటీపీ) విషయంలో ఇండిగో డిసెంబర్ మూడో తేదీన కేవలం 19.7 శాతాన్ని మాత్రమే చేరుకోగల్గిదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే 172 విమానాలు రద్దయ్యాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 118, బెంగళూరులో 100, హైదరాబాద్‌లో 75, కోల్‌కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో తలెత్తిన సమస్యకు పైలట్ల కొరత సైతం కారణమన్న వార్తల నేపథ్యంలో ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఎల్పీఏ) ఘాటుగా స్పందించింది. ‘‘ నిరాటంకంగా విమానం నడిపే పైలట్ పూర్తి ఆరోగ్యంగా ఉండటం కోసం ‘కొత్త ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్’ నిబంధనల ప్రకారం పైలట్ మరింతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పైలట్ విశ్రాంతి/సెలవులో ఉంటే అదనపు పైలట్లతో విమాన సర్వీసుల్ని కొనసాగించాలి. అంతమంది పైలట్లు ఇండిగోలో లేరు. ఇటీవల ఇండిగో కొత్త పైలట్లను నియమించుకోవడం ఆపేసింది. దీంతో పైలట్ల కొరత ఏర్పడి విమానాలను రద్దుచేయాల్సి వస్తోంది’’ అని ఏఎల్పీఏ వ్యాఖ్యానించింది. ఇండిగో రోజుకు సగటున 2,300 విమానసర్వీసులను నడుపుతోంది.ఫిబ్రవరి 10దాకా ఇంతేసమస్య పూర్తిగా సద్దుమణగాలంటే ఫిబ్రవరి పదో తేదీదాకా ఆగక తప్పదని ఇండిగో గురువారం మరో బాంబు పేల్చింది. అంటే అప్పటిదాకా సమయానికి ఇండిగో విమాన రాకపోకలు సవ్యంగా ఉండకపోవచ్చని సంస్థ పరోక్షంగా అంగీకరించింది. ఈ మేరకు ఇండిగో గురువారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు వివరణ ఇచ్చింది. ‘‘ రోజువారీ విమానాల సంఖ్యను డిసెంబర్ 8వ తేదీ నుంచి తగ్గిస్తాం. గతంలో మాదిరి విమానసర్వీసులు యథాతథ స్థాయికి చేరుకోవడానికి ఫిబ్రవరి10దాకా వేచి ఉంచాల్సి రావొచ్చు. రానున్న రోజుల్లో రద్దయ్యే విమానాల సంఖ్య భారీగా ఉండొచ్చు’’ అని ఇండిగో స్వయంగా ప్రకటించింది. -
యూకే ఏటీసీలో సమస్య.. 100 విమానాలపై ప్రభావం
లండన్: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సమస్య తలెత్తడంతో గురువారం దక్షిణ ఇంగ్లండ్‌లోని పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 100 విమాన సర్వీసులు, ఆలస్యంగా నడవడం లేదా రద్దవడం సంభవించాయి. దీంతో వేలాదిగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. హీత్రూ, గాట్విక్, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్, కార్డిఫ్, ఎడిన్‌బరో తదితర విమానాశ్రయాల్లో పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు. సుమారు 20 నిమిషాల తర్వాత సమస్యను పరిష్కరించినప్పటికీ ఆ ప్రభావం సాయంత్రం వరకు కొనసాగింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తాము వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి దరిద్రంగా మారిందంటూ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్విరామంగా పనిచేస్తున్నామని నేషనల్ ఎయిర్‌ట్రాఫిక్ సర్వీసెస్(ఎన్ఏటీఎస్) తెలిపింది. -
10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు
ఇండోనేషియా బాలీలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద కమ్ముకుని పలు విమానాలు రద్దయ్యాయి. బాలీలోని ‘మౌంట్ లెవోటోబి లకీ-లకీ’ అనే అగ్నిపర్వతం రెండోసారి పేలడంతో దాదాపు 10 కిలోమీటర్ల(32,808 అడుగులు) ఎత్తులో దట్టంగా బూడిద కమ్ముకుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు ప్రమాదకరమని చెప్పారు. దాంతో కొన్ని సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.బాలీలోని ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం నవంబర్ 3న మొదట విస్ఫోటనం చెందింది. తిరిగి మంగళవారం పలుమార్లు భారీ స్థాయిలో బద్దలవ్వడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ‘బాలీలో ఇటీవలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో వాతావరణంలో భారీగా బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చిపోయే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో సంస్థ బెంగళూరు నుంచి ఇండోనేషియా బాలీకి రోజువారీ సర్వీసు నడుపుతోంది.ఢిల్లీ-ఇండోనేషియా మధ్య ప్రయాణించే రోజువారీ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా బుధవారం ఇండోనేషియాకు ప్రయాణించే విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.ఇదీ చదవండి: గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటనబాలీ నుంచి దాదాపు 800 కి.మీ దూరంలో ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో నవంబర్ 3న లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం మొదట విస్ఫోటనం చెందింది. దానివల్ల తొమ్మిది మంది మరణించారు. తాజాగా మంగళవారం మళ్లీ పలుమార్లు విస్ఫోటనం చెందింది. మొదటిసారి ఘటన జరిగిన సమయంలో నవంబర్ 4 నుంచి 12 వరకు సింగపూర్, హాంకాంగ్, కొన్ని ఆస్ట్రేలియన్ నగరాల నుంచి బాలీకి ప్రయాణించే 80 విమానాలు రద్దు చేశారు. -
మాల్దీవులకు టికెట్ బుకింగ్స్ నిలిపేసిన ప్రముఖ సంస్థ
భారత్‌పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ ఎక్స్ వేదికగా కీలక నిర్ణయం ప్రకటించింది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈజ్‌మైట్రిప్ సంస్థ దిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. ఇది ఆన్లైన్ టికెట్ బుకింగ్ సేవలందిస్తోంది. నిషాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టి ఈ సంస్థను 2008లో ప్రారంభించారు. In solidarity with our nation, @EaseMyTrip has suspended all Maldives flight bookings ✈️ #TravelUpdate #SupportingNation #LakshadweepTourism #ExploreIndianlslands #Lakshadweep#ExploreIndianIslands @kishanreddybjp @JM_Scindia @PMOIndia @tourismgoi @narendramodi @incredibleindia https://t.co/wIyWGzyAZY — Nishant Pitti (@nishantpitti) January 7, 2024 భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మంతత్రి మరియం షియునా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలు బొమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రులు మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూం మాజిద్ మద్దతు పలికారు. దీంతో ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు. ఇదీ చదవండి: బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే.. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని మంత్రులు విమర్శించారు. ‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని మోదీ పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ). మా దేశం అందించే సేవలను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’ అని మంత్రి మాజిద్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై భారత నెటిజన్లు మండిపడ్డారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని డిమాండు చేశారు. -
రూ. 13,000 టికెట్టుకి రూ. 20 రీఫండ్ - ఐఏఎస్ ఆఫీసర్ షాక్!
ఆధునిక కాలంలో విమాన ప్రయాణాలు సర్వ సాధారణం అయిపోతున్నాయి. కావున చాలామంది ఫ్లైట్ జర్నీ చేసేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కొంత అమౌంట్ (రీఫండ్) తిరిగి వస్తుంది. అయితే ఇటీవల ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ఒక ఐఏఎస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాహుల్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి తన ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ టికెట్ ధర రూ. 13,820 కాగా, క్యాన్సిల్ చేసుకున్న తరువాత అతనికి రీఫండ్ అయిన మొత్తం కేవలం రూ. 20 మాత్రమే. దీనిని అతని ట్విటర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది. నిజానికి అతని టికెట్ ధర నుంచి ఎయిర్‌లైన్ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 11,800, జీఐ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 1200, జీఐ కన్వీనియన్స్ ఫీజు కింద రూ. 800 కట్ చేసి చివరకు రూ. 20 రీఫండ్ చేసారు. ఇది చూడగానే ఐఏఎస్ అధికారి కూడా హవాక్కయిపోయాడు. తిరిగి డబ్బు వెనక్కి రావాలంటే ఏదైనా సలహా ఇవ్వండి అంటూ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపైన నెటిజన్లు వారికి నచ్చిన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..) Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq — Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023 -
‘బాంబ్’ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని విధ్వంసం
బఫెలో: ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత తీవ్రమైన మంచు తుపాన్ (Bomb Cyclone) కోరల నుంచి అమెరికా ఇంకా బయట పడలేదు. గత వారం రోజులతో పోలిస్తే హిమపాతం కాస్త తగ్గినా దేశవ్యాప్తంగా అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రోడ్లపై దట్టంగా పేరుకున్న మంచును తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాంతో తుఫాన్ విధ్వంసం తాలూకు తీవ్రత క్రమంగా వెలుగులోకి వస్తోంది. మంచులో కూరుకుపోయిన కార్లలో నిస్సహాయంగా మరణించిన వారి శవాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మంచు తుఫాన్ ధాటికి కనీసం 100 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు భావిస్తున్నారు. దీన్ని తరానికి ఒక్కసారి మాత్రమే సంభవించే మహోత్పాతంగా వాతావరణ శాఖ అభివర్ణిస్తోంది. మెరుగవని రవాణా వ్యవస్థ దేశవ్యాప్తంగా వారం రోజులుగా దాదాపుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. మంగళవారం కూడా 6,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం బయల్దేరాల్సిన 3,500 పై చిలుకు విమానాలను ముందస్తుగానే రద్దు చేశారు. దాంతో విమానాశ్రయాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. చిక్కుబడిపోయిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బయటికెళ్లే పరిస్థితి లేక ప్రయాణికులంతా టెర్మినల్స్‌లోనే కాలం గడుపుతున్నారు. డిసెంబర్ 22 నుంచి రద్దయిన విమానాల సంఖ్య 25 వేలు దాటింది. సకాలంలో సేవలను పునరుద్ధరించడంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ వైఫల్యం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది. సంస్థకు చెందిన వేలాది విమాన సర్వీసులు వరుసగా ఆరో రోజూ రద్దవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆగ్రహించారు. ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయాలని ప్రయాణికులకు సూచించారు! కానీ పరిస్థితి చక్కబడేందుకు కనీసం ఇంకో వారం పట్టొచ్చని సౌత్‌వెస్ట్ ప్రకటించింది. యథేచ్ఛగా లూటీలు రవాణా వ్యవస్థ స్తంభించడంతో అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిత్యావసరాలు తదితరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో చాలా రాష్ట్రాల్లో ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. బయటికెళ్లే పరిస్థితి లేక జనం రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావడంతో ఆహార పదార్థాలు నిండుకున్నాయి. నాలుగైదు రోజులుగా దుకాణాలూ తెరిచుకోక సమస్య మరింతగా విషమించింది. ఫలితంగా మొన్నటిదాకా బఫెలో నగరంలోనే వెలుగు చూసిన లూటీ ఉదంతాలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లోనూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాల్లోకి చొరబడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న లక్షలాది మంది తెలుగువాళ్లు కూడా నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కెనడాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువ నమోదవున్నాయి! వరద ముప్పు క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అమెరికా ఇప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటోంది. మంచు శరవేగంగా కరగడం వల్ల ఊహాతీత వేగంతో ఆకస్మిక వరదలు ముంచెత్తవచ్చని పలు రాష్ట్రాలను వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. పూర్తిగా మంచులో కూరుకుపోయిన బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. బఫెలో.. దయనీయం! పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ఇంకా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా 8 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. దాంతో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు అత్యవసర సర్వీసులు కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి! నగరంలోకి వెళ్తుంటే యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉందని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ వాపోయారు. నగరం, పరిసరాల్లో రోడ్డు ప్రయాణాలపై నిషేధం ఇంకా అమల్లోనే ఉంది. దాని అమలుకు మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగారు. పొరుగు రాష్ట్రం న్యూజెర్సీ నుంచి ఎమర్జెన్సీ సేవల సిబ్బంది న్యూయార్క్‌కు తరలుతున్నారు. చాలామంది కార్లలోనే చిక్కుకుపోయి ఉన్నారు. 30కి పైగా మృతదేహలను వెలికితీసినట్టు చెబుతున్నారు. ఇంతటి ప్రతికూల వాతావరణాన్ని తమ సర్వీసులోనే ఎన్నడూ చూడలేదని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. చావు అంచుల దాకా వెళ్లాం మంచు తుఫాను బారిన పడి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డవాళ్లు తామెదుర్కొన్న కష్టాలను కథలుగా చెబుతున్నారు. మేరీలాండ్కు చెందిన డిట్జక్ ఇలుంగా అనే వ్యక్తి తన ఆరు, పదహారేళ్ల కూతుళ్లతో కలిసి కార్లో హామిల్టన్ వెళ్తూ బఫెలో వద్ద తుఫానులో చిక్కాడు. చూస్తుండగానే కారు చుట్టూ మంచు పేరుకుపోవడంతో గంటల తరబడి కారు ఇంజన్ ఆన్‌లో ఉంచి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ‘‘చివరికి ప్రాణాలకు తెగించాం. ధైర్యం చేసి కష్టమ్మీద కారు దిగాం. చిన్న కూతుర్ని వీపున వేసుకుని, పెద్దమ్మాయీ నేనూ భయానక వాతావరణంలో అతికష్టమ్మీద షెల్టర్ హోమ్ దాకా వెళ్లాం. లోపలికి అడుగు పెడుతూ నేనూ నా పిల్లలూ ఒక్కసారిగా ఏడ్చేశాం. ఇంతటి భయానక అనుభవం జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఒక్క అడుగూ వేయడానికి ప్రాణాలన్నీ కూడదీసుకోవాల్సి వచ్చింది. కానీ సాహసం చేయకపోతే కార్లోనే నిస్సహాయంగా మరణించేవాళ్లం’’ అంటూ డిట్జక్ గుర్తు చేసుకున్నాడు. -
అమెరికాను ముంచేసిన మంచు.. 60 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో హిమోత్పాతం దేశాన్ని గజగజ వణికిస్తోంది. మంచు తుపానులో చిక్కుకొని ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో న్యూయార్క్ వాసులే 27 మంది ఉన్నారు. పశ్చిమ న్యూయార్క్‌లో కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయాయి. ఏకధాటిగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావడం అసాధ్యంగా మారిందని న్యూయార్క్ గవర్నర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్, అట్లాంటా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. One car tried to drive my hill and Queen Anne and hit all these parked cars who clue down the hill… insane. DON’T DRIVE. #seattle pic.twitter.com/wJsor6byDa — Kaybergz (@kay0kayla) December 23, 2022 కొలరాడో, కన్సాస్, కెంటకీ, మిస్సోరీ, ఓహియోలో ప్రాణనష్టం అధికంగా ఉంది. అమెరికాలో తూర్పు రాష్ట్రాలన్నీ డీప్ ఫ్రిజ్‌లో పెట్టినట్టుగా ఉన్నాయని అమెరికా నేషనల్ వెదర్ సర్వీసెస్ (ఎన్‌డబ్ల్యూఎస్) తెలిపింది. ఈ రాష్ట్రాల జనాభాలో 2 లక్షలకు మందికి పైగా విద్యుత్ సదుపాయం లేక విలవిలలాడిపోతున్నారు. ప్రజలు ఇల్లు కదిలి బయటకు రావద్దని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ అయిన ప్రాంతాల్లో కోటి మంది వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోని బఫెల్లో ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కార్లలో ప్రయాణిస్తున్న వారిపై విపరీతంగా మంచుకురవడం వల్ల ఆ వాహనంలో మంచులో కూరుకుపోయి మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావడంపై ఆ ప్రాంతంలో నిషేధం విధించారు. విద్యుత్ సబ్ స్టేషన్లు 18 అడుగుల మంచులో కూరుకుపోవడంతో ఎప్పటికి కరెంట్ వస్తుందో తెలీని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్కిటిక్ బ్లాస్ట్‌తో అమెరికా ఈ శీతాకాలంలో గడ్డకట్టుకుపోయింది. My dads places in Crystal Beach after the winter storm pic.twitter.com/BnntAihoMz — Bat Boy Slim (@TerjeOliver) December 26, 2022 -
కరోనాతో స్పైస్‌జెట్- క్విప్‌తో ఐడీబీఐ బోర్లా
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో తొలుత 400 పాయింట్లవరకూ పతనమైన సెన్సెక్స్ ప్రస్తుతం 150 పాయింట్లు క్షీణించి 45,404 వద్ద కదులుతోంది. కాగా.. కొత్త రూపు సంతరించుకుని వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కారణంగా యూకేకు అన్ని దేశాలూ విమాన సర్వీసులను రద్దు చేశాయి. దీంతో స్పైస్‌జెట్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇక మరోపక్క క్విప్‌లో భాగంగా జారీ చేసిన షేర్లు తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావడంతో ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో పతన బాట పట్టాయి. వివరాలు ఇలా.. (సీరమ్ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ) స్పైస్‌జెట్ వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో యూకేకు నడుపుతున్న అన్ని విమాన సర్వీసులనూ ఈ నెల 31వరకూ దేశీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు ఈ బాటలో నడుస్తున్నాయి. వందే భారత్ మిషన్‌లో భాగంగా స్పైస్‌జెట్ సైతం యూరోపియన్ దేశాలకు 30 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. లండన్, ఆమ్స్టర్డామ్, టొరంటో, రోమ్, మిలన్‌లకు విమానాలను నడుపుతోంది. అంతేకాకుండా యూరప్, ఆఫ్రికా, అమెరికా తదితర దేశాలతో కనెక్టవిటీకి వీలుగా ఇటీవలే ఎమిరేట్స్‌తో అవగాహనా ఒప్పందాన్ని సైతం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్ఎస్ఈలో తొలుత స్పైస్‌జెట్ షేరు దాదాపు 10 శాతం పతనమై రూ. 82.35ను తాకింది. ప్రస్తుతం 8.5 శాతం నష్టంతో రూ. 84 దిగువన ట్రేడవుతోంది. సోమవారం సైతం ఇదే స్థాయిలో నష్టపోవడం గమనార్హం! ఐడీబీఐ బ్యాంక్ క్విప్‌లో భాగంగా ఐడీబీఐ బ్యాంక్ సంస్థాగత కొనుగోలుదారులకు(క్విబ్) జారీ చేసిన 37.18 కోట్ల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేటి నుంచి లిస్టయ్యాయి. 44 సంస్థలకు షేరుకి రూ. 38.60 ధరలో బ్యాంక్ షేర్లను జారీ చేసింది. తద్వారా రూ. 1,435 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఫ్లోర్ ధర రూ. 40.63తో పోలిస్తే 5 శాతం డిస్కౌంట్లో షేర్లను కేటాయించింది. ఇక మరోపక్క బ్యాంకులో మెజారిటీ వాటా కలిగిన పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ నుంచి రూ. 1,500 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను సమకూర్చుకోనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 20 శాతం కుప్పకూలింది. రూ. 30.75ను తాకింది. ప్రస్తుతం 13.4 శాతం నష్టంతో రూ. 33 వద్ద ట్రేడవుతోంది. -
జెట్ ఎయిర్వేస్ సంక్షోభంపై అత్యవసర భేటీ..
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులను నిలిపివేయడంతో పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. ప్రయాణీకుల ఇబ్బందులను తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని యాజమాన్యంతో మంగళవారం జరిపిన అత్యవసర భేటీలో డీజీసీఏ ఆదేశించింది. మరోవైపు జెట్ ఎయిర్వేస్లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. నగదు లభ్యత కొరవడటంతో సమస్యలు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో కూరుకుపోయింది. గత కొద్ది నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో వారి మానసిక స్థైర్యం దెబ్బతిని సంస్థ విమాన సర్వీసులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. విమాన సర్వీసుల్లో కోత విధించే క్రమంలో జెట్ ఎయిర్వేస్ ఈ దిశగా సంకేతాలు పంపుతోంది. జెట్ ఎయిర్వేస్ చేతులెత్తేయడంతో వేతనాలపై ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. మార్చి నాటికి వేతనాలను క్లియర్ చేస్తామని తమకిచ్చిన హామీ నెరవేరకపోవడంతో కంపెనీ పట్ల విశ్వాసం సన్నగిల్లిందని జెట్ ఎయిర్వేస్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)కు రాసిన లేఖలో పేర్కొంది. తమకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా జోక్యం చేసుకోవాలని డీజీసీఏను కోరింది. జెట్ ఎయిర్వేస్లో దాదాపు 560 మంది మెయింటెనెన్స్ ఇంజనీర్లు పనిచేస్తుండగా 490 మంది ఇంజనీర్లు ఈ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకూ తమకు కంపెనీ మూడు నెలల జీతాలు బకాయి ఉందని ఇంజనీర్ల అసోసియేషన్ డీజీసీఏకు పంపిన ఈ మెయిల్లో పేర్కొంది. అత్యవసర భేటీ.. జెట్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణీకులకు నెలకొన్న అసౌకర్యం నేపథ్యంలో అత్యవసర భేటీని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంతో డీజీసీఏ సంస్థ యాజమాన్యంతో సమావేశమైంది. విమాన సర్వీసుల రద్దు, క్యాన్సిలేషన్, రిఫండ్ల వివరాలతో పాటు సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం, బ్యాంకర్లకు బకాయిలు వంటి పలు అంశాలపై యాజమాన్యంతో ఈ భేటీలో విస్తృతంగా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. సంక్షోభం సమసేలా.. ప్రైవేట్ ఎయిర్‌లైనర్ జెట్ ఎయిర్వేస్ దివాళా బారిన పడకుండా ఆదుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులను కాపాడే క్రమంలో ప్రభుత్వం బ్యాంకర్లను చొరవ చూపాలని సూచించింది. బ్యాంకులకు కంపెనీ బకాయి పడిన రుణాలను వాటాలుగా మార్చుకోవాలని దివాళా గండం నుంచి గట్టెక్కించాలని బ్యాంకులను ప్రభుత్వం కోరినట్టు సమాచారం. కాగా, జెట్ ఎయిర్వేస్ను తిరిగిగాడిలో పెట్టే ప్రణాళికలను సైతం ఆయా బ్యాంకులు ప్రభుత్వానికి సమర్పించాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. -
నేలకు దిగిన బోయింగ్‌లు
న్యూఢిల్లీ/అడిస్ అబబా: భారత విమానయాన సంస్థలు ఉపయోగిస్తున్న అన్ని బోయింగ్ 737 మ్యాక్స్–8 రకం విమానాలను కిందకు దింపేశామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఖరోలా బుధవారం చెప్పారు. దీని కారణంగా స్పైస్‌జెట్‌కు చెందిన 35 విమానాల సర్వీసులు గురువారం రద్దు అవుతాయన్నారు. రద్దవుతున్న సర్వీసులకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తమ ఇతర విమానాల్లో టికెట్లు కేటాయిస్తున్నామనీ, టికెట్లు రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పైస్‌జెట్ తెలిపింది. వివిధ దర్యాప్తు సంస్థల నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి బోయింగ్‌పై నిషేధాన్ని కొనసాగించాలా, ఎత్తేయాలా అన్నది నిర్ణయిస్తామనీ, అయితే దీనిపై సమీప భవిష్యత్తులో నిర్ణయం వెలువడే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇక మరో భారతీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ వద్ద కూడా ఐదు బోయింగ్ 737 మ్యాక్స్ 8 రకం విమానాలు ఉన్నప్పటికీ వాటికి అద్దె చెల్లించలేక ఆ సంస్థ వాటిని ఇప్పటికే నిలిపేసింది. తాజా నిషేధంతో ఆ సంస్థ సర్వీసులపై ప్రభావమేమీ ఉండదు. ఇథియోపియాలో ఇటీవల కూలిపోయిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలోని బ్లాక్ బాక్స్‌లను విశ్లేషణల కోసం యూరప్‌కు పంపనున్నట్లు ఇథియోపియా ప్రభుత్వం తెలిపింది. బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఈ బ్లాక్ బాక్స్‌లను విశ్లేషించాలని తీవ్రంగా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇథియోపియా ఈ నిర్ణయం తీసుకుంది. బోయింగ్ విమానాలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇథియోపియాలో కూలిన విమానం బ్లాక్ బాక్స్‌లు, కాక్పిట్ల్లోని సమాచారాన్ని విశ్లేషించేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవనీ, కాబట్టి వాటిని యూరప్‌కు పంపుతున్నామని ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చెప్పారు. అయితే యూరప్‌లో ఏ దేశానికి పంపాలో గురువారం నిర్ణయిస్తామన్నారు. -
ఇండిగో కస్టమర్ల నెత్తిన పిడుగు
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను పైలట్ కొరత కష్టాలు వీడడం లేదు. గత కొన్నిరోజులుగా రోజూ విమాన సర్వీసులను రద్దు చేస్తూ వస్తున్నసంస్థ తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. విమాన సర్వీసుల రద్దు ప్రక్రియ మరికొంతకాలం కొనసాగనుందని ప్రకటించింది. రోజుకు కనీసం 30 విమాన సేవలు రద్దు కానున్నాయంటూ ఇండిగో కస్టమర్ల నెత్తిన బాంబు వేసింది. ఎందుకంటే..చివరి నిమిషంలో ఇండిగో విమానాలు రద్దు కావడంతోపాటు, లాస్ట్ మినిట్ విమాన టికెట్ల బుకింగ్ చార్జీలతో ప్రయాణికుల భారం తడిసి మోపెడవుతోంది. మరోవైపు ఈ అసౌకర్యతను నివారించడానికి, ముందుగానే సంబంధిత సర్దుబాట్లు చేస్తున్నామని, ప్రయాణీకులకు సమాచారం అందిస్తున్నామని ఇండిగో చెబుతోంది. కాగా సోమవారం దేశంలోని వివిధ నగరాల్లో 32విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. మంగళవారం మరో 30 విమానాలను రద్దు చేసింది. విమానాల సర్వీసుల కోత కొన్ని రోజులపాటు కొనసాగనుందని తాజాగా వెల్లడించింది. ఇది ఇలా వుంటే ఈ వ్యవహారంపై డీజీసీఏ దృష్టి సారించింది. ఈ సమస్యను పరిశీలిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
పెథాయ్ ఎఫెక్ట్ : బస్సులు, విమానాలు రద్దు
సాక్షి, అమరావతి : తీవ్ర తుపానుగా మారిన పెథాయ్ దెబ్బకు జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. విజయవాడ, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విమాన సర్వీస్‌లను నిలిపివేసింది. దాంతో బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్ ఏసియా విమానం బోర్డింగ్ పాస్‌లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖలో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఢిల్లీ - విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వగా చెన్నై - విశాఖ విమానం తిరిగి చెన్నైకి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే హైదరాబాద్ - విశాఖ స్పైస్‌జెట్ విమానాన్ని రద్దు చేయడమే కాక.. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 14 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విమానాల రద్దుతో దాదాపు 700 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు గాస్తోన్నారు. అంతేకాక తుపాను ప్రభావం దృష్ట్యా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. (ఏపీలో పలు రైళ్లు రద్దు) శ్రీకాకుళం.. పెథాయ్ తుపాన్ కారణంగా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కానీ ఉపాధ్యాయులు, వంట ఏజేన్సీలు, వంట కార్మికులు పాఠశాలల వద్ద అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. విజయనగరం.. పెథాయ్ తుపాన్ విజృంభిస్తోన్న నేపథ్యంలో అధికారలు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్ - 08922 276713, ఆర్డీవో ఆఫీస్ హెల్ప్‌లైన్ నంబర్ - 08922 276888 తూర్పు గోదావరి జిల్లా... జిల్లాలోని ముమ్మిడివరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విద్యాశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గోకవరం డిపో నుంచి బయలుదేరాల్సిన పలు బస్సు సర్వీసులను కూడా రద్దు చేశారు. ఆత్రేయపురంలో అత్యధికంగా 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం, కోరుకొండ మండలంలోని రాఘవపురం, కోటి కేశవరం గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంతో విశాఖ నుంచి రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ వైపు వెళ్లే సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. పశ్చిమ గోదావరి... పెథాయ్ తుపాన్ కారణంగా జిల్లాలోని తీర ప్రాంతంలోని ఆరు మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 100 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. గడిచిన 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 46(4.6 సెంటిమీటర్ల) మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏలూరులో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు... జిల్లావ్యాప్తంగా ఎడతెరపిలేని జల్లులు, తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలోని కొన్ని పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. నిజాం పట్నం పోర్టులో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కోన శశీధర్ తీరప్రాంతంలో పరిస్థిని సమీక్షిస్తున్నారు. -
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్..?
న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ ఇవ్వబోతోందా? అంటే అవుననే తెలుస్తోంది. విమాన క్యాన్సిలేషన్ లేదా ఆలస్యం కారణంతో కనెక్టింగ్ విమానాలు అందుకోలేని వారికి పరిహారాలను రూ.20వేలకు పెంచాలని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ చూస్తోంది. దీని కోసం డ్రాఫ్ట్ సిటిజన్ ఛార్టర్ను పునఃసమీక్షిస్తోందట. కొన్ని ఎయిర్‌లైన్స్ నుంచి ఈ నియమాలకు తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్టు తెలుస్తోంది. పరిహారాల పెంపు మాత్రమే కాక, విమాన టిక్కెట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోగా టిక్కెట్లో ఏమైనా మార్పులు చేపడితే జరిమానాలను రద్దు చేయాలని కూడా నిర్ణయిస్తోంది. మే 1న విమానయాన సంస్థలు, ఇతర వాటాదారులతో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబోయే సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనిలో కూడా కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయని, మే 1న నిర్వహించబోయే సమావేశంలో ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు ఇద్దరికీ ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోనున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే పరిహారాల పెంపుతో విమాన టిక్కెట్ ధరలు కూడా పెరుగుతాయని వాదనలు వినిపిస్తున్నాయి. 80 శాతం మార్కెట్ షేరు కలిగిన ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్ ఎయిర్వేస్ వంటి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ పరిహారాల పెంపుపై ఆందోళన వ్యక్తంచేస్తోంది. పరిహారాలు పెంచితే, విమానయాన సంస్థల ఆర్థిక సాధ్యతపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నాయి. -
ఫ్లైట్ ఆలస్యమైతే గిఫ్ట్ వోచర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రయాణం ఆలస్యమైనా, విమానం రద్దు అయినా ఇక నుంచి స్పైస్‌జెట్ ప్రయాణికులు గిఫ్ట్ వోచర్లు అందుకోవచ్చు. ఆన్ టైమ్ గ్యారంటీ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి స్పైస్‌జెట్ శ్రీకారం చుట్టింది. 60 నిముషాలపైన విమానం ఆలస్యమైతే రూ.500 వోచర్‌ను ఇస్తారు. అది కూడా మరోసారి ప్రయాణించినప్పుడు ఇస్తారు. విమానం రద్దు అయినా, 120 నిమిషాలపైన ఆలస్యమైనా రూ.1,000 వోచర్ అందుకోవచ్చు. నేటి నుంచే ఇది అమలులోకి వస్తుంది. ఇక్కడ ఒక నిబంధన ఉందండోయ్.. వాతావరణం అనుకూలించక పోయినా, ఎయిర్ ట్రాఫిక్ రద్దీ కారణంగా విమానం రద్దు, ఆలస్యమైనా వోచర్ ఇవ్వరు. సంస్థ వల్ల జరిగిన ఆలస్యానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వోచర్ వివరాలు, వినియోగించే విధానాన్ని ప్రయాణికులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా తెలుపుతారు. గత కొన్ని నెలలుగా సరైన సమయానికి సర్వీసులను నడుపుతున్నట్టు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరణ్ అవిలి ఈ సందర్భంగా తెలిపారు. తమ విమానాలు ఆలస్యం కావని హామీ ఇస్తున్నామని చెప్పారు.


