ఢిల్లీ: ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతల మధ్య ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ వేదిక వద్దకు రాగానే అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తదితరులు నిలబడి ఉన్నారు. ప్రధాని మోదీ మొదట రాహుల్ గాంధీకి కరచాలనం చేశారు.
ఆ తర్వాత ప్రధాని మోదీ నమస్కరిస్తూ ప్రియాంకా గాంధీ వైపు దృష్టి సారించారు. ప్రియాంకా జీ ఎలా ఉన్నారంటూ ప్రధాని పలకరించారు. ‘‘నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?" అంటూ ప్రియాంక బదులిచ్చారు. ‘‘నేను అలాగే ఉన్నాను’’ అని ప్రధాని నవ్వుతూ ముందుకు నడిచారు. ఈ సంభాషణను గమనిస్తున్న మల్లికార్జున ఖర్గే వెంటనే జోక్యం చేసుకున్నారు. ‘‘అలా ఏమీ లేరు.. కాస్త మారారు’’ అని ఖర్గే చమత్కరించారు. ‘‘అవునా’’ అంటూ నవ్వుతూ ప్రధాని మోదీ.. ఖర్గే చేతిపై తట్టారు. చిరునవ్వుల మధ్య ఇద్దరు నేతలు ఒకరికొకరు హై-ఫైవ్ ఇచ్చుకున్నారు.
ఢిల్లీలో సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే, నాగ్‌పూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త సారంఘ్ లఖానీల వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ జంట జూన్‌లో ముంబైలో వివాహం చేసుకోగా.. ఢిల్లీలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్ జైశంకర్, హర్‌దీప్ సింగ్ పూరి, గజేంద్ర సింగ్ షెకావత్, రాందాస్ అథవాలే, చిరాగ్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు.
मौका और दस्तूर यही होता है सुप्रिया सुले की बेटी के विवाह समारोह कार्यक्रम में कांग्रेस के वरिष्ठ नेता मल्लिकार्जुन खड़गे जी ने मोदी जी के मजे ले लिए।
खड़गे जी - भाई साहब थोड़ा सा बदल गए हैं।
नरेंद्र मोदी जी - अच्छा
खड़गे जी ने अपने दिल की बात कह दी जो सदन में कहते नहीं बनता था। pic.twitter.com/dDgzLbWO3V— Krishnadev Yadav (@krishna_news) August 12, 2026


