ఇండిగో కస‍్టమర్ల నెత్తిన పిడుగు

IndiGo Pulls out 30 Flights on Tuesday, says Cancellations to Continue - Sakshi

పైలట్ల కొరతతో స్తంభిస్తున్న ఇండిగో సేవలు

రోజుకు 30 విమానాలు రద్దు

ఈ వ్యవహారంపై  దృష్టి సారించిన డీజీసీఏ  

సాక్షి,న్యూఢిల్లీ:  దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను పైలట్‌ కొరత కష్టాలు వీడడం లేదు. గత కొన్నిరోజులుగా రోజూ విమాన సర్వీసులను రద్దు చేస్తూ వస్తున్నసంస్థ తాజాగా మరో షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది.  విమాన సర్వీసుల రద్దు  ప్రక్రియ మరికొంతకాలం కొనసాగనుందని ప్రకటించింది. రోజుకు కనీసం 30 విమాన సేవలు  రద్దు కానున్నాయంటూ  ఇండిగో కస్టమర్ల నెత్తిన బాంబు  వేసింది. 

ఎందుకంటే..చివరి నిమిషంలో ఇండిగో విమానాలు రద్దు కావడంతోపాటు,  లాస్ట్‌ మినిట్‌ విమాన టికెట్ల బుకింగ్‌ చార్జీలతో  ప్రయాణికుల భారం తడిసి మోపెడవుతోంది. మరోవైపు ఈ అసౌకర్యతను నివారించడానికి, ముందుగానే  సంబంధిత సర్దుబాట్లు   చేస్తున్నామని, ప్రయాణీకులకు సమాచారం అందిస్తున్నామని ఇండిగో చెబుతోంది.  కాగా సోమవారం దేశంలోని వివిధ నగరాల్లో 32విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. మంగళవారం మరో 30 విమానాలను రద్దు చేసింది. విమానాల సర్వీసుల కోత కొన్ని రోజులపాటు కొనసాగనుందని తాజాగా వెల్లడించింది.

ఇది ఇలా వుంటే ఈ వ్యవహారంపై డీజీసీఏ దృష్టి సారించింది.  ఈ సమస్యను పరిశీలిస్తున్నామని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top