ఇండిగో సంక్షోభంపై మోదీకి కాంగ్రెస్ ప్రశ్న
న్యూఢిల్లీ: ఇండిగో విమాన సర్విసుల మూకుమ్మడి రద్దుతో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రా ్ఛలను సంధించింది. ప్రధాని మోదీ ‘ఈజ్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్’అని వాగ్దానం చేస్తూ ‘సీజ్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్’ను కానుకగా ఇచ్చారని ఎద్దేవా చేసింది. ఇలాంటి అనూహ్య పరిస్థితులకు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యత వహిస్తారని అని ప్రశ్నించింది.
ఇండిగో సంక్షోభం అనుకోకుండా జరిగింది కాదన్న కాంగ్రెస్ పార్టీ.. ఈ రంగంలో రెండు సంస్థలకే పెత్తనం ఉండేలా బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితమని అభివరి్ణంచింది. వైమానిక రంగ భద్రతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనటానికి ఇదే నిదర్శనమని తెలిపింది. పైలట్లకు విరామం కలి్పంచేందుకు ఉద్దేశించిన ప్రమాణాలను ఉపసంహరించుకోవడం బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు, అత్యంత దారుణం. తద్వారా, బీజేపీ ప్రభుత్వం ప్రయాణీకుల భద్రతను ప్రమాదంలోకి, విమాన సిబ్బంది శ్రేయస్సును అనిశి్చతిలోకి నెట్టివేసింది’అని కాంగ్రెస్ మండిపడింది.


