సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో దారుణం జరిగింది. గౌరారం వద్ద కాంగ్రెస్ నేత గోపిని దుండగులు కారుతో వేగంగా ఢీకొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


