breaking news
Mallikarjun Kharge
-
నందిగ్రామ్‌లో ఇంకో ట్విస్ట్.. ముదిరిన పొలిటికల్ వార్
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉపఎన్నికకు ముందు రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తొలుత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అభ్యర్థి సాంచిత తన నామినేషన్ ఉపసంహరించుకోవడం.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మమతా బెనర్జీ మద్దతు ప్రకటించడం తెలిసిందే. అయితే ఆపై కొద్ది గంటల్లోనే మిలన్ ప్రధాన్ అరెస్ట్ కావడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది.నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ వర్గం తరఫున బరిలో ఉన్న సాంచితా ప్రధాన్ డే శుక్రవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. సీఎం సువేందు అధికారితో భేటీ నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ అనూహ్య పరిణాంపై మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన వర్గం ఇక నందిగ్రామ్‌లో మరో అభ్యర్థిని నిలబెట్టబోదని ప్రకటించి.. కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన మిలన్ ప్రధాన్‌కు మద్దతు తెలిపారు. ఇండియా కూటమిని బలోపేతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ సైతం ఖుషీ అయ్యింది.అయితే మమతా మద్దతు ప్రకటించిన కొద్ది గంటల్లోనే మిలన్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2007 నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన పాత హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆయనపై ఇప్పటికే పలు కేసులు, అరెస్టు వారెంట్ ఉన్నాయని చెబుతున్నారు.నందిగ్రామ్ సోనాచూరాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మిలన్ ప్రధాన్. 2007 భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీతో కలిసి చురుకుగా పనిచేశారు. అప్పటి నుంచి నందిగ్రామ్ రాజకీయాల్లో కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు. ఉద్యమానికి సంబంధించిన పలు కేసుల్లో ఆయన పేరు నమోదైంది. తాజాగా ఆయనకు కాంగ్రెస్ నందిగ్రామ్ టికెట్ ఇచ్చింది. సరిగ్గా ఇదేసమయంలో.. పెండింగ్ వారెంట్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు.మిలన్ ప్రధాన్‌ను శుక్రవారం రాత్రి పుర్బా మేదినీపూర్‌లోని ఓ హోటల్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత 2007 కేసులో పెండింగ్ వారెంట్ ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈరోజు (సెప్టెంబర్ 19) హల్దియా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు.. ఈ అరెస్ట్‌ను రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నా చేపట్టాలని కేడర్‌కు పిలుపు ఇచ్చింది. అలాగే ‘నందిగ్రామ్ చలో’ కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది.‘ఇది యాదృచ్ఛికం కాదు’..మిలన్ ప్రధాన్ అరెస్టుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. దీనిని ‘ఓటు చోరీ’, ‘ఎన్నికల చోరీ’గా అభివర్ణించారు. బీజేపీ ఉపఎన్నికలోనూ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. ప్రధానమంత్రి ‘మదర్ ఆఫ్ డెమొక్రసీ’ అని చెప్పుకుంటుంటే.. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయని ఖర్గే వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ.. మిలన్ ప్రధాన్ అరెస్టు యాదృచ్ఛికం కాదని, ఇది రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్లు, ప్రభుత్వాలు, పార్టీలు దొంగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ భయపడబోదని, పోరాడుతుందని పేర్కొన్నారు.‘ఎందుకీ సమయంలోనే?’.. మమతా ప్రశ్నమమతా బెనర్జీ సైతం అరెస్టు సమయాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే మిలన్ ప్రధాన్‌ను అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. పాత కేసును ఇప్పుడు ఎందుకు బయటకు తీశారని ప్రశ్నించారు. బీజేపీ ‘రాజకీయ కక్ష సాధింపు’తో వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని మమతా ఆరోపించారు. ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయంటూ కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఏమంటోంది?మిలన్ ప్రధాన్ అరెస్టు రాజకీయ కక్షతో జరిగిందన్న ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని, అరెస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. పాత కేసులో చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే చర్య జరిగిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ టికెట్‌ను హసిరాణి రథ్‌కు ఇచ్చింది. తన దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పని చేసి.. దారుణ హత్యకు గురైన చంద్రనాథ్ తల్లి ఆవిడ. అందుకే సువేందు ఆమెకు టికెట్ ఇప్పించారు. దీంతో నందిగ్రామ్‌లో పోటీ ప్రధాన పార్టీల మధ్య మరింత ఉత్కంఠగా మారింది.రితబ్రత బెనర్జీ ఎదురుదాడిమరోవైపు టీఎంసీ రెబల్ వర్గానికి చెందిన రితబ్రత బెనర్జీ మాత్రం మమతా వర్గం తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. గత ఏడు రోజులుగా నందిగ్రామ్‌ను కాంగ్రెస్‌కు వదిలేసి.. రిజీనగర్లో పోటీ చేయాలనే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అందుకు అంగీకరించకపోవడంతో మమతా అసంతృప్తికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమ వర్గం అభ్యర్థి అకస్మాత్తుగా నామినేషన్ ఉపసంహరించుకోవడం కూడా ఒక ‘ఫిక్స్’లో భాగమేనని ఆయన ఆరోపించారు. మమతా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడాన్ని రితబ్రత బెనర్జీ ‘అసంతృప్తితో తీసుకున్న నిర్ణయం’గా అభివర్ణించారు.అసలు వివాదం ఇక్కడే..బెంగాల్ రాజకీయ చదరంగంలో విపక్షాలకు ఒకే ఒక్కరోజులో భారీ షాకిచ్చింది. పార్టీ చీలిక కారణంగా.. అక్టోబర్ 6న జరగాల్సిన నందిగ్రామ్, రిజీనగర్ ఉప ఎన్నికలకు ఈసీ నిర్ణయంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి పార్టీ పేరు, గుర్తు దూరం అయ్యాయి. ఆ వెంటనే నందిగ్రామ్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ, మమతా కాంగ్రెస్‌కు మద్దతు.. ఆ వెంటనే ఆ అభ్యర్థి అరెస్టు జరగడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇదీ చదవండి: బలవంతంగా ఆయన్ని రిటైర్ చేశారా? -
తొలగింపుపై తాపత్రయం
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం అధికార కాంగ్రెస్‌లో కొత్త కోణం తెరపైకి వస్తోంది. ఈ విషయంలో అధిష్టానానికి నచ్చజెప్పి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభీష్టానికి అనుగుణంగా హైకమాండ్‌ను ఒప్పించడంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నేతల సహకారం ఉందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. రేవంత్‌తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడిన ఓ నాయకుడు, ప్రభుత్వంతో సమాంతరంగా పార్టీకి అధికారాలు కావాలని పోరాట బాటపట్టిన మరో నాయకుడు ఏకాభిప్రాయంతో ఈ ఎపిసోడ్లో కీలకపాత్ర పోషించారని.. ఇందులో స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా దాగి ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. మరో విషయం ఏమిటంటే సురేఖకు ఖర్గే అపాయింట్మెంట్ ఇప్పించడంలో తెరవెనుక పాత్ర పోషించిన అధిష్టాన దూత ఒకరు.. ఈ వ్యవహారం ఢిల్లీకి మారాక మౌనం దాల్చారని.. ఆయన మౌనముద్రతోనే జరగాల్సిందంతా సజావుగా జరిగిందనే చర్చ కూడా గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. మొదటి నుంచీ ఆయన చుట్టూనే.. కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే సీఎం రేవంత్‌కు ఢిల్లీ వేదికగా సహకరించిన కీలక నేత ఒకరి చుట్టూనే రాజకీయమంతా తిరిగింది. ఒకదశలో సురేఖ ఎపిసోడ్‌పై కమిటీ వేస్తారని.. ఈ కమిటీకి ఆయనే నేతృత్వం వహిస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. ఆయన క్యాంపు కార్యాలయంలోనే కీలక నేతల సమావేశాలు, తర్జనభర్జనలు జరిగాయి. ఆ సమయంలోనే ఆయన తన వైఖరిని సురేఖ శిబిరానికి కుండబద్దలు కొట్టి చెప్పారని సమాచారం. ఆ తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు కూడా తన వైఖరిని వెల్లడించారని.. ఓ దఫా ఆయనకు ఆశించిన సమ్మతి లభించకపోయినా ఎపిసోడ్ ఢిల్లీకి బదిలీ అయ్యాక ఏఐసీసీలో ఉండే మరో ముఖ్యుడి సహకారంతో ఆయన అధిష్టానం పెద్దలకు నచ్చజెప్పగలిగారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఆ కీలక నేత మంతనాల నేపథ్యంలో సురేఖ తొలుత బెంగళూరులో, ఆ తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినప్పుడు ఆయన స్వరంలో మార్పు కనిపించిందని అంటున్నాయి. ఇక పార్టీలోని ఓ ముఖ్య నేత సహకారం ఈసారి సీఎం రేవంత్‌కు లభించిందని తెలుస్తోంది. ఇటీవల పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగిన సందర్భంలో రేవంత్ వ్యతిరేక శిబిరంలో ఉన్న ఆ నాయకుడు సురేఖ వ్యవహారంలో మాత్రం రేవంత్ అనుకూల శిబిరంలో కీలకపాత్ర పోషించారని సమాచారం. ఆయన కూడా సీఎం నిర్ణయానికి అడ్డుచెప్పకుండా తలూపారని తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు కలిసి పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలను నియంత్రించాలంటే నిర్ణయం తప్పనిసరిని చెప్పి అధిష్టానానికి నచ్చజెప్పారని తెలుస్తోంది. ఆ ఇరువురి సహకారానికి తోడు అధిష్టాన దూత ప్రేక్షకపాత్ర పోషించడం, సీఎం సైతం ఒత్తిడి తేవడం వెరసి అధిష్టానం సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని.. ఈ నేపథ్యంలోనే సురేఖ పక్షం వహించిన మరో ముఖ్య నేత వాదనకు ప్రాధాన్యం ఇవ్వలేదని సమాచారం. అయితే తనకు సహకరించిన ఆ ఇద్దరు నేతల విషయంలో సీఎం రేవంత్ భవిష్యత్ వైఖరి ఎలా ఉంటుంది? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వారికి ప్రాధాన్యం ఉంటుందా? శాఖల మార్పుపై ప్రభావం చూపుతుందా? అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ‘అనుబంధం’కొనసాగుతుందా? అనేది వేచిచూడాల్సిందే! అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక హస్తినకు మరోసారి సీఎం! సురేఖ ఉద్వాసన నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ప్రస్తుతమున్న మంత్రుల శాఖల మార్పు గురించి చర్చించేందుకు వీలైనంత త్వరగా కబురు చేస్తామని ఢిల్లీ పెద్దలు సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పారని తెలుస్తోంది. అందుకే ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని.. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక సీఎం రేవంత్‌తోపాటు పార్టీలోని ఇతర ముఖ్యులు హస్తినకు వెళ్లి కేబినెట్ ప్రక్షాళనపై హైకమాండ్‌తో చర్చిస్తారని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
కాసేపట్లో సురేఖ మీడియా సమావేశం.. ఖర్గే అల్టిమేటం?
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేయకపోతే మంత్రి పదవి నుంచి తప్పించే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైనే చర్చ జరిగినట్లు సమాచారం. ఏఐసీసీ కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో.. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై నిర్ణయం దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి బయలుదేరనున్నారు. సీఎం హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత కొండా సురేఖ వ్యవహారంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరి కాసేపట్లో కొండా సురేఖ మీడియా ముందుకు రానుండటం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. తన వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇస్తారా? లేక రాజీనామాపై ప్రకటన చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె ఏం మాట్లాడతారు? అనే ఉత్కంఠ రేపుతోంది.ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో కొండా సురేఖ.. అడుగడుగునా వివాదాలే!ఈరోజు సాయంత్రంలోగా రాజీనామా ప్రకటన చేయకపోతే.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని గవర్నర్‌కు సీఎం లేఖ రాసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కొండా సురేఖ మంత్రి పదవిలో కొనసాగుతారా? లేదా కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో తప్పుకుంటారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కీలకంగా మారిన ఈ పరిణామాలపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కొండా సురేఖ ఎపిసోడ్‌కు నేడు ఎండ్‌కార్డ్?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మంత్రి సురేఖపై క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక, సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం, హైకమాండ్ ముందు సురేఖ వివరణ, ఆపై మీడియా ముందు సీఎంపై చేసిన ఆరోపణలు.. అన్నింటినీ పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు తుది నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే కీలక భేటీ నేపథ్యంలో ఈ వ్యవహారానికి తెరపడొచ్చనే చర్చా జోరందుకుంది. పరకాల రాజకీయాల నేపథ్యంలో మొదలైన వివాదం.. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్(చిట్టక్క) చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా భావించారు. కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు పార్టీ క్రమశిక్షణా కమిటీ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సురేఖను వివరణ కోరగా.. తన కుమార్తె వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే పీసీసీ మాత్రం ఈ వ్యవహారం అంతా అధిష్టానమే చూసుకుంటుందని చెబుతూ వచ్చింది. ఈలోపు ఈ వివాదంపై విచారణ జరిపిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ.. సురేఖ వ్యవహారంపై ఓ నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదిక ఆగస్టు 25న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు చేరింది. అక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు.. అటు నుంచి ఏఐసీసీకి చేరింది. అప్పటి నుంచి ఈ అంశం కాంగ్రెస్ హైకమాండ్ వద్దే ఉంది. అయితే వెంటనే చర్యలు తీసుకోకుండా.. సురేఖ వివరణ, పార్టీపై దాని ప్రభావం, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వంటి అంశాలను అధిష్టానం పరిశీలిస్తూ వచ్చింది.రేవంత్ స్పష్టమైన వైఖరిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా.. ఈ ఎపిసోడ్ అంతా నడిచింది. తిరిగొచ్చిన వెంటనే ఆయన ఈ పరిణామాలపై భగ్గుమన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా సురేఖపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన సందేశం వెళ్లాలన్నది రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగే పాలమూరు రాజకీయాల్లో కాకరేపిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వ్యవహారంపైనా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి పదవుల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని సీఎం రేవంత్ కోరుతుండగా.. దానికి టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ సైతం మద్దతు ప్రకటించినట్లు సమాచారం. అయితే.. సురేఖకు మద్దతు కూడామరోవైపు సురేఖను వెంటనే కేబినెట్ నుంచి తొలగించొద్దంటూ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలు హైకమాండ్‌ను కోరినట్లు తాజా సమాచారం. ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు సహా పలువురు నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సురేఖ విషయంలో హైకమాండ్ ముందు రాజకీయంగా సున్నితమైన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో.. ఒకవేళ ఆమెను బర్తరఫ్ చేసినా ఆ తర్వాతి పరిస్థితులకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.హైకమాండ్‌తో సురేఖ భేటీమరోవైపు ఢిల్లీలో నిన్నంతా కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ ఇందిరా భవన్ వేదికగా నాటకీయ పరిణామాలు జరిగాయి. అధిష్టానం పిలుపుతో అక్కడికి వెళ్లిన కొండా సురేఖ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు. తనపై జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సీఎం రేవంత్‌తో పాటు పలువురు మంత్రులపై వస్తున్న ఆరోపణల గురించి కూడా హైకమాండ్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాను చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆమె చెప్పారు. ఆ వెంటనే సీఎం రేవంత్, ఖర్గేతో మరోసారి భేటీ జరిపారు. అయితే రాష్ట్ర వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఖర్గే.. రాహుల్ గాంధీతో చర్చించాకే ఏ నిర్ణయమైనా వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం.నేడు కీలక భేటీలురాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర అగ్రనేతలు తిరిగి అందుబాటులోకి రావడం, తెలంగాణకు చెందిన కీలక నేతలు ఢిల్లీలో ఉండటంతో గురువారం చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షి నటరాజన్ తదితరులు హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత రేవంత్, మహేష్ గౌడ్లు హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారని సమాచారం. దీంతో ఇవాళ నిర్ణయం వెలువడొచ్చనే ప్రచారం జోరందుకుంది. ఇటు ఇవాళ కొండా సురేఖ దంపతులు తిరిగి వరంగల్‌కు చేరుకోనున్నారు. అనుచరులతో వాళ్లు భేటీ అవుతారని సమాచారం అందుతోంది.కేబినెట్ మార్పులపై కూడా చర్చ?ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలనే ఆలోచనలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు ఉన్నారు. ఇప్పటికే అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇవాళ్టి భేటీలో సురేఖపై నిర్ణయంతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సురేఖను తప్పిస్తే ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలి? ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి? నామినేటెడ్ పదవుల భర్తీ ఎలా చేపట్టాలి? అనే అంశాలపైనా ఢిల్లీలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వేటా.. ప్రత్యామ్నాయ మార్గమా?సురేఖను కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు బలంగా ఉన్నాయన్న ప్రచారం కొనసాగుతున్నప్పటికీ.. హైకమాండ్ మరో మార్గాన్ని పరిశీలిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆమెకు కేబినెట్ నుంచి తప్పుకుని మరో కీలక పదవి ఇచ్చే అవకాశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే కొండా వ్యవహారంపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎవరూ బహిరంగంగా స్పందించవద్దని హైకమాండ్ నుంచి సూచనలు వెళ్లినట్లు సమాచారం. తుది నిర్ణయం వచ్చే వరకు ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదన్న ఆదేశాలు.. ఈ అంశాన్ని పార్టీ ఎంత సీరియస్‌గా తీసుకుంటోందో స్పష్టం చేస్తున్నాయి. సురేఖతో పాటు జి.చిన్నారెడ్డి వ్యవహారం కూడా హైకమాండ్ ముందుంది. ఇద్దరిపై క్రమశిక్షణా కమిటీ సిఫారసులు చేయడంతో.. ఒకేసారి ఇద్దరిపై చర్యలు తీసుకోవాలా? లేక వేర్వేరుగా నిర్ణయం తీసుకోవాలా? అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఒకవైపు రేవంత్‌రెడ్డి కఠిన చర్యల వైపు మొగ్గు చూపుతున్నారన్న సమాచారం.. మరోవైపు సురేఖకు పార్టీలోని కొందరి మద్దతు.. ఇంకోవైపు హైకమాండ్ రాజకీయ లెక్కలు.. ఈ మూడు అంశాల మధ్య తుది నిర్ణయం ఆసక్తికరంగా మారింది. నేటి ఢిల్లీ పరిణామాలతో కొండా ఎపిసోడ్‌కు ఎండ్‌కార్డ్ పడుతుందా? లేదంటే మరో మలుపు తిరుగుతుందా?అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్ అయ్యింది.ఇదీ చదవండి: పిల్లల బడిలో.. పెద్దోళ్ల ఆఫీస్! -
సాగు ప్రాజెక్టుల కార్యసాధకుడు వైఎస్సార్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల కార్యసాధకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డేనని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. పోలవరం, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుల పనులను వైఎస్సారే ప్రారంభించారని గుర్తుచేశారు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చేందుకు ఆయన తలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుతోపాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ప్రస్తుతం ఆగిపోయాయని.. అయితే ఆయన కలగన్న ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి తెలంగాణ ప్రజలకు అంకితమిస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అవార్డు–2026 ప్రదానోత్సవ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాడు సీఎంగా ఉచిత విద్యుత్‌పై వైఎస్సార్ తొలి సంతకంవైఎస్సార్ జీవితాంతం ప్రజాశ్రేయస్సు కోసం శ్రమించారని.. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు ఎర్రటి ఎండల్లో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించిన ఆయన నాడు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ముఖ్యంగా కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోతున్న పంటలతో అష్టకష్టాలు పడుతున్న రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి 2004లో సీఎం అయ్యాక ఆ పథకంపై తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్న మహనీయుడని ప్రశంసించారు. దాదాపు రూ. 1,300 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేయడమే కాకుండా అప్పటికి రైతులపై ఉన్న వేలాది అక్రమ కేసులన్నింటినీ తొలగించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం సహా ఆయన కలలుగన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అదే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని చెప్పారు. వైఎస్సార్ పేదల పక్షపాతి: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వై.ఎస్. రాజశేఖరరెడ్డి పేదల పక్షపాతి అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అవార్డు–2026ను ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు ఖర్గే ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌తోపాటు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ దేశానికి చేసిన విశేష సేవలను ఆయన స్మరించుకున్నారు. 17 ఏళ్ల క్రితం వైఎస్సార్‌ను కోల్పోయినా ఆయన నెలకొల్పిన ఆదర్శాలు నేటికీ సజీవంగా ఉన్నాయన్నారు. ఏ రైతు, ఏ పేద కుటుంబం కనీస అవసరాలకు నోచుకోకుండా మిగిలిపోకూడదన్నదే రాజశేఖరరెడ్డి సిద్ధాంతమని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా గూడు, భూమిలేని వారికి భూపంపిణీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటి విప్లవాత్మక పథకాలను అమలు చేశారని ప్రశంసించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంతోపాటు 39 ఎంపీ స్థానాల్లో పార్టీని గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో వైఎస్సార్ కీలకపాత్ర పోషించారని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్, ఎంపీలు సురేశ్ షెట్కార్, నిరంజన్‌రెడ్డి, అనిల్ యాదవ్, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కి, సంపత్ పాల్గొన్నారు.వైఎస్సార్, స్వామినాథన్ మహనీయులు: భట్టి రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు మహనీయుల్లో ఒకరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అయితే, మరొకరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. వ్యవసాయ రంగానికి శాస్త్ర సాంకేతిక ఫలాలను స్వామినాథన్ అందించారని, రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే భరోసాను వైఎస్సార్ కల్పించారని చెప్పారు. ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభు త్వాలు సైతం విస్మరించలేని విధంగా రైతు సంక్షేమానికి వైఎస్సార్ బాటలు వేశారని చెప్పారు. ఆయన నేర్పిన ఓనమాలతోనే తాను ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఎదిగేందుకు దోహదపడ్డాయన్నారు. రచ్చబండ కొనసాగాల్సిందేనని చెప్పి బయలుదేరిన ఆయన.. ఎవరికీ కనబడనంత దూరానికి వెళ్లిపోయారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గొప్ప నాయకుడి వారసుడిగా పార్టీ నేతలు, కార్యకర్తలంతా ముందుకు వెళ్తుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
నా కుమార్తె వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. వివాహం చేసుకుని స్వతంత్రంగా జీవిస్తున్న ఆమె మాట్లాడిన మాటలకు, మంత్రిగా ఉన్న తనకు పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడం పెద్ద తప్పని పేర్కొన్నారు. తన కుమార్తె మాట్లాడిన మాటలకు తననెలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనకుండి మాట్లాడించిన శక్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.‘మంగళవారమే ఢిల్లీకి చేరుకున్నప్పటికీ సమయం దొరకలేదు. బుధవారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడిని కలిసి అన్ని అంశాలను సమగ్రంగా వివరించా. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బిజీగా ఉండటంతో ఆయన్ను కలవలేకపోయా. నా వివరణను ఖర్గే, మీనాక్షి నటరాజన్‌లకు లిఖితపూర్వకంగా అందజేశా. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాం«దీలకు ఈ–మెయిల్ ద్వారా, కేసీ వేణుగోపాల్‌కు వాట్సాప్ ద్వారా పంపించా. నా వివరణను పరిశీలిస్తానని ఖర్గే చెప్పారు..’అని సురేఖ వెల్లడించారు. నా కూతురు పూర్తి స్వతంత్ర వ్యక్తిగా జీవిస్తోంది.. ‘నా కూతురికి పెళ్లయింది. తను ఒక ఇంటి కోడలిగా పూర్తి స్వతంత్ర వ్యక్తిగా జీవిస్తోంది. తన ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేసే, మాట్లాడే అధికారం ఆమెకు ఉంది. మాట్లాడవద్దని చెప్పే అధికారం తల్లిదండ్రులుగా మాకు లేదు. సమాజంలో నిత్యం వందల మంది ఎన్నో మాట్లాడుతుంటారు. అలాగే ఆమె కూడా మాట్లాడింది. ఆమె నా బిడ్డ అయినంత మాత్రాన నన్ను ఎందుకు బాధ్యురాలిని చేయాలి? మహిళలు మనుస్మృతి భావజాలాన్ని వీడి తండ్రి లేదా సోదరుల మద్దతుపై ఆధారపడకుండా స్వతంత్రంగా మాట్లాడాలని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. నా బిడ్డ అలాగే స్వతంత్రంగా మాట్లాడింది. ఆ వ్యాఖ్యలను సమరి్ధంచడం లేదా ఖండించడంపై నేనేమీ మాట్లాడను. నా సొంత రాజకీయ జీవితం, నా భర్త రాజకీయ ప్రస్థానం వేరు. మంత్రి పదవి కొనసాగించాలని కోరా.. నేను పద్మశాలి వర్గానికి, నా భర్త మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాళ్లం. తెలంగాణలో ఈ రెండు సామాజిక వర్గాలకు కలిపి దాదాపు 16 శాతం ఓటు బ్యాంకు ఉంది. బీసీ మంత్రిగా ఉన్న నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అప్పగించిన శాఖలను నిరి్వఘ్నంగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నా. నా మంత్రి పదవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనసాగేలా చూడాలని అధిష్టానాన్ని కోరా. నాపై మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ స్వచ్ఛందంగా మాట్లాడలేదు. కొందరు వెనకుండి బలవంతంగా మాట్లాడించారు. వివాదం అవుతుందనే ఉద్దేశంతో వారి పేర్లు బయటపెట్టడం లేదు. ఎవరు మాట్లాడించారో అధిష్టానానికి తెలుసు. మాట్లాడినవారే స్వయంగా మాకు ఫోన్లు చేసి..వాళ్లు పిలిస్తే అయిష్టంగానే వెళ్లాల్సి వచి్చందని చెప్పారు. తప్పు చేయని నన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. వారి వెనుక ఉండి నడిపించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..’అని సురేఖ అన్నారు. పీసీసీ క్రమశిక్షణ సంఘం తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా నివేదిక ఇచ్చి ఉండవచ్చని, ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్న తనపై నిర్ణయం తీసుకునే తుది అధికారం కేవలం అధిష్టానానికే ఉంటుందని చెప్పారు. ఏఐసీసీ తీసుకునే నిర్ణయం ఆధారంగా తన తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. -
ఢిల్లీలో హైటెన్షన్.. ఖర్గేతో కొండా సురేఖ కీలక చర్చలు!
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఆమె భేటీ కానున్నారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా అధిష్ఠాన పెద్దలతో సమావేశమవుతున్నారు.ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి.. ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సుమారు గంటన్నరపాటు సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటీలో కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీ క్రమశిక్షణ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, పెండింగ్‌లో ఉన్న రెండు మంత్రి పదవులు, కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, అలాగే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులు కూడా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలా? లేక శాఖ మార్పుతో సరిపెట్టాలా? అనే అంశంపై అధిష్ఠానం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సురేఖకు కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఆమెపై తుది నిర్ణయం తీసుకునే ముందు సురేఖతో సంప్రదింపులు జరపాలని కొందరు నేతలు అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. శాఖను మార్చడం వంటి ప్రత్యామ్నాయాన్ని కూడా కొందరు నేతలు సూచించినట్లు సమాచారం.ఇక మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్‌తో కేసీ వేణుగోపాల్ సమావేశం కూడా కీలకంగా మారింది. సురేఖ వ్యవహారంపై వారి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఖర్గే నేతృత్వంలో మరో కీలక భేటీ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా.. కొండా సురేఖపై చర్య విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠగా మారింది.ఇదీ చదవండి: ప్రజలను కాంగ్రెస్ నట్టేటముంచింది: కేటీఆర్ -
HYD: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. గాంధీభవన్ వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం వద్ద కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ‘కాంగ్రెస్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఈ ఆందోళన చేపట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అమిత్ షా దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. అనంతరం, బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా.. వారితో వాగ్వాదం జరిగింది. గాంధీ భవన్ వద్ద హైటెన్షన్..మరోవైపు.. కాసేపటి క్రితం బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్లిన యూత్ కాంగ్రెస్ నేతలు.. బీజేపీ ఆఫీస్ గేట్లకు నల్లరంగు పూయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి ప్రతిగా గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. గాంధీ భవన్ వైపు వచ్చిన పలువురు బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇరువర్గాల ఆందోళనల నేపథ్యంలో గాంధీ భవన్‌పై దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గాంధీ భవన్ చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.ఇదీ చదవండి: తుక్కుగూడలో ‘ఆర్డీకర్’ తరహా అఘాయిత్యం -
రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మనుస్మృతికి, డా. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు.ఆర్ఎస్ఎస్, బీజేపీ మనుస్మృతిని అనుసరిస్తున్నాయి. మనుస్మృతి ఆధారంగానే దళితులపై వివక్ష కొనసాగుతోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభలను వాళ్లు శుద్ధీకరణ చేస్తున్నారు. ఈ ఘటనే వాళ్ల వివక్షకు నిదర్శనం. అంటరాని తనం పాటిస్తున్నారు.. అది నేరం. దేశంలో దళితులపై అనాదిగా కొనసాగుతున్న అణచివేతకు ఇప్పటికీ పూర్తిగా తెరపడలేదని రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో దళిత విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించడం, ‘శుద్ధీకరణ’ పేరుతో వివక్ష చూపడం వంటి ఘటనలు అంటరానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కులాలకు చెందిన వాడినని ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ.. బీజేపీ నేతలు మాత్రం పాత కుల వివక్ష విధానాలనే కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి కొత్త సంస్థలు, కొత్త పేర్లు, కొత్త విభాగం వచ్చినా.. దాని విధానాలు మాత్రం మారలేదని విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వం, హక్కులను కాపాడటం కోసమే తమ పోరాటమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారుLIVE: Special Congress Party Briefing by LoP Shri @RahulGandhi at AICC HQ, New Delhi https://t.co/f6sL6o2vHX— Congress (@INCIndia) August 29, 2026 ఇదీ చదవండి: సోనియా బుక్.. అందుకే బీజేపీ భయపడుతోందా? -
ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో.. కొండా కుటుంబంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేరడంతో రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక, ఖర్గేతో భేటీ అనంతరం కూడా భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తిని పెంచుతోంది.తాజా పరిణామాల్లో భాగంగా నిన్న కొండా మురళి, రాజగోపాల్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. అయితే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా మురళి.. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదంపై కొండా కుటుంబం తమ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ.. పార్టీ అధిష్ఠానం మాత్రం కఠిన చర్యల దిశగానే అడుగులు వేస్తుందా? అన్న చర్చ మొదలైంది.ఇదిలా ఉంటే.. కొండా మురళి, రాజగోపాల్‌రెడ్డితో భేటీ అనంతరం భట్టి విక్రమార్క నేరుగా బెంగళూరు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఖర్గేతో భట్టి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో కొండా కుటుంబం వ్యవహారంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను భట్టి ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా సుస్మిత తాజాగా చేసిన వ్యాఖ్యలు, వాటిపై పార్టీలో నెలకొన్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో.. ఆ సిఫారసులను అమలు చేయాల్సిన అవసరం ఉందని భట్టి అధిష్ఠానం వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. కొండా కుటుంబంతో పాటు సీనియర్ నేత చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని భట్టి కోరినట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం క్రమశిక్షణతో ముందుకు సాగాలంటే.. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే నేతలపై చర్యలు తప్పవని ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.ఇంకా బెంగళూరులోనే భట్టి..మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం కూడా భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తిని పెంచుతోంది. మరోసారి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కొండా ఫ్యామిలీపై కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. క్రమశిక్షణ కమిటీ సిఫారసులకు ఆమోదం లభిస్తుందా? కొండా కుటుంబంపై చర్యలు తప్పవా? చిన్నారెడ్డిపై కూడా వేటు పడుతుందా? లేక వివాదానికి మరోసారి సర్దుబాటు పరిష్కారం చూపుతారా? అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.సీఎం, పీసీసీ అభిప్రాయాలపైనా చర్చఇదిలా ఉండగా.. కొండా కుటుంబం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ నాయకత్వం అభిప్రాయాలపైనా భట్టి-ఖర్గే మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదాన్ని రాష్ట్ర స్థాయిలోనే ముగించాలా? లేక అవసరమైతే ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలా? అన్న అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ అంశాన్ని ఇకపై సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని భట్టి అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని కూడా కోరినట్లు సమాచారం.చదవండి: ‘రేవంత్‌పై కొండా సుస్మిత వ్యాఖ్యలతో నాకేం సంబంధం’ -
కులగణనలో ఓపెన్ ఫార్మాట్ వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జనాభా లెక్కల సేకరణలో కులాల వివరాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓపెన్ ఫార్మాట్ (స్వేచ్ఛగా కులం పేరును నమోదు చేసే) విధానంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పద్ధతి వల్ల కచ్చితమైన వివరాలు నమోదు కాకపోగా, కులగణన అసలు లక్ష్యమే నీరుగారిపోతుందని రాజ్యసభ, లోక్‌సభ ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రశ్నావళిని తక్షణమే రద్దు చేయాలని, రాజకీయ పక్షాలు, నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే కొత్త విధానాన్ని ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఖర్గే, రాహుల్ సంయుక్తంగా లేఖ రాశారు. తప్పుడు డేటాకు ఆస్కారం జనాభా లెక్కల్లో కులాల నమోదు కోసం ఎలాంటి కచ్చితమైన ముందస్తు జాబితా లేకుండా ‘ఓపెన్–ఎండెడ్’ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిద్వారా పౌరులు తమ కులం పేరును ఇష్టం వచ్చిన రీతిలో చెప్పుకునే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకే కులానికి వేర్వేరు పేర్లు, ఉప కులాలు, భిన్నమైన స్పెల్లింగ్‌లు వాడుకలో ఉన్నాయని ఖర్గే, రాహుల్ తమ లేఖలో ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధానం వల్ల ఒకే కులం వేలాది వేర్వేరు పేర్లతో నమోదయ్యే ప్రమాదం ఉందని వివరించారు. దానివల్ల దేశంలో కులాల సంఖ్య లక్షల్లో ఉన్నట్లుగా తప్పుడు డేటా వస్తుందని, ఫలితంగా మొత్తం కులగణన ప్రక్రియే నిరుపయోగంగా మారుతుందని తేల్చిచెప్పారు. ‘డ్రాప్–డౌన్’ జాబితాయే పరిష్కారం ఈ గందరగోళాన్ని నివారించడానికి ఓపెన్ ఫార్మాట్ బదులుగా ‘డ్రాప్–డౌన్’జాబితా పద్ధతిని అమలు చేయాలని ఖర్గే, రాహుల్ సూచించారు. జనాభా లెక్కల సేకరణ సిబ్బంది వద్ద ముందుగానే పొందుపరిచిన కులాల జాబితా ఉంటే కచ్చితమైన సమాచారం నమోదు చేయడానికి వీలుంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల జన గణనకు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(ఎస్ఈబీసీ) జాబితా, ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ఆధారంగా ఈ డ్రాప్–డౌన్ జాబితాను సులభంగా తయారు చేయవచ్చని సూచించారు. తెలంగాణ (2024), బిహార్ (2022) రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనల్లో ఈ డ్రాప్–డౌన్ విధానాన్నే అనుసరించారని వెల్లడించారు. ఆయా రాష్ట్రాల కులాల జాబితా కాపీలను ప్రధానికి రాసిన లేఖకు జతచేశారు. ప్రశ్నావళిలో ‘వెనుకబడిన తరగతి’ పదం ఏదీ? కేంద్రం తీసుకొచ్చిన తాజా ప్రశ్నావళిలో కనీసం ’వెనుకబడిన తరగతి’అనే పదం కూడా లేకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కులగణనలో సరైన గణాంకాలు రాకపోతే అత్యంత నష్టపోయేది ఓబీసీలు, ఇతర అట్టడుగు వర్గాలేనని స్పష్టం చేశారు. దీనివల్ల విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, ప్రభుత్వ పథకాల రూపకల్పన వంటి కీలక అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. గణాంకాలు చెబుతున్న వాస్తవాలివే..కులగణన కచ్చితంగా జరగాల్సిన అవసరాన్ని పలు గణాంకాలతో సహా ఖర్గే, రాహుల్ వివరించారు. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ఓబీసీ జాబితాలో 2,479 కులాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో మండల్ కమిషన్ దేశంలో 3,743 వర్గాలను ఓబీసీలుగా గుర్తించింది. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) అంచనాల ప్రకారం దేశ జనాభాలో ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 9 శాతం, ఓబీసీలు 42 శాతం, ఇతరులు 27 శాతం ఉన్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్)–2025 అంచనాల ప్రకారం ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 9 శాతం, ఓబీసీలు 46 శాతం, ఇతరులు 24 శాతం వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఓపెన్ ఫార్మాట్’విధానాన్ని అమలు చేస్తే ఈ వాస్తవ గణాంకాలన్నీ తప్పులతడకగా మారిపోయే ముప్పు ఉందని ఖర్గే, రాహుల్ తమ లేఖలో ఉద్ఘాటించారు. ఈ పరిస్థితిని నివారించి, కుల గణన ద్వారా కచ్చితమైన సమాచారం రాబట్టేలా పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. -
ఖర్గేను కలిసిన సురేఖ.. నేడు రేవంత్ ప్రెస్‌మీట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొండా కుటుంబ వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ నిన్న బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆమె రాత్రి 8.45 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.బెంగళూరులో ఖర్గేతో భేటీ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను మంత్రి సురేఖ.. ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అన్ని విషయాలను ఆయనతో మాట్లాడతానని కొండా సురేఖ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే, ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్‌మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్‌లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్ రియాక్షన్ఇదిలా ఉండగా, లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రాకతో కొండా కుటుంబ వ్యవహారంపై తదుపరి పరిణామాలపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ సీఎంను కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉందని, ఈ వ్యవహారంపై పార్టీ పరంగా కీలక నిర్ణయం వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికా పర్యటన రద్దు కావడానికి గల కారణాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కారణంగానే తన పర్యటన రద్దయిందన్న అంశంపై కూడా సీఎం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. -
మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరింది. ఆదివా రం మధ్యాహ్నం ఆమె బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. దాదాపు 15 నిమిషాలపాటు ఇద్దరి భేటీ జరిగిందని సమాచారం. అయితే బెంగళూరుకు వెళ్లి ఖర్గేను కలిసిన విషయంలో మంత్రి సురేఖ గోప్యత పాటించడం.. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్న ముందు రోజే ఆమె ఏఐసీసీ అధ్యక్షుడితో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అన్ని విషయాలపై వివరణ ఖర్గేను కలిసిన సందర్భంగా మంత్రి సురేఖ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై మాట్లాడినట్టు తెలిసింది. ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్‌మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్‌లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం. బీజేపీ చీఫ్ రాంచందర్‌రావుకు తారసపడిన సురేఖ మంత్రి కొండా సురేఖ బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురూ పలకరించుకున్నారని, ఆ సమయంలోనే బెంగళూరు నుంచి వస్తున్నానని సురేఖ వెల్లడించారని సమాచారం. -
జాతీయ నేతలు కూడా దేశద్రోహులేనా?
కలబురిగి: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి జాతీయ నేతలు నిర్ణయించిన వందేమాతరం వెర్షన్‌నే కాంగ్రెస్ అనుసరిస్తోందని చెప్పారు. వందేమాతరం సంక్షిప్త రూపంపై నిర్ణయం తీసుకున్న జాతీయ నేతలు కూడా దేశద్రోహులేనా? అని ప్రశ్నించారు. వందేమాతరం గీతాన్ని కేవలం రెండు చరణాలు మాత్రమే పాడాలన్న నిర్ణయం దేశ వ్యతిరేకమైనదని, చట్టాన్ని ధిక్కరించి ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు. శనివారం కర్ణాటకలోని కలబురిగిలో మీడియాతో మాట్లాడారు. చరిత్ర చదవాలని అమిత్ షాకు సూచించారు. పండిట్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ తదితరులు కలిసి వందేమాతరం గీతాన్ని ఆరు చరణాల నుండి రెండు చరణాలకు తగ్గించాలని 1937లో నిర్ణయించారని తెలిపారు. మనమంతా గత 90 ఏళ్లుగా రెండు చరణాలు ఆలపిస్తున్నామని చెప్పారు. 90 ఏళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఆరు చరణాలు ఎందుకు ఆలపించలేదని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇన్నాళ్లూ ఈ విషయం ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. అవసరమైనప్పుడల్లా కొత్త సమస్యలను తెరపైకి తేవడమే బీజేపీ విధానమని ధ్వజమెత్తారు.దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి వందేమాతరం గీతాన్ని ఆలపించడానికి కాంగ్రెస్ ఎన్నడూ వ్యతిరేకం కాదని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. జనగణమన గేయాన్ని ఆలపించినట్లే తమ పార్టీ, సేవాదళ్ ఎన్నో ఏళ్లుగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్నాయని గుర్తుచేశారు. జనగణమన కూడా ఐదు చరణాలతో దీర్ఘంగా ఉండేదని, నేడు ఒక చరణాన్ని మాత్రమే పాడుతున్నారని తెలియజేశారు. దీనిని గేయ రచయిత రవీంద్రనాథ్ టాగోర్ కూడా ఆమోదించారని చెప్పారు. వందేమాతరంలో రెండు చరణాలు, జన గణ మనలో ఒక చరణం ఉన్నాయని, రెండింటికీ ఒకే సమయం పడుతుందని స్పష్టంచేశారు. జాతీయ నేతలు నిర్ణయించిన దానినే మనం ఈరోజు పాడుతున్నామని, వారు చెప్పినట్లు మనం పాడితే మనం దేశద్రోహులమా? అని ప్రశ్నించారు. -
పండుగల వేళ ‘షుగర్’ షాక్.. కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: పండుగల సీజన్ మొదలు కాకముందే దేశంలో చక్కెర ధరలు పెరుగుతుండటంపై రాజకీయ దుమారం రేగుతోంది. పెరుగుతున్న ధరలు, తక్కువగా ఉన్న చక్కెర నిల్వలు, ఇథనాల్ ఉత్పత్తి విధానాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అదే సమయంలో దేశంలో చక్కెర కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.చక్కెర నిల్వలు తగ్గడం, ధరలు పెరగడం, ఇథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లించడం వంటి అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించింది. కేంద్రం చెబుతున్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు ప్రస్తుత పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయని ప్రశ్నించింది. ముఖ్యంగా పండుగల సీజన్‌కు ముందు ధరలు పెరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రతిపక్షం నిలదీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. పండుగల సీజన్ ప్రారంభానికి ముందే చక్కెర ధరలు పెరగడం, దేశంలో చక్కెర నిల్వలు తగ్గిపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ విధానాల చేదు.. చక్కెర తీపిలోకి కూడా చేరింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకును మళ్లించడం వల్ల చక్కెర ఉత్పత్తి, నిల్వలు ప్రభావితమయ్యాయా? దేశంలో చక్కెర నిల్వలు తొమ్మిదేళ్ల కనిష్ఠానికి చేరాయా? ధరలు పెరుగుతున్న వేళ చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇదేనా ఆత్మనిర్భర్ భారత్? అంటూ కేంద్ర విధానాలపై విమర్శలు గుప్పించారు.ఇది కూడా చదవండి: రేవంత్ ఒక్కడే కాదు.. కేంద్రం ‘నో’ చెప్పిన సీఎంలు వీరే!అయితే ఖర్గే ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కారణం కాదని స్పష్టం చేసింది. 2022-23లో ఇథనాల్‌కు మళ్లించిన చక్కెర వాటా సుమారు 12 శాతం ఉండగా.. 2025-26లో అది దాదాపు 9 శాతానికి తగ్గిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల పెరుగుదలకు తక్కువ దేశీయ ఉత్పత్తి, వాతావరణ ప్రభావం, పండుగల డిమాండ్, ఊహాజనిత ట్రేడింగ్, నిల్వ దాచడం వంటి కారణాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్రం అక్టోబర్ 31 వరకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. అలాగే హోర్డింగ్‌ను అరికట్టేందుకు స్టాక్ పరిమితులను కూడా కఠినతరం చేసింది. మొత్తానికి పండుగల వేళ చక్కెర ధరలు పెరగడం, దేశీయ నిల్వలు, ఇథనాల్ ఉత్పత్తి, దిగుమతులు.. ఈ నాలుగు అంశాలు ఇప్పుడు కేంద్రం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. పండుగల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చక్కెర ధరలు ఎలా ఉంటాయన్నదే వినియోగదారుల్లో ఆసక్తిని రేపుతోంది. -
పార్టీలో నాకు మద్దతేదీ?.. ఖర్గే ఆవేదన
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో తన సభ తర్వాత జరిగిన ‘శుద్ధీకరణ’ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను అవమానించిన ఈ ఘటనపై పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో బహిరంగంగా స్పందించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశం బయట రాజకీయ వివాదానికే పరిమితం కాకుండా.. ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత చర్చలోనూ చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.అలాగే సామాజిక న్యాయం, కుల వివక్షకు సంబంధించిన అంశాలపై పార్టీ నాయకులు దూకుడుగా వ్యవహరించాలని ఆయన కోరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బుధవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఖర్గే శుద్ధీకరణ అంశాన్ని లేవనెత్తారు. తనకు మద్దతు తెలపని సీనియర్ నాయకులపై ఖర్గే సరదాగా ఒక వ్యాఖ్య చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ‘బాగా రాసేవారు, చూడటానికి బాగుండేవారు ఈ విషయంలో గట్టిగా గళం విప్పలేదని ఖర్గే ఆవేదన చెందారు’ అని వెల్లడించాయి.పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం కాంగ్రెస్ ఇప్పటికే ఈ ఘటనను ఖండించిందని చెప్పారు. ఈ ఘటన ‘ఆమోదయోగ్యం కాదు, ఖండించదగినది’ అని ఆయన పేర్కొంటూ, ఇది బీజేపీ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. అయితే సమావేశంలో ఉన్న నేతల ప్రకారం, ఖర్గే మాత్రం పార్టీ స్పందనపై పూర్తిగా సంతృప్తి చెందినట్లు కనిపించలేదని సమాచారం. అంటే ఈ ఘటనను కేవలం ఉత్తరాఖండ్‌లో జరిగిన ఒక రాజకీయ వివాదంగా వదిలేయకుండా.. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం అంశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ అధ్యక్షుడు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.అసలేం జరిగింది?కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగస్టు 8న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో రామలీలా మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. 2027 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాల్లో భాగంగా ఈ సభ జరిగింది. ఆయన సభ ముగిసిన రెండు రోజుల తర్వాత, అదే రామలీలా మైదానంలో ఖర్గే ప్రసంగించిన వేదికను కొందరు వ్యక్తులు ‘శుద్ధీకరణ హవన్’ పేరుతో శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ్ సేనకు సంబంధించిన వారుగా చెప్పబడుతున్న వ్యక్తులు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఖర్గే స్వయంగా రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఏ కులం లేదా మతాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రసంగించలేదని, ప్రజలకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించానని చెప్పారు. తన ప్రసంగం తర్వాత వేదికకు ‘శుద్ధీకరణ’ చేయడం తనను అవమానానికి గురిచేసిందని, అంటరానితనం వల్ల కలిగే బాధను గుర్తు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ వైఖరి ఏంటి..ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగడంతో బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా ఈ ఘటనను విచారకరమని పేర్కొంటూ, బీజేపీకి దీనితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఖర్గే చేసిన ఆరోపణలపై విచారణ చేస్తామని కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఘటనను కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానంగా కాకుండా కుల వివక్ష, సామాజిక న్యాయం, అంటరానితనం వంటి అంశాలతో ముడిపెట్టింది. ఈ అంశాన్ని రాజకీయంగా కూడా బలంగా ప్రస్తావిస్తోంది.ఇదీ చదవండి: డీకే ఎదుట విజయ్ సరెండర్.. డీఎంకేకు చిక్కిన అస్త్రంమొత్తానికి.. హల్ద్వానీలో జరిగిన ‘శుద్ధీకరణ’ ఒక వేదికను శుభ్రం చేసే కార్యక్రమంగా మొదలైనా.. అది ఇప్పుడు కుల వివక్ష, సామాజిక న్యాయం, రాజకీయ సిద్ధాంతాలపై పెద్ద చర్చగా మారింది. అంతేకాదు.. ఆ ఘటనపై బయట బీజేపీతో పోరాడుతున్న కాంగ్రెస్.. లోపల మాత్రం తన సొంత నేతల స్పందనపైనే అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నలు సంధించడం కొత్త రాజకీయ కోణాన్ని తెరపైకి తెచ్చింది. -
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి సత్తా చాటాలని, అందుకు అవసరమైన అన్నిరకాల సహకారం అందించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్టానం ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వగా, సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ వ్యూహాలు, జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి కీలకమైన రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులు, పీసీసీ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారన్నారు. అధిష్టానం ఆదేశిస్తే.. పార్టీ విజయంలో కీలక భూమిక పోషించే ప్రచారం కోసం అక్కడే మకాం వేసి పూర్తిస్థాయిలో పనిచేస్తారని సీఎం తెలిపారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీలను ఆయా రాష్ట్రాల ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారాన్ని రూపొందిస్తామన్నారు. బీజేపీ విధానాలను తిప్పికొట్టాలి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీ, అయోధ్య రామాలయంలో చందాల చోరీ వంటి విషయాల్లో బీజేపీ తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే సమయం యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు, సమరశీల పోరాటాలు చేపడుతున్నామని వివరించారు. భవిష్యత్ ఎన్నికల్లో యువతే కీలకపాత్ర పోషించనున్నందున, వారి సమస్యలపై నిరంతరం దృష్టి సారిస్తున్నామని చెప్పారు. -
వందేమాతరం వివాదంపై భగ్గుమన్న మల్లికార్జున్ ఖర్గే
సాక్షి, ఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ జాతీయగేయం వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారంటూ వివాదం చెలరేగింది. తాజాగా దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. తాము పాడిన వందేమాతరం గతంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాడినదేనని ఆయన స్పష్టం చేశారు. అది నేరమైతే మహాత్మా గాంధీ, నెహ్రూలపైనా కేసులు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఖర్గే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వందేమాతరం ఆలాపన జరిగింది. అయితే గాయకులు వందేమాతరంలోని పూర్తి వెర్షన్‌ను ఆలపిస్తుండగా సోనియా గాంధీ ఖర్గే వైపు సైగ చేసి, అనంతరం గాయకులకు కూడా ఏదో చెప్పినట్లు కనిపించిందని బీజేపీ ఆరోపించింది. ఆమె వందేమాతరం పూర్తి ఆలాపనను ఆపించేందుకు ప్రయత్నించారని బీజేపీ నేతలు విమర్శించారు.అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. ఖర్గే చాలాసేపు నిల్చోవడంతో ఆయనకు కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్వాహకులకు సైగ చేశారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తెలిపారు. వందేమాతరం గీతాన్ని ఆపాలని ఆమె ఎలాంటి సూచన చేయలేదని స్పష్టం చేశారు. ఖర్గే ఆరోగ్యం బాగోలేదని, ఎక్కువసేపు నిల్చోలేరని ఆయన పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై సోమవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. వందేమాతరం గీతాలాపనను అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు. తాజాగా దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఖర్గే మాట్లాడుతూ.. ‘‘మేము పాడిన వందేమాతరం మహాత్మా గాంధీ పాడినదే. జవహర్లాల్ నెహ్రూ పాడినదే. గత 18 ఏళ్లుగా మేము అదే వందేమాతరాన్ని పాడుతున్నాం. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనూ ఇదే పాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లపాటు ఇదే వందేమాతరం పాడారు’’ అని అన్నారు.‘‘మేము చేసినదే నేరమైతే.. గత 18 ఏళ్లుగా ఇదే నేరం జరుగుతున్నట్లే. అదే నేరమైతే మహాత్మా గాంధీపై కేసు పెట్టండి. నెహ్రూపైనా కేసు పెట్టండి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. జాతీయ గీతాలు, జాతీయ గీతాలాపనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాల క్రితమే తీర్మానం చేసిందని, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారిలో చాలామంది పుట్టకముందే కాంగ్రెస్ ఈ అంశంపై నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, వందేమాతరం వివాదం మరింత ముదిరింది. సోమవారం గోవాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ఖర్గే స్వయంగా వందేమాతరాన్ని ఆలపించారు. అయితే ఈసారి గీతంలోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడారు. గోవా కాంగ్రెస్ సదస్సు ప్రారంభానికి ముందు ఖర్గేతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు వందేమాతరం ఆలపించారు.మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వందేమాతరం గీతాన్ని పూర్తి రూపంలో బహిరంగ సమావేశాలు, పాఠశాలలు, అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలు తదితర సందర్భాల్లో ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది. అంతేకాకుండా వందేమాతరం ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, అంతరాయం కలిగించడం లేదా నిలిపివేయడం నేరంగా పరిగణించేలా పార్లమెంట్లో బిల్లును కూడా ఆమోదించింది.దీంతో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వందేమాతరం ఆలాపనపై బీజేపీ చేసిన ఆరోపణలు, సోనియా గాంధీపై వచ్చిన ఫిర్యాదు, కాంగ్రెస్ ఇచ్చిన వివరణలతో ఈ అంశం రాజకీయంగా మరింత వివాదాస్పదంగా మారింది -
బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో విద్వేష వ్యాప్తి
న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్లు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల మధ్య విభేదాలను పెంచుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో శాంతి, ఐక్యతలను పెంపొందించేందుకు తమ పార్టీ ప్రేమ దుకాణం తెరిచిందని చెప్పారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఖర్గే ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాం«దీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు పేర్లు మారుస్తూ వాటిని ప్రధాని మోదీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే, మున్ముందు మోదీ మన జాతీయ జెండాను సైతం ఎగురవేయబోరంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రపంచాన్ని తానే సృష్టించానంటూ మోదీ చెప్పుకోలేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా సలహా ఇచ్చి ఈ ప్రపంచాన్ని తానే రక్షించానంటూ చెప్పుకునే ఉండేవారన్నారు. అది మోదీ ఏర్పాటు చేసిన ట్రస్ట్ అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఆరోపణల అంశాన్ని ఖర్గే ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేద ప్రజలు భక్తితో ఇచ్చిన రూ. 50 విరాళానికి కూడా భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విరాళాల దొంగతనానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘తన ఘనతగా చెప్పుకునేందుకే ప్రధాని మోదీ రామాలయ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, అందులోకి సొంతవాళ్లను నియమించుకున్నారు. సాధుసంతులతో పనిలేకుండా ఒంటరిగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నిజంగాదేశభక్తుడే అయితే ఆధ్యాతి్మకవేత్తలను, రామభక్తులను కలుపుకుని ఈ కార్యక్రమం పూర్తి చేసేవారు’అని ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం ఎంతకైనా తెగించే ఇలాంటి ధోరణి వల్ల, భవిష్యత్తులో మోదీ జాతీయ జెండాను కూడా కిందకు దింపేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉంది’అని ఆయన వ్యాఖ్యానించారు. నిరసన రాజ్యాంగ హక్కు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకో వడం అంటే ఆనాటి యోధులు కలలుగన్న దేశాన్ని సాకారం చేసే క్రమంలో ఆత్మ విమర్శ చేసుకునేందుకు వచ్చిన ఓ అవకాశమని ఖర్గే చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిర, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్, మన్మోహన్ వంటి కాంగ్రెస్ ప్రధానులు తమ హయాంలోని సవాళ్లకు అనుగుణంగా దేశాన్ని ముందుకు నడిపారని, భవిష్యత్ భారత్‌కు బలమైన పునాది వేశారని ఖర్గే అన్నారు. నేటి యువత ఆశలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలతో యువత తీవ్ర నిరాశకు గురై దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు. వారికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని, హక్కుల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడటం ఎంతమాత్రం దేశద్రోహం కాదని ఖర్గే స్పష్టం చేశారు. హక్కుల కోసం గొంతు విప్పుతున్న నేటి యువతను దేశద్రోహులుగా చిత్రీకరించవద్దని, స్వాతంత్య్ర పోరాటంతో సాధించిన హక్కులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. -
స్వాతంత్ర్య వేడుకలకు రెండోసారి రాహుల్ డుమ్మా.. కారణం అదేనా?
ఢిల్లీ: ఎర్రకోటలో జరుగుతున్న 80 వ స్వాతంత్ర్య వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం గైర్హాజరైంది.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరుసగా రెండో ఏడాది ఎర్రకోటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకాలేదు. 2024లో ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై వివాదం చెలరేగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా, కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ.. కార్యక్రమంలో రెండో చివరి వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. ఇది అప్పట్లో సంప్రదాయం, ప్రొటోకాల్‌కు భిన్నంగా ఉందంటూ చర్చకు దారితీసింది.రాహుల్ గాంధీకి వెనుక వరుసలో సీటు కేటాయించడం కాంగ్రెస్ ఎంపీని మాత్రమే కాకుండా ప్రజలను అవమానించడమేనని ప్రతిపక్షం విమర్శించింది. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఒలింపియన్లకు వేదికపై చోటు కల్పించాల్సి రావడంతో సీట్ల కేటాయింపులో మార్పులు చేసినట్లు వివరణ ఇచ్చింది.ప్రొటోకాల్ ప్రకారం అధికారిక, ఆచారబద్ధమైన కార్యక్రమాల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది కూడా ఖర్గే, రాహుల్ గాంధీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గైర్హాజరు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ గైర్హాజరుపై ఎటువంటి ప్రకటన చేయలేదు.కాగా దేశవ్యాప్తంగాభారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ‘వందే మాతరం’ 150 ఏళ్ల వార్షికోత్సవం, అలాగే ‘యువ శక్తి–వికసిత్ భారత్@2047’ ప్రధాన అంశాలుగా వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటలో వేడుకలకు సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నట్లు సమాచారం. -
లోక్‌సభ 19%.. రాజ్యసభ 39%
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. పార్లమెంట్ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వకుండా విపక్ష సభ్యులు పదేపదే నినాదాలు, నిరసనలకు దిగడంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పార్లమెంట్‌ను నిరసనలకు వేదికగా మార్చడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.వర్షాకాల సమావేశాల్లో శాసనపరమైన కార్యక్రమాల పరంగా మంచి పనితీరు కనిపించిందని రిజిజు తెలిపారు. పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. అయితే పార్లమెంట్లో అర్థవంతమైన చర్చలు జరగడంలో మాత్రం సమావేశాలు ఆశించిన స్థాయిలో సాగలేదని పేర్కొన్నారు. లోక్‌సభ ఉత్పాదకత కేవలం 19 శాతంగా నమోదైందని, రాజ్యసభ ఉత్పాదకత 39 శాతంగా ఉందని వివరించారు.లోక్‌సభలో పలు అంశాలపై చర్చకు అవకాశం ఉన్నప్పటికీ.. విపక్ష సభ్యుల నిరసనల కారణంగా కార్యకలాపాలు పదేపదే అంతరాయం కలిగాయని రిజిజు ఆరోపించారు. కొంతమంది విపక్ష ఎంపీలు చర్చల్లో పాల్గొన్నారని అంగీకరించిన ఆయన.. లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లుపై మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో చర్చ జరిగిందన్నారు. మిగతా సమయం పెద్దగా సద్వినియోగం కాలేదని పేర్కొన్నారు.తొలిసారి చూశా..విపక్షాల వైఖరిపై రిజిజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో తొలిసారిగా విపక్షాలు చర్చల నుంచి పారిపోతున్న పరిస్థితిని చూస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అంటే కేవలం నినాదాలు చేయడం, నిరసనలు వ్యక్తం చేయడం మాత్రమే కాదని.. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించి, వాటిపై చర్చ జరిపి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని స్పష్టం చేశారు.కొత్తగా ఎన్నికైన ఎంపీలకు విపక్ష సభ్యులు ఎలాంటి సంప్రదాయాలను నేర్పిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌కు తొలిసారి వచ్చిన సభ్యులు సభా సంప్రదాయాలను, చర్చల పద్ధతులను నేర్చుకోవాల్సిన సమయంలో.. నిరసనలు, నినాదాలే రాజకీయానికి మార్గమని చూపడం సరికాదని అన్నారు.‘నినాదాలు రోడ్లపై చేయాలి’పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని రిజిజు పేర్కొన్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే దానిని సభలో చర్చ రూపంలో వ్యక్తం చేయాలని సూచించారు. నినాదాలు చేయాలనుకుంటే రోడ్లపై చేయొచ్చని.. కానీ పార్లమెంట్లో మాత్రం ప్రజా సమస్యలపై చర్చ జరగాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీలను పార్లమెంట్‌కు పంపుతున్నారని గుర్తు చేసిన రిజిజు.. సభా కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల చివరకు నష్టపోయేది ప్రజలేనని అన్నారు. పార్లమెంట్లో చర్చ జరగకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు.‘ప్రజలే ఈ అహంకారాన్ని బద్దలు కొడతారు’మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌కు వచ్చి విపక్షాల ఆందోళనలు, సమస్యలను వినడం లేదని ఆరోపించారు. వాళ్లు అసలు సభకు రాలేదని అన్నారు. ప్రభుత్వ వైఖరి అహంకారంతో కూడుకున్నదని ఖర్గే విమర్శించారు. పార్లమెంట్ తమ ముందు ఏమీ కాదన్నట్లుగా, తామే సర్వస్వం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘‘వాళ్లు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. పార్లమెంట్‌కు ప్రాధాన్యత లేకుండా చేయాలని భావిస్తున్నారు. ఈ అహంకారాన్ని ప్రజలే బద్దలు కొడతారు’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. -
ఖర్గే సభా వేదిక ‘శుద్ధి’ వివాదం.. రాజ్యసభలో దుమారం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో తన ర్యాలీకి కేటాయించిన వేదికను బీజేపీ నేతలు ‘శుద్ధి’ కార్యక్రమాలతో శుభ్రం చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలు రాజ్యసభలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటన కుల వివక్ష, అంటరానితనానికి నిదర్శనమని ఖర్గే మండిపడ్డారు.గురువారం రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఖర్గే.. హల్ద్వానీలోని రామలీలా మైదానంలో తన సభ జరగాల్సిన ప్రదేశంలో తన రాక తర్వాత కొందరు బీజేపీ నేతలు హవనం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. ఇది దళితుల పట్ల వివక్షను ప్రతిబింబిస్తోందని, బీజేపీ దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెడుతోందని విమర్శించారు.#WATCH | In Rajya Sabha, LoP and Congress chief Mallikarjun Kharge says, "...I was in Haldwani where I made a public speech at Ramlila Maidan. Lakhs of people were there. At that time, I did not mention the name of any community or religion; I only reiterated the issues of the… pic.twitter.com/oePxPC0jBr— ANI (@ANI) August 13, 2026దీనిని బీజేపీ సమర్థించదుఖర్గే ఆరోపణలపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే.. ఇలాంటి చర్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని స్పష్టం చేశారు. “ఖర్గే జీ చేసిన వ్యాఖ్యలు బాధాకరం. ఇది కాంగ్రెస్‌కు మాత్రమే కాదు.. మనందరికీ బాధ కలిగించే విషయం. బీజేపీ ఇలాంటి కార్యక్రమాలను ఎన్నడూ సమర్థించదు. ఘటనపై కచ్చితంగా విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన వారు ఎవరైనా ఉంటే తగిన చర్యలు తీసుకుంటాం” అని నడ్డా హామీ ఇచ్చారు.అయితే, ఈ ఘటనకు మొత్తం పార్టీని బాధ్యురాలిగా చూపడాన్ని నడ్డా ఖండించారు. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండానే బీజేపీపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఖర్గే మనోభావాలు దెబ్బతిన్నందుకు చింతిస్తున్నామని, ఈ అంశాన్ని పార్టీ అధ్యక్షుడి హోదాలో పరిశీలిస్తానని తెలిపారు.#WATCH | In Rajya Sabha, Leader of House and Union Minister JP Nadda responds to LoP Mallikarjun Kharge; says, "What Kharge ji said is really sad - not just for Congress party but for all of us...BJP does not subscribe to such activities. Never. But we will investigate this. I… pic.twitter.com/pC2Fx25vPV— ANI (@ANI) August 13, 2026రాజ్యసభలో వాడీవేడి చర్చఖర్గే వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు ఆరోపణలను ఖండించగా.. కాంగ్రెస్ సభ్యులు సామాజిక సమానత్వం, దళిత గౌరవం అంశాలను ప్రస్తావించారు. అంటరానితనం వంటి వివక్షకు ఎలాంటి స్థానం లేదని, ఘటన నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పక్షం పేర్కొంది. అయితే పార్టీపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేసింది.రాజ్యసభ ఛైర్మన్ తీవ్ర వ్యాఖ్యలుఈ వివాదంపై రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ కూడా స్పందించారు. అంటరానితనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. “అంటరానితనం పాపం కాకపోతే.. ఈ ప్రపంచంలో అంతకంటే పెద్ద పాపం మరొకటి ఉండదు. పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా మనమంతా దీనిని వ్యతిరేకిస్తున్నాం. మనల్ని ఎవ్వరూ శుద్ధి చేయాల్సిన అవసరం లేదు.. మనమంతా ఇప్పటికే శుద్ధులమే” అని అన్నారు. ఘటనపై విచారణ జరిపి, తప్పు చేసిన వారు ఎవరైనా ఉంటే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.‘హవనం అవసరం ఏమొచ్చింది?’.. ఖర్గే ఫైర్ఇదే అంశంపై ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై మరింత తీవ్ర విమర్శలు చేశారు. “ఈ దేశంలో దళితులకు స్థానం లేదని మేం చాలా కాలంగా చెబుతున్నాం. అసలు అక్కడ హవనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని ప్రశ్నించారు. హల్ద్వానీ రామలీలా మైదానంలో అన్ని పార్టీల నేతలు సభలు నిర్వహిస్తుంటారని, కానీ తన సభకు ముందు నిర్వహించిన శుద్ధి కార్యక్రమం హిందూ ధర్మ స్ఫూర్తికి కూడా విరుద్ధమని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలేనని ఆరోపించిన ఖర్గే.. దేశాన్ని విభజించేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
మోదీని ఆటపట్టించిన ఖర్గే.. సరదా సన్నివేశం
ఢిల్లీ: ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతల మధ్య ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ వేదిక వద్దకు రాగానే అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తదితరులు నిలబడి ఉన్నారు. ప్రధాని మోదీ మొదట రాహుల్ గాంధీకి కరచాలనం చేశారు.ఆ తర్వాత ప్రధాని మోదీ నమస్కరిస్తూ ప్రియాంకా గాంధీ వైపు దృష్టి సారించారు. ప్రియాంకా జీ ఎలా ఉన్నారంటూ ప్రధాని పలకరించారు. ‘‘నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?" అంటూ ప్రియాంక బదులిచ్చారు. ‘‘నేను అలాగే ఉన్నాను’’ అని ప్రధాని నవ్వుతూ ముందుకు నడిచారు. ఈ సంభాషణను గమనిస్తున్న మల్లికార్జున ఖర్గే వెంటనే జోక్యం చేసుకున్నారు. ‘‘అలా ఏమీ లేరు.. కాస్త మారారు’’ అని ఖర్గే చమత్కరించారు. ‘‘అవునా’’ అంటూ నవ్వుతూ ప్రధాని మోదీ.. ఖర్గే చేతిపై తట్టారు. చిరునవ్వుల మధ్య ఇద్దరు నేతలు ఒకరికొకరు హై-ఫైవ్ ఇచ్చుకున్నారు.ఢిల్లీలో సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే, నాగ్‌పూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త సారంఘ్ లఖానీల వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ జంట జూన్‌లో ముంబైలో వివాహం చేసుకోగా.. ఢిల్లీలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్ జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, గజేంద్ర సింగ్ షెకావత్, రాందాస్ అథవాలే, చిరాగ్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు.मौका और दस्तूर यही होता है सुप्रिया सुले की बेटी के विवाह समारोह कार्यक्रम में कांग्रेस के वरिष्ठ नेता मल्लिकार्जुन खड़गे जी ने मोदी जी के मजे ले लिए।खड़गे जी - भाई साहब थोड़ा सा बदल गए हैं।नरेंद्र मोदी जी - अच्छाखड़गे जी ने अपने दिल की बात कह दी जो सदन में कहते नहीं बनता था। pic.twitter.com/dDgzLbWO3V— Krishnadev Yadav (@krishna_news) August 12, 2026 -
మాటల మంటలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్ష ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కీలక జాతీయ అంశాలపై రాజ్యసభలో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తప్పుబట్టారు. దీంతో ఇరుపక్షాల సభ్యులు మధ్య మాటల మంటలు చెలరేగాయి. రిజిజు నుంచి నేర్చుకోవాలా?: ఖర్గే రాజ్యసభ మొదలైన వెంటనే చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. ఈ సందర్భంగా జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాషీ్టకం అంశంలో కేంద్ర హోంమంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికార పక్షం, చైర్మన్ అడ్డుచెప్పడంతో ఖర్గే జోక్యంచేసుకున్నారు. ప్రతిపక్షం లేవనెత్తుతున్న ప్రజా సమస్యలకు సమాధానం చెప్పకుండా నిబంధనల పేరుతో ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజా ప్రయోజనకర అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరడం ప్రతిపక్షాల రాజ్యాంగబద్ధ బాధ్యత అని గుర్తుచేశారు. సభా నియమాలను ఖర్గే పాటించడం లేదన్న రిజిజు వ్యాఖ్యలకు ఖర్గే ఘాటుగా స్పందించారు. ‘రిజిజు నుంచి మేం నేర్చుకోవాల్సి వస్తోంది. ఎప్పుడు, ఎక్కడా, ఎలా, ఏది మాట్లాడాలో మాకు తెలుసు’అని అన్నారు. కాంగ్రెస్ తీరుతో చాన్స్ రావట్లేదన్న రిజిజు ఖర్గే వ్యాఖ్యలపై రిజిజు స్పందించారు. ‘‘ప్రతిపక్ష నేత డిమాండ్లు చేస్తున్నప్పుడు సంబంధిత నిబంధనలను ప్రస్తావించకుండా కేవలం ఒత్తిడి తీసుకురావడం సరైన పద్ధతి కాదు. సభను గానీ, చైర్మన్‌ను గానీ ఎవ్వరూ ఆదేశించజాలరు. కాంగ్రెస్‌లోని యువ, కొత్త సభ్యులకు మాట్లాడే అవకాశాలు దక్కట్లేదు. ముఖ్యంగా పవన్ ఖేరా వంటి కొత్త సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు. సభలో చర్చలు, ప్రశ్నోత్తరాలు, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక సంభాషణ జరగాలంటే అధికార, ప్రతిపక్షాలు రెండూ పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించి సహకరించాలి’’అని రిజిజు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో నినాదాలు మార్మోగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. విపక్షాల వాదనలను వినండి: చైర్మన్ 12 గంటలకు సభ ఆరంభమయ్యాక రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ సభలో ఉన్న మంత్రి రిజిజునుద్దేశించి మాట్లాడారు. ‘‘ఇన్ని రోజులుగా విపక్షసభ్యులు హోం మంత్రి సభకు రావాలని, జంతర్‌మంతర్ ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్చేస్తున్నారు. వాళ్ల డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లండి. షాను సభకు రమ్మని చెప్పండి. ఎందుకంటే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మీరే ’’అని రాధాకృష్ణ గుర్తుచేశారు. పోలీస్చర్యపై అమిత్ షా ప్రకటన చేయాలంటూ కాంగ్రెస్‌సహా విపక్ష పారీ్టలకు చెందిన కొందరు సభ్యులు వాకౌట్‌చేశారు. తర్వాత సైతం రాజ్యసభలో నినాదాలు కొనసాగడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి లోక్‌సభ మొదలుకాగానే దశాబ్దాల క్రితం హిరోíÙమా, నాగసాకి నగరాలపై అణుబాంబు దాడిలో మరణించిన వారికి సభ్యులు నివాళులరి్పంచారు. తర్వాత వెంటనే విపక్ష సభ్యులు పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ నినాదాలు మొదలెట్టారు. దీంతో లోక్‌సభ స్పీకర్ బిర్లా అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడం సరికాదని సభ్యులకు సూచించారు. అయినప్పటికీ పరిస్థితి మారకపోవడంతో లోక్‌సభలో వాయిదాలు కొనసాగాయి. -
మల్లిఖార్జున ఖర్గే Vs జేపీ నడ్డా..దద్దరిల్లిన పార్లమెంట్..
-
“అరెస్టుల్లో తప్పేముంది?”.. విద్యార్థి నిరసనలపై నడ్డా కౌంటర్
నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, రాజ్యసభ సభా నాయకుడు జేపీ నడ్డా ప్రభుత్వ చర్యలను సమర్థించారు. నిరసనలు చేపట్టినప్పుడు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.బుధవారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థి నిరసనలపై పోలీసులు బలప్రయోగం చేశారని, ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. నిరసనకారులపై చర్యలు తీసుకున్న వారిపై ఎందుకు చర్యలు లేవని.. వాళ్లు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.దీనిపై స్పందించిన నడ్డా.. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవడం వారి బాధ్యత అని అన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో పాల్గొనే వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.Union Minister JP Nadda on Wednesday defended the Delhi Police action at the CPI(M) headquarters, calling it a "normal law and order situation" and accusing the Opposition of politicising the incident. Responding in the Rajya Sabha after CPI(M) MP John Brittas raised the issue,… pic.twitter.com/i2yzjYApeE— The Siasat Daily (@TheSiasatDaily) July 29, 2026నిరసనలు చేస్తే చర్యలు సహజమేవిద్యార్థి ఉద్యమాలపై మాట్లాడిన నడ్డా.. యాక్టివిజంలో పాల్గొనేవారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. నిరసన హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ.. చట్ట పరిమితులను దాటితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. తన విద్యార్థి దశను గుర్తు చేసుకున్న నడ్డా.. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా విద్యార్థి కార్యకర్తగా ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో తరగతి గది నుంచి రెండుసార్లు పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.‘నేనూ అరెస్టయ్యా..’‘‘నేను కూడా విద్యార్థి ఉద్యమంలో ఉన్నాను. ఎమర్జెన్సీ సమయంలో క్లాస్రూమ్ నుంచి రెండుసార్లు నన్ను పోలీసులు తీసుకెళ్లారు’’ అని నడ్డా పేర్కొన్నారు. అయితే అప్పటి పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ఉద్యమాల్లో పాల్గొంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.ఇటీవల విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని డిమాండ్ చేశారు. అయితే నడ్డా మాత్రం పోలీసుల చర్యలను సమర్థించారు. చట్టాన్ని అమలు చేయడం ప్రభుత్వ, పోలీసు వ్యవస్థల బాధ్యత అని అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితుల్లో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. -
రాజ్యసభలో మాటల మంటలు.. నడ్డా, ఖర్గే మధ్య వాగ్వాదం
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో నేతల మాటల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎంపీ జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, రాజకీయ ప్రత్యర్థులపై చర్యలు వంటి అంశాలపై ఇరువురు నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఎమర్జెన్సీ కాలం నాటి అరెస్టులను ప్రస్తావిస్తూ జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విమర్శలు చేయగా, ప్రస్తుతం బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య హక్కులు క్షీణిస్తున్నాయని ఖర్గే ఆరోపించారు.ప్రజలకు స్వేచ్ఛ లేదు: ఖర్గేపార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ఉదయం సభలో మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి రక్షణ లేదని ఆరోపించారు. దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు.దీనికి ప్రతిస్పందించిన జేపీ నడ్డా.. కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను నడ్డా రాజ్యసభలో ప్రస్తావించారు. అప్పట్లో తాను విద్యార్థిగా ఉన్న సమయంలో క్లాస్ జరుగుతుండగానే అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల స్వేచ్ఛ, హక్కులు అణచి వేయబడ్డాయని పేర్కొంటూ, కాంగ్రెస్ చరిత్రను ఆయన విమర్శించారు. Ruckus in Rajya Sabha over police action on protesters: "Those who hit students are roaming free," Congress chief Mallikarjun Kharge slams Centre, JP Nadda hits back, says "police acted to maintain law & order" pic.twitter.com/EZ3u8jj7fu— NDTV (@ndtv) July 29, 2026ఇదే సమయంలో తమ పార్టీ కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు రావడంపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద పోలీసుల జోక్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళనకర సంకేతమని పేర్కొంది. అయితే, పార్టీ కార్యాలయాలకు పోలీసులు వెళ్లడం సాధారణ ప్రక్రియేనని జేపీ నడ్డా స్పందించారు. చట్టపరమైన అంశాల్లో పోలీసులు తమ విధులు నిర్వహిస్తారని తెలిపారు.దీంతో, ఎమర్జెన్సీ నాటి పరిణామాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన చర్చతో రాజ్యసభలో వాతావరణం వేడెక్కింది. గత ప్రభుత్వాల విధానాలు, ప్రస్తుత పాలనపై అధికార–విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. -
యువత కళ్లలోకి చూసే ధైర్యం మోదీకి ఉందా?
న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో రక్తమోడిన యువత కళ్లలోకి నేరుగా చూసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. యువతకు అన్ని దారులు మూసుకుపోయాయని, ఇక వారు ఎక్కడికి వెళ్లాలని అన్నారు. నరేంద్ర మోదీ హయాంలో విద్యా వ్యవస్థ క్షీణించిపోయిందని ఆరోపించారు. ప్రజలకు ఊరట మాటలు గానీ, శాంతి ప్రకటనలు గానీ అవసరం లేదన్నారు. మోదీ ప్రభుత్వం యువతపై లాఠీచార్జి చేసిందని, సొంత పిల్లలు కానట్లుగా నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. ఈ మేరకు ఖర్గే గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘మీ ఏసీ గదుల విలాసవంతమైన కోటల నుంచి బయటకు రండి. మీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ వీధుల్లో రక్తమోడ్చిన యువతీ యువకుల కళ్లలోకి నేరుగా చూడండి’’అని మోదీకి తేలి్చచెప్పారు. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నేరవేర్చాలని స్పష్టంచేశారు. దేశంలో విద్యా వ్యవస్థ ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో చిక్కుకుందని ఖర్గే ఆరోపించారు. మోదీ చేసిన ప్రకటన కంటితుడుపు చర్యగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ అభివరి్ణంచారు. యువత దీన్ని అంగీకరిస్తారనే భ్రమలో ప్రధానమంత్రి ఉన్నారని ఆక్షేపించారు. టూ లిటిల్, టూ లేట్ పేపర్ లీక్‌ల దోషులను శిక్షించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రధానమంత్రి ప్రకటనను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘చాలా తక్కువ, చాలా ఆలస్యం’అని కొట్టిపారేశారు. అది మోసపూరితమైన ప్రకటన అని విమర్శించారు. విద్యార్థులు అలాంటి తక్కువ స్థాయి చర్యలను అంగీకరించలేరని పేర్కొన్నారు. పేపర్ లీకేజీలను నివారించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. -
మోదీ నివాసం వద్ద రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ నేతల ధర్నా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా తదితర కాంగ్రెస్ నేతలు లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. చేతులు కట్టేసుకుని వారు నిరసన తెలిపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ నేతలను పోలీసులు కోరుతున్నారు. సీజేపీ ర్యాలీ వేళ భద్రతా బలగాలు విద్యార్థులపై ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ఈ నిరసన చేపట్టింది.లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ మాట్లాడుతూ.. "మమ్మల్ని అత్యంత దారుణంగా అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న ఢిల్లీ పోలీసులు మా విద్యార్థులపై దారుణంగా వ్యవహరించినందుకు నిరసన తెలిపేందుకు ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తున్నాం. ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కేంద్ర హోంమంత్రి కూడా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ప్రధానమంత్రి నోరు కూడా విప్పడం లేదు" అని అన్నారు.అదుపులోకి తీసుకున్న తర్వాత పంజాబ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ.. "ఇది బీజేపీ ఉగ్రవాదం. వారు విద్యార్థుల మాట వినడం లేదు..." అని ఆరోపించారు. -
జంతర్ మంతర్ లాఠీచార్జ్.. రాజ్యసభలో రాజకీయ మంటలు
న్యూఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీస్ చర్య అంశం పార్లమెంట్లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించడంతో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.రాజ్యసభ తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే ఖర్గే మాట్లాడుతూ.. జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న వేలాది మంది విద్యార్థులపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగిందని ఆరోపించారు. విద్యార్థుల గొంతును అణిచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వేలాది మంది విద్యార్థులను మౌనం చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జంతర్ మంతర్ వద్ద వారిపై లాఠీచార్జ్ చేశారు అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై బలప్రయోగం చేయడం సరికాదని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఖర్గే అధికార పక్షంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. చందా చోరీకి మద్దతుదారులు ట్రెజరీ బెంచ్‌లలో కూర్చున్నారు(అయోధ్య రామ మందిర విరాళాల వివాదాన్ని ఉద్దేశించి) అంటూ చేసిన వ్యాఖ్యలు సభలో మరింత ఉద్రిక్తతకు కారణమయ్యాయి. అధికారపక్ష సభ్యులు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఖర్గే ప్రసంగం కొనసాగుతున్న సమయంలో ప్రతిపక్ష ఎంపీలు లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇరువైపుల సభ్యుల నిరసనల మధ్య సభా కార్యక్రమాలు కొనసాగించడం కష్టంగా మారడంతో రాజ్యసభను కొద్దిసేపటికే వాయిదా వేశారు.#WATCH | Delhi: Rajya Sabha adjourned to meet again at 12 Noon today.Leader of the Opposition in Rajya Sabha Mallikarjun Kharge says, "You have allowed me to present my views regarding this paper leak and the NEET examination scandal. This is a matter concerning students; I am… pic.twitter.com/2bRWp771zI— ANI (@ANI) July 20, 2026ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యా సంస్కరణలు, నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు మద్దతుగా పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కూడా స్పందించారు. నిరసనల సమయంలో పోలీసులు చేపట్టిన చర్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే శాంతిభద్రతల పరిరక్షణ కోసమే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. జంతర్ మంతర్ ఘటన ఇప్పుడు పార్లమెంట్లో ప్రధాన రాజకీయ అంశంగా మారింది. విద్యార్థుల నిరసనలు, పోలీస్ చర్య, ప్రభుత్వ వైఖరిపై చర్చలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. -
మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్ అధ్యక్షుడు) రాయని డైరీ
చెట్లను రాల్చుకుని గంపలకు ఎత్తుకునేవి కావు ‘నినాదాలు’! నిరసనకారులే ‘నినాదాలకు’ గుత్తులు గుత్తులుగా ప్లకార్డులై కాస్తారు. రేపటి నుండి వర్షాకాల సమావేశాలు. పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీలు ఎలాంటి నిరసనలు, ధర్నాలు, సమ్మెలు, దీక్షలు చేయకూడదని లోక్‌సభ స్పీకర్ ఆదేశాలు!వర్షం కురవకూడదని పార్లమెంటు భవనం పైకెక్కి నిబంధనలు విధిస్తే ఆకాశం ఆలకిస్తుందా? మబ్బులు ఎక్కడివక్కడ తేలిపోతాయా? ఉరుములు వెళ్లి దిక్కుల్లో దాక్కుంటాయా? పిడుగులు మౌనంగా గొడుగుల కిందకు చేరతాయా? ఏం జరగబోతున్నాయి లోపల? పార్లమెంట్ సమావేశాలే కదా! ఎవరు వెళ్లబోతున్నారు లోపలికి? పార్లమెంటు సభ్యులే కదా! సభ్యుల్లో ఒక్కరైనా ఒక్క నినాదమైనా ఇవ్వకుండానే, నిరసన గళం వినిపించకుండానే పార్లమెంటుకు ఎన్నికై వచ్చి ఉంటారా?! దీక్షలు, ధర్నాలు చేయకుండానే విద్యార్థి సంఘాలను, కార్మిక ఉద్యమాలను నడిపి ఉంటారా?!నినాదం నిన్ను స్కూల్లోనో, కాలేజ్‌లోనో పట్టుకుంటుంది. అక్కడ వదిలేసినా, నువ్వు పని చేసే ఫ్యాక్టరీలో చిమ్నీ పొగలోంచి వచ్చి నిన్ను కమ్మేస్తుంది. నిన్ను నిరసనకారుడిని చేస్తుంది. నినాదాలను నిషేధిస్తూ స్పీకర్ తన సెక్రెటేరియట్ జనరల్ చేత ‘ప్రకటన లాంటి చట్టం’ చేయించినప్పుడు, నా తండ్రి మాపన్న నన్ను మందలించటం గుర్తొచ్చింది.‘‘పొద్దున్నే లేస్తావు. సమ్మెలు, నిరసనలు అని వెళ్తావు. చట్టం అంటే నీకు గౌరవం లేదా, కనీసం భయం లేదా...’’ అని ఆందోళనచెందేవారు ఆయన. చట్టానికి కదా పౌరులంటే గౌరవం ఉండాలి! చట్టానికి కదా పౌరులంటే భయం ఉండాలి! నాన్నకు తెలియక కాదు. తన కొడుకు చేతిని ‘నినాదపు పిడికిలి’ నుంచి విడిపించాలని ఆయన ప్రయత్నం. నినాదం నన్ను ఈ జన్మకూ, ఏ జన్మకూ వదిలేది కాదు.రజాకార్లు ఇంటికి నిప్పు పెట్టినప్పుడు ఆ చీకటి మధ్యాహ్నం ఆరేళ్ల వయసులో నాకు అంటుకున్న నినాదం; ఆ మంటల్లో అమ్మ, చెల్లి, మామయ్య కాలి పోయినప్పుడు నా చేత పెడబొబ్బలు పెట్టించిన నినాదం; నాన్న నన్ను నెలరోజులు అడవిలో దాచి, నాకోసం ఊళ్లో బంధువుల ఇళ్లకు భిక్షాటనకు వెళ్లినప్పుడు నన్ను జోలె పట్టిన నినాదం;కూలీగా నాన్న పని చేస్తున్న మిల్లులో, ఆ మిల్లు నడిపే బడి... పేద పిల్లలకు ట్రైనింగ్ లేని టీచర్లతో, పెద్దవాళ్ల పిల్లలకు పేరున్న టీచర్లతో పాఠాలు చెప్పిస్తున్నప్పుడు నన్ను పలకపై దిద్దిన నినాదం... ఇప్పుడీ సమావేశా లలో నా నిరసనను తెలియజేయకుండా నన్ను ఆపుతుందా? నీట్ అవకతవకలు, డీలిమిటేషన్ దురుద్దేశాలు, ఫిరాయింపు ఆపరేషన్లు, ఓటర్ల జాబితా అక్రమ సవరణల మీద నన్ను మౌనం వహించనిస్తుందా?పార్లమెంటు సమావేశాలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై 10 జన్‌పథ్‌లోని సోనియాజీ నివాసంలో జరిగిన సమావేశం ముగిశాక, బయటికి వస్తున్నప్పుడు రాహుల్ గాంధీ నన్ను ఒక్క చిరునవ్వుతో ఆపారు.‘‘ఖర్గేజీ, ప్రతి మాన్సూన్ సెష¯Œ ్స ప్రారంభా నికీ కాస్త అటూ ఇటుగా ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో చెప్పండి’’ అన్నారు రాహుల్. ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో నేను వెంటనే గ్రహించలేకపోయాను. ‘‘సరే, జూలై 21కి మీకేం గిఫ్టు కావాలో చెప్పండి ఖర్గేజీ...’’ అని మళ్లీ అడిగారు రాహుల్. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది! ఈ 85 ఏళ్ల వయసులోనూ ప్రజల కోసం పాటు పడవలసిన పని ఒకటి ఉండటం, ప్రజల తరఫున ప్రదర్శన జరపటానికి చేతిలో ఒక నినాదం ఉండటం... వీటిని మించిన బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది?!- మాధవ్ శింగరాజు -
రాహుల్, ఖర్గేకు ఓపెన్ లెటర్.. క్షమాపణ చెప్పాల్సిందే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'(డబ్బులిస్తే వచ్చారు) అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ కార్యక్రమం నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ చార్టర్డ్ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు పూర్తిగా ఖండించారు. 'మోదీ ఎయిర్వేస్' పేరుతో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు ప్రత్యేక చార్టర్ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు.. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని స్పష్టం చేశారు. ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను ఎక్కువ మంది స్వయంగా భరించారని, మరికొందరికి స్థానిక భారతీయ సంఘాలు మాత్రమే సహకరించాయని పేర్కొన్నారు.నిర్వాహకుల్లో ఒకరైన అమిత్ కరంత్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికీ కూడా బీజేపీ, భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 'పెయిడ్ క్రౌడ్' అనడం వేలాది మంది భారతీయ-ఆస్ట్రేలియన్లను అవమానించడమే అని అన్నారు.బహిరంగ లేఖలో నిర్వాహకులు మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. చార్టర్ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ అంగీకరించాలి. సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'గా అభివర్ణించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రయాణికులు, భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు.అలాగే భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్‌కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారని, చాలా మందికి ఎలాంటి రాజకీయ అనుబంధం కూడా ఉండదని పేర్కొన్నారు. అందువల్ల దేశీయ రాజకీయాల కోసం ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం తగదని సూచించారు.కాగా, మెల్బోర్న్లో జరిగిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింటా అలన్ కూడా పాల్గొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు, ప్రవాస భారతీయుల సేవలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. -
మధ్యప్రదేశ్‌లో మరో భారీ స్కాం!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ అవినీతి, దోపిడీకి కేంద్రంగా మారిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక కుంభకోణం మరువకముందే మరో కుంభకోణం వెలుగుచూస్తోందని విమర్శించారు. తాజాగా రాష్ట్రంలో ఇథనాల్ తయారీ పేరిట రూ.1,200 కోట్ల భారీ బియ్యం కుంభకోణం జరిగిందని ఆరో పించారు. ఈ మేరకు తన సామాఇజక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికల కోసం వినియోగించాల్సిన బియ్యాన్ని లాభాల కోసం పక్కదారి పట్టించారని ఖర్గే మండిపడ్డారు. సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు, ఇథనాల్ మాఫియాకు అప్పగించారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ అవినీతి దందా సాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ నేతల కుమ్మక్కుతో ప్రజల హక్కుగా దక్కాల్సిన పౌష్టికాహారాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.ముఖ్యమంత్రి చుట్టూ ఉజ్జయిని భూస్కామ్తాజా బియ్యం కుంభకోణం కంటే ముందు ఉజ్జయినిలో భారీ భూ కుంభకోణం వెలుగుచూసిందని ఖర్గే గుర్తుచేశారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, హైవే కారిడార్ రానున్నాయని ప్రతిపాదించిన ప్రాంతాల్లోనే ముందస్తు సమాచారంతో అక్రమంగా భూముల కొనుగోళ్లు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి శాఖలోనూ దోపిడీ సాగుతోందని, బీజేపీ నేతలు తమ జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు.అవినీతికి మోడల్‌గా మధ్యప్రదేశ్గతంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం నుంచి మొదలుకొని, లెక్కలేనన్ని పేపర్ లీకేజీలు, అవినీతి వ్యవహారాలు వెలుగుచూస్తున్నా రాష్ట్రంలో దోపిడీ ఆగలేదని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మధ్యప్రదేశ్‌ను పూర్తిగా ‘అవినీతి మోడల్’గా మార్చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు తమ అధికార అహంకారంతో ప్రజా జీవితంలో ఉండాల్సిన జవాబుదారీతనం అనే భావనను కాలరాశారని ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
రాజ్యసభ సభ్యునిగా ఖర్గే ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక నుండి రాజ్యసభకు తిరిగి ఎన్నికైన తర్వాత, సోమవారం నాడు ఎంపీగా ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తన ఛాంబర్లో ఖర్గే చేత ప్రమాణం చేయించారు. చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని, హిందీ భాషలో ఖర్గే ఈ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా మోదీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపారు. ప్రజల గొంతుకను, వారి ఆకాంక్షలను పార్లమెంట్లో పూర్తి చిత్తశుద్ధితో వినిపిస్తానని ఆయన అన్నారు.ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ, జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒత్తిడి తీసుకురావడమే తన ప్రధాన బాధ్యతని ఖర్గే ప్రకటించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగే అవకాశం లభించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా ప్రత్యేకంగా హాజరై ఖర్గేకు అభినందనలు తెలిపారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు జె.పి. నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఖర్గేతో పాటు బీజేపీ నేత తరుణ్ చుగ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన మరో ఆరుగురు కొత్త సభ్యులు కూడా ఈ రోజు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. -
‘యూజ్లెస్ ఫెలోస్.. మీ సంగతి తేలుస్తా’
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనం కోల్పోయారు. కర్ణాటకలో నిర్వహించిన కాంగ్రెస్ ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. కొందరు కార్యకర్తలు అత్యుత్సహం ప్రదర్శించారు. అయితే.. వద్దని వారిస్తున్న వాళ్లు అదే పని చేయడంతో ఖర్గేకు కోపమొచ్చింది. యూజ్లెస్ ఫెలోస్.. అంటూ గట్టిగానే మందలించారాయన. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా.. సభలోని కొందరు కార్యకర్తలు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతుగా ‘డీకే.. డీకే’ అంటూ నినాదాలు చేశారు.దీంతో అసహనానికి గురైన ఖర్గే.. “ఇక్కడ మీరు నినాదాలు చేస్తే దేశమంతా ప్రభావితమవుతుందా? ఇది ఒక వ్యక్తి కార్యక్రమం కాదు.. పార్టీ కార్యక్రమం. మీరంతా పనికిమాలిన వాళ్లు(యూజ్లెస్ ఫెలోస్). ఇక్కడ వ్యక్తుల ఆరాధనకు స్థానం లేదు. మనందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చేది పార్టీ మాత్రమే. అది గుర్తించండి” అంటూ మండిపడ్డారు.తనకు 58 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని పేర్కొన్న ఖర్గే.. “ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చారు. వారి కంటే పార్టీ వారికి ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ నినాదాలు చేసిన వారందరి వీడియో ఫుటేజ్‌ను పరిశీలిస్తాను. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.కార్యకర్తలు అలా నినాదాలు చేస్తున్న సమయంలో.. వేదికపైనే ఉన్న డీకే శివకుమార్ తన కుర్చీలోంచి లేచి ఆపమంటూ సైగలు చేశారు. అయినా కూడా వాళ్లు ఆగలేదు. ఆ సమయంలో వేదికపై కూర్చున్న మాజీ సీఎం సిద్ధరామయ్య డీకేను చూస్తూ ఉండిపోయారు.#WATCH | Bengaluru, Karnataka: Congress President Mallikarjun Kharge loses his cool at party workers during the Sankalpa Samavesha programme after the workers raised “DK-DK” slogans“Will the entire country be affected if you shout here? This is not an individual’s programme, it… pic.twitter.com/jmO0rLMftK— ANI (@ANI) June 21, 2026ఖర్గే వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్‌లో వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమనే సందేశాన్ని ఇవ్వడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సభలో డీకే శివకుమార్ అనుచరుల నినాదాలపై ఖర్గే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కర్ణాటక కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీసింది. కేడర్‌ను ఉద్దేశించి ఖర్గే అంతలా మాట్లాడిన అవసరం లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. 12 రోజుల్లో 4 సమావేశాలు..
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్ర నేతల మధ్య పెరుగుతున్న అసమ్మతి, నాయకత్వ పోరు, వర్గపోరును చల్లార్చేందుకు పార్టీ అధిష్ఠానం గత 12 రోజుల్లో నాలుగు కీలక సమావేశాలు నిర్వహించింది. ఎన్నికల ముందు పార్టీ ఐక్యత దెబ్బతింటే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే ఆందోళన కాంగ్రెస్‌లో కనిపిస్తోంది.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తన ఆధిపత్యాన్ని కొనసాగించగా, కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. ఇదే సమయంలో పంజాబ్‌లో ఎన్నికలు ముందుగానే జరిగే అవకాశం ఉందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సమీకరణాలను మరింత వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, పంజాబ్‌కు చెందిన సీనియర్ నేతలు వరుసగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర యూనిట్లో ఉన్న విభేదాలను వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల నాటికి పార్టీని ఏకతాటిపైకి తీసుకురావాలని నేతలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం.పంజాబ్ కాంగ్రెస్‌లో గత కొంతకాలంగా నాయకత్వం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహాల విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి. కొందరు నేతలు రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఎన్నికల వ్యూహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఎన్నికల నాటికి మరింత తీవ్రమైతే ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరే అవకాశం ఉందని హైకమాండ్ భావిస్తోంది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే ముందుగా పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాల్సిందేనని కాంగ్రెస్ అధిష్ఠానం అభిప్రాయపడుతోంది. అందుకే వరుస సమావేశాల ద్వారా నేతల మధ్య సమన్వయం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, పార్టీ అంతర్గత విభేదాలు కొనసాగితే ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లేలా కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. హైకమాండ్ జోక్యంతో విభేదాలు సద్దుమణుగుతాయా? లేక ఎన్నికల సమయానికి మరోసారి బహిరంగంగా బయటపడతాయా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
ధరల పెరుగుదల, పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం
న్యూఢిల్లీ: పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకేజీలు, ఎన్నికల్లో అవకతవకలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రభుత్వం తీరును ఎండగడుతూ జూన్ చివర్లో దేశవ్యాప్త నిరసన ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గురువారం ఇందిరా భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. సమావేశంలో రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ జైరాం రమేశ్, భూపేశ్ బఘెల్లతోపాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల పార్టీ ఇన్చార్జులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ భేటీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘నీట్, సీబీఎస్ఈ వంటి పరీక్షల పత్రాల లీకేజీలను అరికట్టేందుకు రెండేళ్ల క్రితమే చట్టం చేసిన కేంద్రం పకడ్బందీగా అమలు చేయలేకపోయింది. ఫలితంగానే లీకయ్యాయి. అదేవిధంగా, ఈ నెల 22న అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నిటినీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు’అని జైరాం రమేశ్ చెప్పారు. ‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న డబుల్ ఇంజన్. ఇందులో ఒక ఇంజన్ ఓట్ చోరీ కాగా, మరోటి సీట్ చోరీ’అని ఆయన పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పరీక్షల కుంభకోణాలు, సామాజిక అసమానతలు వంటి తీవ్ర సమస్యలను దేశం నేడు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన వ్యవస్థలను మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చిందని ఆరోపించారు. దేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం రాజకీయ పోరాటం సాగించడటం తమ బాధ్యతని ఖర్గే వివరించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో మొదలయ్యే తమ దేశవ్యాప్త పోరాటం రెండు, మూడు నెలలపాటు కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలకు దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
నేడు కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ గురువారం కీలక అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం ‘ఇందిరా భవన్’లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సారథ్యంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు హాజరవుతారని జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి కంటే ప్రజలకు జరిగిన నష్టమే ఎక్కువని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఆ అంశాలను చార్జ్ షీట్ రూపంలో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. యువత ఉపాధి అవకాశాలను కోల్పోవడం, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జాప్యంపై దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అంశం సైతం గురువారం నాటి సమావేవంలో చర్చకురానుంది. -
కేంద్రంపై సమరమే
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’కూటమి సమరశంఖం పూరించింది. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను గట్టిగా తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం సాగించాలని నిర్ణయించింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కూటమి నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో సాగుతున్న ఓట్ల లూటీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.ఇండియా కూటమి సమావేశం రెండేళ్ల విరామం తర్వాత సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్విని యోగం, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలపై భవిష్యత్ పోరాట కార్యాచరణపై రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. విపక్షాల ఐక్యతను చాటుతూ ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్‌లో జరుగనుంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమా వేశాల్లో సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు. ఐక్యతను బలోపేతం చేసుకోవాలి మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లను ఎదుర్కొనేందుకు కూటమి ఐక్యతను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. దేశంలో రాజ్యాంగంపై దాడి కొనసాగు తోందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి పాల కులు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని ధ్వజమె త్తారు. కూటమి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యా సం చేశారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, కొత్త పెట్టుబడులు రావడం లేదని, నూతన ఉద్యోగాల కల్పన జరగడం లేదని చెప్పారు.పరీక్షల వ్యవస్థలో అక్రమాలు లక్షలాది మంది యువత ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2026 ఏప్రిల్ 17న డీలిమిటేషన్‌పై మోడీ ప్రభుత్వ బిల్లులను ఓడించడానికి లోక్‌సభలో ప్రతిపక్షాలు గొప్ప ఐక్యతను ప్రదర్శించాయని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ పేరిట కోట్లాది మంది పౌరుల నుంచి ఓటు హక్కును లాగేసుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.విదేశాంగ విధానంలో ప్రభుత్వం రాజీ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, కొత్త పెట్టుబడులు రాకపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగించిందని కూటమి నేతలు పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పరీక్షల వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని కూటమి పక్షాలు పట్టుబట్టాయి. దశాబ్దాలుగా దేశం పటిష్టంగా పాటిస్తున్న సంప్రదాయ విలువల నుంచి మోదీ సర్కార్ పక్కకు జరిగిందని, విదేశాంగ విధానంలో పూర్తిగా రాజీ పడిందని విపక్షాలు ఆక్షేపించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై దాడులు ఆగడం లేదని మండిపడ్డాయి.హాజరైన 23 పార్టీల నేతలు విపక్ష కూటమి భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, సీపీఐ అగ్రనేత డి.రాజా, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు హాజరయ్యారు.శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. మొత్తం 23 పార్టీల నాయకులు ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు. 2024 జూన్ 1న ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ఆరో సమావేశం జరిగింది. ఆ తర్వాత సోమవారం అగ్రనేతలంతా ఒకే వేదికపైకి వచ్చారు. విపక్షాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఎన్సీపీ(ఎప్పీ) అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ గైర్హాజరు సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా సమావేశమైన విపక్ష కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ కీలక భేటీకి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ హాజరు కాకపోవడం గమనార్హం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, డీఎంకేల మధ్య దూరం పెరిగింది. ఇకపై తాము ఇండియా కూటమిలో భాగస్వామి కాదని డీఎంకే తాజాగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలోనే ఇండియా కూటమికి దూరమైంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.రాహుల్‌కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో సోమవారం ఉదయం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. రాహుల్ గాంధీకి నిలకడ లేదంటూ శరద్ పవార్ అన్నట్లుగా ఆ పోస్టర్లలో ముద్రించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోస్టర్లను చించివేశారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు.ఐదు అంశాలపై అంగీకారం: ఖర్గే దేశంలో అస్థిర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, ప్రజా సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు. సోమవారం ఇండియా కూటమి భేటీ అనంతరం రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీతోపాటు ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు అంశాలపై తాము అంగీకారానికి వచ్చిననట్లు తెలిపారు. ఎస్ఐఆర్లో అక్రమాలు, ఓట్ల లూటీ, ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తికి లేఖ రాయబోతున్నట్లు చెప్పారు.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి కేంద్రం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. ఇకపై ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను లేవనెత్తబోతున్నామని, దీనికి కూటమి పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించాయని ఖర్గే పేర్కొన్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో సమన్వయంతో పనిచేస్తామని, ప్రతిరోజూ ఉదయం విపక్ష నేత చాంబర్లో తమ భేటీ జరుగుతుందని వెల్లడించారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ 2029 లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సోమవారం సూచించారు. బీజేపీ వ్యతి రేక కూటమి ఐక్యంగా ఉందని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామని తెలి పారు. ప్రధానమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి రాబోయే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పారు. అవినీతిపరులను, దోపిడీదార్లను అధికారం నుంచి దించేయడమే ప్రజల ఎజెండా అని స్పష్టంచేశారు. -
రాహుల్ గాంధీ ప్రసంగం.. కూటమికి హెచ్చరిక!
ఇండియా కూటమి సమావేశంలో.. ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించారు. 'ఐక్యంగా ఉంటే బలం, విడిపోతే పతనం' అనే సందేశాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కూటమిలోని అన్ని పార్టీలు పరస్పర విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని సూచించారు.కూటమి భాగస్వాములు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదా బలహీనపరచుకోవడం మానుకోవాలని రాహుల్ గాంధీ హెచ్చరించారు. దేశం, రాజ్యాంగం రక్షణ కోసం ప్రతిపక్షాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కొందరు మిత్రపక్షాలు ఎన్నికల ఓటర్ల జాబితాలపై కాంగ్రెస్ లేవనెత్తిన 'ఓటు చోరీ' ఆరోపణలకు తగిన మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ తరచుగా కాంగ్రెస్ పార్టీని విమర్శించే మమతా బెనర్జీకి చెందిన తృణమూల్, వామపక్షాల వంటి కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.ఈ సమావేశంలో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)పై ఉన్న అనుమానాలు, అక్రమాల ఆరోపణల అంశాన్ని కూడా చర్చించారు. ఈ విషయంపై దేశ ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా లేఖ రాయాలని కూటమి నిర్ణయించింది.బీజేపీని ఓడించడం అంత కష్టమైన విషయం కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ 240 స్థానాలను కైవసం చేసుకుంది, ఇది 2019లో గెలుచుకున్న 303 స్థానాల కన్నా చాలా తక్కువ. 2024లో కాంగ్రెస్ 99 స్థానాలకు ఎగబాకిందని తమ బలాన్ని గుర్తు చేశారు. అయితే.. ప్రతిపక్షాలు పరస్పరం పోట్లాడుకుంటూ తమ బలమే తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ సమావేశంలో ఐక్యత ప్రాముఖ్యతను వివరించారు. 2026 ఏప్రిల్‌లో లోక్‌సభలో ప్రతిపక్షాలు కలిసి కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అదే ఐక్యతను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశం ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత ఈ సమావేశం జరగడం విశేషం. ఆ ఎన్నికల్లో బీజేపీ అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ కేరళలో విజయం సాధించింది. తమిళనాడులో నటుడు - రాజకీయ నాయకుడు విజయ్ భారీ విజయం సాధించారు. మూడేళ్ల క్రితం ఏర్పడిన ఇండియా కూటమి ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించింది. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్‌లో జరగనుంది. -
కేంద్రంపై పోరుకు ఉమ్మడి కార్యాచరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, కూటమిలో నెలకొన్న అభిప్రాయ భేదాల నేపథ్యంలో మరోమరు విపక్షాల ఐక్యత చాటేందుకు, కేంద్ర ప్రభుత్వంపై పోరుకు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించేందుకు విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు 8వ తేదీన హస్తినలో భేటీకానున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సహా మొత్తం 15 పార్టీల అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం, ప్రతిపక్ష ఐక్యతను మరింత బలోపేతం చేయడం భేటీ ప్రధాన లక్ష్యాలుగా తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, నిరుద్యోగం, ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, అంతర్జాతీయ పరిస్థితులు వంటి ప్రజా సమస్యలపై సంయుక్త పోరాటానికి భేటీలో వ్యూహాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర పరిణామాలు, వివిధ రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. అయితే ‘ఇండియా’ కూటమిలోని కొన్ని పార్టీల మధ్య ఇటీవల అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు వార్తలు రావడం కూటమిలో గందరోగళం నెలకొంది. ‘ఇండియా’ కూటమితో తెగదెంపులు చేసుకున్న ఆప్ పార్టీ ప్రతి పక్షాల కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. తమిళనాడు ఎన్నికల అనంతరం పరిణాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో తన బంధాన్ని తెంచుకుంటున్నట్లు డీఎంకే ప్రకటించింది. తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు తెగిపోయిన నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలకు దూరంగా కూర్చోవాలని డీఎంకే నిర్ణయించింది. డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి కొద్ది రోజుల కిందటే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి తమ ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో డీఎంకే సమావేశానికి దూరంగా ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో డీఎంకే స్థానంలో విజయ్ జోసెఫ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి ప్రాధాన్యం లభించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
డిప్యూటీ సీఎం పోస్టులు లేవా?
శివాజీనగర: రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థానాలను సృష్టించడం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆదివారం కల్బుర్గిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, రెండు దశల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. డీసీఎం పదవుల గురించి ప్రస్తావన రాలేదు. జూన్ 3 తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటుగా తొలి దశలో ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలనేది 2 రోజుల్లో ఖరారవుతుందన్నారు. తొలి దశ మంత్రిమండలి ఏర్పాటు తరువాత 15 రోజుల్లోగా 2వ దశ మంత్రివర్గ విస్తరణ అవుతుందని, పూర్తిస్థాయిలో కేబినెట్ ఏర్పాటవుతుందని తెలిపారు. ఒకవేళ డీసీఎంలు అవసరమైతే ఎంతమంది ఉండాలనేది చర్చిస్తాము, దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగాయి. జూన్ 3 తరువాత స్పష్టమైన చిత్రం లభిస్తుంది అని చెప్పారు.కేపీసీసీ సారథిపైకేపీసీసీ అధ్యక్షుని మార్పుపై ఖర్గే స్పందిస్తూ, సీఎం ప్రమాణం తరువాత సహజంగానే కేపీసీసీ కొత్త సారథి నియామకం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం సుపరిపాలనకు ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుని మధ్య ఉత్తమ అవగాహన అవసరముందన్నారు. సీఎం, మంత్రులతో ఐకమత్యంతో పనిచేయాలన్నారు. పార్టీ నిర్మాణంలో శక్తియుక్తులు, ప్రజా మద్దతు కలిగిన నేతను పార్టీ అధ్యక్షునిగా నియమించాలని చర్చలు జరిగాయన్నారు. -
ఖర్గేకు స్వాగతం
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్తున్న ఆయన కొద్దిసేపు హైదరాబాద్‌లో ఆగారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌లు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో ఖర్గే ప్రత్యేకంగా సమావేశమయ్యారని, ఇటీవల జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) వివరాలతో పాటు రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఖర్గేకు మహేశ్‌గౌడ్ వివరించారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
కర్ణాటక పవర్ గేమ్‌లో వైల్డ్ కార్డ్ ట్విస్ట్!
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు మరోసారి ఢిల్లీ కేంద్రంగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఢిల్లీ చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. సీఎం మార్పు ఊహాగానాల నడుమ.. ఇవాళ జరగనున్న కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు పాల్గొననున్నారు.ఈ భేటీ ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వ భవిష్యత్ దిశ, పరిపాలనా మార్పులు.. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు “పాలిటికల్ రీసెట్”పై కేంద్రంగా సాగనుందని సమాచారం. ప్రభుత్వం పనితీరు మెరుగుపరచడం, మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం వంటి అంశాలు కూడా చర్చలో ఉండే అవకాశం కనిపిస్తోంది. పార్టీ వర్గాల ప్రకారం ప్రస్తుతం మూడు ఆప్షన్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయి. అందులో మొదటిది.. సీఎం సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగించడం. అంటే నాయకత్వ మార్పు లేకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయడం ఆప్షన్‌గా ఉంది. ఇందులో పనితీరు తక్కువగా ఉన్న మంత్రులను తొలగించి, సామాజిక సమతుల్యత (అహిందా ఫార్ములా.. మైనారిటీలు+వెనుకబడిన వర్గాలు+దళితులు) ఆధారంగా కొత్త సమీకరణాలు తీసుకురావాలనే ఆలోచన ఉందని తెలుస్తోంది.రెండో ఆప్షన్‌గా.. నాయకత్వ మార్పు. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి బాధ్యతల్లోకి తీసుకురావడం. అదే సమయంలో సీనియర్ నేత హోదాలో సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించడం. అయితే ఇది అత్యంత సున్నితమైన రాజకీయ నిర్ణయంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మూడో ఆప్షన్.. దీనికి అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఇదే జరిగితే.. నిజంగా కర్ణాటక రాజకీయాలకు పెద్ద సర్ప్రైజే. అదే మల్లికార్జున ఖర్గేను కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్రలో తీసుకురావడం. అంటే ప్రస్తుతం జాతీయాధ్యక్షుడిగా ఉన్న ఖర్గేను.. “వైల్డ్ కార్డ్” ఎంట్రీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లోకి తెచ్చి సీఎంను చేయడం. ఇది జరిగితే రాష్ట్రంతో పాటు జాతీయ కాంగ్రెస్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరు వర్గాలను చల్లబర్చే ఈ ఆప్షన్ కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పై మూడు ఆప్షన్లలో ఏది అమలు చేసినా.. అది కర్ణాటక రాజకీయాల వరకు సంచలనమే కానుంది.పార్టీ లోపల వర్గపోరు, నాయకత్వ ఆశలు, సామాజిక సమీకరణాలు.. వెరసి ఢిల్లీలో ఇవాళ్టి కర్ణాటక కాంగ్రెస్ నేతల కీలక భేటీని అత్యంత కీలకంగా మార్చాయి. మరోవైపు.. రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలు కూడా దగ్గరలో ఉండటంతో, టికెట్ల పంపకం గురించీ చర్చించవచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ చర్చలు కర్ణాటకలో కేవలం పాలన మార్పుల గురించి కాకుండా.. కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కాంగ్రెస్‌లో రాజ్యసభ కలవరం
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాజ్యసభలో ఖాళీ అయ్యే 24 స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. రాజ్యసభలో చోటు దక్కించుకునేందుకు అవకాశమున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో టిక్కెట్ల కేటాయింపుపై చర్చలు మొదలయ్యాయి. సీటు కోసం పలువురు మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతల మధ్య పోటీ కన్పిస్తోంది. దీంతోపాటు, ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ ప్రాంతంలోని టైప్–7 ప్రభుత్వ బంగ్లాను కాంగ్రెస్ పేరుతోనే కొనసాగించే వ్యూహం కూడా అధిష్టానం వద్ద ఉంది.కర్ణాటక నుంచి ఖర్గే బెర్త్ ఖరారు?కర్ణాటకలోని నాలుగు సీట్లకు ఎన్నికలు జరుగనుండగా, ఇందులో కాంగ్రెస్‌కు కనీసం రెండింటి అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ రెండింటిలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బెర్త్ దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. మరో సీటు లింగాయత్ సామాజిక వర్గ నేతకు దక్కే అవకాశముందంటున్నారు. మూడో సీటుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా, జార్ఖండ్‌లో జేఎంఎంతో ఉన్న పొత్తులో భాగంగా 2 సీట్లలో ఒకటి కాంగ్రెస్‌కు కేటాయించే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రాజస్థాన్‌లో మూడు సీట్లకుగాను కాంగ్రెస్ ఒక సీటును సులభంగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ సీటు కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, సిట్టింగ్ ఎంపీ నీరజ్ డాంగీ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్ నుంచి మాజీ ముఖ్య మంత్రి కమల్ నాథ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ పేర్లు తెరపైకి వచ్చాయి. సోనియా గాంధీ సహా పార్టీ అగ్రనేతలను ఇటీవల కమల్ నాథ్ కలిసి రాజ్యసభ నామినేషన్‌పై ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.24 అక్బర్ రోడ్ బంగ్లాపై దృష్టి..పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రుల్లో ఒకరిని రాజ్యసభకు పంపే అవకాశాలను అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తోంది. దీనికి రాజకీయ ప్రాధాన్యంతో పాటు వ్యూహాత్మక కారణా లూ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా, ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ ప్రాంతంలోని టైప్–7 ప్రభుత్వ బంగ్లాను కొనసాగించుకోవడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా భావిస్తున్నారు. సాధారణంగా మాజీ ముఖ్యమంత్రులకు ఇలాంటి వసతి కేటాయించే అవకాశం ఉండటంతో, కమల్ నాథ్, భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లాట్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ టైప్–7 బంగ్లా అధికారికంగా ఏ వ్యక్తి పేరుతోనూ కాకుండా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయ వినియోగం కోసం కేటాయించిన ప్రభుత్వ వసతిగా ఉంది. ఇది గతంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యాలయంగా ఉండేది. అయితే, కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం ఇందిర భవన్‌కు మారిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఈ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ బంగ్లాను కొనసాగించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి లేదా మాజీ కేంద్ర మంత్రిని రాజ్యసభకు పంపించి, వారి పేరుతో బంగ్లాను మళ్లీ తమ వద్దే ఉంచుకునే వ్యూహంలో అధిష్టానం ఉన్నట్లు గా కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. -
కేరళ ఉత్కంఠ.. ఇరకాటంలో కాంగ్రెస్!
కేరళలో కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం కొనసాగుతోంది. పార్టీలో తీవ్ర అంతర్గత పోరు నడుమ.. హస్తినలో కీలక సమావేశం జరగబోతోంది. దీంతో ఇవాళ సాయంత్రం లోపు కీలక నిర్ణయం వెలువడవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే.. ఇరకాటంలో పడేసేందుకు బీజేపీ రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది.కాంగ్రెస్‌లో ప్రస్తుతం సీఎం రేసులో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వీ.డి. సతీశన్ ఇద్దరూ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. అదనంగా రమేశ్ చెన్నితాల కూడా చేరడంతో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. పార్టీ కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లు క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయసేకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో కేంద్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న కేసీ వేణుగోపాల్‌కు 63 మంది ఎమ్మెల్యేల్లో 47 మంది మద్దతు ఇస్తున్నారు. ఈ పోరులో రెండో ఎంపికగా రమేష్ చెన్నితల పేరును కొందరు ఎమ్మెల్యేలు సూచించినట్లు సమాచారం. అయితే వీడీ సతీశన్‌కు ప్రజల్లో విస్తృత ఆదరణ కనిపిస్తోంది. దీంతో టాప్ ప్రయారిటీగా వేణుగోపాల్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తోంది. ఈ తరుణంలో..ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది యూడీఎఫ్ మిత్రపక్షం ఐయూఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్). సీఎం ఎంపికలో జాప్యంపై అసంతృప్తితో ఉన్న ఐయూఎంఎల్.. అనూహ్యంగా సతీశన్‌కు మద్దతు ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఈ నిర్ణయంతో విబేధిస్తోంది. ఇప్పటికే బీజేపీ తరచూ కాంగ్రెస్‌ను ఓ మతానికి అనుకూల పార్టీ అని విమర్శిస్తోంది. ఈ దశలో ఐయూఎంఎల్ ఒత్తిడికి లొంగితే.. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లే అవుతుందని కొందరు కేరళ కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.ఇదిలా ఉండగానే.. సతీశన్ తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న ఆయన.. ముఖ్యమంత్రి పదవి తప్ప మరేమీ అంగీకరించబోనని హైకమాండ్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. సతీశన్‌ను ఎంపిక చేస్తే మరో సమస్య ఏమిటంటే.. ఆయనకు పరిపాలనా అనుభవం లేదు. వేణుగోపాల్ మాత్రం రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన నాయకుడు. రాష్ట్రవ్యాప్తంగా సతీశన్‌ను సీఎం చేయాలని పోస్టర్లు కనిపించడం, ఆయన పార్టీని ఒత్తిడికి గురి చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే వర్గపోరు, బహిరంగ శక్తి ప్రదర్శనలు ఆపాలని సూచించారు.మరోవైపు.. అనుభవజ్ఞుడైన వేణుగోపాల్‌ను సీఎం చేస్తే.. ఆయన లోక్‌సభ సభ్యత్వం వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక అసెంబ్లీ సీటు, ఒక లోక్‌సభ సీటుకు ఆరు నెలల్లో ఉపఎన్నికలు జరగాలి. అదనంగా, కాంగ్రెస్ కేంద్ర స్థాయిలో కొత్త ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. అయితే.. కేసీ వేణుగోపాల్ ఛాయిస్ పైనా బీజేపీ సెటైర్లు వేస్తోంది.సోషల్ మీడియాలో కాంగ్రెస్ సీఎం ఎంపిక విషయంలో కేరళ బీజేపీకి.. జాతీయ బీజేపీకి మధ్య పోరు నడుస్తోంది. ఆయన కేరళలో ఉండాలని కేరళ బీజేపీ, లేదు ఢిల్లీలో ఉండాలని జాతీయ బీజేపీ కోరుకుంటోంది అని కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. దానికి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ వెటకారంగా స్పందించారు. ఇది నిజమని నేను ధృవీకరించను.. అలాగే ఖండించను కూడా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ లోపల జరుగుతున్న నాయకత్వ పోరును ఎగతాళి చేస్తూ, బీజేపీకి రాజకీయ వ్యంగ్యంగా మారింది.అసెంబ్లీ గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. ఎంతకంత కంగారు?. పార్టీ హైకమాండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా పార్టీ శ్రేణులకే కాదు.. యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలకు కూడా సంతృప్తికలిగించేదిగా ఉండాలి. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ అని రమేశ్ చెన్నితాల మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ గందరగోళం నడుమ.. సందిగ్ధానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ హైకమాండ్ నాయకత్వం నడుం బిగించింది. కేరళ మాజీ పీసీసీ అధ్యక్షులతోపాటు సీనియర్ నేతలతో చివరిగా చర్చలు చేపట్టాలని నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో జరిగే చర్చలకు అధిష్టానం కబురందుకున్న వారిలో ఎంఎం హస్సన్, వీఎం సుధీరన్, ఎం. రామచంద్రన్, కె.మురళీధరన్, కన్నూర్ ఎంపీ కె.సుధాకరన్ ఉన్నారు. వీరితో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ చర్చలు జరుపుతారు. ఈ సమావేశాలతో.. ఇవాళ సాయంత్రానికో.. లేదంటో రేపటికల్లా కేరళ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నిర్ణయం ఏదైనా సరే కేరళ రాజకీయ సమీకరణాలను మాత్రమే కాదు, జాతీయ స్థాయిలోనూ ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. -
కేరళం సీఎంపై ఉత్కంఠ.. రంగంలోకి రాహుల్
-
మోదీ ఓ ఉగ్రవాది!
చెన్నై: బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దీంతో ఖర్గే, కాంగ్రెస్‌లపై బీజేపీ విమర్శల వర్షం కురిపించింది. ఈ విమర్శల దుమారానికి తమిళనాడు ఎన్నికల ప్రచారపర్వం వేదికగా నిలిచింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న ఖర్గే మంగళవారం చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘పెరియార్ ఈవీ రామస్వామి, సీఎన్ అన్నాదురై సిద్ధాంతాలను నమ్మే అన్నాడీఎంకే నేతలు ఇప్పుడు ప్రధాని మోదీ పంచన చేరారు. అన్నాడీఎంకే నేతలు అసలు ఎలాంటి వాళ్లో ఇప్పుడు అందరికీ తెల్సివచ్చింది. అన్నాదురై ఫొటో పట్టుకుని ప్రచారంచేసే అన్నాడీఎంకే నేతలు ఏకంగా మోదీతో ఎందుకు పొత్తుపెట్టుకోవాల్సి వచి్చంది? మోదీ ఒక ఉగ్రవాది.ఆయనకు సమానత్వం అంటే అస్సలు గిట్టదు. సమానత్వం, న్యాయం అంటే బీజేపీకి సుతరామూ ఇష్టం ఉండదు. అలాంటి బీజేపీ నేతలతో అన్నాడీఎంకే నేతలు పొత్తుకు సై అన్నారు. అన్నీ తెల్సి పొత్తుకు సిద్ధపడ్డారంటే వీళ్లంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలని కంకణం కట్టుకున్నట్టే లెక్క’’అని ఖర్గే అన్నారు. ‘‘ఆరో, ఏడో నంబర్ ఈసీ దరఖాస్తుల ద్వారా ఓటర్ల జాబితాను బీజేపీ తిమ్మినిబమ్మిని చేస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను మోదీ తన జేబులో వ్యక్తిలా మార్చుకున్నాడు. బీజేపీకి అనుబంధ కార్యాలయంగా ఈసీ తయారైంది. తమిళనాడులో ఎన్నికల ప్రచారం చివరిదిశలో మోదీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.రాజకీయ పార్టీల కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను రంగంలోకి దింపుతున్నారు. ఎన్నికలప్పుడు ఐటీ, ఈడీ దాడులు ఎందుకు ఎక్కువవుతున్నాయి? అందులోనూ ఎంపికచేసిన వ్యక్తుల మీదనే ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి?’’అని ప్రశ్నించారు. తమిళనాడులో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌కు, రాహుల్‌గాందీకి మధ్య మనస్పర్థలున్నాయనే వార్తలను ఖర్గే కొట్టిపారేశారు. ‘‘వాళ్లిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసి ఎన్నికల్లో పనిచేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, మణిపూర్ నుంచి ముంబైదాకా అన్ని ప్రాంతాల ప్రజలను రాహుల్ కలుపుకొని పోతున్నారు.కాంగ్రెస్, డీఎంకేలు సొంత లక్ష్యాల విషయంలో విభిన్నంగా ఆలోచిస్తాయికానీ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఉక్కు సంకల్పంతో కలిసి ముందడుగేస్తాయి’’అని ఖర్గే అన్నారు. ‘‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం బీజేపీకి లేదు. ఒకవేళ ఉద్దేశం ఉంటే సీట్లు పెంచిన తర్వాతే ఇస్తామనడం ఏంటి? ఇప్పుడే, 543 సీట్లలోనే 33 శాతం అమలుచేయవచ్చుకదా?’’అని సూటి ప్రశ్నవేశారు. ‘‘జనాభా నియంత్రణను సాధిస్తూ ప్రగతిపథంలో ముందుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలను అణగదొక్కేందుకే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో మోదీ దక్షిణభారత రాష్ట్రాలకు అన్యాయంచేయాలని కుట్ర పన్నారు’’అని ఆరోపించారు. మండిపడిన బీజేపీమోదీనుద్దేశించి ఖర్గే చేసిన ‘ఉగ్రవాది’వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘‘దేశ ప్రధాని పట్ల విపక్ష కాంగ్రెస్ వైఖరి ఏస్థాయిలో ఉందో ఖర్గే మాటలతో స్పష్టమైంది. ఖర్గే పొరపాటున మోదీని ఉగ్రవాది అనలేదు. ఉద్దేశపూర్వకంగానే రాహుల్‌గాంధీ సూచనలమేరకే ఉగ్రవాది అని సంబోధించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సాహసించామనే అక్కసుతోనే మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలుచేస్తున్నారు.ఇలాంటి నేతలు, పార్టీకి ఓటర్లు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. బీజేపీ ఘాటుగా స్పందించడంతో ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘‘ప్రధాని మోదీ ఎప్పడూ మమ్మల్ని బెదిరిస్తుంటారు. ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కీలక సంస్థలన్నీ మోదీ చేతుల్లో ఉన్నాయి. మోదీని ఉగ్రవాది అని నేను నేరుగా అనలేదు. విపక్ష పార్టీలను మోదీ బెదిరించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే అర్థంలోనే ఆ పదం ఉపయోగించా’’అని ఖర్గే అన్నారు. -
ప్రధాని మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోదీ హరిస్తున్నారని అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఏలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాటలు ఇప్పుడు తీవ్రదుమారం రేపుతున్నాయి.తమిళనాడులో ఈ నెల 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు సాగుతుండగా మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సినీస్టార్ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
‘పునర్వీభజన’కు వ్యతిరేకంగా ఓటేస్తాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లులోని నియోజకవర్గాల పునర్వీభజన నిబంధనలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని వెల్లడించాయి. సంబంధిత బిల్లును తీసుకొస్తున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇది రాజకీయ ప్రేరేపిత బిల్లు అని ఆరోపించారు. విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల నేతలు బుధవారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. మహిళ రిజర్వేషన్ల బిల్లును తీసుకొస్తున్న విధానం పట్ల తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షాలను అణచివేసి బిల్లును నెగ్గించుకోవాలన్నదే ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్లకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గతంలో ఆమోదించిన సవరణ బిల్లును అమలు చేయాలని కోరుతున్నామని, ప్రభుత్వం మాత్రం డీలిమిటేషన్ పేరిట డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ వ్యవహారాన్ని వ్యతిరేకించాలని ఉమ్మడిగా నిర్ణయించినట్లు స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. స్పష్టత లేని జనగణన, భవిష్యత్తు డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టొద్దని కోరారు. పార్లమెంట్ వద్ద ఉండాల్సిన అధికారాలను కార్యనిర్వాహక వర్గానికి కల్పిస్తూ, రాజకీయంగా అనుకూలమైనప్పుడల్లా నియోజకవర్గాలను మార్చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అస్సాం, జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి మోసం చూశామని ఖర్గే తెలిపారు. అందుకే నియోజకవర్గాల పునర్వీభజనను కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. అధికారం కోసమే ఈ కుతంత్రం: రాహుల్ మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ బిల్లును 2023లో పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ఇప్పటికే రాజ్యాంగంలో భాగమేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదిస్తున్న దానికి మహిళా రిజర్వేషన్లతో ఎలాంటి సంబంధం లేదన్నారు. డీలిమిటేషన్‌తో అధికారం దక్కించుకోవాలన్న కుతంత్రం తప్ప ఇందులో ఇంకేముందని ప్రశ్నించారు. విపక్షాల భేటీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కుల గణన డేటాను విస్మరించి ఓబీసీ, దళిత, ఆదివాసీల హక్కులను చోరీ చేస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే దక్షిణ, ఈశాన్య, వాయువ్య, చిన్న రాష్ట్రాల పట్ల అన్యాయంగా వ్యవహరించడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదకరం: కె.సి.వేణుగోపాల్మోదీ ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన చర్య ప్రమాదకరమైనదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై, ముఖ్యంగా రాష్ట్రాలకు సమాన అధికారాన్ని కల్పించే సమాఖ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విపక్ష నేతల సమావేశంలో డీఎంకే నాయకుడు టి.ఆర్.బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సాగరికా ఘోష్, శివసేన(ఉద్ధవ్) నాయకులు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. -
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, కానీ కేంద్రం తీసుకొస్తున్న విధానం సరైనది కాదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ ‘రాజకీయ స్వార్థంతో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారు. డీలిమిటేషన్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం మద్దతు ఇస్తాం. ప్రభుత్వం విపక్షాలను అణగదొక్కాలని చూస్తోంది’ అని అన్నారు.రేపటి నుంచి పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. లోక్‌సభలో ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఈ బిల్లులపై చర్చ, ఓటింగ్ జరగనుంది. మూడు బిల్లులపై చర్చకు మొత్తం 18 గంటల సమయం కేటాయించారు.రాజ్యసభలో ఏప్రిల్ 18న చర్చ, ఓటింగ్ జరగనుంది. అక్కడ చర్చకు 10 గంటల సమయం కేటాయించారు. అదనంగా, ఏప్రిల్ 16, 17 తేదీల్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్పర్సన్ ఎన్నికపై కూడా చర్చ జరగనుందని సమాచారం. -
29 తర్వాత అఖిలపక్షం పెట్టండి
న్యూఢిల్లీ: ఎంతో కీలకమైన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ఇతర అంశాలను తేల్చకుండా మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై చర్చించడం వృథా ప్రయాసేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే అఖిల పక్ష భేటీని ఏర్పాటు చేసి వీటిపై చర్చ జరపాలని కోరారు. ఈ మేరకు ఖర్గే ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం చూస్తుంటే రాజకీయ లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని హడావుడిగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండా, డీలిమిటేషన్ తీరును వివరించకుండానే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో సభలో అర్థవంతమైన చర్చ ఎలా సాధ్యమని భావిస్తున్నారంటూ ఖర్గే నిలదీశారు. మరోవైపు, మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లో జాప్యంతో కోట్లాది మంది మహిళలకు అన్యాయం జరుగుతుందంటూ ఖర్గేకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాశారు. -
మోదీ పొలిటికల్ గేమ్
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుదీర్ఘ కాలం మౌనంగా ఉండి, ఇప్పుడు అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం వెనుక కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే కుతంత్రం దాగి ఉందని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం (సీడబ్ల్యూసీ)లో ఆయన ప్రారం¿ోపన్యాసం చేశారు. కేంద్రం వైఖరిని ఎండగట్టారు. సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు, కీలక నేతలు ప్రియాంకా గాం«దీ, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోనీ, సచిన్ పైలట్, భూపేశ్ బఘేల్ పాల్గొన్నారు. అమలు లేని రిజర్వేషన్ ఎందుకు?... ‘ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదు. ప్రధాని రాసే వ్యాసాలు చదివి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి వస్తోంది. మాకు అందిన సమాచారం ప్రకారం.. ఈ రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేవలం ఈ ఎన్నికల్లో లబ్ది కోసమే ఈ బిల్లును తెస్తున్నారు’అని ఖర్గే విమర్శించారు. డీలిమిటేషన్ వెనుక కుట్ర... లోక్‌సభ సీట్లను 543 నుంచి 816కు పెంచాలన్న ప్రతిపాదనపై ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం ముందుకు తెచ్చిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తీవ్ర విపరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ‘డీ లిమిటేషన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైంది. దీనిపై లోతైన చర్చ జరగాలి. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఎంపీలు బిజీగా ఉన్న సమయంలో సమావేశాలు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం నిబంధనల ఉల్లంఘనే. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. అది హోంశాఖ కింద పనిచేసే ఒక విభాగంలా మారిపోయింది. అందుకే ఈ కోడ్ ఉల్లంఘనలను వారు పట్టించుకుంటారని మేం ఆశించడం లేదు’అని ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం మహిళా సాధికారత విషయంలో తమకు ఎవరి సరి్టఫికెట్లు అవసరం లేదని ఖర్గే స్పష్టం చేశారు. ‘స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతో తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల వల్లే నేడు స్థానిక సంస్థల్లో 14.5 లక్షల మంది మహిళలు ప్రతినిధులుగా ఉన్నారు. 2023లోనే ఈ బిల్లుపై మేం హైదరాబాద్ సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ అనేకసార్లు ప్రధానికి లేఖలు రాశారు. జనగణన, డీ లిమిటేషన్ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలి’అని డిమాండ్ చేశారు. పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఒత్తిడిపై విపక్షాలతో కలిసి ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్తాం’అని ఖర్గే వెల్లడించారు. వచ్చే వారం ప్రతిపక్ష నేతలతో ఖర్గే భేటీ ప్రభుత్వం తలపెట్టిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతలతో సమావేశం జరపనున్నట్లు కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కాకుండా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు ప్రభుత్వం చెబుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చెప్పారు. అయితే, ఇందుకు సమాచారాన్ని ప్రభుత్వం ఇంతవరకు ప్రతిపక్షాలకు అందజేయలేదని ఆరోపించారు. ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్ చీఫ్ ఖర్గేఅధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం జరుగుతుందన్నారు. -
గుజరాతీలు నిరక్షరాస్యులు!
ఇడుక్కి/న్యూఢిల్లీ: గుజరాతీలు నిరక్షరాస్యులంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఆదివారం ఆయన కేరళలోని ఇడుక్కిలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ‘‘గుజరాత్ ప్రజలు నిరక్షరాస్యులైనందున ప్రధాని మోదీ వారిని నమ్మించి మోసగించారు. కానీ కేరళ ప్రజలు ఎంతో తెలివైనవారు. అక్షరాస్యులు. వారిని మోదీ, కేరళ సీఎం విజయన్ ఏమాత్రం మోసం చేయలేరు’’ అని పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గుజరాతీలు, ఉత్తర భారతీయులను ఆయన అవమానిస్తున్నారని ధ్వజమెత్తింది. కాంగ్రెస్‌కు ఓట్లేయడం లేదనే అక్కసుతోనే గుజరాత్, యూపీవాసులను ఖర్గే అవమానిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలను గుజరాత్ కాంగ్రెస్ నేతలు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సమర్థిస్తారా అని ప్రశ్నించింది. విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్) నిబంధనలు మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. దీన్ని క్రైస్తవ సంస్థలు, ఎన్జీవోలు, పౌర సంఘాలపై దాడిగా అభివర్ణించారు. ఎఫ్సీఆర్ఏ సవరణలతో బీజేపీ, మోదీ నిజంస్వరూపం బట్టబయలైందన్నారు. ‘‘సీఎం విజయన్ స్వతంత్రుడు కారు. మోదీ చెప్పినట్లే నడుచుకుంటున్నారు’’ అని ఆరోపించారు. -
ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి ఇటీవల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని ఖర్గే, కేసీల వద్దకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఆయన్ను పరిచయం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మొన్నటి వరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి చేసిన కృషిని వారికి వివరించారు. కాగా.. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ఖర్గే, కేసీలకు వేం నరేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. నరేందర్ రెడ్డిని వారు అభినందించారు. ఎంపీగా తనదైన ప్రత్యేక ముద్ర కనిపించేలా పనిచేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే.. ఆయనతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇటీవల ఏఐసీసీ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ పనితీరుపై చర్చించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం కుదిరేలా, ప్రభుత్వ పథకాల అమలులో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకుకోవాలని ఖర్గే సూచించినట్లుగా తెలిసింది. ప్రతీ రెండు నెలలకోసారి ఈ కమిటీ సమావేశమై.. సమన్వయ అంశాలపై చర్చించాలని ఖర్గే తెలిపినట్లు చెబుతున్నారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి.. సీపీపీ చైర్మన్ సోనియాగాంధీ, లోకస్భలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాం«దీలను కలిసే అవకాశం ఉంది. అలాగే.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో జరిగిన భేటీలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, సురేశ్ షెట్కార్ ఉన్నారు. -
ఎల్పీజీ సంక్షోభంపై కేంద్రం అబద్దాలు చెబుతోంది : మల్లిఖార్జున ఖర్గే
న్యూఢిల్లీ: ఇరాన్ వార్తో దేశంలో ఎల్పీజీ గ్యాస్ లభ్యంత గందరగోళంగా మారింది. సోమవారం పార్లమెంటులో ఈ సంక్షోభంపై దుమారం రేగింది. ఒకవైపు ఎల్పీజీ కొరతలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఆందోళనగా కరంగా ఉందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) మల్లికార్జున్ ఖర్గే, జె.పి. నడ్డా మధ్య వాగ్వాదంచోటు చేసుకుంది. జీరో అవర్ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, గల్ఫ్ యుద్ధం మరియు హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎల్పిజి సరఫరాపై ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ కేంద్రంపై మండిపడింది. రాజ్యసభలో ఎల్పిజి సంక్షోభ అంశాన్ని లేవనెత్తిన మల్లికార్జున్ ఖర్గే సిలిండర్ల ప్యానిక్ బుకింగ్‌పై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఎల్పిజి సమస్య మధ్యతరగతి, రెస్టారెంట్లు, హాస్టళ్లు , వాణిజ్య వినియోగ దారులను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో, ఎల్పిజి లభ్యత, ధర స్థిరత్వం తీవ్రమైన సమస్యలుగా మారాయనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ఎల్పిజి కొరత లేదని లోక్‌సభలో ప్రకటించిన వైనాన్నిఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చెబుతున్న వాదనలు తప్పు అని వాస్తవాలు రుజువు చేస్తున్నామని మండిపడ్డారు.హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని ఖర్గే ఆరోపించడంతో జీరో అవర్ సమయంలో ఘర్షణ చెలరేగింది.దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్ల తీవ్ర కొరతకు ప్రభుత్వమే కారణమని ఖర్గే అన్నారు. మధ్యతరగతి , పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. రెస్టారెంట్లు, హాస్టళ్లు కమ్యూనిటీ కిచెన్లను మూసివేయాల్సి వచ్చిందని, ఎల్పిజి సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.దేశంలో 60 శాతం ఎల్పిజి దిగుమతి అవుతుందని, ఇందులో 90 శాతం సరఫరా హోర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంద న్నారు. ప్రపంచ చమురు సంక్షోభానికి దారితీసే కీలకమైన సముద్ర మార్గం ఇది అని అన్నారు. ఎల్పిజి సరఫరాపై కేంద్రం ముందస్తు ప్రణాళిక వేసుకుని ఉంటే, ఈపరిస్థితి తలెత్తేది కాదన్నారు. ఖర్గే ఎరువుల సరఫరా కొరతను కూడా ఎత్తిచూపారు.అలాగే సిలిండర్ కోసం వెయిటింగ్ సమయాన్ని కూడా 21 - 25 రోజులకు పెంచారు, ఇది, బ్లాక్ మార్కెటింగ్‌కు దారితీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ప్రభుత్వ పేలవమైన ప్రణాళిక నిదర్శనమని, ఇది విదేశాంగ విధానంపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతుదని ఖర్గే మండిపడ్డారు. ప్రణాళిక లేకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి దేశంలో ఎల్పిజి సరఫరాపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.నడ్డా కౌంటర్ ఖర్గే విమర్శలతో సభలో వేడి రాజుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, నడ్డా కూడా స్పందించారు. జీరో అవర్ కారణంగా సభ్యులు ప్రజా సమస్యలపై లేవనెత్తాల్సిన అవసరం ఉందని, చైర్ జోక్యం చేసుకోవాలని నడ్డా కోరారు. సభలో తీవ్రమైన అంశాలపై చర్చలు జరుగుతున్నపుడు వాటిపై శ్రద్ధపెట్టకుండా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు LPG సమస్యపై మాట్లాడకుండా ఇతర అంశాలపై మాట్లాడటానికే మొగ్గు చూపారంటూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల ఆందోళన అయితే ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, LPG సంక్షోభం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించాయి. ప్రతిపక్షాల వైపు నుంచి గందరగోళం కొనసాగుతుండగానే, సభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ముగించాలని ఖర్గేను కోరారు. ఖర్గే చేసిన ఆరోపణలకు బదులిస్తూ, నడ్డా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు అసలు ఈ సంక్షోభం దేశం వల్ల కాదని, ప్రపంచవ్యాప్త కారణాల వల్లే తలెత్తిందని పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాస్ నిరంతరాయంగా లభ్యతను నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్‌కు బానిసలా మోదీ.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
కలబురిగి (కర్నాటక): పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, టారిఫ్ అంశాల్లో కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఒక నియంతగాను, ప్రధాని మోదీని ఆయనకు బానిసగాను అభివర్ణించారు. ట్రంప్ ఎప్స్టీన్ ఫైళ్లను అడ్డుపెట్టుకుని మోదీని ఆడిస్తున్నారన్నారు.కర్నాటకలోని కలబురిగి జిల్లా చిత్తాపూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. ‘ఇరాన్ సుప్రీం నేతను అమెరికా చంపేసింది. ఏకంగా దేశ నేతనే చంపేస్తే ఆ దేశం, ఇక ప్రపంచం సురక్షితంగా ఉంటుందా? ఇరాన్ నేత ఖమేనీ లేదా వెనెజువెలా నేత మదురో..ఇలా ఎవరైనా కావచ్చు. దేశాల నేతలను ఇలా బెదిరింపులకు గురిచేస్తే ప్రపంచంలో శాంతి అనేదే ఉండదు. అమెరికా తన అహంకారంతో అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతోంది’ అని ఖర్గే మండిపడ్డారు. భారత్‌ను టారిఫ్‌ల పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయించిందన్నారు. మోదీ, ట్రంప్‌లు మన దేశాన్ని నాశనం చేస్తూ, అమెరికాకు దాసోహమనేలా చేస్తున్నారని ఆరోపించారు. -
పురపోరులో సత్తా చాటుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. దీంతో ఇదే ఊపుతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ముందుకెళ్లాలని ఖర్గే చెప్పారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ఆయన నేరుగా తుగ్లక్ రోడ్డులోని అధికార నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో రాజాజీ మార్గ్‌లోని ఖర్గే నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు, విజయావకాశాలపై సుమారు 30 నిమిషాల పాటు నేతలు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ వంటి అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఈ అంశాలు పారీ్టకి కలిసివస్తాయని రేవంత్ వివరించారు. 70 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధిస్తామని, మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని చెప్పారు. గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల పదవుల్లో బీసీ సామాజిక వర్గం, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా ఖర్గే, రేవంత్ చర్చించినట్లు సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొద్దిసేపు ఖర్గే, రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలిసింది. బీఆర్ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇటీవల రాజకీయ, పాలనా పరమైన అంశాలు బయటకు రావడంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ యంత్రాంగం, ప్రభుత్వం మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూసుకోవాలని, నేతల మధ్య విభేదాలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించుకోవాలని రేవంత్‌కు ఖర్గే హితబోధ చేసినట్లు సమాచారం. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖర్గే సూచించారు. ఒకవైపు బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఖర్గే దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. నేడు కేంద్ర మంత్రులతో భేటీ ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాష్ట్రానికి సబంధించిన పలు అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్ జోషిని కలిసి అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీతోనూ భేటీ కానున్నట్లు సమాచారం. -
బదులిచ్చే ధైర్యం ప్రధానికి లేదు: ఖర్గే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం విమర్శలు గుప్పించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధానికి లేదన్నారు. ప్రభుత్వం సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నడపాలనుకోవడం లేదని ఆరోపించారు. పదేపదే అబద్ధాలు చెప్పడమే మోదీ పని అని ఆరోపించారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మోదీ తన 97 నిమిషాల ప్రసంగంలో ముఖ్యమైన, అవసరమైన విషయం ఒక్కటీ చెప్పలేదు. ఇంకా వందేళ్లు, 75 ఏళ్లు, 50 ఏళ్ల కిందటి సంగతులే మాట్లాడుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని అధికార పక్షం పార్లమెంటులో చెబుతోంది. తాము ఆ పుస్తకాన్ని బాహాటంగా చూపినా వారికి అర్థం కావడం లేదు. ముందుగా వాస్తవాలను శ్రద్ధగా విని, ఆపై సమాధానం చెప్పాలి’’ అని ఖర్గే అన్నారు. రాహుల్, కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టూ్ట వివాదంపైనా ఆయన స్పందించారు. సభ బయట ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను సిక్కులకు జరిగిన అవమానంగా ముద్ర వేశారని మండిపడ్డారు. ‘‘సిక్కులను కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవిస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానిగా పనిచేశారు’’ అని గుర్తు చేశారు. సిక్కులను, దళితులను, ఆదివాసీలను ఎవరినీ గౌరవించే అలవాటు లేనిది బీజేపీకేనన్నారు. ఇతరు లను ఎలా కించపరచాలా అనే మోదీ ఆలోచిస్తారని ఖర్గే ఆరోపించారు. ‘‘దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిందే తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. కానీ మోదీ మాత్రం వాటిని దివాలా తీసే కర్మాగారాలు అని పిలుస్తూ నెహ్రూపై విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని నడిపే దార్శనికత మోదీకి లేదు’’ అన్నారు. రాహుల్ ఏం ప్రశ్నలు అడుగుతారో, ఎలాంటి వాస్తవాలు బయటపెడతా రోనని మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘లోక్‌సభలో మోదీపై దాడి జరుగుతుందని నిఘా సమాచారముందని చెబుతున్నారు. అంత గొప్ప ఇంటలిజెన్స్ పుల్వామా వంటి ఉగ్ర దాడుల సమయంలో ఏమైంది?’’ అని ఖర్గే ప్రశ్నించారు. ‘‘ఎప్స్టీన్ ఫైల్స్ బయటపడ్డ తరవాత మోదీ ఆందోళనగా ఉన్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లొంగిపోయి ఆ దేశంతో ఏకపక్ష వాణిజ్య ఒప్పందం కుదుర్చు కున్నారు. తద్వారా మన దేశ రైతులను బలిపశు వులను చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దేశం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదు: మోదీ
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాల వాకౌట్ చేశాయి. మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ప్రధాని మోదీ సెటైరికల్ కామెంట్స్ చేశారు. మీరు కూర్చునే నినాదాలు చేయొచ్చు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. విపక్ష పార్టీల ఎంపీలు నిరసనతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే కూడా లేచి నిలబడి నిరసనలు తెలిపారు. దీంతో, మోదీ... వయసు రీత్యా ఖర్గే కూర్చుని నిరసనలు చేపట్టొచ్చని మోదీ అన్నారు. అనంతరం, రాజ్యసభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. ముందు నన్ను మాట్లాడనివ్వాలంటూ విపక్షాలకు ప్రధాని మోదీ సూచించారు.మరోవైపు.. రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘ఎన్డీయే హయాంలో భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుంది. దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది. దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు. గతంలో భారత్‌తో ఒప్పందానికి పలు దేశాలు ముందుకు వచ్చేవి కాదు. దేశం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఒక విజన్ లేదు. ఎన్డీయే హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. మా హయాంలో అనేక సంస్కరణలు చేపట్టాం.భారత్ తొమ్మిది దేశాల్లో ట్రేడ్ డీల్ చేసుకుంది. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొవడానికి దేశం సిద్దంగా ఉంది. యూపీఏ హయాంలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇటీవలి కాలంలో దేశం శరవేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. అన్ని వర్గాల్లో మార్పు కనిపిస్తోంది. 27 దేశాలు, ఈయూతో అనేక ఒప్పందాలు చేసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు. #WATCH | In Rajya Sabha, PM Modi says, "...India is signing future-ready trade deals with several countries. In the past few days, we signed trade deals with 9 big and important countries of the world. Mother of all deals with 27 countries, with European Union is one of them..." pic.twitter.com/qpOcOpVUks— ANI (@ANI) February 5, 2026రాష్ట్రపతిని విపక్షాలు దారుణంగా అవమానించారు. దేశ అత్యున్నత పదవిని విపక్షాలు అవమానించాయి. దేశ అత్యున్నత పదవిని, రాజ్యాంగాన్ని, ఆదివాసీలను అవమానించారు. లోక్‌సభలో విపక్షాల ప్రవర్తన నన్నెంతో బాధపెట్టింది. స్పీకర్ కుర్చీలో కూర్చున్న దళితులను విపక్షాలు అవమానించాయి. అసోం ప్రజలు ఈ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. కాంగ్రెస్ యువరాజు ఓ ఎంపీని ద్రోహి అన్నారు. అతనికి గర్వం తలకెక్కింది. కాంగ్రెస్ నుంచి ఎంతో మంది పార్టీని వీడారు. బిట్టు సిక్కు కావడంతో అతడిని అవమానించారు. సిక్కుల పట్ల ఎంత ద్వేషం ఉందో వారి మాటల్లో కనిపించింది అని మండిపడ్డారు. -
Shashi Tharoor: నేనెప్పుడూ కాంగ్రెస్‌లోనే..!
-
ఖర్గే, రాహుల్‌కు మూడో వరుసా?
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలు ప్రొటోకాల్ రగడకు వేదికయ్యాయి. విపక్ష నేతలకు వెనక వరుసల్లో సీట్లు కేటాయించడం వివాదానికి దారితీసింది. సోమవారం కర్తవ్యపథ్‌లో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీకి మూడో వరుసలో స్థానం కల్పించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలైన వారిద్దరినీ మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. వారు మూడో వరుసలో కూర్చున్న ఫొటోలను ఆ పారీ్టకి చెందిన పలువురు నేతలు ఎక్స్‌లో పంచుకున్నారు.తమ నేతలకు సీట్ల కేటాయింపులో వివక్ష ఎందుకని నిలదీశారు. ఇవి చిల్లర చేష్టలంటూ మండిపడ్డారు. మోదీ సర్కారు ఆత్మన్యూనతకు ఈ ఉదంతం నిదర్శనమని రణ్‌దీప్ సుర్జేవాలా తదితరులు విమర్శించారు. యూపీఏ హయాంలో బీజేపీకి చెందిన విపక్ష నేత ఎల్కే అడ్వాణీకి తొలి వరుసలోనే స్థానం దక్కేదని వారు గుర్తు చేశారు. అయితే వేడుకలు ప్రారంభమైన కాసేపటికి ఖర్గే మొదటి వరుసలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పక్క సీటుకు మారారు. కాంగ్రెస్ విమర్శల్లో అహంకారమే తప్ప మరేమీ లేదంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనేవాలా ఎదురుదాడికి దిగారు.क्या देश के विपक्ष के नेता के साथ ऐसा व्यवहार किसी मर्यादा, परंपरा और प्रोटोकॉल के मापदंड पर खरा उतरता है ?ये केवल हीन भावना से ग्रस्त सरकार की कुंठा दिखाता है ।प्रजातंत्र में मतभेद रहेंगे मगर श्री @RahulGandhi के साथ किया जाने वाला ये व्यवहार अस्वीकार्य है। pic.twitter.com/b4mdU9BU7G— Randeep Singh Surjewala (@rssurjewala) January 26, 2026 -
గవర్నర్లను కీలుబొమ్మలుగా మార్చారు
హుబ్బళ్లి: కాంగ్రెస్ పాలిత, బీజేపీయేతర పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మలుగా మార్చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడానికి గవర్నర్లను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోంశాఖ కార్యాలయాల ద్వారా కేంద్ర ప్రభుత్వం గవర్నర్లకు ఆదేశాలు ఇస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రులు సిద్ధంచేసిన ప్రసంగాన్ని అసెంబ్లీలో చదవొద్దని చెబుతోందని పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియజేయకుండా వెనక్కి పంపిస్తున్నారని చెప్పా రు. ఈ విషయంలో పై స్థాయి నుంచి ఆదేశాలు అందుతున్నాయంటూ గవర్నర్లు కూడా ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారని తెలిపారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లేకపోతే దేశంలో నిరంకుశ పాలన వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. -
ఒక్కటై పోరాడుదాం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. గతంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాల వెనుక ఉన్నట్లే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చట్టం రద్దు కోసం కూలీలతో కలిసి పోరాటం సాగించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సందీప్ దీక్షిత్ నేతృత్వంలోని రచనాత్మక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో జరిగిన ఉపాధి హామీ కూలీల సదస్సులో రాహుల్ గాందీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కూలీలు తరలివచ్చారు. తాము పనులు చేసే స్థలాల నుంచి పిడికెడు మట్టి తీసుకొచ్చారు. మొక్కల కుండీల్లో ఈ మట్టిని చల్లారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పేదలకు హక్కు లు కల్పించడమే ఉపాధి హామీ చట్టం అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. కూలీలంతా ఏకమై పోరాడితే మోదీ వెనక్కి తగ్గుతారని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరిస్తారని చెప్పారు. ఈ సదస్సులో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వ్యవసాయ పనిముట్లను చేతబూని పలుగు పారలు ప్రదర్శించడం విశేషం.పేద కూలీలకు తీవ్ర నష్టం ‘‘పనులు కావాలని కోరుకునేవారు అందుకోసం గౌరవంగా డిమాండ్ చేసే వెసులుబాటు ఉపాధి హామీ పథకంలో ఉంది. పేదలకు పని హక్కు లభిస్తుంది. ఈ ఉద్దేశాన్ని నాశనం చేయడానికి మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది. 2020లో ఇలాగే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చింది. పార్లమెంట్‌లోపల, బయట రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాం. దాంతో నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేసింది. అప్పుడు రైతులను లక్ష్యంగా చేసుకున్నారు.. ఇప్పుడు పేద కూలీలను టార్గెట్ చేస్తున్నారు. ఉపాధి పనుల కోసం ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలన్నది ఇక కేంద్రమే నిర్ణయిస్తుంది. సహజంగానే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, విపక్ష పాలిత రాష్ట్రాలకు తక్కువ నిధులు ఇస్తారు. పనులు ఎప్పుడు, ఎక్కడ కల్పించాలి? కూలీలకు ఎంత వేతనం ఇవ్వాలన్నది కేంద్రమే నిర్ణయించబోతోంది. దాంతో కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. స్వాతంత్య్రం ముందునాటి పరిస్థితులను మళ్లీ తీసుకురావాలన్నదే బీజేపీ నాయకుల ఎత్తుగడ. అప్పట్లో రాజు చేతిలోనే మొత్తం అధికారాలు, సంపద ఉండేవి. ఆధునిక భారతదేశ నిర్మాణాన్ని మార్చాలని బీజేపీ పెద్దలు ఆరాటపడతున్నారు. వారిని అడ్డుకోవాలంటే మనమంతా ఒక్కటై పోరాటం సాగించాల్సిందే. బీజేపీ నాయకులు నిజంగా పిరికిపందలు. మనం కలిసికట్టుగా ముందుకెళ్తే వారంతా పారిపోతారు’’ అని రాహుల్ తేల్చిచెప్పారు. గాందీజీ పేరును తుడిచిపెట్టే కుట్ర: ఖర్గే ప్రజల హృదయం నుంచి జాతిపిత మహాత్మాగాంధీ పేరును తుడిచేయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కూలీల సదస్సులో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన అణగారిన వర్గాలను నిర్బంధ కూలీలుగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. పేదలకు ఉపాధి కల్పించే మహత్తర పథకాన్ని రద్దు చేయడం ఏమిటని మండిపడ్డారు. తాను చాయ్‌వాలా అని చెప్పుకుంటున్నారని, నిజానికి ఏనాడూ ఆయన చాయ్ తయారు చేయలేదని, రైళ్లలో తిరుగుతూ విక్రయించలేదని ఖర్గే అన్నారు. చాయ్‌వాలా పేరిట మోదీ చేసేదంతా ఉత్త డ్రామా అని కొట్టిపారేశారు. -
సీఎం మార్పునకు హైకమాండ్ బ్రేకులు!?
సాక్షి బెంగళూరు/శివాజీనగర: త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎలాంటి మార్పులు వద్దని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కూడా సూచనప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం. అస్సోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరో నాలుగైదు నెలల్లో పూర్తికానుంది. అప్పటివరకు కర్ణాటకతో పాటు ఏ ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చెయ్యొద్దని.. యథాతథ స్థితినే కొనసాగించాలని అధిష్టానం తేల్చిచెప్పినట్లు తెలిసింది. అలాగే, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసే వరకు నాయకత్వ మార్పు విషయంలోగానీ ఇతర ఏ అంశాల్లో కూడా చర్చ అవసరంలేదని.. కర్ణాటకలో రాజకీయాల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని డీకే శివకుమార్‌కు అధిష్టానం స్పష్టంచేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ ఎన్నికలపై ప్రభావం పడకూడదనే..నిజానికి.. కర్ణాటకలో బడ్జెట్‌కు ముందే తనకు సీఎం స్థానం కట్టబెట్టాలని డీకే శివకుమార్ పట్టుబట్టారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వ మార్పుచేస్తే ఆ ప్రభావం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పడుతుందని అధిష్టానం భావిస్తోంది. ఈ ఎన్నికలను హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున కర్ణాటక రాజకీయాలపై కాకుండా అస్సోంలో గెలుపుపై దృష్టిసారించాలని డీకేకు అధిష్టానం సూచించినట్లు తెలిసింది. అయితే, ఈ ఎన్నికల తర్వాతైనా ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారా అని హైకమాండ్‌ను డీకే ప్రశ్నించగా.. ‘మీ కృషికి, క్రమశిక్షణకు, నిబద్ధతకు ప్రతిఫలం తప్పక దక్కుతుంద’ని హైకమాండ్ బదులిచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.జాతీయ రాజకీయాల్లోకి రండి..మరోవైపు.. అస్సోం శాసనసభ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అస్సోం రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైకమాండ్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి డీకే శివకుమార్‌తోనూ చర్చించినట్లు తెలిసింది. అక్కడి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికపై డీకే శివకుమార్‌కు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా డీకే శివకుమార్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా డీకే సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే డీకే శివకుమార్‌కు మెరుగైన అవకాశాలు ఉంటాయని.. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా హైకమాండ్ కోరినట్లు చర్చ జరుగుతోంది. -
ఉపాధి పథకం..చట్టబద్ధ హామీ
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) చట్టం దానధర్మ పథకం కాదు, రాజ్యాంగ పరమైన చట్టబద్ధ హామీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా కోట్లాది పేదలకు స్వగ్రామాల్లోనే ఉపాధి లభించిందని, ఆకలి, బల వంతపు వలసలు తగ్గాయని, గ్రామీణ కూలీల వేతనాలు పెరిగాయని తెలిపారు. మహిళల ఆర్థిక గౌరవాన్ని ఈ పథకం బలోపేతం చేసిందన్నారు. అలాంటి ఉపాధి హా మీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతు న్నాయని, ప్రతిపాదిత జీ రామ్ జీ చట్టం ద్వారా కో ట్లాది గ్రామీణ కార్మికుల హక్కులను హరించి వేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ‘ఉపాధి హామీ చట్టం బచావో సంగ్రామ్’ను కాంగ్రెస్ ప్రారంభించిన ట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం ముందు మూడు డిమాండ్లను ఉంచారు. జీ రామ్‌జీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని, ఉపాధి చట్టాన్ని హక్కుల ఆధారిత చట్టంగా తిరిగి అమలు చేయాలని, పని హక్కు, పంచాయతీల అధికారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టం చట్టం ద్వారా పని హక్కును రద్దు చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నరు. ఇకపై ఉపాధి హామీ ఉండదని, ఎంపిక చేసిన పంచాయతీల్లో మాత్రమే అనుమతి ఆధారంగా పని కల్పిస్తారని పేర్కొన్నారు. బడ్జెట్‌కు పరిమితి విధించడం వల్ల సంక్షోభ సమయంలోనూ పనులు నిలిచిపోయే ప్రమాదముందని తెలిపారు. నిధులు, పనులపై నిర్ణయాలు ఢిల్లీ నుంచే తీసుకోవడం ద్వారా గ్రామ సభలు, పంచాయతీలను నిస్సత్తువగా మార్చే యత్నమని ఆయన విమర్శించారు. 60 రోజుల పని బ్లాక్అవుట్ నిబంధన అత్యవసర సమయంలో ఉపాధి నిరాకరణకు చట్టబద్ధత ఇస్తుందన్నారు. వేతనాలు అనిశ్చితంగా మారడం, 40 శాతం నిధుల భారం మోపడం వల్ల పేద రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. బయోమెట్రిక్, యాప్ ఆధారిత టెక్నాలజీ వల్ల నిజమైన కూలీలు ఉపాధి నుంచి వెలివేతకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ఆస్తుల సృష్టి స్థానంలో కాంట్రాక్టర్ తరహా పనులు పెరుగుతాయని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకూ శాంతియుతంగా, దృఢంగా పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. -
కాంగ్రెస్ సిద్ధాంతాలకు మరణం లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అంటేనే ఒక సిద్ధాంతమని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు మరణం లేదని అన్నారు. ఆదివారం ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో కాంగ్రెస్ 140వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఖర్గే పార్టీ జెండాను ఎగరేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే ప్రసంగించారు. మహోన్నత కాంగ్రెస్ నాయకుల కృషి వల్లే భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పని అయిపోందని చెబుతున్నవాళ్లు ఒక్క విషయం తెలుసుకోవాలని సూచించారు. తమ శక్తి కొంత తగ్గినప్పటికీ వెన్నెముక మాత్రం నిటారుగానే ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, లౌకికవాదం, పేదల హక్కుల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తాము అధికారంలోకి లేనప్పటికీ ఇతరుల వద్ద యాచించబోమని అన్నారు. మతం పేరిట కాంగ్రెస్ ఏనాడూ ఓట్లు అడగలేదన్నారు. మందిరం–మసీదు పేరిట ఏనాడూ విద్వేషాలు రగిలించలేదని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ఏకం చేస్తుందని, బీజేపీ విడదీస్తుందని చెప్పారు. తమ దృష్టిలో మతం అంటే విశ్వాసం మాత్రమేనని పేర్కొన్నారు. కొందరు మాత్రం మతాన్ని రాజకీయంగా మార్చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పటికీ ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందని ఖర్గే స్పష్టంచేశారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. #WATCH | Delhi: Congress National President Mallikarjun Kharge says, "... On December 28, 1885, in Mumbai, Congress was founded. For 62 years, crores of Congressmen struggled, were jailed, and fought for the country, leading to our freedom. I pay tribute to the founders of… https://t.co/vl2DOsI0bC pic.twitter.com/KqkHbnQOud— ANI (@ANI) December 28, 2025భారతీయ ఆత్మ గొంతుక కాంగ్రెస్కాంగ్రెస్ అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని.. అది భారతీయ ఆత్మ గొంతుక అని పార్టీ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ప్రతి బలహీనుడికి, అణగారినవర్గాలకు, కష్ట జీవు లకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. విద్వేషం, అన్యాయం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి బలమైన సంకల్పం తీసు కున్నట్లు తెలిపారు. సత్యం కోసం తమ పోరా టం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ వ్యవ స్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగానికి పునాదులు వేయడంతోపా టు ప్రజాస్వా మ్యం, లౌకికవాదం, సామాజిక న్యా యం, సమానత్వ విలువలను బలోపేతం చేసినవారిని స్మరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
మరో దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి రెడీ: సీడబ్ల్యూసీలో ఖర్గే
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జరుగుతున్న ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఇతర సీనియర్లు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరును వీబీ జీ రామ్ జీ మార్చడంపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం తుడిచి వేసే ప్రయత్నం చేస్తుందని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ అంశంపైనే దేశవ్యాప్త పోరాటాలు చేయాలని నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ.. ఎంజీఎన్ఆర్ఈజీఏ రద్దుతో కోట్లాది పేదలకు ఉపాధి కరువు. పథకాన్ని రద్దు చేయడం(పేరు మార్చడం)మహాత్మా గాంధీకి అవమానమే. యూపీఏ హయాంలో.. దళితులు, ఆదివాసీలు, మహిళలకు భరోసా ఇచ్చిన పథకం. అలాంటి పథకాన్ని ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేశారు. హయాంలో అమలైన హక్కులను కావాలనే కూల్చేస్తున్నారు. పని హక్కు మీద మోదీ సర్కార్ చేస్తున్న క్రూర దాడి ఇది. పేదల కంటే కార్పొరేట్ల లాభాలే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యం. మూడు నల్ల వ్యవసాయ చట్టాల తరహాలోనే. .. ఎంజీఎన్ఆర్ఈజీఏ MGNREGAపై దేశవ్యాప్త పోరాటం అవసరం. కాంగ్రెస్ ప్రజా ఉద్యమానికి సిద్ధం. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం’’ అని ప్రకటించారాయన. అలాగే.. ఈడీ, ఐటీ, సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల హక్కులపై కుట్ర జరుగుతోంది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీల పేర్లు తొలగించొద్దు. నేషనల్ హెరాల్డ్ కేసులో న్యాయ పోరాటం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. అలాగే.. దేశంలో సామరస్యం దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం అని ఖర్గే పేర్కొన్నారు.కాంగ్రెస్ ‘సంస్థా శ్రీజన్ అభియాన్’ కొనసాగుతోంది. ఇప్పటికే 500 జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి అయ్యింది. బూత్ స్థాయి వరకూ పార్టీ బలోపేతం చేస్తాం. 2026లో జరగబోయే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది అని ఖర్గే అన్నారు. థరూర్ పరుగు.. నమస్తేచాలాకాలంగా కాంగ్రెస్ కీలక సమావేశాలకు సైతం దూరంగా ఉంటూ.. హట్ టాపిక్‌గా మారిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఎట్టకేలకు ఇవాళ సీడబ్ల్యూసీ భేటీకి హాజరయ్యారు. ఆ సమయంలో మీడియా కెమెరాలు ఆయన వైపే తిప్పాయి. దీంతో ఆయన వేగంగా పరిగెత్తుకుంటూ డోర్ దాకా వెళ్లారు. అక్కడ నుంచి అందరి చూస్తూ నమస్కారం చేసి లోపలకు వెళ్లిపోయారు. అంతకు ముందు.. ఇందిరా భవన్ ప్రాంగణంలో కనిపించిన ప్రతీ ఒక్కరికీ షేక్‌హ్యాండ్ ఇస్తూ చిరునవ్వుతో పలకరించారాయన. Delhi: Congress MP Shashi Tharoor reaches the Congress headquarters for the CWC meeting pic.twitter.com/AT3XlczxIG— IANS (@ians_india) December 27, 2025గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక లైన్ అంశాలపై మాట్లాడుతున్న ఆయన.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కీలక భేటీ సహా మూడు సమావేశాలకు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం కేంద్రం రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన విందులో థరూర్ పాల్గొని కాంగ్రెస్ సీనియర్లతోనే విమర్శలు ఎదుర్కొన్నారు.సోనియా, రాహుల్‌తో రేవంత్ భేటీఇటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, అటు ఏపీ నుంచి సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజులు హాజరయ్యారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ కాసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. -
నేడు సీడబ్ల్యూసీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రామ్ జీ) పేరుతో తెచి్చన కొత్త చట్టంతో పాటు దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీకి అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాం«దీలతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీల అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో అక్కడి వైఫల్యాలపైనా చర్చించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న పశి్చమబెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పారీ్టలతో పొత్తుల అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇటీవల వెల్లడైన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను భేటీలో విశ్లేíÙంచనున్నారు. దీంతో పాటే యూపీఏ ప్రభుత్వం తీసుకువచి్చన నరేగా పథాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్తగా తెచ్చి జీ రామ్ జీ చట్టాన్ని అమల్లోకి తెచి్చన నేపథ్యంలో, దీనిపై. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై భేటీలో చర్చించనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నిరసనలపై రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి సభ్యుల నుంచి ప్రతిపాదనలు కోరనున్నట్లు తెలిసింది. కొత్త చట్టంపై కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ తీసుకునే కార్యాచరణ కీలకం కానుంది. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహా ఢిల్లీకి చేరుకున్నారు. -
చరిత్రను వక్రీకరిస్తున్న మోదీ
కలబురగి (కర్ణాటక): అస్సాంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్ పారీ్టయే కారణమంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరగనున్న అస్సాంలో మోదీ చేసిన ప్రసంగంపై ఖర్గే ఆదివారం తీవ్రంగా ప్రతిస్పందించారు. స్వాతంత్య్రానికి పూర్వం ముస్లిం లీగ్, బ్రిటిష్ వారు కలిసి దేశ విభజనకు పునాదులు వేస్తున్నప్పుడు, అస్సాంను తూర్పు పాకిస్థాన్‌లో కలిపేందుకు కుట్ర పన్నారని, ఆ కుట్రలో కాంగ్రెస్ కూడా భాగస్వామి అయిందని మోదీ ఆరోపించారు. కేవలం గోపీనాథ్ బార్డోలోయ్ మాత్రమే సొంత పార్టీని ఎదిరించి అస్సాం అస్తిత్వాన్ని కాపాడారని ప్రధాని స్పష్టం చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే.. దీనిపై ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘కేంద్రంలోనూ, అస్సాంలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. మరి రక్షణ కల్పించడంలో విఫలమైతే ప్రతిపక్షాలను ఎలా నిందిస్తారు? మీరు విఫలమైన ప్రతిసారీ విపక్షాలపై బురద చల్లడం తగదు. ఈ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’.. అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం రద్దు చేయడంపై కూడా ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పేదలకు జీవనాడి వంటిదన్నారు. గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, ధనవంతులకు బానిసలుగా మార్చడానికే మోదీ ఈ చట్టాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రతి జిల్లాలోనూ ఆందోళనలు చేపడతామని ఖర్గే హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో హిందువుపై జరిగిన మూకదాడి ఘటనను ఖర్గే తీవ్రంగా ఖండించారు. ‘అక్కడ హిందువులకు రక్షణ కల్పించాలి. భారత ప్రభుత్వం వెంటనే ఆ దేశంతో మాట్లాడి హిందువుల రక్షణకు చర్యలు చేపట్టాలి’.. అని ఆయన డిమాండ్ చేశారు. -
స్థానిక గొడవే అది.. హైకమాండ్ సృష్టించలేదు
శివాజీనగర: కర్ణాటకలో సీఎం పదవి వివాదంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం కల్బుర్గిలో మీడియాతో మాట్లాడుతూ ‘దీనిని హైకమాండ్ సృష్టించలేదు. గందరగోళానికి హైకమాండ్ కారణం కాదు. స్థానిక నాయకులే గొడవ చేసుకున్నారు. వారే దీనిని పరిష్కరించుకోవాలి. అన్నిటికీ హైకమాండ్‌ను అంటే ఎలా?’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎవరో ఒక నాయకుడి వల్ల బలపడలేదని, తన వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని, తానే పార్టీ కోసం శ్రమించానని ఎవ్వరూ చెప్పరాదని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అనేది కార్యకర్తల ద్వారా విస్తరించిన పార్టీ. పార్టీ అన్న తరువాత అందరి పాత్ర ఉంటుంది. ఫలానా వారే పార్టీకి ఆధారం అని కార్యకర్తలు కూడా అనరాదు’ అని సూచించారు. సోదరుల్లాగా పనిచేసుకుంటున్నాం: శివకుమార్ మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారం బెంగళూరులో తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ తనకు కాంగ్రెస్‌లో ఏ నాయకుడితో భిన్నాభిప్రాయాలు లేవన్నారు. అవన్నీ మీడియా, ప్రతిపక్షాల సృష్టి అని పేర్కొన్నారు. తాను, సీఎం సిద్ధరామయ్య కలసికట్టుగా సోదరుల్లాగా పని చేయడం లేదా? అని ప్రశి్నంచారు. ‘కొన్ని సందర్భాల్లో రాజకీయంగా వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఇందుకు అసంతృప్తికి గురికావాలా?, అన్నదమ్ములే గొడవపడుతుంటారు. ఇక మా గొడవ అనేది ఏ లెక్కకు వస్తుంది?’ అని ప్రశ్నించారు. పార్టీలో గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని మల్లికార్జున ఖర్గేకు కొందరు నాయకులు లేఖ రాయడంపై మాట్లాడుతూ, ‘నా వరకు ఎలాంటి గందరగోళం లేదు. మీడియాకు వార్తలు కావాలి, అందుకోసమే రోజూ గందరగోళం చేయిస్తున్నారు’ అని అన్నారు. సీఎం సన్నిహిత వర్గానికి చెందిన నేత కేఎన్ రాజన్న కలవడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘ఆయనకు సీఎం సన్నిహితుడా?, నాకు కూడా సన్నిహితుడే’ అని చమత్కరించారు. -
తెలంగాణ ‘విజన్’ భేష్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్’పై కాంగ్రెస్ అధిష్టానం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర భవిష్యత్ ముఖచిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారంటూ ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌రెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. ఖర్గే, ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ విజయవంతమైన తీరును రేవంత్‌రెడ్డి వారికి వివరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేలా చేసుకున్న ఒప్పందాలు, విజ న్ డాక్యుమెంట్ ఆవిష్కరణ వంటి అంశాలపై వారి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. సమ్మిట్ నిర్వహణ, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అగ్రనేతలు ప్రత్యేకంగా అభినందించారు. రేవంత్‌రెడ్డి వెంట మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎంపీలు సురేశ్ షెట్కార్, మందాడి అనిల్ కుమార్, పోరిక బలరాం నాయక్, డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.ప్రణబ్ ముఖర్జీకి ఘన నివాళిమాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో ఘన నివాళులర్పించారు. ప్రణబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దశాబ్దాలపాటు ప్రజాసేవకే అంకితమైన గొప్ప దార్శనికుడు ప్రణబ్ ముఖర్జీ అని సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బెంగాల్ ఎన్నికల్లో లబ్ధికే వందేమాతరంపై చర్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో సామాన్య ప్రజల సమస్యలపై చర్చించి, పరిష్కరించిన రోజున మాత్రమే భారత మాతకు నిజమైన నివాళి అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలో బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ వందేమాతరంపై చర్చను చేపట్టారని ఆయన విమర్శించారు. నిరుద్యోగం, దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ, రూపాయి విలువ పతనం తదితర దేశం ముందున్న ప్రధానమైన సమస్యలపై అందరి దృష్టినీ మళ్లించేందుకు కూడా ఈ చర్చను కేంద్రం నిర్వహిస్తోందని ఆరోపించారు.మంగళవారం ఆయన వందేమాతర గీతానికి 150 ఏళ్లవుతున్న సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొని, దాదాపు గంటపాటు మాట్లాడారు. వందే మాతర గీతాన్ని రెండు చరణాలకే పరిమితం చేశారంటూ నెహ్రూపై ప్రధాని మోదీ, అమిత్‌షాలు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ అంశంపై మహాత్మాగాంధీ, సుభాష్ చంద్ర బోస్, మదన్ మోహన్ మాలవీయ, ఆచార్య కృపలానీ, రవీంద్రనాథ్ ఠాకూర్ వంటి మహామహులతో కలిసి ఆయన తీసుకున్న నిర్ణయమన్నారు. అప్పట్లో వందేమాతరం ఆలపించేందుకు ఇష్ట పడిన వారు సైతం నేడు వందేమాతరం అంటున్నారని, ఇదే జాతీయ గీతం గొప్పదనమని ఖర్గే చెప్పారు.‘దక్షిణాసియా దేశాలను బాహాటంగానే చైనా తన వైపు లాక్కుంటోంది. తన ఛాతీ 56 అంగుళాలని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ చైనాకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడారా?’అని ఖర్గే ప్రశ్నించారు. యూపీఏ హయాంలో 55 రూపాలయ వరకు ఉన్న డాలరు విలువ నేడు ఏకంగా ఆకాశమంత ఎత్తుకు పెరిగి రూ.90కి చేరుకుందన్నారు. వందేమాతరం గురించి మాట్లాడటమంటే, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ పరిణామాలను గురించి మాట్లాడుతున్నారంటూ అధికార పక్షాల సభ్యులు అభ్యంతరం తెలపగా అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ వారితో ఏకీభవించారు. -
సమ్మిట్ లక్ష్యం నెరవేరాలి
సాక్షి హైదరాబాద్: పార్ల మెంటు సమావే శాల నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025కు హాజరు కా లేకపోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. హైదరాబాద్ వేదికగా సోమ, మంగళవారాల్లో నిర్వహించే సదస్సు విజయవంతం కావాలని కోరుతూ వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలి యజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు ఖర్గే ఆదివారం లేఖ రాశారు.సమ్మి ట్ విజయవంతం కావాలని లేఖలో ఆకాంక్షించారు. ఈ సద స్సు ద్వారా తెలంగాణ పెట్టుబడిదారుల గమ్యంగా.. ఇన్నోవేషన్ హబ్‌గా అవతరించాలని అభిప్రాయపడ్డారు. సదస్సులో జరిగే చర్చలు మెరుగైన ఫలితాలు ఇవ్వాలని.. తెలంగాణ నిర్దేశించుకున్న లక్ష్యాలు, దేశాభివృద్ధి ప్రయాణంలో సమ్మిట్ ఫలవంతమైన తోడ్పా టు అందించాలని సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో ఖర్గే ఆకాంక్షించారు. -
ప్రభుత్వ విందు వివాదం: విమర్శలపై థరూర్ ఏమన్నారంటే..
పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన అధికారిక విందు కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలను ఆహ్వానించకపోవడంపై రాజకీయ దుమారం రేగింది. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ అనూహ్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం హాట్ టాపిక్ అయ్యింది.శశిథరూర్‌ను కేంద్రం ఆహ్వానించడం.. దానిని అంగీకరించి ఆయన హాజరు కావడం కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత కలహాలను బయటపెట్టింది. పలువురు సీనియర్లు ఆయన్ని బహిరంగంగానే తప్పుబడుతున్నారు. థరూర్ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని పవన్ ఖేడా, జైరాం రమేష్‌లాంటి సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే.. థూరూర్ను ఆహ్వానిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన సమస్య ఏంటో అర్థం కావడం లేదని బీజేపీ అంటోంది. ఈ అభ్యంతరాలు.. రాజకీయ విమర్శల దరిమిలా శశిథరూర్ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు.తిరువనంతపురం(కేరళ) ఎంపీ శశిథరూర్.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ హోదాలోనే తాను కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చిందని అన్నారాయన. ‘‘20 ఏళ్ల క్రితం నేను జియోపాలిటికల్ అలైన్మెంట్స్ కోసం అన్వయించిన ఓ పదం.. ఇప్పుడు వాస్తవరూపం దాల్చినందుకు సంతోషం. రాష్టప్రతి భవన్లో గతంలో భిన్నమైన వైఖరి ఉండేది. కానీ, ఈసారి ఇతర గళాలను కూడా వినిపించాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. అందుకే నన్ను ఆహ్వానించి ఉంటారు. అలాగే..ఇతర దేశాలతో సంబంధాలు మా కమిటీ పరిధిలోకి వస్తాయి. అందువల్ల అక్కడ జరిగే సంభాషణలు, వాతావరణం గురించి అవగాహన కలగడం మాకూ మంచిదే అని అన్నారాయన. అంతేకాదు.. ప్రభుత్వం ఇచ్చిన ఈ విందును అద్భుతం(Excellent Dinner) అని అభివర్ణించారు.ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో రెండు రోజులు పర్యటించారు. ఆయన కోసం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో శుక్రవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే అధికారిక కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలకు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామంపై థరూర్ స్పందిస్తూ.. ఆ విషయం తనకు తెలీదన్నారు. ఏ ప్రతిపాదికన ఆహ్వానాలు పంపారో తనకు అవగాహన లేదన్నారు. అలాగే అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారం కోరారా? అనే ప్రశ్నకు.. రాష్ట్రపతి భవన్ విందుతో దానికి సంబంధం లేదన్నారు. విందు ముందు జరిగిన సంభాషణల్లో తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వ అధికారులతో ప్రస్తావించానని తెలిపారు. “ప్రజల కోసం, ఓటర్ల కోసం పని చేయడం నా రాజకీయ బాధ్యత” అని అన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడంపై స్పందిస్తూ.. కొన్ని విషయాల్లో విభేదాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో ఏకీభవిస్తాం. ఏకీభవించే చోట కలిసి పనిచేయాలి అని వ్యాఖ్యానించారు. థరూర్ గతకొంతకాలంగా ప్రభుత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేయడం.. ఆపరేషన్ సిందూర్ కోసం దూతలా ప్రపంచమంతా తిరగడం కాంగ్రెస్‌లో అసంతృప్తికి దారి తీసింది తెలిసిందే. ఈ తరుణంలో.. ఆయనకు పార్టీ మారతారా? అనే ప్రశ్నా తాజా ఇంటర్వ్యూలోనూ ఎదురైంది. ‘‘నేను కాంగ్రెస్ ఎంపీని. ఎన్నికల్లో గెలవడానికి చాలా కష్టపడ్డాను. వేరే నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచన అవసరం’’ అంటూ ఆచితూచి స్పందించారాయన. -
కేంద్రం అన్ని ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘిస్తోంది
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాకను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలకు ప్రభుత్వం ఆహ్వనం పంపకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. అదే సమయంలో, తమ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఆహ్వనించడం, వెళ్తానంటూ ఆయన ప్రకటించడంపైనా స్పందించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, పార్టీ మీడియా ఇన్‌ఛార్జి పవన్ ఖేరా మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య విధానాలపై ఏమాత్రం విశ్వాసం లేని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని రకాల ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలను పిలవకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఇందులో తాము చెప్పడానికేమీ లేదని, దీనిపై ప్రభుత్వాన్నే అడగాలని వారు మీడియాతో వ్యాఖ్యానించారు. విందుకు పార్టీ ఎంపీ శశి థరూర్‌కు ఆహ్వనం అందడంపై వారు..‘ఈ విషయం థరూర్నే అడగండి. తమ పార్టీ నేతలకు ఆహ్వనం ఇవ్వకుండా, తమకు మాత్రమే పిలుపు అందిన సందర్భాల్లో ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలి. ఆహ్వనించడంలోనూ రాజకీయాలు నడుస్తుండటం ప్రశ్నార్థకం. అలా అందిన ఆహ్వనాన్ని అంగీకరించడం కూడా ప్రశ్నార్థకమే’అని వారు పేర్కొన్నారు. తనకు అందిన పిలుపుపై శశి థరూర్ స్పందిస్తూ.. విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా ఆ విందుకు తాను వెళ్తున్నానన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలకు పిలుపు అందకపోవడం తనకు తెలియదని చెప్పారు. ఏదేమైనా తనకు ఆహ్వనం అందింది కాబట్టి, విందుకు హాజరవుతానని చెప్పారు. -
కాలుష్యంపై విపక్షాల నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ కాలుష్య రాజధానిగా పరవుమాసినా మోదీ ప్రభుత్వంలో ఇంచు కూడా చలనం లేదంటూ విపక్ష పార్టీలు పార్లమెంట్ వేదికగా ఆందోళనకు దిగారు. గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రభుత్వ వ్యతిరేక ప్లకార్డులు చేతబూని, నల్ల మాస్క్‌లు ధరించిన విపక్ష పార్టీల సభ్యులు మకరద్వారం వద్ద నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలిరోజు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ చేసిన ‘‘ శీతాకాల సుందర ప్రకృతిని ఆస్వాదించండి’ వాక్యాలను పెద్ద బ్యానర్‌పై రాసి ఎంపీలంతా ప్రదర్శించారు. ‘‘ఓవైపు పిల్లలు కాలుష్య వాయువు కారణంగా చనిపోతుంటే ఇకనైనా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలి. నాలాంటి వృద్ధులు సైతం ఎంతో బాధపడుతున్నారు’’ అని సోని యాగాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ ఢిల్లీవాసులంతా ఎందుకింతగా కష్టపడాలి? అని మోదీని ప్రశ్నిస్తే ఆయనేమో శీతాకాలం ఎంత బాగుందోకదా అని మాట్లాడుతున్నారు. వాయుకాలుష్యంపై బీజేపీ నిర్లక్ష్య వైఖరిపై పార్లమెంట్ వేదికగా నిలదీస్తాం’’ అని ఖర్గే అన్నారు. ‘‘ రాజకీయంగానీ ఈ వాయుకాలుష్యం సమస్యపై తక్షణం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలి. ఈ అంశం పార్లమెంట్లో చర్చకు రావాలి. చర్యల విషయంలో మేం ప్రభుత్వానికి మద్దతిస్తాం’’ అని ప్రియాంకాగాంధీ అన్నారు. -
ఉమ్మడి వ్యూహంపై విపక్షాల చర్చ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతలు బుధవారం పార్లమెంట్లో ప్రాంగణంలోని మల్లికార్జున ఖర్గే చాంబర్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, ఎన్సీపీ(ఎస్పీ), శివసేన(ఉద్ధవ్) తదితర పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో చర్చించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని తీర్మానించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతిపక్ష నేతలు స్పష్టంచేశారు. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరగాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, విపక్షాల భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 1వ తేదీన సమావేశానికి కూడా వారు హాజరు కాలేదు. లేబర్ కోడ్స్పైపత్రిపక్షాల నిరసన కేంద్రం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్స్‌పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. వీటిని వెంటనే రద్దు చేయాలని తేల్చిచెప్పాయి. లేబర్ కోడ్స్ పట్ల విపక్షాలు బుధవారం పార్లమెంట్ మకరద్వారం వద్ద నిరసన వ్యక్తంచేశాయి. కాంగ్రెస్ ముఖ్యనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కారి్మకులకు కక్షగట్టిందని, కేవలం ఆశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఖర్గే మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కొత్త లేబర్ కోడ్స్‌తో కారి్మకులకు, ఉద్యోగులకు నష్టం వాటిల్లుందని పేర్కొన్నారు. లేబర్స్ కోడ్స్‌ను ప్రియాంకా గాంధీ సైతం తప్పుపట్టారు. -
మోదీ.. పాత కేసులతో వేధించే ప్రయత్నం: ఖర్గే ఆగ్రహం
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఖర్గే పలు విమర్శలు చేశారు. ఇది బీజేపీ, మోదీ రాజకీయ ప్రతీకారం అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, ఈడీ కలిసి కొత్త ఆరోపణలు లేక ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకువస్తున్నాయని అన్నారు.నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘12 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా గాంధీ కుటుంబంపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం, ఈడీ వద్ద కొత్త ఆరోపణలు లేవు. వాస్తవాలు తక్కువగా ఉన్నప్పుడు నాటకీయ అంశాలు రంగంలోకి దిగాయి. రాజకీయ ప్రతీకార చర్య, పాత ఆరోపణలు తీసుకురావడం అన్నీ ప్రత్యర్థులను వేధించే ప్రయత్నం. ఇది రాజకీయ ప్రతీకార చర్య. దీనిని న్యాయవ్యవస్థ కచ్చితంగా గుర్తిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’ అని పోస్టులో పేర్కొన్నారు.కేసు వివరాలు ఇలా.. దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1938లో వార్తాపత్రిక నేషనల్ హెరాల్డ్ స్థాపించారు. ఈ పత్రికలో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజెఎల్ సంస్థకు చెందిన రూ.2000 విలువైన స్థలాలను కేవలం రూ.50 లక్షలకే దక్కించుకున్నట్లు అభిమోగాలు మోపింది. వాటిలో రాహుల్‌కు 38శాతం, సోనియాకు 38శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్‌లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది.ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్(AJL)కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలతోపాటు యంగ్ ఇండియన్ అనే ఒక ప్రైవేటు కంపెనీ కుట్రకు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. -
సిద్ధూ, డీకేలతో మాట్లాడతాం: ఖర్గే
సాక్షి బెంగళూరు: కర్ణాటక సీఎం వివాదంపై ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. త్వరలోనే ఈ ప్రతిష్ఠంభనకు ముగింపు పలకబోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలోనే పార్టీ అగ్రనేతలతో కలిసి సమావేశం నిర్వహిస్తామని ఆ మీటింగ్‌లో ఈ వివాదానికి ముగింపు పలుకుతామని ఖర్గే పేర్కొన్నారు.కర్ణాటకలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవి కాపాడడం కోసం సిద్దరామయ్య, ఎలాగైనా సీఎం పదవి చేపట్టాలని డీకే శివకూమార్ ఇద్దరు నేతలు భీష్మించుకు కూర్చొన్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఇటీవల వ్యాఖ్యానించడంతో కేంద్రం ఆయనను సీఎం చేస్తానని హామి ఇచ్చిందని దానికోసమే అలా మాట్లాడారని అంతా అనుకున్నారు. ఈ వరుస ఘటనలతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాజాగా ఆ రాష్ట్ర వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ "త్వరలోనే కర్ణాటకలో జరుగుతున్న వివాదానికి ముగింపు పలుకుతాం. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర నాయకులతో కలిసి సమావేశం నిర్వహిస్తాం. ఆ మీటింగ్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌ను కూడా పిలిచి వారితో చర్చిస్తాం" అని ఖర్గే తెలిపారు.ఇటీవల ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని, వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద చర్య అని అన్నారు. దీంతో సీఎం పదవినుద్దేశించే తాను మాట్లాడారని చర్చ జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ‘అంతిమంగా నిర్ణయం తీసుకునేది హైకమాండ్ఈ గందరగోళానికి పూర్తి ముగింపు పలకడానికి, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి అని అన్నారుపవర్ షేరింగ్ ఏంటంటే..2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండనున్నట్లు అధిష్ఠానం నిర్ణయించిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 తారీఖుతో రెండున్నరేళ్ల కాలం ముగిసింది. దీంతో సీఎం మార్పు వ్యవహారం మళ్లీ తెరమీదకొచ్చింది. -
రాజ్యాంగంపై నిరంతరం దాడి
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ నిరంతరం దాడి చేస్తూ దాని ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగ విలువలు, సూత్రాలను ఒక పద్ధతి ప్రకారం కాలరాస్తున్నాయని, సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం రూపకల్పనలో బీజేపీ–ఆర్ఎస్ఎస్లకు ఎలాంటి పాత్ర లేదని ఖర్గే బుధవారం ‘ఎక్స్’లో తేల్చిచెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, రాజ్యాంగాన్ని అవమానిస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అణచివేసే బాధ్యతను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ముందుకు తీసుకెళ్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రాజ్యాంగం అనేది పేదలకు ఒక రక్షణ కవచమని పేర్కొన్నారు. రాజ్యాంగంపై దాడిని సహించబోమంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలను కోరారు. ఈ దాడిని ఎదుర్కోవడానికి తాను ఎల్లప్పుడూ ముందంజలో ఉంటానని స్పష్టంచేశారు. రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదని, అది ప్రజలకు ఇచ్చిన పవిత్రమైన హామీ అని ఉద్ఘాటించారు. ప్రజలందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సమానత్వం, గౌరవం, న్యాయం చేకూర్చడమే రాజ్యాంగం ఇస్తున్న హామీ అని వెల్లడించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, సిద్ధరామయ్య పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని తేల్చిచెప్పారు. -
సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధం?!
నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ.. కర్ణాటక రాజకీయంలో బడా ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం మార్పు ఉండొచ్చనే సంకేతాలను బలపరిచేలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇంతకాలం పదేపదే చెబుతూ వచ్చిన ఆయన.. ఇవాళ సరికొత్తగా మాట్లాడడం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తే.. ఐదేళ్లు సీఎంగా కొనసాగుతాను. ఒకవేళ సీఎంను మార్చి తీరాలని అధిష్టానం భావిస్తే అందుకు కట్టుబడి ఉంటాను. నేను మాత్రమే కాదు.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా దీనిని అంగీకరించాల్సి ఉంటుంది’’ అని అన్నారాయన. నవంబర్ 20వ తేదీన నుంచి కర్ణాటక రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. పవర్ షేరింగ్ ఫార్ములా ద్వారా సీఎం రేసులో ఉన్న సిద్దూ, డీకేశిలను చల్లార్చిందనే ప్రచారం ఒకటి ఉంది. రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే మద్దతుదారులు ఆయనకు సీఎంపగ్గాలు అప్పగించాలని గళం వినిపిస్తుండగా.. అనుభవాన్ని,సామాజిక వర్గాల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని కొనసాగించాలంటూ సిద్ధరామయ్య మద్దతుదారులు ఢిల్లీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. డీకే శివకుమార్‌కు శిబిర ఎమ్మెల్యేల సంఖ్య పరిమితంగా ఉండడంతో ఈ మార్పునకు అధిష్టానం సుముఖంగా లేదని నిన్నటిదాకా ప్రచారం వినిపించింది. అయితే.. అనూహ్యంగా ఆయనకు మద్దతుదారుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. వాళ్లంతా మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇటు సిద్ధరామయ్య కూడా సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధమంటూ తాజాగా ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతా వాళ్ల చేతుల్లోనే..కర్ణాటకలో కేబినెట్ పునర్వవ్యస్థీకరణ(పీసీసీ చీఫ్ మార్పు సహా) చేపట్టాలని సిద్ధరామయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సీఎం సీటు పంచాయితీ తేల్చిన తర్వాతే ఆ పని చేయాలంటూ డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో.. ‘‘నాలుగైదు నెలల కిందటే హైకమాండ్ నుంచి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు తనకు గ్రీన్‌సిగ్నల్ లభించిందని.. అయితే రెండున్నరేళ్ల పాలన పూర్తి అయ్యేదాకా ఆగాలని భావించానని’’ సిద్ధరామయ్య ఇవాళ మీడియాకు తెలిపారు. అయితే.. పవర్ షేరింగ్ ఫార్ములా(రెండున్నరేళ్ల తర్వాత సీఎం సీటు వదులకునేందుకు సిద్ధపడ్డారా?) అనేది ఒకటి ఉందా?.. అందుకు మీరు అంగీకరించారా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉంటుంది అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారాయన. ఆయన వస్తేనే..కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను డీకే శివకుమార్‌తో రీప్లేస్ చేయాలంటూ కొంత కాలంగా నడుస్తున్న రాజకీయాలతో ఢిల్లీ వేడెక్కుతోంది. ఇప్పటికే డీకే శివకుమార్ వర్గీయులు హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు.. శనివారం సిద్ధూ వర్గం ఎడతెరిపి లేకుండా బెంగళూరు పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరిపింది. అయితే.. అంతిమ నిర్ణయం అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉందంటూ ఖర్గే వాళ్లతో తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఖర్గే ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి రానున్నారు. ఆయన వచ్చాకే కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ఓ కొలిక్కి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
హైకమాండ్ చూసుకుంటుంది..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మౌనం వీడారు. అక్కడి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం సిద్ధరామయ్య– డిప్యూటీ డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న కుర్చీలాట సమస్యను పరిష్కరించడం తనవల్ల సాధ్యపడదని పరోక్షంగా విచారం వ్యక్తంచేశారు. ‘మీరు (మీడియా) మూడ్రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తోంది. ఎందుకంటే ఏ విషయం లేకుండా నేను చెప్పడం మంచిది కాదు. నా దగ్గర చెప్పేందుకు ఏమీలేదు’ అని అన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి జరిగే పక్షంలో సీఎం రేసులో తాను కూడా ఉంటానని సీనియర్ మంత్రి జి. పరమేశ్వర్ ఆదివారం పేర్కొన్నారు. -
కర్ణాటకలో ట్విస్ట్.. ఖర్గేతో భేటీలో ఏం జరిగింది?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అధికార, నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమమని సీఎం సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. శనివారం రాత్రి ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సుమారు గంటకు పైగా సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఖర్గేతో భేటీ అనంతరం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు రావడంతో కలిశానన్నారు. ఇదొక మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని చెప్పుకొచ్చారు. పార్టీ బలోపేతంపై, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు. నాయకత్వ మార్పు అంశంపై చర్చించలేదన్నారు. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో చర్చలు జరపడంపై స్పందిస్తూ ఎవరైనా ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌తో మాట్లాడొచ్చని, అందులో ప్రత్యేకత ఏముందని ప్రశ్నించారు. సీఎం మార్పు అంశంలో ఏమి జరిగినా తాను బాధపడనని, అలాగే సంతోషపడనని కూడా చెప్పారు. ఏ విషయమైనా పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమమని, అది తానైనా, డీకే శివకుమార్ అయినా, పార్టీ నేతలెవరైనా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ! ఖర్గేతో భేటీలో సిద్ధరామయ్య తననే సీఎంగా కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. శనివారం బెంగళూరు నగరంలోని సదాశివనగరలో ఉన్న ఖర్గే నివాసానికి తన వర్గం, నేతలు లేకుండా సీఎం సిద్ధరామయ్య ఒక్కరే వెళ్లడం గమనార్హం. ఇద్దరు నేతలు కలిసి సుదీర్ఘంగా పలు తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరిగిందని సమాచారం. అంతకు ముందు సీఎం తన అనుచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర మంత్రులతో సమావేశమై చర్చించారు. సీఎం నివాసం కావేరికి మంత్రులు జమీర్ అహ్మద్‌ఖాన్, ఈశ్వర్ ఖండ్రే, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లారు.ప్రస్తుత రాజకీయ సంక్షోభ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎంతో వారు చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో మంత్రి డి.సుధాకర్ కుమారుడి పెళ్లికి సీఎం హాజరై అక్కడి నుంచి నేరుగా ఖర్గే నివాసానికి చేరుకున్నారు. తనకు ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని ఖర్గే చెప్పినట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ పాలనకు ఎలాంటి ఆటంకం లేకుండా, సుపరిపాలన కొనసాగాలంటే తానే సీఎంగా కొనసాగాల్సిన ఆవశ్యకతను వివరించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటే కూడా తానే సీఎంగా కొనసాగాలని చెప్పినట్లు సమాచారం. కాగా, సీఎం సిద్ధరామయ్య, ఖర్గే భేటీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. వారి భేటీకి ప్రత్యేకత ఏమీ లేదన్నారు. తాను ఉంటున్న ఇంటి నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఖర్గే నివాసం ఉందని తెలిపారు. -
ఖర్గే ఓటు ఎవరికో!
సాక్షి బెంగళూరు/శివాజీనగర/బనశంకరి: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరింది. ఒప్పందం మేరకు తనను సీఎం చేయాల్సిందేనని డీకే గట్టిగా పట్టుబట్టారు. మరోవైపు పూర్తిగా ఐదేళ్లూ తననే సీఎంగా కొనసాగించాలని, అత్యధికంగా ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని సిద్ధరామయ్య చెబుతున్నారు. శుక్రవారం దాకా ఢిల్లీ కేంద్రంగా ఇరు వర్గాల నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై ఈ మేరకు ఒత్తిడి తెచ్చారు. ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూపకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని గ్రహించిన అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు వచ్చారు. స్వతహాగా కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గేకు ఇక్కడి రాజకీయాలపై పూర్తిగా అవగాహన ఉండడంతో సమస్య పరిష్కారానికి బరిలోకి దిగారు. శుక్రవారం రాత్రి కూడా డీకే శివకుమార్ బెంగళూరులో ఖర్గేతో సమావేశమై చర్చించారు. అధికార మారి్పడికి అంగీకరించాలని డీకే శివకుమార్ ఒత్తిడి చేశారు. డీకే సోదరుడు సురేశ్, డీకే వర్గం ఎమ్మెల్యేలు కూడా శివకుమార్ వెంట ఉన్నారు. వారి డిమాండ్లు, విజ్ఞప్తులను ఖర్గే సావధానంగా విన్నారు. డీకే శివకుమార్ అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై సుదీర్ఘంగా డీకే శివకుమార్‌తో చర్చించారు.సీఎం తాజా ప్రతిపాదన!సిద్దరామయ్య శనివారం ఖర్గేతో కలిసి మాట్లాడారు. తననే సీఎంగా కొనసాగించాలని కోరారు. తనకే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినట్లు సమాచారం. డీకే శివకుమార్ వంటి ప్రభావవంతమైన నాయకుడిని దీటుగా ఎదుర్కొనేందుకు.. ఆయన మద్దతుదారు ఎమ్మెల్యేలు, ఆశావహులను నియంత్రించేందుకు తన వర్గం నుంచి మరో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండాలని సిద్ధరామయ్య ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రస్తుతానికి హైకమాండ్ నేరుగా చర్యలు తీసుకోనప్పటికీ బెంగళూరు, ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. సిద్ధరామయ్య కూడా వరుస భేటీలతో తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటుండటం కనిపిస్తోంది. ఆచితూచి అడుగులు వేస్తున్న అధిష్టానం రానున్న రెండున్నరేళ్లు కూడా తానే సీఎం అంటూ సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేయడం, ఇందుకు ప్రతిగా ‘విష్ యు ఆల్ ది బెస్ట్. సిద్ధరామయ్యకు మంచి జరగాలి’ అంటూ డీకే శివకుమార్ కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఈ నేపథ్యంలో ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఏ ముప్పు వస్తుందోనన్న తలనొప్పి ప్రస్తుతం హైకమాండ్‌కు ఏర్పడింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇరు వర్గాలకు అంగీకారయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని, తద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఆచితూచి అడుగులు వేస్తోంది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాన్ని వెల్లడించాలని చూస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నుంచి బెంగళూరు సదాశివనగరలోని మల్లికార్జున ఖర్గే నివాసం బిజీబిజీగా మారింది. వరుసగా నేతలు భేటీ అయ్యేందుకు తరలివస్తున్నారు. ఖర్గేతో సమాలోచనలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకే వేదికపై సిద్దరామయ్య, శివకుమార్ కర్ణాటక సీఎం మార్పుపై చర్చ జోరందుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఒకే వేదికపై ఆతీ్మయంగా మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు హెబ్బాళలో జరిగిన ప్రపంచ మత్స్య దినాచరణలో వారిద్దరూ కలిసి పాల్గొన్నారు. చేపల పెంపకం, తదితర విషయాలపై శివకుమార్ ముఖ్యమంత్రికి వివరించారు. సిద్దరామయ్య కూడా ప్రతిస్పందిస్తూ తల ఊపారు.కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు: కుమారస్వామి రానున్న రోజుల్లో కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని కేంద్ర మంత్రి హెచ్డీ.కుమారస్వామి జోస్యం చెప్పారు. శనివారం బెంగళూరులో జేడీఎస్ పార్టీ రజతోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం మార్పు అంటూ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే రానున్న రోజుల్లో ఎవరూ ఊహించని రాజకీయ మార్పులు ఖాయం అన్నారు. ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పడానికి వీలులేని పరిస్థితి నెలకొందన్నారు. -
త్యాగాలకు కూడా ఓ హద్దు ఉంటుంది!
ఆయన పార్టీ కోసం ఎంతో చేశారు. అలాంటి వ్యక్తిని మోసం చేయడం వెన్నుపోటు కిందే లెక్క. త్యాగాలకు కూడా ఓ హద్దు ఉంటుంది. అది దాటితే పరిస్థితులు మరోలా మారతాయ్.. డీకే శివకుమార్ వర్గీయులు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల సారాంశం ఇది. శనివారం కర్ణాటక పవర్ పాలిటిక్స్ ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్ పడుతుందనే ప్రచారం వేళ.. ఈ తరహా పోస్టులు కుప్పలుగా కనిపిస్తున్నాయక్కడి గ్రూపుల్లో!.. కర్ణాటకలో నాయకత్వం మార్పు కోరుతూ అధికార పార్టీ రాజకీయం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను సీఎం చేయాలంటూ ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే డజను మంది ఎమెల్యేలు ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి తమ గళం వినిపించారు. ఇవాళ బెంగళూరు పర్యటనలో ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మరోసారి కలవాలనుకుంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయని డీకే శివకుమార్ మాత్రం గప్‌చుప్‌గా జైల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ములాఖత్కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఆయన త్యాగాలకు అంతే లేదా?.. బిహార్ ఎన్నికల ఫలితంతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలో రాజకీయ సంక్షోభాన్ని కోరుకోవడం లేదు. అందుకే నాయకత్వ మార్పు ఉండదనే సంకేతాలను కాంగ్రెస్ వర్గాలకు పంపిస్తోంది. ఇది సిద్ధరామయ్య వర్గీయులకు ఊరట ఇచ్చే విషయమే. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గం మాత్రం అధిష్టానంపై ఒత్తిడి పెంచాలనే చూస్తోంది. సోషల్ మీడియాలో వినూత్న ప్రచారానికి దిగింది. ఆయనపై సింపథీ పెంచేందుకు గత త్యాగాలను గుర్తు చేస్తోంది. డీకే త్యాగాల ట్రాక్ రికార్డుడీకే శివకుమార్.. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలోకి అడుగుపెట్టి 1989లో తొలిసారి సతనుర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నెగ్గారు. యువ నాయకుడిగా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. రెండో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎస్ఎం కృష్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూనే ఉన్నారాయన. 2004–2013 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉంది. ఆ సమయంలో పార్టీని నిలబెట్టడానికి డీకే శివకుమార్ విశేషంగా కృషి చేశారు. ఆ సమయంలోనే సీఎం కుర్చీ కోసం ప్రయత్నాలు చేయాలంటూ అనుచరులు ఒత్తిడి చేసినా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ వాళ్లకు సర్దిచెప్పారు. ఈలోపు 2014–2019 మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో సిద్దూ సర్కార్‌లో మంత్రిగా పని చేశారు సిద్ధరామయ్య. అయితే.. 2019లో ED (Enforcement Directorate) దర్యాప్తు కారణంగా మంత్రిత్వ పదవి కోల్పోయారు. ఆ సమయంలో తన వ్యక్తిగత భవిష్యత్తును పక్కన పెట్టి, పార్టీ కోసం త్యాగం చేశారు.అలా ట్రబుల్ షూటర్‌గా దేశవ్యాప్తంగా..2019లో.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూలకుండా.. ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకున్నారు డీకే శివకుమార్. అలా “ట్రబుల్ షూటర్”గా ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆపై 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(KPCC) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు అన్నివిధాల కృషి చేశారు. అక్కడి నుంచి 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన పేరు దేశం మొత్తం వినిపించింది. అయితే తన అనుచరులు ఆయనను ముఖ్యమంత్రి కావాలని కోరినా.. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించారు.కష్టపడి.. త్యాగాలు చేసినవాళలకు ఆశలు ఉండడం సహజమేనని.. అయినా తనకు పార్టీ నిర్ణయమే తుదిదని చెబుతూ వస్తున్న డీకేకు ఇప్పుడు మద్దతు పెరుగుతోంది. తొలి నుంచి చేస్తున్న త్యాగాలు.. పార్టీ బలోపేతం కోసం చేసిన ప్రయత్నాలు.. ప్రభుత్వం కుప్పకూలకుండా చూసిన వైనం.. పార్టీ గెలుపు కోసం చేసిన కృషి, చివరకు ప్రత్యర్థులు ఎంత ఆశ చూపినా.. అధికారం కంటే పార్టీనే ముఖ్యమనుకుంటున్న ఆయన నిజాయితీతో కూడిన రాజకీయానికి పార్టీ తగిన న్యాయం చేయాలని మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షా లను నాశనం చేసేందుకు ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముసుగులో ఎన్నికల కమిషన్(ఈసీ) కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి నిరసనగా డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ చేపడతామని ప్రకటించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ అమలవుతున్న సమయంలో ఈసీ వైఖరి తీవ్ర నిరుత్సాహం కలిగించిందని పేర్కొంది. లక్షిత ఓట్లను తొలగించే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ సాగిందని ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ ఛత్రం కింద పనిచేయడం లేదని ఈసీ తక్షణమే నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ–కాంగ్రెస్ సారథ్యంలోని మహాగఠ్‌బంధన్ అనూహ్యంగా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమావేశమైంది.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో మంగళవారంజరిగిన ఈ భేటీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఎస్ఐఆర్ జరిగే 12 రాష్ట్రాల అధ్యక్షులు, శాసనసభా పక్షాల నేతలు, పార్టీ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేందుకు ఈసీ ప్రయత్నించడం, దేశ చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ‘మేం జనంలోకి వెళతాం. డిసెంబర్ మొదటి వారంలో రాంలీలా మైదాన్‌లో లక్షలాది మంది ప్రజలతో భారీ ర్యాలీ చేపడతాం.ఈసీ బండారాన్ని బట్టబయలు చేస్తాం’అని వేణుగోపాల్ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ఎస్ఐఆర్ ప్రక్రియ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిష్పాక్షికంగా ఓటరు జాబితాను రూపొందించాల్సిన ఈసీ..రాజకీయ పక్షాలపై పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అసలైన ఓటర్లను తొలగించేందుకే ఈ ప్రక్రియను ఈసీ హడావుడిగా చేపడుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయంగా, సంస్థాగతంగా, న్యాయపరంగా కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు.ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడుతాంఎన్నికల ప్రక్రియ సమగ్రతను పరిరక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఖర్గే ఎక్స్‌లో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం తగ్గిపోగా, ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఈసీ వైఖరి మరింత నిరుత్సాహపూరితంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నట్లు, ఏ రాజకీయ పార్టీకి లోబడి పనిచేయడం లేదని తక్షణం ఈసీ నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి: ఖర్గే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ‘ఆర్ఎస్పై నిషేధం విధించాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే వల్లభ్ భాయ్ పటేల్ కు ప్రధాని, అమిత్ షా గౌరవం ఇవ్వాలనుకుంటే ఇది జరగాలి. దేశంలో జరుగుతున్న ఘర్షణలకు, శాంతి భద్రతల సమస్యలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లే కారణం’అని అన్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో ఖర్గే విలేకరులతో మాట్లాడారు. ‘గాం«దీజీని హత్య చేసిన వారే.. పటేల్‌ను కాంగ్రెస్ స్మరించదంటున్నారు. మహాత్ముని హత్య తర్వాత అప్పటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు. అయితే.. 9 జూలై 2024న 81ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్పై ఉన్న నిషేధాన్ని మోదీ ప్రభుత్వం తొలగించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. దీనిని రద్దు చేయాలని మేము ఇప్పటికీ కోరుతున్నాం’’అని ఖర్గే స్పష్టం చేశారు. -
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘‘నేను ఖర్గేతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారుకాగా, మల్లికార్జున ఖర్గేకు బుధవారం రాత్రి బెంగళూరు ఆస్పత్రి వైద్యులు పేస్‌మేకర్‌ను అమర్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెంగళూరు వచ్చిన ఆయన శ్వాసలో ఇబ్బంది, జ్వరం రావడంతో మంగళవారం సాయంత్రం ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు.Spoke to Kharge Ji. Enquired about his health and wished him a speedy recovery. Praying for his continued well-being and long life.@kharge— Narendra Modi (@narendramodi) October 2, 2025తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే సోషల్ మీడియా లో..‘వయో సంబంధ సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలతో ఖర్గే ఇబ్బంది పడుతున్నారు. వీటిని సరిచేసేందుకు పేస్‌మేకర్ అమర్చాలని వైద్యులు సలహా ఇచ్చారు’అని తెలిపారు. ఖర్గేకు బుధవారం రాత్రి వైద్యులు స్వల్ప శస్త్రచికిత్స జరిపి పేస్‌మేకర్‌ను విజయవంతంగా అమర్చారు. ఆయన ఆరోగ్యం బాగుందని, గురువారం డిశ్చార్జి అవుతారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. -
ఖర్గేకు పేస్‌మేకర్
బెంగళూరు: ఏఐసీసీ చీఫ్(AICC Chief) మల్లికార్జున ఖర్గే(83) ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇటు వైద్యులు, అటు కుటుంబ సభ్యులు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఆయన్ని నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. జ్వరం, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడుతున్నట్లు తొలుత వైద్యులు ప్రకటించారు. అయితే.. ఆయనకు ఫేస్మేకర్(Kharge pacemaker) అమర్చాలని వైద్యులు సూచించారట. ఈ విషయాన్ని ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గ్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందన్న ఆయన.. ఆయన ఆరోగ్యం పట్ల ఆరా తీసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉంటే.. ప్రత్యేక వైద్య బృందం ఖర్గేకు చికిత్స అందిస్తోంది. సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రికి వెళ్లి ఖర్గేను పరామర్శించారు. మరోవైపు.. Sri Kharge was advised pacemaker to be implanted and is admitted to the hospital for the planned procedure. He is stable and doing well.Grateful to all of you for your concern and wishes.— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) October 1, 2025ఖర్గే అస్వస్థత(Mallikarjun Kharge Hospitalised) వార్తతో కాంగ్రెస్ శ్రేణులు అందోళన వ్యక్తం చేశాయి. పార్టీ సీనియర్ నేతలు ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 7వ తేదీన కోహిమా(నాగాలాండ్)లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి ఖర్గే హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. పూర్తిగా కోలుకునేంత వరకు ఆస్పత్రిలోనే ఉంటారని ఖర్గే కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఆ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు.పేస్‌మేకర్ అంటే.. హృదయ స్పందన (heart rhythm) సరిగ్గా లేకపోతే దాన్ని నియంత్రించేందుకు శరీరంలో అమర్చే చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. వయసు పైబడిన వాళ్లలో.. హార్ట్‌బీట్ మందగించిన సమస్యలుంటే దీనిని అమరుస్తారు. ఇదీ చదవండి: నన్ను ఏమైనా చేస్కోండి, కానీ..: టీవీకే విజయ్ ఆవేదన -
బిహార్ నుంచే మోదీ సర్కార్ పతనం
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలే కేంద్రంలోని మోదీ ప్రభుత్వ అవినీతి పాలన పతనానికి నాంది పలుకుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌ను భారంగా భావిస్తున్న బీజేపీ ఆయనను మానసికంగా రిటైర్ చేసిందని చెప్పారు. బుధవారం పట్నాలో సీడబ్ల్యూసీ భేటీలో ఖర్గే మాట్లాడారు. బిహార్‌ను ఒక ఉదాహరణగా చూపించి లక్షలాది మంది ఓట్లను తొలగించడానికి దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఓటరు జాబితాను తారుమారు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని, ఈ సమయంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మనమంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. మన దేశం అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సమస్యలకు మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విఫలమవడం కావడమే కారణమని ఆరోపించారు. మోదీ గొప్పగా చెప్పుకుంటున్న స్నేహితులే భారత్‌ను సమస్యల వలయంలోకి నెట్టారని మండిపడ్డారు. ఒకవైపు స్వదేశీ అని చెబుతున్న మోదీ మరోవైపు చైనాకు బహిరంగంగా ఎర్ర తివాచీ పరుస్తున్నారని ఖర్గే ధ్వజమెత్తారు. ఈబీసీల రక్షణకు చట్టం: రాహుల్ బిహార్‌లో తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రక్షణ చట్టం తరహాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ)ను వేధింపుల నుంచి రక్షించడానికి చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈబీసీలకు న్యాయం చేయడానికి 10 సంకల్పాలను ప్రకటించారు. స్థానిక సంస్థల్లో ఈబీసీల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 30 శాతానికి పెంచుతామన్నారు. రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, ఈబీసీలకు కలిపి 50 శాతం కోటా కలి్పస్తామన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈబీసీలు ప్రవేశాలు కలి్పస్తామని తెలిపారు. అంతేకాకుండా ఉచితంగా భూమి పంపిణీ చేస్తామన్నారు. విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నత స్థాయి రిజర్వేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేస్తామని రాహుల్ ప్రకటించారు. ఓట్ల చోరీపై త్వరలో హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నానని స్పష్టంచేశారు. -
క్రెడిట్ కొట్టేయడానికి మోదీ ఆరాటం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్నులో నరేంద్ర మోదీ సర్కార్ చేపట్టిన మార్పులు లోతైన గాయాలకు కేవలం బ్యాండ్–ఎయిడ్ వేసి వదిలేసినట్లుగా ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. కొన్ని రకాల నిత్యావసరాలపై అధికంగా జీఎస్టీ విధించారని, ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు.ఈ క్రమంలో ఖర్గే.. 900 ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లిందన్న సామెత తీరుగా ప్రధాని నరేంద్ర మోదీ తీరు ఉందని ధ్వజమెత్తారు. మోదీ సర్కార్ ఇప్పటిదాకా 9 రకాల పన్నుల శ్లాబ్‌లతో గబ్బర్‌సింగ్ ట్యాక్స్ వసూలు చేసిందని ఆరోపించారు. ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.55 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు. కానీ, ఇప్పుడు ప్రజలకు రూ.2.5 లక్ష కోట్లు కోసం ఆదా చేశామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఖర్గే దుయ్యబట్టారు.జీఎస్టీ సంస్కరణల విషయంలో మొత్తం క్రెడిట్ కొట్టేయడానికి ప్రధాని మోదీ ఆరాటపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. నిజానికి జీఎస్టీలో ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలు ఏమాత్రం సరిపోవని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలన్న డిమాండ్‌ను కేంద్రం విస్మరించిందని ఆక్షేపించారు. జీఎస్టీ 2.0 తీసుకురావాలని తాము 2017 జూలై నుంచే డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. జీఎస్టీలో సంస్కరణలను మరింత విస్తరింపజేయాలని కేంద్రానికి సూచించారు. -
H1B ఎఫెక్ట్.. బలహీన ప్రధాని అంటూ మోదీపై విమర్శలు
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల వార్షిక ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచినా మౌనంగా ఉండిపోయిన ప్రధాని మోదీ నిజంగానే బలహీన ప్రధాని అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్ తమ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాల్లో పోస్ట్‌లు పెట్టారు.‘నేను మరోసారి చెబుతున్నా. భారత్‌కు ఉన్నది కేవలం బలహీన ప్రధాని మాత్రమే’ అని రాహుల్ విమర్శించారు. ‘మోదీజీ.. పుట్టినరోజు నాడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ట్రంప్ నుంచి మీకు ఫోన్‌కాల్ వచ్చింది. కానీ రిటర్న్ గిఫ్ట్‌గా లక్ష డాలర్ల రుసుం భారం భారతీయులపై పడింది’ అని ఖర్గే అన్నారు. ‘‘నాడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తరఫున పాల్గొని ‘మరోసారి ట్రంప్ సర్కార్’ అని మీరే నినదించారు. అందుకే రిటర్న్ గిఫ్ట్‌గా లక్షడాలర్ల వార్షిక ఫీజు భారం భారతీయ టెక్ ఉద్యోగులపై పడింది. ఇప్పటికే 50 శాతం టారిఫ్ పడుతోంది. దీంతో 10 కీలక రంగాల్లో భారత్ రూ.2.17 లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోతోంది. ఇవి చాలవన్నట్లు భారత్‌పై 100 శాతం టారిఫ్ మోపాలని ఐరోపా సమాఖ్యను ట్రంప్ ఉసిగొల్పుతున్నారు.విదేశీ అగ్రనేతలు కనబడగానే గట్టిగా ఆలింగనాలు చేసుకోవడం, ప్రాసలు వినిపించేలా నినాదాలు ఇవ్వడం, పెద్ద సభలు ఏర్పాటుచేయడం, ఆ సభల్లో మోదీ, మోదీ అని బిగ్గరగా నినా దాలు ఇప్పించుకోవడం సరైన విదేశాంగ విధానం అనిపించుకోదు’ అని మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘భారతీయ ప్రతిభావంతులు, అత్యున్నత నైపుణ్యాలున్న సిబ్బంది భవిష్యత్తును అమెరికా ప్రభుత్వం నాశనం చేస్తోంది. ఇంతటి రుసుముల భారం మోపినా మోదీ మౌనంగా ఉండటం ఆయన బలహీనతను రుజువుచేస్తోంది’అని గౌరవ్ గొగోయ్ అన్నారు. ‘నేరుగా చర్చల వేళ హెచ్–1బీ వీసాల విషయంలో నాటి ట్రంప్ ప్రభుత్వం ఆనాడు మోదీకి ఎలాంటి హామీ ఇవ్వలేదని 2017లోనే రాహుల్‌గాంధీ బయటపెట్టారు. ఇప్పుడు అది నిజమని నిరూపితమైంది’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా అన్నారు. -
ఐదు గంటల హడావుడి: ఖర్గే
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఐదు గంటలు కూడా ఆయన మణిపూర్ ప్రజలతో గడపలేకపోయారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వర్గవైషమ్యాలతో రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న వారిని ఈ పర్యటనతో మోదీ ఘోరంగా అవమానించారన్నారు. మోదీ పర్యటనను ఆయన పిట్ స్టాప్‌గా అభివరి్ణంచారు. ‘రెండేళ్లకుపైగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో సుమారు 300 మంది చనిపోగా, 1,500 మంది గాయపడ్డారు. మరో 67 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి కూడా చూడని ప్రధాని మోదీ ఇప్పుడు హడావుడిగా ఇంఫాల్ నుంచి చురాచాంద్‌పూర్ వరకు రోడ్ షో చేపట్టడమేంటి?’అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయ శిబిరాల్లోని ప్రజల మొర ఆలకించకుండా పిరికితనంతో తప్పించుకోవడానికే మోదీ షో చేపట్టారని ఎక్స్‌లో ఖర్గే వ్యాఖ్యానించారు. పర్యటనకు వెళ్లిన మోదీ ఘనమైన స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేయించుకోవడం బాధితుల గాయాలను మరింతగా పెంచడమేనన్నారు. ఇలాంటి చర్యలతో మోదీలో పశ్చాత్తాపం గానీ, అపరాధ భావన కానీ లేవని వెల్లడవుతోందన్నారు. మణిపూర్‌లో అశాంతి కొనసాగుతున్న గత 864 రోజుల సమయంలో 46 విదేశీ పర్యటనలు చేసిన మోదీకి, మన పౌరులతో రెండు సానుభూతి మాటలు పంచుకునే తీరికే దొరకలేదా అని ప్రశ్నించారు. మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అసమర్థత బయటపడిందన్నారు. దీన్నుంచి తప్పించుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని ఖర్గే ఆరోపించారు. మీ రాజ్యధర్మం ఎక్కడికి పోయిందంటూ 2002లో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖర్గే ప్రస్తావించారు. ఇలా ఉండగా, 28 నెలలుగా ఎదురుచూస్తున్న మణిపూర్ ప్రజలతో ప్రధాని మోదీ కనీసం ఐదు గంటలైనా గడపలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ప్రచారానికి, విదేశాల్లో పర్యటనలకు ఉన్న సమయం ప్రజల మధ్య గడిపేందుకు ఆయనకు దొరకలేదా అని నిలదీశారు. -
మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్) రాయని డైరీ
తెలిసిన పదాలకే అర్థాలు వెతుక్కుంటున్నాను నేను! రాహుల్ గురించి నాకేం తెలియదని?!ఆయన నాతో ఒక్క నవ్వును మించి ఎక్కువ మాట్లాడరు. ఆ నవ్వుకు ‘‘నమస్తే ఖర్గేజీ’’ అని అర్థం; ఎక్కడికి వెళుతున్నదీ చెప్పరు.‘‘నా కోసం చూడకండి’’ అని అర్థం; ఎందుకు వెళుతున్నదీ చెప్పరు. ‘‘ఎక్కువగా ఆలోచించ కండి’’ అని అర్థం; ఎప్పుడు వచ్చేదీ చెప్పరు. ‘‘రావాలని నాకూ ఉంటుంది’’ అని అర్థం;ఏం చేయబోయేది చెప్పరు. ‘‘నాకైనా ఎలా తెలుస్తుంది?’’ అని అర్థం; ఎవరి గురించి,ఏం మాట్లాడబోయేదీ చెప్పరు. ‘‘మాటలు మనకు చెప్పి వస్తాయా ఖర్గేజీ?!’’ అని అర్థం.రాహుల్ మళ్లీ ఇవాళ కొన్ని గంటలుగా కనిపించటం లేదు! ఆయన కనిపించక పోవటానికి – కనిపించకపోవటానికి మధ్య ఆయన కనిపించే నిడివి ఈ మధ్య కాస్త ఎక్కువగా తగ్గుతున్నట్లు నాకు అనిపిస్తోంది!‘‘మీకేమైనా సమాచారం ఉందా వేణుగోపాల్?’’ అని అడిగాను. పార్టీ ఆఫీస్‌లో నేను, వేణుగోపాల్ మాత్రమే ఉన్నాం. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఆయన. ‘మీకు తెలియకుండా నాకు తెలుస్తుందా ఖర్గేజీ!’ అన్నట్లుగా... నిస్సహాయంగా నా వైపు చూశారు వేణుగోపాల్. ఆయన్నిక ఎక్కువ సంఘర్షణకు గురి చేయదలచుకోలేదు నేను. ‘‘సరే! తాళం వేసుకుని మీరు వెళ్లండి’’ అని పైకి లేచాను. నాతో పాటే వేణుగోపాల్ కూడా పైకి లేచి, ‘‘ఖర్గేజీ! మీతో ఒక మాట’’ అన్నారు!!‘చెప్పండి వేణు...’’ అన్నాను.‘‘ఖర్గేజీ! మీరీ మధ్య ఒకే మాటను రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారు. లేదా, మీరు మాట్లాడుతున్న ఒకే మాట రెండు అర్థాలు వచ్చేలా ఉంటోంది...’’ అన్నారు వేణుగోపాల్.‘‘ఏమిటా ‘ఒక మాట – రెండర్థాలు’ వేణుగోపాల్?!’’ అన్నాను. ‘‘ఖర్గేజీ! జునాగఢ్‌లో మీరు – ‘‘మొత్తం పెట్టె కుళ్లిపోక ముందే, చెడిపోయిన మామిడిపండ్లను తొలగించాలి...’’ అని అన్నారు.వెంటనే టీవీ ఛానెళ్ల వాళ్లు, ‘కాంగ్రెస్‌లో ఎవరా చెడిపోయిన మామిడి పండ్లు?!’ అని డిబేట్ మొదలు పెట్టేశారు. ఇప్పుడేమో, ‘తాళం వేసుకుని మీరు వెళ్లండి’ అని నాతో అన్నారు. అదృష్టవశాత్తూ ఇది టీవీ వాళ్లకు తెలిసే అవకాశం లేదు కనుక – ‘తాళం వేయమంటే ఏమిటర్థం? పార్టీ ఆఫీస్‌కు తాళం వేసేద్దాం అనేనా ఖర్గే అంటున్నది...’ అని డిబేట్ పెట్టే ప్రమాదం తప్పిపోయింది...’’ అన్నారు వేణు!‘‘నిజమే కానీ వేణుగోపాల్, ఒక మాటను పది మంది పది రకాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పి, ఆ పది మందికీ ఒకే రకంగా అర్థం అయ్యేలా మాట్లాడాలంటే... ఒక్క మౌనంతో మాత్రమే కదా అది సాధ్యం అవుతుంది?’’ అన్నాను. అలా అంటున్నప్పుడు నాకు రాహుల్ గుర్తొచ్చారు. బహుశా అందుకేనా రాహుల్ నాతో గానీ, పార్టీలో మరొకరితో కానీ తక్కువ మాట్లాడి, ఎక్కువ మౌనంగా ఉంటారు?! ‘‘సీఆర్పీఎఫ్ వాళ్లు లెటర్ పంపించారు వేణుగోపాల్. సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేయకుండా రాహుల్ బయట తిరుగు తున్నారని కంప్లైంట్. ఈ తొమ్మిది నెలల్లోనే ఇటలీ, వియత్నాం, ఖతార్, లండన్, దుబాయ్ మలేసియా ట్రిప్పులు వేశారట! ‘హై రిస్క్ కేటగిరీలో ఉన్న వీఐపీలు ప్రోటోకాల్‌ని వయలేట్ చేస్తే ఎలా?’ అంటున్నారు’’ అన్నాను.వేణుగోపాల్ మౌనంగా ఉన్నారు! బహుశా అది, వివేచనతో కూడిన మౌనం కావచ్చు. ‘‘మీరు వెళ్లండి వేణుగోపాల్! నేను కాసేపు ఉండి వస్తాను‘ అన్నాను, తిరిగి కూర్చుంటూ. ఆయన వెళ్లిపోయారు. నా చేతిలో సీఆర్పీఎఫ్ వాళ్లు పంపిన లెటర్ ఉంది. ‘‘మీ అబ్బాయి మాట వినటం లేదు’’ అని స్కూల్ హెడ్ మాస్టర్, పేరెంట్స్‌కి లెటర్ రాయగలరు. ‘‘మా అబ్బాయి మాట వినటం లేదు...’’ అని పేరెంట్స్ ఎవరికి లెటర్ రాయగలరు?! రాహుల్ సీఆర్పీఎఫ్కే కాదు, సీడబ్ల్యూసీకీ చెప్పి వెళ్లటం లేదని నేనెవరితో చెప్పుకోగలను?! ఎవరికి లెటర్ రాయగలను? -
ఓట్ల దొంగలకు... ఈసీయే కవచం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఓట్ల దొంగలను స్వయానా కేంద్ర ఎన్నికల సంఘమే కాపాడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేళ్లుగా ఓటు చోరులను కాపాడే బ్యాక్ ఆఫీస్‌లాగా ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన సంస్థ ఓట్ల దొంగలకు రక్షణ కవచంలా మారిందని నిప్పులు చెరిగారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గ ఓటర్ ఫ్రాడ్ కేసులో ఈసీ వైఖరిని ఆయన నిలదీశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఖర్గే పోస్టు చేశారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓటర్ ఫ్రాడ్ కేసులో ఎన్నికల సంఘం వైఖరిని ఆయన తప్పుపట్టారు. కీలకమైన ఆధారాలను దాచిపెట్టారని విమర్శించారు. 2023లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓటర్ల పేర్లు తొలగించేందుకు నకిలీ ఫామ్–7 దరఖాస్తులు వాడినట్లు కాంగ్రెస్ బహిర్గతం చేసింది. దీనిపై కేసు నమోదు కాగా, దర్యాప్తులో 5,994 నకిలీ అప్లికేషన్లు బయటపడ్డాయి. ఇది చిన్న తప్పిదం కాదని, ఓటు హక్కును దోచుకోవడానికి పన్నిన పెద్ద కుట్ర అని ఖర్గే ధ్వజమెత్తారు. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశాలు ఇచి్చంది. తొలుత ఎన్నికల సంఘం కొన్ని పత్రాలు సమరి్పంచినప్పటికీ ఇప్పుడు మాత్రం కీలక ఆధారాలను ఇవ్వకుండా వెనక్కి తగ్గిందని ఖర్గే ఆరోపించారు. ‘‘ఈసీ ఎందుకు వెనక్కి తగ్గింది? నకిలీ వోటర్ల వెనుక ఉన్న వారిని కాపాడేందుకేనా?’’ అని నిలదీశారు. బీజేపీ ఓటు చోరీ డిపార్టుమెంట్ అంటూ ఈసీని అభివర్ణించారు. సీఐడీ దర్యాప్తును నీరుగార్చడానికి బీజేపీ ఆదేశాల మేరకు ఈసీ పని చేస్తోందన్నారు. ఓటు హక్కు అంటే ప్రజాస్వామ్యానికి మూలం అని స్పష్టం చేశారు. ఆ హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘమే ఓట్ల దొంగలతో చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన సంస్థే బలహీనపరుస్తోందని ఆక్షేపించారు. దేశానికి శత్రువు మోదీ ప్రధాని నరేంద్ర మోదీ మన దేశానికి శత్రువుగా మారారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోదీ మంచి స్నేహితులే అయినప్పటికీ ఆ స్నేహం వల్ల భారత్‌కు నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదన్నారు. ఆదివారం కర్ణాటకలోని కలబుర్గిలో ఖర్గే మీడియాతో మాట్లాడారు. భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లను ప్రస్తావించారు. దీనివల్ల మన ప్రజలకు భారీ నష్టం జరుగుతుందన్నారు. ట్రంప్‌తో స్నేహం సంగతి పక్కనపెట్టి దేశ ప్రయోజనాలను కాపాడే విషయం ఆలోచించాలని మోదీకి హితవు పలికారు. దేశమే ప్రథమం, ఆ తర్వాతే స్నేహం అని తేలి్చచెప్పారు. జీఎస్టీలో సంస్కరణలతో నిజంగా పేదలకు మేలు జరిగితే స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు. నేడు విపక్ష ఎంపీలకు ఖర్గే విందు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై సోమవారం విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలకు అవగాహన కల్పించనున్నారు. పార్లమెంట్ పాత భవనంలోని సెంట్రల్ హాల్లో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలకు మల్లికార్జున ఖర్గే సోమవారం రాత్రి విందు ఇవ్వబోతున్నారు. -
ఖర్గేను ఎందుకు కలిసానంటే..? ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి క్లారిటీ
-
‘నేను వందకు వంద శాతం వైఎస్ జగన్ మనిషిని’
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను తాను కలవడంపై వస్తున్న విమర్శలపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్‌రెడ్డి స్పందించారు. తాను మల్లికార్జున ఖర్గేను కలవడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, మర్యాద పూర్వకంగా మాత్రమే ఆయన్ను కలిశానని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు 22వ తేదీ) ‘సాక్షి’తో మాట్లాడిన ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి.. ‘ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిశాను. ఆయన్ను కలవడం వెనుక రాజకీయ ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు. 35 ఏళ్లుగా మల్లికార్జున ఖర్గే నాకు సన్నిహితుడు. కర్ణాటక హోం మంత్రిగా ఖర్గే పనిచేసిన దగ్గర్నుంచీ ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది. సన్నిహితుడు కాబట్టే మర్యాదపూర్వకంగా మాత్రమే ఖర్గేను కలిశాను. రాజకీయాల్లో ఉన్నంత వరకూ మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్‌తోనే నడుచుకుంటాను. నేను వందకు వంద శాతం వైఎస్ జగన్ మనిషిని. ఎల్లో మీడియా కావాలని నాపై ఉద్దేశపూర్వక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుంది
న్యూఢిల్లీ: వెలుగులోకి వస్తున్న ఎన్నికల అక్రమాలను చూస్తే అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని అర్థమవుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జెండా ఎగురవేసిన అనంతరం నాయకులు, శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. జోరున వర్షం కురుస్తుండగానే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్యనేతలు జెండా వందనం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ..బిహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) పేరుతో బతికున్న వారిని సైతం చనిపోయినట్లుగా ధ్రువీకరించడం ద్వారా ప్రతిపక్షాలకు పడే ఓట్లను తొలగించారని ఆరోపించారు. తొలగింపునకు గురైన 65 లక్షల ఓట్లకు సంబంధించి బీజేపీ ఒక్క అభ్యంతరం కూడా వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఎస్ఐఆర్తో లాభం కలిగేది బీజేపీకి మాత్రమేనని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇలాంటి అక్రమాలు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఏ ప్రాతిపదికన ఓట్లను రద్దు చేసిందో తెలిపేందుకు ఈసీ సైతం సిద్ధంగా లేదని ఆరోపించారు. అధికారంలో కొనసాగేందుకు ఆ పార్టీ ఎంత అనైతికతకయినా సిద్ధమవుతోందని దీంతో స్పష్టమవుతోందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందే తప్ప, ఎన్నికల్లో విజయం కోసం కాదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు విభాగాలైన ఈడీ, సీబీఐలతోపాటు ఆదాయపన్ను శాఖను సైతం బీజేపీ సర్కార్ బాహాటంగా దుర్వినియోగం చేస్తోన్న విషయాన్ని ప్రత్యక్షంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన అన్నారు. అలీన విధానం ద్వారా కూడగట్టుకున్న ప్రతిçష్టను బీజేపీ సర్కార్ హయాంలో మన దేశం కోల్పోవాల్సి వచ్చిందని ఖర్గే విమర్శించారు.వర్షంలో తడుస్తూ రాహుల్ జెండా వందనంఇందిరా భవన్ ప్రాంగణంలో పార్టీ చీఫ్ ఖర్గే జెండా ఎగురవేస్తుండగా ఆయన పక్కనే అగ్రనేత రాహుల్ గాంధీ వర్షంలో మిగతా వారితో కలిసి తడుస్తూనే నిలబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో షేర్ చేసింది. ‘ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. వీటి పరిరక్షణ కోసం ఇకపైనా పోరాడుతాం’అని ఆ పార్టీ పేర్కొంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
‘ఎలక్షన్ చోరీ ఆయోగ్’
న్యూఢిల్లీ: ఓట్ల చోరీపై విపక్ష కాంగ్రెస్ పార్టీ తమ పోరాటం ఉధృతం చేస్తోంది. పోలింగ్ బూత్‌లో ఒకరి బదులు ఇంకొకరు ఓటు ఎలా వేస్తున్నారో వివరిస్తూ ఒక వీడియోను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ‘మీ ఓటు చోరీ, మీ అధికారం చోరీ, మీ గుర్తింపు చోరీ’ అనే శీర్షికతో సోషల్ మీడియాలో చేశారు. ఓటర్ల జాబితాలో గోల్‌మాల్‌పై ప్రజలంతా గొంతు విప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాలని చెప్పారు. వీడియోలో ఏముంది?కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోలో ఆసక్తిక రమైన సన్నివేశం కనిపిస్తోంది. ఇందులో ఓ కుటుంబం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబానికి తారసపడతారు. మీ ఓట్లు మేమే వేశాం, ఇక మీరు వెళ్లిపోవచ్చు అని చెప్తారు. దొంగ ఓట్లు వేసిన ఆ ఇద్దరు వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల అధికారికి బొటన వేలు పైకెత్తి విజయం చిహ్నం చూపిస్తారు. ఆ అధికారి టేబుల్‌పై ‘ఎలక్షన్ చోరీ ఆయోగ్’ అనే నేమ్‌బోర్డు ప్రత్యక్షం అవుతుంది. నేడు దేశవ్యాప్తంగా ర్యాలీలు: ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం భారీ ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. -
ఓట్ల చోరీపై పోరుబాట
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)తోపాటు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, ఓట్ల చోరీ, గత లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌పై విపక్ష ‘ఇండియా’ కూటమి పోరుబాట పట్టింది. ఓట్ల చోరీని వెంటనే ఆపాలని, ‘ఒక్కరికి ఒక ఓటు’ అనే విధానాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు సోమవారం దేశ రాజధానిలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తెల్లటోపీలు ధరించి పార్లమెంట్ మకరద్వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి బయలుదేరిన ‘ఇండియా’ కూటమి ఎంపీలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీకి అనుమతి లేదంటూ పీటీఐ భవనం ఎదుట పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను పక్కకు తొలగించేందుకు ఎంపీలు ప్రయత్నించారు. కేవలం 30 మందిని అనుమతిస్తామని పోలీసులు చెప్పగా, ఎంపీలు అంగీకరించలేదు. ఎన్నికల సంఘానికి విజ్ఞాపన పత్రం అందజేయడానికి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. కొందరు రోడ్డుపై బైఠాయించి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చయడం ఆపాలన్నారు. మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, సాగరికా ఘోష్, సుస్మితా దేవ్, సంజనా జాతవ్, జోతిమణితోపాటు సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు అఖిలేష్ యాదవ్ బారీకేడ్లపైకి ఎక్కారు. ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు చెరిగారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళం మధ్య మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, మితాలీ బేగ్ స్పృహ తప్పిపడిపోగా, రాహుల్ గాంధీ వారికి సపర్యలు చేశారు. తర్వాత పోలీసులు నిరసనకారులను బస్సుల్లోకి ఎక్కించి, పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రెండు గంటల తర్వాత వారందరినీ విడుదల చేశారు. రాజకీయ పోరాటం కాదు: రాహుల్ ఇది రాజకీయ పోరాటం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పోరాటం ప్రారంభించామని స్పష్టంచేశారు. నిరసన ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్ట ప్రకారం ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు. అక్రమాలు, అవకతవకలకు తావులేని స్వచ్ఛమైన, స్పష్టమైన ఓటర్ల జాబితా కోసం ఉద్యమిస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఎన్నికల సంఘం దీనిపై స్పందించడం లేదని నిలదీశారు. గత ఎన్నికల్లో దేశమంతటా జరిగిన రిగ్గింగ్‌పై త్వరలో బాంబు పేలుస్తానని రాహుల్ మరోసారి వెల్లడించారు. ఎన్నికల సంఘం కోరుతున్నట్లుగా సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని విశ్లేíÙంచి, ఓట్ల చోరీని బయటపెట్టానని, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. అది తాను సృష్టించిన డేటా కాదని స్పష్టంచేశారు.బీజేపీ కుట్రలను అడ్డుకుంటాం: ఖర్గే ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఓట్ల చోరీని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఎస్ఐఆర్ పేరిట ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలను కచి్చతంగా అడ్డుకుంటామని అన్నారు. ఈ మేరకు ఖర్గే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశంలో బీజేపీ నిరంకుశత్వం చెల్లదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సాక్షాత్తూ పార్లమెంట్ ఎదుటే ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎంపీలను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తమ డిమాండ్లపై ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం దొంగతనం చేసే సంఘంగా మారొద్దని జైరాం రామేశ్ హితవు పలికారు. నిరసన ర్యాలీలో శరద్ పవార్(ఎన్సీపీ–ఎస్పీ), టి.ఆర్.బాలు(డీఎంకే), సంజయ్ రౌత్(శివసేన–ఉద్ధవ్), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ)తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, నిరసన ర్యాలీ కోసం ఎవరూ అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారీకేడ్ దాటేసిన అఖిలేశ్ నిరసన ర్యాలీలో తమను అడ్డుకున్న పోలీసులపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బారీకేడ్లను తోసుకొని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. బారీకేడ్ ఎక్కి అవతలికి దూకేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రజా ఉద్యమంలా మారింది: రాహుల్న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారం ఉధృతమై ప్రజా ఉద్యమంలా మారిందని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి మద్దతుగా 15 లక్షల సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, 10 లక్షల వరకు మిస్డ్ కాల్స్ వచ్చాయన్నారు. -
‘సబ్ కా సాత్’ అంతా డొల్ల
సాక్షి, న్యూఢిల్లీ: ‘సబ్ కా సాత్ సబ్కా వికాస్’అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా డొల్ల అని, అణగారిన వర్గాల రిజర్వేషన్ల కోసమే తమ పోరాటమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. న్యాయం ఆలస్యం కావడమంటే, దాన్ని నిరాకరించడమేనని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరుతూ బుధవారం జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ ధర్నా పురస్కరించుకుని వారు ‘ఎక్స్’లో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం తెలంగాణ సర్కారు కృషి: ఖర్గే ‘విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్ హక్కు కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఆమోదించింది. కానీ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో.. రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో మహాధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కుల సర్వే అనంతరం సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసే చర్య మా ప్రభుత్వం తీసుకుంది. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా డొల్ల. ఎందుకంటే ఈ బిల్లులకు, అణగారిన వర్గాల హక్కులకు మోదీయే అడ్డుగోడగా ఉన్నారు..’అని ఖర్గే ధ్వజమెత్తారు. అణగారిన వర్గాల కోసమే ఈ పోరాటం: రాహుల్ గాంధీ ‘తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేశా యి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలని వారు డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం దిశగా ఈ బిల్లు ఒక పెద్ద ముందడుగు. మద్దతు ఇచ్చిన ‘ఇండియా’నేతలకు నా కృతజ్ఞతలు. రాష్ట్రపతి దీనిని గుర్తించి ఆమోదిస్తారని ఆశిస్తున్నా. ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసం మాత్రమే కాదు. దేశంలోని అణగారిన వర్గాలకు అధికారం, హక్కుల కోసం జరుపుతున్న సమిష్టి పోరాటం.’. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. చరిత్రాత్మక బిల్లు ‘తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక బిల్లు ఆమోదించింది. అయితే ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడే ఆగిపోయింది. ఇందుకు నిరసనగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. రాష్ట్రపతి తక్షణమే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం తెలంగాణ పోరాటమే కాదు. అణగారిన వర్గాలకు న్యాయం, సమానత్వం, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కోసం జాతి యావత్తు చేస్తున్న ఆందోళన. న్యాయాన్ని ఆలస్యం చేయడమంటే, దాన్ని తిరస్కరించడమే..’అని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. -
ఢిల్లీలో కొనసాగుతున్న టీపీసీసీ ధర్నా.. పలువురు ఎంపీల మద్దతు
Congress Delhi dharna Updates..కొనసాగుతున్న కాంగ్రెస్ ధర్నా..బీసీ రిజర్వేషన్ల సాధనకు దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదీక్షకు సంఘీభావం తెలిపేందుకు హాజరైన కాంగ్రెస్ ఎంపీలుఎంపీలు గౌరవ్ గొగోయ్, జ్యోతిమణి సెన్నిమలై, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ, శివసేన, ఎన్సీపీ ఎంపీల మద్దతు👉ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ ధర్నా సభా స్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిCongress Protest for 42% BC Quota at Jantar Mantar pic.twitter.com/9bh91VwPcQ— Naveena (@TheNaveena) August 6, 2025ఎమ్మెల్సీ విజయ శాంతి కామెంట్స్..బీసీ రిజర్వేషన్లు అడిగితే మమ్మల్ని ఢిల్లీ నడి రోడ్డు మీద నిలబెట్టింది బీజేపీ.బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము వదలము.ఈరోజు దేశం ఇంత అభివృద్ధిలో ముందు ఉందని అంటే కారణం ఎస్సీ, ఎస్టీ, బీసీలే..బీసీ బిల్లులో న్యాయపరమైన చిక్కులు ఉంటే EWS బిల్లు ఎలా అమలు అయ్యింది..బీసీలు తయారు చేసిన కుర్చీలో మీరు కూర్చున్నారు.కానీ మీరు బీసీలకు మాత్రం న్యాయం చేయడం లేదు.42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.కొండా సురేఖ కామెంట్స్..42శాతం రిజర్వేషన్లలో ముస్లింలు ఉంటే తప్పేంటి అని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడుగుతున్నానుముస్లింలు మనుషులు కాదా?వారికి ఒటుహక్కు లేదా?రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళ, వితంతువు కాబట్టి ఆమెను పార్లమెంట్ ప్రారంభోత్సవానికి మోదీ పిలవలేదు.రాష్ట్రపతి తెలంగాణ బిల్లును ఆమోదిస్తుందనే నమ్మకం నాకు లేదు. LIVE : ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా https://t.co/R7xbpWWxBK— Telangana Congress (@INCTelangana) August 6, 2025 కనిమొళి కామెంట్స్..జంతర్ మంతర్‌లో కాంగ్రెస్ ధర్నాకు హాజరై మద్దతు పలికిన డీఎంకే ఎంపీ కనిమొళి50 శాతం న్యాయం కాదు.. సంపూర్ణ న్యాయం చేయాలి #WATCH | Delhi: On Congress workers holding a protest at Jantar Mantar over the 42% OBC reservation in Telangana state local bodies, DMK MP Kanimozhi says, "Tamil Nadu has 69% reservation. We stand in support to make centuries-old wrong into right. We stand with the Telangana… pic.twitter.com/QHWSCYJNc9— ANI (@ANI) August 6, 2025 కాసేపట్లో ధర్నా ప్రారంభం..కాసేపట్లో జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా ప్రారంభం కానుంది.తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తూ భారీ ధర్నాతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా.టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ధర్నా నిర్వహించనున్నారు.ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు.సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ గారు విచ్చేసి ప్రసంగిస్తారు.తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, జిల్లా స్థాయి ప్రముఖ నేతలు, బీసీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమం ద్వారా బీసీల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పోరాట పటిమను మరోసారి నిరూపించబోతుంది.👉తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించనుంది.Massive protest at Delhi’s Jantar Mantar today demanding 42% BC reservations. Led by CM @revanth_anumula & TPCC chief Mahesh Kumar Goud, joined by ministers, MPs & BC leaders the protest will be innugarted by AICC president #MallikarjunKharge @kharge at 11 AM, LoP #RahulGandhi… pic.twitter.com/EolP9x0AxK— Ashish (@KP_Aashish) August 6, 2025👉జంతర్ మంతర్ వద్ద ధర్నాలో 200 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. 1,500 మందికి పైగా కూర్చునేలా కుర్చీలు వేశారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్‌మంతర్‌కు వెళ్లే దారిలో ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు.👉మహాధర్నాలో పాల్గొనే దాదాపు వెయ్యి మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సోమవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంది. వీరికి స్థానిక వైఎంసీఏతో పాటు పలు హోటళ్లలో వసతి కల్పించారు. వీరితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు సుమారు 500 మంది వరకు విమానాల్లో ఢిల్లీకి వచ్చారు. వీరందిరికీ ఎంపీల అధికారిక నివాస గృహాలు, వెస్ట్రన్ కోర్ట్‌లో వసతిని ఏర్పాటు చేశారు. -
ఎస్ఐఆర్పై చర్చించాల్సిందే
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు ఎంతకీ పట్టువీడడం లేదు. గత నెల 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అంశంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వెంటనే చర్చించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సైతం పార్లమెంట్లో అలజడి సృష్టించాయి. ఈ ప్రక్రియపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని నివృత్తి చేయాలని విపక్ష ఎంపీలు తేల్చిచెప్పారు. నిరసనలు, నినాదాలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. లోక్‌సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నినాదాల హోరు లోక్‌సభలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ సహా ముగ్గురు దివంగత సభ్యులకు నివాళులరి్పంచారు. అనంతరం విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఎస్ఐఆర్పై చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. ఇంతలో స్పీక ర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అయినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు. సభకు సహకరించాలని కోరారు.విపక్ష ఎంపీలు వినిపించుకోకపోవడంతో సభను మ« ద్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్షాలు శాంతించకపోవడంతో సభను బుధవారానికి వాయి దా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. అంతకుముందు గోవా అసెంబ్లీలో ఎస్టీలకు రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాజ్యసభలోనూ రగడ యథాతథంగా కొనసాగించింది.ఎస్ఐఆర్పై చర్చకు రూల్ 267 కింద విపక్షాలు 34 వాయిదా తీర్మానం నోటీసులు ఇవ్వగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. వెంటనే చర్చ ప్రారంభించాలన్న విపక్షాల డిమాండ్ పట్ల సభాపతి సానుకూలంగా స్పందించలేదు. కాంగ్రెస్ సహా ఇతర పారీ్టల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో సభ తొలుత రెండుసార్లు.. చివరకు బుధవారానికి వాయిదా పడింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ తీర్మానం లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందగా, రాజ్యసభలో మంగళవారం ఆమోదించారు. అలాగే కస్టమ్స్ టారిఫ్ యాక్ట్–1975లోని రెండో షెడ్యూల్‌ను సవరిస్తూ మరో తీర్మానాన్ని రాజ్యసభలో ఆమోదించారు. మేము ఉగ్రవాదులమా?: ఖర్గే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీరుపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. గతవారం తనకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడం సరైంది కాదని అన్నారు. గతవారం రాజ్యసభ వెల్‌లో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా, సీఐఎస్ఎఫ్ జవాన్లు రంగంలోకి దిగి వారిని బటయకు తీసుకెళ్లారు. రాజ్యసభలోకి పారామిలటరీ సిబ్బంది రావడం పట్ల ఖర్గే మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా విపక్షాలు గొంతు నొక్కేస్తున్నారని, ప్రజాస్వామ్య హక్కును అణచివేస్తున్నారని ఆరోపించారు.సభలో పారామిలటరీ దళాన్ని అనుమతించకూడదని కోరుతూ హరివంశ్‌కు లేఖ రాశారు. అనంతరం ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే, డిప్యూటీ చైర్మన్‌కు రాసిన లేఖ సభాహక్కుల పరిధిలోకి వస్తుందని, దాన్ని బయటపెట్టడం ఏమిటని హరివంశ్ ప్రశ్నించారు. పార్లమెంట్లో పారామిలటరీ సిబ్బంది సేవలు ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదన్నారు. ఖర్గే స్పందిస్తూ.. తాము ప్రజాస్వామ్య విధానంలో నిరసన తెలిపామని, ఇకపై కూడా నిరసన కొనసాగిస్తామని బదులిచ్చారు. సభలో సీఐఎస్ఎఫ్ జవాన్లు అడ్డుకున్నారని, మేము ఉగ్రవాదులమా? అని ప్రశ్నించారు. డిప్యూటీ చైర్మన్‌కు రాసిన లేఖపై ప్రెస్‌నోట్ మాత్రమే మీడియాకు విడుదల చేశానని పేర్కొన్నారు. సభ్యులందరి కోసమే ఈ పని చేశానన్నారు.పోలీసులను, సైన్యాన్ని తీసుకొచ్చి సభను నడిపిస్తారా? అని నిలదీశారు. ఖర్గే వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతవారం మార్షల్స్ మాత్రమే లోపలికి వచ్చారని, పారామిలటరీ సిబ్బంది రాలేదని స్పష్టంచేశారు. సభలో తప్పుడు ఆరోపణలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడుతూ.. తాను గతంలో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నానని, ప్రభావవంతమైన ప్రతిపక్షంగా ఎలా పని చేయాలో నేర్చుకోవాలంటే తన వద్దకు ట్యూషన్‌కు రావాలని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. -
ఆయన చేతిలో తోలుబొమ్మ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శల వర్షం కురిపించారు. బిహార్‌లో బీజేపీ కూటమికి అనుకూలంగా ఓటర్ల జాబితాను మార్చేందుకు ప్రధాని మోదీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని దురి్వనియోగం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ‘‘రాజ్యాంగం ఎదుర్కొంటున్న పెను సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు’’సదస్సులో ప్రసంగిస్తూ ‘‘భారతరాజ్యాంగం అనేది కేవలం చట్టపరమైన పత్రం కాదు. అది మన ప్రజాస్వామ్య ఆత్మ. ప్రతి భారతీయుడికి రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రసాదించింది. అలాంటి రాజ్యాంగం ఇప్పుడు మోదీ సర్కార్ ఏలుబడిలో ప్రమాదంలో పడింది. రాజ్యాంగంలో సవరణలు చేయాలన్న దుస్సాహసానాకి నేటి పాలకులు తెగిస్తున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే ఖచ్చితంగా రాజ్యాంగంలో బీజేపీ పెను మార్పులు చేసేది. కానీ ప్రజాశీస్సులు లేని ఎన్డీఏ కూటమికి అన్ని సీట్లు రాలేదు. ఓటర్లు 400సీట్లు అని పాటపాడి వారి చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘనత అంతా కాంగ్రెస్ నేత రాహుల్గాందీకే దక్కుతుంది. రాజ్యాంగంలో మార్పులు చేస్తామన్న ఎన్డీఏ సర్కార్‌కు ఎదురునిలిచి నెలలతరబడి పోరాటంచేశారు. ప్రతి సమావేశంలో రాజ్యంగ ప్రతిని చేతబూని రాజ్యాంగ గొప్పదనాన్ని మరోసారి గుర్తుచేశారు’’అని ఖర్గే అన్నారు. ఏకంగా 65 లక్షల ఓట్లు ఎలా తీసేస్తారు? ‘‘బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) వేళ 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు దరఖాస్తును మరోసారి సమర్పించంత మాత్రాన అంత మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి ఈసీ ఎలా తొలగిస్తుంది?. పేదలు, అణగారిన వర్గాలకు చెందిన ఈ ఓటర్ల ఓటు హక్కులను ఈసీ ఉద్దేశపూర్వకంగా లాగేసుకుంటోంది. బీజేపీ పాలనతో విసిగిపోయిన కాంగ్రెస్‌కు ఓటేస్తే తమ జీవితాలు బాగుపడతాయని కోరుకుంటున్న ఓటర్ల ఓట్లను తొలగించాలన్న కుట్ర జరుగుతోంది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల వేళ ఓటర్ల జాబితాలో ‘మార్పులు’జరుగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల వేళ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలా ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు జరిగాయనేదానిపై ఇప్పుడు కాంగ్రెస్ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. ఒక్క గదిలో 9 ఓట్లు, ఒకే హాస్టల్లో 9,000 ఓట్లు ఎలా ఉంటాయి? ఇలాంటి అక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి. ఇది కేంద్ర ఎన్నికల సంఘమా? లేదంటే మోదీ చేతిలో కీలుబొమ్మనా?’’అని ఖర్గే ప్రశ్నించారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలు, దళితులను వివక్షకు గురిచేయడం నిత్యకృత్యమైంది. ఎన్నికల వేళ కేవలం ఒక పక్షానికి అనుకూలంగా ప్రధాని ప్రకటనలు చేస్తూ భారత్‌లో ఏకధృవ సమాజాన్ని సృష్టించాలని ఆయన ఆశపడుతున్నారు. తరచూ చికెన్, మొఘలులు, మంగళసూత్రం అంశాలపై మోదీ మాట్లాడుతూ సమాజంలో విభజన తెచ్చేందుకు ప్రయతి్నస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాడనే ఆయనను ప్రజలు ఎన్నుకుంటే ఆయనను ఏకంగా రాజ్యాంగ విలువలనే కాలరాస్తున్నారు’’అని ఖర్గే ఆరోపించారు. మోదీకి చురక ‘‘పార్లమెంట్ సమావేశాల వేళ ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రాంగణానికి వచ్చి ఆయన ఆఫీస్‌లోనే కూర్చుంటారు. టీవీలో రాజ్యసభ, లోక్‌సభ చర్చలు, సభా కార్యకలాపాలను ప్రత్యక్షప్రసారాలు చూస్తారు. పార్లమెంట్ ప్రోసీడింగ్స్ తెలియాలంటే అలా టీవీలో చూడకుండా నేరుగా సభలోకి వచ్చి కూర్చోవాలి. అప్పుడు ప్రత్యక్ష అనుభవం కల్గుతుంది’’అని మోదీకి ఖర్గే చురక అంటించారు. రాజ్యసభలో డెప్యూటీ ఛైర్మన్నూ.. ‘‘రాజ్యసభలో నాటి డెప్యూటీ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌నూ ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది. రాజ్యసభలో వి పక్షాల గొంతు నొక్కేందుకు ధన్‌ఖడ్‌నూ ఓ పా వులా వాడుకున్నారు. విపక్ష నేతలకు ధన్‌ఖడ్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆయన సభా కార్యకలాపాలను పర్యవేక్షించినప్పుడు పెద్దసంఖ్యలో విపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేశారు. చిట్టచివర్లో ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుందామని భావించినా ఆయనపై ప్రభుత్వ పెద్దలు మరింత ఒత్తిడి పెంచారు’’అని ఖర్గే వ్యాఖ్యానించారు.సామ్యవాదం, లౌకికవాదంను తొలగించాలనుకున్నారు ‘‘రాజ్యాంగ పీఠికలో దశాబ్దాల క్రితం చేర్చిన సామ్యవాదం, లౌకికవాదం పదాలను తొలగించాలని బీజేపీ ప్రభుత్వం నిశ్చయంగా ఉందిన ఆ పార్టీ కీలక నేతలే సెలవిస్తున్నారు. రాజ్యాంగం నుంచి ఈ పదాలను తీసేయాలని చూస్తున్న ఇదే పార్టీ తమ సొంత పార్టీ సిద్ధాంతాలు, నియమనిబంధనల్లో మాత్రం సామ్యవాదం, లౌకికవాదం పదాలను కొనసాగించడం విడ్డూరం. ఆ పదాలను బీజేపీ–ఆర్ఎస్ఎస్ శక్తులు తొలగించలేవు. ఎందుకంటే అంతటి శక్తిని వాళ్లకు ప్రజలు కట్టబెట్టలేదు’’అని ఖర్గే అన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడే పవిత్రబాధ్యతలు రాజ్యాంగం న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమిషిన్, మీడియాకూ ఇచ్చింది. కానీ ఒక మతాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన జడ్జీపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక క్రతువు నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యం ఉందనడం కంటే నియంతృత్వం ఉందనడం నయం’’అని అన్నారు. -
ఆహ్వానం లేకుండా పాక్‌కు వెళ్లింది ఎవరు? సీజ్ ఫైర్ నిర్ణయం ఎవరిది?
పహల్గాం ఘటన.. పూర్తిగా భద్రతా వైఫల్యమేనని, పైగా అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మండిపడింది. ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో భాగంగా.. ఇటు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, అటు రాజ్యసభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు. పర్యాటక ప్రాంతంలో భద్రత లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై ఆమె విమర్శలు గుప్పించారు. ‘‘ఈ అంశంపై రక్షణ శాఖ మంత్రి గంటసేపు మాట్లాడారు. అధికార కూటమి ఎంపీలు కూడా మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదంపై పోరు, జాతీయ భద్రత, చరిత్ర.. ఇలా అంశాలన్నింటిపై మాట్లాడారు. కానీ, ఒక్క విషయాన్ని వదిలేశారు. అసలు ఆ దాడి ఎందుకు?.. ఎలా జరిగింది? అనేది.. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో కుటుంబ సభ్యుల కళ్లెదుటే 26 మంది చంపారు. అసలు ఆ ఉగ్రదాడి ఎందుకు.. ఎలా జరిగిందో మాత్రం కేంద్రం చెప్పడం లేదు. #WATCH | In Lok Sabha, Congress MP Priyanka Gandhi Vadra says, "... Yesterday, the Defence Minister spoke for an hour, during which he spoke about terrorism, protecting the country, and also gave a history lesson. But one thing was left out- How did this attack happen?..." pic.twitter.com/as9gAbNCjr— ANI (@ANI) July 29, 2025కశ్మీర్లో ఉగ్రవాదం ముగిసిన అంకమని, అక్కడ పర్యటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. కానీ.. జరిగింది మరొకటి. శుభం ద్వివేదీకి వివాహమై ఆరు నెలలే అయ్యింది. ఏప్రిల్ 22వ తేదీన అందరు పర్యాటకుల్లాగే ఆ జంట విహారంలో మునిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో అడవుల్లో నుంచి వచ్చిన ఉగ్రవాదులు వాళ్లపై తెగబడ్డారు. భార్య కళ్ల ముందే శుభంను చంపేశారు. గంట వ్యవధిలో మరో 25 మందిని చంపేశారు. శుభం భార్య ఐశన్య ఓ మాట చెప్పింది.. నా కళ్ల ముందే నా ప్రపంచం చీకటి అయ్యింది. ఘటన సమయంలో అక్కడ ఒక్క భద్రతా సిబ్బంది లేరు. ఈ దేశం, ఈ ప్రభుత్వం మమ్మల్ని.. మా భద్రతను గాలికి వదిలేసింది అని. ఆమె అడిగిందే నేనూ అడుగుతున్నా.. ప్రతీరోజు 1,000 నుంచి 1,500 మంది పర్యటించే ఆ ప్రాంతంలో ఒక్క సైనికుడు కూడా కాపలాగా ఎందుకు లేడు?. వాళ్లు ప్రభుత్వాన్ని నమ్మి అక్కడికి వెళ్తే.. ఈ ప్రభుత్వం దేవుడ్ని మీద భారం వేసి వాళ్లను అలా వదిలేసిందా?. ఉగ్రదాడికి రక్షణమంత్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యత వహించారా? రాజీనామా చేశారా?. అసలు పౌరుల ప్రాణాలకు బాధ్యత ఎవరిది?. ప్రధానిదా?, హోం మంత్రిదా?, రక్షణ మంత్రిదా? ఎవరిది??సెక్యూరిటీ మాట అటుంచి కనీసం ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు?. ఇది నిఘా సంస్థ వైఫల్యం కాదా?.. అంటూ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఆర్మీనో, కేంద్రమో ఈ నిర్ణయం తీసుకోలేదు. అసలు సీజ్ ఫైర్ ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా చేస్తారు?. పాక్ భారత్ కాల్పుల విరమణ ఒప్పందం అసలు ఎలా జరిగింది?. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే అని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఇటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘‘పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచం మొత్తం చూసింది. తమ తండ్రి తమ కళ్ల ముందే చనిపోవడం చిన్న పిల్లలు చూశారు. అసలు పర్యాటక ప్రాంతంలోకి టెస్టులు ఎలా వచ్చారు?. పహల్గాం ఉగ్రదాడి ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే. దాడి జరగకుండా కేంద్రం ఎందుకు ఆపలేకపోయింది?. ఇంటెలిజెన్స్ వైఫల్యానికి బాధ్యులెవరు?. .. పహల్గాం ఘటనలో సంబంధం లేని అంశాలను లేవనెత్తుతున్నారు. పాకిస్తాన్‌కు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు. కాంగ్రెస్ దేశాన్ని నిర్మించిన పార్టీ. ఆ పార్టీకి చాలా చరిత్ర ఉంది. మేం ఎప్పుడూ పాక్‌కు సపోర్ట్ చేయలేదు. ఆహ్వానించకుండా పాక్‌కు వెళ్లడం సిగ్గుచేటు. మాపై నిందలు వేస్తూ.. పాక్ నేతలను కౌగిలించుకుంటారు. మీరు తప్పు చేసి మాపై అసత్య ప్రచారాలు చేస్తారా?. ఇదేనా మీ దేశ భక్తి. #WATCH | Discussion on Operation Sindoor | Rajya Sabha LoP Mallikarjun Kharge says, "...We attended the meeting (all-party), but you went to Bihar for election campaigning. Is that your patriotism?...He should have been in the House today and heard us. If you do not have the… pic.twitter.com/XrcPafJoNp— ANI (@ANI) July 29, 2025కాంగ్రెస్‌ను నిందిస్తూ ఎంత కాలం బతుకాలనుకుంటున్నారు?. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువ అయ్యాయా? పహల్గాం ఘటన తర్వాత జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రధాని ఎందుకు లేరు?. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొన్నారు?. ప్రధానికి దేశ భద్రత కంటే ఎన్నికల ర్యాలీలే ఎక్కువయ్యాయా?. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయా?’’ అని ఖర్గే ధ్వజమెత్తారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్-భారత్ కాల్పుల విరమణను భారత విదేశాంగ శాఖ మంత్రో, ప్రధానినో, లేకుంటే రక్షణ మంత్రినో ప్రకటించలేదు. ఎక్కడో వాషింగ్టన్ నుంచి ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విమరణ తన విజయమేనని ట్రంప్ ఇప్పటిదాకా 29సార్లు ప్రకటించుకున్నారు. ఈ నా ప్రసంగం ముగిసేలోపు ఆయన మరోసారి ప్రకటించుకుంటే 30వ సారి అవుతుంది. అయినా ఆ నిజాన్ని కేంద్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు అని ఖర్గే ఎద్దేవా చేశారు. -
అప్పుడు సీఎం స్థానం ఆశించి భంగపడ్డా.. ఆయనకు ఇచ్చారు: ఖర్గే ఆవేదన
బెంగళూరు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నడూ అధికారం కోసం పరుగు తీయలేదన్నారు. 1990ల్లో తాను కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతగానో శ్రమించినట్టు చెప్పుకొచ్చారు. తీరా, పార్టీ అధికారంలోకి వచ్చాక.. పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను ఇవ్వలేదని ఖర్గే గుర్తు చేసుకున్నారు.కర్ణాటకలోని బేలిమఠంలో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని స్థాయి నుంచి ఏఐసీసీ అధ్యక్ష పదవి వరకు దేనికీ తాను ప్రయత్నించలేదని, పార్టీయే అవకాశం ఇచ్చిందన్నారు. నేను ఎప్పుడు పదవుల కోసం పరుగులు తీయలేదు. 1999లో కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను శ్రమించినా, పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను ఎస్.ఎం.కృష్ణకు అప్పగించిందని గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో తనకు ముఖ్యమంత్రి స్థానం దక్కకపోగా, తన సేవలన్నీ వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికీ నిరాశకు గురికాకుండా పార్టీ శ్రేయస్సు కోసం శ్రమించడంతోనే తనకు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని పేర్కొన్నారు. పదవులను తాను ఎప్పుడూ కోరుకోలేదని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై ఖర్గే స్పందిస్తూ.. ఆయన ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు. జగదీప్ మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. నేను రాజ్యసభలో మాట్లాడేందుకు ఆయన అవకాశమివ్వలేదు. రైతులు, పేదలు, అంతర్జాతీయ సమస్యలు, విదేశాంగ విధానంపై విపక్షాలు మాట్లాడితే, వారి స్వరం వినిపించకుండా చేసేవారు అని వ్యాఖ్యలు చేశారు. Mallikarjun Kharge, Congress chief and Gandhi family loyalist, voiced regrets on how he missed being the Chief Minister of Karnataka despite winning an election for the Congress... pic.twitter.com/KsdgSf2Nqx— MALLU PARUTI (@mallu_paruti) July 27, 2025 -
ఓబీసీల కోసం ప్రత్యేక ప్రణాళిక
సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం కొత్త పథకాలు తీసుకురావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరినట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. వెనుకబడిన వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందజేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ఓబీసీలను అభ్యున్నతి వైపు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై పార్టీ ఆధ్వర్యంలో ఒక నక్షా (ప్రణాళిక) సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. విభజించి పాలించడమే మోదీ ప్రభుత్వ విధానమని దుయ్యబట్టారు. తాను బీసీనని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ గడచిన 11 ఏళ్లలో ఓబీసీల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ఏఐసీసీ ఓబీసీ విభాగం నిర్వహించిన ‘భాగీదారీ న్యాయ సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ విషం లాంటివి.. ‘తెలంగాణలో ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేశారు. కర్ణాటకలో కూడా చేస్తున్నారు. దాని ఆధారంగా వారికి పథకాలు రూపొందిచాలని ముఖ్యమంత్రులకు సూచించాం. సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కోరాం. తెలంగాణ, కర్ణాటక సర్వేల్లో అగ్రకులాలకు చెందినవారు 5, 10 శాతం ఉన్నారని తెలుస్తోంది. వీళ్లే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే వీళ్ల దగ్గర విద్య, మానసిక బలం ఉంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ విషం లాంటివి. ఆ విషాన్ని ఒక్కసారి రుచి చూద్దామనుకుంటే చనిపోతారు. ఓబీసీ కులగణన చేయాలని మొట్ట మొదటిసారిగా రాహుల్‌గాంధీ చెప్పారు. గతంలో ఎవరూ చెప్పలేదు. అలాంటి రాహుల్‌గాం«దీకి మద్దతిస్తారా? లేక దేశాన్ని ముక్కలు చేసేవారికా? ఆలోచించుకోవాలి..’అని ఖర్గే అన్నారు. మోదీ అబద్ధాలకు సర్దార్ ‘బీసీ అయిన నన్ను కాంగ్రెస్ వాళ్లు వేధిస్తున్నారని ప్రధాని మోదీ పదే పదే అంటున్నారు. మేము కాదు.. మోదీయే అందరినీ వేధిస్తున్నారు. అందరినీ మట్టిలో కలిపేసి ఆయన ఒక్కడే సజీవంగా ఉండాలనుకుంటున్నారు. మోదీజీ ఎప్పడూ అబద్ధాలే చెబుతారు. ఆయన అబద్ధాలకు సర్దార్. పార్లమెంటులో కూడా అసత్యాలు చెబుతారు. అబద్ధాలు చెప్పే ప్రధాని దేశం, సమాజానికి మంచి చేయలేరు..’అని ఖర్గే ధ్వజమెత్తారు. ఓబీసీ వర్గాలను రక్షించుకోవడంలో వెనుకబడ్డా: రాహుల్‌గాంధీ ఓబీసీ వర్గాన్ని రక్షించే విషయంలో నేను వెనుకబడ్డా. మీ సమస్యలను ఆ సమయంలో నేను లోతుగా అవగాహన చేసుకోలేదు. 10, 15 ఏళ్ల ముందు దళితులు, ఆదివాసీల సమస్యలను అర్థం చేసుకోగలిగా. కానీ ఓబీసీల సమస్యలను లోతుగా అర్థం చేసుకోలేకపోయా. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు.. కచి్చతంగా నా తప్పే. ఆ సమయంలోనే కులగణన చేయించి ఉంటే..ఇప్పడు నేను చేయించాలనుకున్నట్లుగా ఉండేది కాదు. ఓబీసీల కోసం ముందుగా నేను చేయలేకపోయిన పనిని ఇప్పుడు రెట్టింపు వేగంతో చేయబోతున్నా..’అని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తెలిపారు. తెలంగాణ సర్కారు వద్ద ఉన్న డేటాకు తిరుగులేదు.. ‘తెలంగాణలో చేసిన కులగణన ఒక రాజకీయ భూకంపం. అది దేశ రాజకీయాలను కుదిపేసింది. దాని తర్వాత పరిణామాలు ఇంకా మీరు చూడలేదు. గతంలో ఒకసారి సునామీ వచ్చింది. రెండు మూడు గంటల తర్వాత దాని ప్రభావం కనిపించింది. అదే తెలంగాణలోనూ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉన్న డేటాకు దేశంలో ఎక్కడా ఎదురులేదు. ఆ డేటా ఆధారంగా తెలంగాణలోని మొత్తం కార్పొరేట్ సంస్థల్లో ఎంతమంది ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఉన్నారనేది ఒక్క నిమిషంలోనే చెప్పవచ్చు.అయితే తెలంగాణలో కార్పొరేట్లలో ఎంతమంది ఓబీసీ యజమానులు, దళిత యజమానులు ఉన్నారు? అక్కడ లక్షలు, కోట్ల రూపాయల ప్యాకేజీలు లభిస్తాయి. కానీ ఓబీసీలకు ఎంత ప్యాకేజీ లభిస్తోందని అడిగితే..నేను జీరో అంటాను. అక్కడ దళితులు, ఓబీసీలు, ఆదివాసీల్లో ఎవ్వరికీ ఇలాంటి ప్యాకేజీలు దక్కడం లేదు. దేశంలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే కూలీ పనిచేస్తారు..’అని రాహుల్ పేర్కొన్నారు. ఉత్పాదక శక్తికి గౌరవం దక్కాలి ‘ఏ దేశాన్ని అయినా నడిపించేది ఉత్పదక శక్తే. అలాంటి శక్తికి దేశం ఏం ఇస్తోంది? రోడ్లు, భవనాలు, కాలేజీలు, ఆసుపత్రులు, ఆలయాలు నిర్మించేది మీరే. ఈ పని కోసం దేశం మీకు ఏం ఇస్తోంది? నేను ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు ఊరుకోను. కులగణన ఒక్కటే కాదు.. ఉత్పాదక శక్తికి దేశంలో గౌరవం దక్కాలన్నదే నా లక్ష్యం. దేశ ఉత్పాదక శక్తి చరిత్రను ఆర్ఎస్ఎస్, బీజేపీలు కలిసి చెరిపేసే ప్రయత్నం చేశాయి. పాఠ్య పుస్తకాల్లో ఓబీసీల చరిత్ర ఎక్కడుంది? దేశంలో 55, 60 శాతం ఉన్న ఓబీసీల చరిత్రను కావాలనే చెరిపేశారు.ఎప్పుడైతే మీరు మీ చరిత్ర తెలుసుకుంటారో ఆ రోజు ఆర్ఎస్ఎస్ మీ శత్రువు అని తెలుసుకుంటారు. మా ప్రభుత్వాలు ఉన్నచోట ముందుగా కులగణన ఎక్స్‌రే, ఎంఆర్ఐ చేస్తాం. ఓబీసీలు ఎంతమంది ఉన్నారు? ఎక్కడున్నారు? భాగస్వామ్యం ఎంత? అనేది తేలుతుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో కుల గణన, 50 శాతం అడ్డుగోడలు పడగొతాం..’అని కాంగ్రెస్ అగ్రనేత చెప్పారు. ఇంగ్లిష్తో డబుల్ బ్యారెల్ ప్రోగ్రెస్ ‘చదువు ఉన్నవారు వేగంగా అభివృద్ధి చెందుతారని తెలంగాణ సర్వేలో తెలిసింది. విద్యతో పాటు మీ దగ్గర ఇంగ్లిష్ ఉంటే డబుల్ బ్యారెల్ ప్రోగ్రెస్ ఉంటుందని తేలింది. ఇంగ్లిష్‌ను దేశం నుంచి తొలగించేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రాంతీయ భాషలు ఎంతో అవసరం. కానీ దాంతో పాటు ఇంగ్లిష్ కూడా అవసరం. అందుకే మా మూడో నినాదం ప్రైవేట్ విద్యా విధానంలో దళితులకు, ఆదివాసీ, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడమే..’అని రాహుల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోట్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్ తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజూ అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు వరుసగా రెండో రోజు మంగళవారం సైతం అట్టుడికాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఆపరేషన్ సిందూర్ సహా పలు కీలక అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. ఆపరేషన్ సిందూర్ సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం పదేపదే ప్రకటించినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. ఆయా అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తేచ్చిచెప్పాయి.మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతోపాటు పహల్గాం ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ప్రక్రియలో అమెరికా జోక్యం, నియోజకవర్గాల పునర్విభజన, దేశంలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మహిళలపై పెరుగుతున్న దౌర్జన్యాలు, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన, మణిపూర్ హింసాకాండ తదితర అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ సభకు హాజరై, వీటిపై సమాధానం ఇచ్చేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. విపక్షాల భేటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, మాణిక్కం ఠాగూర్, రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా తీర్మానాలు ఇచ్చారు. విపక్ష ఎంపీల తీరుపై లోక్‌సభ స్పీకర్ ఆగ్రహం లోక్‌సభ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. బిహార్ ఓటర్ల జాబితా సవరణతోపాటు ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ ప్లకార్డులు ప్రదర్శించాయి. నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించాయి. సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వ్యవసాయానికి సంబంధించిన కీలకమైన అంశాలు ఉన్నందు వీటిపై చర్చకు సహకరించాలని వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రతిపక్షాలను కోరారు. అయినప్పటికీ విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.సభ పునఃప్రారంభమైన తర్వాత విపక్షాల ఆందోళన కొనసాగింది. స్పీకర్ స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ స్పందిస్తూ... విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సైతం మాట్లాడారు. సభకు సహకరించాలని విపక్ష సభ్యులను కోరారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభ తిరిగి 2 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు ఆందోళన విరమించలేదు. వారి వైఖరిని స్పీకర్ తప్పుపట్టారు.ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకురావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ జరగకుండా సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిడ్డారు. విపక్షాలు నిరసన కొనసాగించడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వాయిదా తీర్మానం నోటీసులను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించడం పట్ల విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. సభ తొలుత 12 గంటలకు వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఎగువ సభ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఓటర్ల హక్కులు కాలరాస్తున్నారు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత విపక్ష ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం మెట్లపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. -
వైఎస్సార్ విజనరీ లీడర్: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకుని ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్సార్‌పై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ‘ వైఎస్సార్ విజనరీ లీడర్. ఏపీ ప్రజల సంక్షేమ కోసం తన జీవితాన్ని అంకింతం చేశారు. నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించి చిరస్థాయిగా నిలిచిపోయారు’ అని కొనియాడారు. Humble tributes to former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.A visionary leader who devoted his life to the welfare of the people of Andhra Pradesh and made countless contributions to their upliftment.He will always be… pic.twitter.com/D3BO9MZsCM— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2025 వైఎస్సార్ కృషి మరువలేనిది..రైతులు, బలహీన వర్గాల కోసం వైఎస్సార్ చేసిన కృషి మరువలేనదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. ఏపీ రాష్ట్ర ప్రజల కోసం జీవితాన్ని ధారబోసిన మానవతా వాది వైఎస్సార్ అని కొనియాడారు. On his birth anniversary, we pay homage to Y. S. Rajasekhara Reddy, the Former Chief Minister of Andhra Pradesh.A truly compassionate leader, he devoted his entire life to the progress and well-being of the state. His remarkable contributions to public service, especially… pic.twitter.com/JYQOdeEthS— Mallikarjun Kharge (@kharge) July 8, 2025 -
పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు? కాంగ్రెస్ సూటి ప్రశ్నకు బీజేపీ రిప్లై ఏంటి?
-
పాకిస్తాన్‌పై యుద్ధం ఎందుకు ఆపేశారో మోదీ ప్రభుత్వం చెప్పాలి... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్
-
యుద్ధాన్ని ఆపేశారేం?
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌పై యుద్ధాన్ని ఆకస్మికంగా ఎందుకు ఆపేశారో, అసలు ఆపిందెవరో దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. పహల్గాం ఘటనపై దేశం యావత్తు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిందని చెప్పారు. దేశంలోని అన్ని రాజకీయపార్టీలు మోదీకి మద్దతు ఇస్తూ యుద్ధం చేయాలంటూ గొంతు కలిపాయని గుర్తుచేశారు. అయినా యుద్ధం కొనసాగించకుండా అర్ధాంతరంగా నిలిపివేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.దేశానికున్న బలగంతో వీరోచితంగా పోరాడి పాక్ పీచమణిచి పీఓకేను స్వాదీనం చేసుకునే అవకాశాన్ని చేజేతులా కోల్పోవడం అత్యంత దురదృష్టకరమంటూ ఖర్గే ధ్వజమెత్తారు. జబ్బలు చరుచుకునే మోదీ కి కీలక సమయంలో చేతులు ఎత్తేయడమే చేతనవుతుందని విమర్శించారు. దేశరక్షణ, సైనికులపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావడం ఆయన దేశభక్తికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, కార్యకర్తల సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మోదీ మణిపూర్ ఎందుకు వెళ్లలేదు? ‘గంభీరంగా కనిపిస్తున్నట్లు నటించే మోదీ నిజానికి అత్యంత భయస్తుడు. ప్రధాని మోదీ ఇప్పటివరకు 42 దేశాల్లో పర్యటించారు. కానీ స్వదేశంలో అగి్నగుండంగా మారిన మణిపూర్‌కు మాత్రం వెళ్లలేదు. మణిపూర్ భారత్‌కు అత్యంత కీలకమైన ప్రదేశం. అక్కడ జరుగుతున్న ఆందోళనలను పరిశీలించేందుకు నేను, రాహుల్‌గాంధీ వెళ్లాం. బాధితులను పరామర్శించాం. మరి మోదీ ఎందుకు మణిపూర్ వెళ్లలేదు? వారు దేశ పౌరులు కాదా? దేశ ప్రజలను పట్టించుకోకుండా ప్రపంచ దేశాలు తిరుగుతూ దేశ ప్రజలను మోదీ రోడ్లపై వదిలేశారు. మోదీ మాదిరి అప్పట్లో ఇందిరాగాంధీ భయపడలేదు. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం కల్పిస్తామని చెప్పి చేసి చూపించారు..’ అని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాకే అందరికీ అభివృద్ధి ఫలాలు ‘కార్యకర్తల కృషితోనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి ఆత్మ. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. కీలక రంగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, రైతుభరోసా, రుణమాఫీ లాంటి ఎన్నో పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇవన్నీ ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. రాజ్యాంగం నుంచి లౌకిక పదాన్ని తొలగించలేరు.. హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాదాపు 50కి పైగా కాంగ్రెస్ పాలనలో ఏర్పడ్డాయి. మరి మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏమిచ్చిందో చెప్పాలి. నల్లధనం తెచ్చి ప్రతి వ్యక్తికి రూ.15 లక్షలు ఇస్తానన్న మోదీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. మోదీ, అమిత్‌షా అబద్ధాలు చెప్పి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో లేదని బీజేపీ చెప్తోంది. కానీ రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తీసేయలేరు. సెక్యులర్ అనే పదంతో ఇబ్బందిగా ఉంటే బీజేపీ పార్టీ ప్రణాళిక నుంచి ఆ పదం తొలగించి చూపించాలి..’ అని ఖర్గే సవాల్ చేశారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు: సీఎం ‘తెలంగాణలో అధికార మదంతో తమకు తిరుగులేదనే అహంకారంతో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు. కార్యకర్తల కృషితో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం..ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, పేదలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. ఈ పథకాలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయి. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా మారుతోంది. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం అమలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది..’ అని సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి ‘అద్భుతమైన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నప్పటికీ వాటిని ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ప్రతి శాఖలో ఒక సంక్షేమ పథకం ఉంది. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. ప్రజా ప్రభుత్వం ప్రతి హామీ అమలు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కుల సర్వే హామీ ఇచ్చి అమలు చేసి చూపించాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానిని జనగణనలో చేర్చింది. మహిళా సంఘాలకు ఆర్టీసీలో బస్సులు అద్దెకు ఇప్పించి లాభాలు గడించేలా ప్రోత్సహిస్తున్నాం. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్‌బంక్‌లు ఏర్పాటు చేయిస్తూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. కోటిమంది మహిళలను ఎస్‌హెచ్‌జీల్లో చేర్పించి కోటీశ్వరులుగా చేసే బాధ్యత ప్రభుత్వానిదే. మోదీ, కిషన్‌రెడ్డి, కేసీఆర్ చర్చకు రావాలి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. 18 నెలల్లో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. వంద నియోజకవర్గాల్లో రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను స్థాపించాం. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించాలి. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదంటూ కొందరు వెకిలిగా వ్యాఖ్యానించారు. కానీ 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించాం. ఈ అంశంపై మోదీ, కిషన్‌రెడ్డి, కేసీఆర్ చర్చకు రావాలి. రైతులకు ఎవరు మేలు చేశారో అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం..’ అని ముఖ్యమంత్రి సవాల్ చేశారు. కార్యకర్తల ఎన్నికలొస్తున్నాయి.. ‘రాష్ట్రంలో నియోజకవర్గాల పునరి్వభజనతో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి అధిష్టానానికి బహుమతి ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. స్టేజిమీద ఉన్న నాయకుల ఎన్నికలు అయ్యాయి. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. కార్యకర్తల గెలుపు కోసం పూర్తి సహకారం అందిస్తాం. టిక్కెట్ల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. బీఫామే ఇంటికి వస్తుంది..’ అని సీఎం అన్నారు. కాగా బహిరంగ సభ అనంతరం ఖర్గే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. -
‘మీలాంటోళ్లను చూసి భయపడం..’ టీపీఏసీ భేటీలో ఖర్గే వ్యాఖ్యలు
గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని తప్పుబడుతూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, సాక్షి: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొందరు ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నలుగురైదుగురు గ్రూపులు కడితే భయపడతాం అనుకుంటున్నారా?. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను నేనూ రాహుల్ అసలు పట్టించుకోం. వాళ్ల సంగతి పార్టీ క్రమశిక్షణా కమిటీ తేలుస్తుంది. అందుకే పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడొద్దు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై నిలవాలి’’ అని సున్నితంగా హెచ్చరించారు. మరో సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా తరచూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నేతలకు చురకలంటించారు. ‘‘కాంగ్రెస్‌లో కొంత మంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మన ప్రతీ మూమెంట్ ప్రజలు గమనిస్తారు. అందుకే ఆచితూచి వ్యవహరించాలి. మీ వ్యవహార శైలితో పార్టీకి కొత్త నష్టం చేస్తే ఊరుకోం. పార్టీ ఉంటేనే మీరుంటారు. సొంత ఎజెండాతో పనిచేసే వారిపై వేటు తప్పదు. పార్టీ, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. జిల్లాల వారీగా ఆశావహుల లిస్టును పీసీసీ సిద్ధం చేయాలి అని సూచించారు. ఈ మీటింగ్ వేదికగా.. పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే టీపీసీసీకి డెడ్ లైన్ విధించారు. ‘‘ఈ నెల 30 లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలి. పదవులు భర్తీ కాకుంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దే బాధ్యత’’ అని ఖర్గే అన్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్ కలగజేసుకుని ఇంచార్జీ మంత్రులు బాధ్యత తీసుకొని పదవుల భర్తీ కోసం లిస్టులు టీపీసీసీ చీఫ్‌కు పంపాలని చెప్పారు. ఆ వెంటనే ఖర్గే మరోసారి ‘పార్టీలో పనిచేసిన వారికి.. అర్హత ఉన్నవాళ్లకే పదవులు ఇవ్వాలి’’ అని సూచించారు. టీపీసీసీ విస్తృత స్థాయి, కార్యవర్గ సమావేశాల్లోనూ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు. మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయం. హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ లో పరిపాలన బావుంది, పార్టీ కార్యకర్తల పనితీరు బావుంది. పార్టీ మీ అందరికీ ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలి. 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. 11 ఏళ్ల వారి పాలనలోని ఎమర్జెన్సీ పరిస్థితులు గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ఖర్గే ప్రసంగించారు. జడ్చర్ల ఎమ్మెల్యేపై పీసీసీ చీఫ్ ఆగ్రహంజడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీని పీసీసీ చీఫ్ ఆదేశించారు. సోమవారం జరగబోయే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
గాంధీ భవన్లో ఖర్గే.. సీఎం రేవంత్‌తో భేటీ
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్, పార్టీ ఇంఛార్జీ మీనాక్షీ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, పీఏసీ సభ్యులతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ పాలన, జై బాపు జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పీఏసీలో ప్రత్యేకంగా చర్చించనున్నారు.లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.కాగా, ఇవాళ పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్న ఖర్గే అక్కడ..ఇటీవలి కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన నేతలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. -
ఖర్గే పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఇవాళ నగరంలోని ఎల్బీ స్టేడియంలోనిర్వహించబోయే సామాజిక న్యాయ సమర భేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అయితే, ఖర్గే పర్యటన వేళ హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం.. తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస క్రీడ చేస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదంటూ ప్లెక్సీలు వెలిశాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘జై భీం ఎస్సీ,ఎస్టీలే మా లక్ష్యం. జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు’ అనే స్లోగన్లతో ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.కాగా, మల్లికార్జున ఖర్గే ఇవాళ(శుక్రవారం) వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్‌లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
సారీ.. వచ్చేసారి.. మంత్రి పదవులు ఆశించిన నేతలతో ఖర్గే
సాక్షి, హైదరాబాద్: అర్హులైన నేతలు మంత్రి పదవులు ఆశించడంలో తప్పులేదని అయితే పార్టీ అంతర్గత పరిస్థితులు రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని సర్దుకుపోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సముచిత న్యాయం చేసేందుకు పార్టీ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో వారి వారి అనుభవం, అర్హతలకు అనుగుణంగా పదవులు సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం జరగనున్న పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పార్టీ నేత హర్కర వేణుగోపాలరావు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేరుగా తాను బస చేసే తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్న ఖర్గే అక్కడ..ఇటీవలి కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన నేతలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. మేం అర్హులం.. మాకు అవకాశం ఇవ్వాల్సిందే ఏఐసీసీ చీఫ్‌తో భేటీ అయ్యేందుకు రావాలని గురువారం మధ్యాహ్నం కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు సుదర్శన్‌రెడ్డి, ప్రేంసాగర్ రావు, బాలునాయక్, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి సాయంత్రం హోటల్‌కు చేరుకుని ఖర్గేతో సమావేశమయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్‌కు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ నియోజకవర్గాల్లో ముందే నిర్ణయించిన సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున వారు రాలేకపోయారు. కాగా ఈ భేటీలో ఎమ్మెల్యేలు.. తమకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలో, తాము ఎలా అర్హులమో వివరించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, పార్టీ పట్ల విధేయతో ఉంటున్నామని, తమకు ఉన్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిందేనని కోరారు. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, ఆ రెండు జిల్లాలకు కూడా తప్పకుండా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కష్టపడండి ..గెలిచి రండి అందరి వాదనలను సావధానంగా విన్న ఖర్గే..ఎమ్మెల్యేల వినతులను పార్టీ తప్పకుండా పరిశీలిస్తుందని, భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అర్హులైన వారికి కూడా కొన్ని పదవులు ఇవ్వలేకపోయామని భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీలును బట్టి పార్టీలో ప్రాధాన్యమిస్తామని, సీనియారిటీని తప్పకుండా గౌరవిస్తామని, సామాజిక న్యాయానికి కట్టుబడి ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి వస్తుందని అప్పుడు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పినట్లు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని, మెజార్టీ స్థానాల్లో గెలవాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నిటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో ఖర్గే సమావేశం కొనసాగుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోటల్లోనే ఉన్నారు. సాయంత్రం 6:30 గంటలకు అక్కడికి వచ్చిన ఆయన.. 9 గంటల తర్వాత కూడా అక్కడే వేచి ఉన్నారు. ఖర్గేతో భేటీ అయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత సీఎంను కూడా కలిశారు. తమకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలో, ఖర్గేకి ఏం చెప్పామో వివరించారు. 9 దాటిన తర్వాత హోటల్ నుంచి రేవంత్ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్ కూడా హోటల్లో కొంతసేపు ఉండి ఆ తర్వాత శుక్రవారం నాటి సమావేశాలు, సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు వెళ్లారు. కాగా సీఎంను కలిసేందుకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హోటల్‌కు రాగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. చీఫ్ విప్ ఆఫర్ చేసినా.. తాను పార్టీ కోసం చేసిన కృషిని, పార్టీ పట్ల విధేయతను వివరించినప్పటికీ మంత్రి పదవిపై సరైన భరోసా లభించకపోవడంతో అలిగిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు హోటల్ నుంచి విసురుగా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆయనకు చీఫ్ విప్ పదవి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కాగా ప్రేంసాగర్ రావును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన ప్రేంసాగర్ రావు.. తాను అలిగాననడంలో ఎలాంటి వాస్తవం లేదని, పార్టీ అధ్యక్షుడికి తన మనసులో మాట చెప్పి వెళ్లిపోయానని చెప్పారు. కొండా మురళి దంపతుల వివరణ వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా ఖర్గేను కలిశారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలతో విభేదాలపై వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అందరినీ కలుపుకొని వెళ్లాలని, సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఖర్గే చెప్పినట్లు తెలిసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళిలు కూడా ఖర్గేతో కాసేపు సమావేశం అయ్యారు. ఖర్గేతో భేటీ అనంతరం ఎవరేమన్నారంటే.. ఉమ్మడి జిల్లాలన్నింటికీ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరినట్లు మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ‘పార్టీలో సీనియర్లం ఉన్నాం..మంత్రి పదవి ఇవ్వాలని కోరా..’ అని సుదర్శన్‌రెడ్డి చెప్పారు. లంబాడా సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారని బాలునాయర్ తెలిపారు. తాను మంత్రి పదవికి ఎలా అర్హుడనో ఖర్గేకి వివరించానని రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. తనది నాలుగు తరాల విధేయత అని చెప్పానన్నారు. నేడు వరస సమావేశాలు మల్లికార్జున ఖర్గే శుక్రవారం వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్‌లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఆ వ్యాఖ్యల్లో అర్థం ఇదేనా ?.. సీఎం మార్పు ఖాయమేనా?
బెంగళూరులో తొక్కిసలాట ఘటన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టిందా?, కర్ణాటకలో సీఎంను మార్చాలా? అనేది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా చర్చిస్తున్న అంశం. మరొకవైపు తొక్కిసలాట ఘటన పేరుతో డీకే శివకుమార్‌ను సీఎం చేయడానికి రంగం సిద్ధమైందా? అనేది ఆ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ హైకమాండ్ నుంచి ఎటువంటి ప్రకటనా నేరుగా రాకపోయినప్పటికీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కర్ణాటకలో సీఎంను మార్చబోతున్నారా? అనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే డైరెక్ట్‌గా ఏమీ చెప్పలేకపోయారు. ఆయన నో అనే అవకాశం ఉన్నా కూడా ‘ అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ హైకమాండ్ అంటే తానే అనే విషయం మరిచిపోయి ఖర్గే ఇలా వ్యాఖ్యానించినప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఏదో జరుగబోతుందనే సంకేతాలిచ్చారు ఖర్గే. మీడియా అడిగిన దానికి.. ‘ఇప్పుడు కర్ణాటకలో సీఎంను మార్చాల్సిన అవసరం ఏమిటి?’ అని చెప్పకుండా, అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది అనడం త్వరలో ఏదో జరగబోతుందనే దాన్ని బలపరిచింది.డీకే శివకుమార్‌కు చాన్స్..? అక్కడ ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను తప్పిస్తే, ఆ తర్వాత రేసులో ఉన్నది డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌కే అవకాశం దక్కుతుంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన సమయంలో డీకే శివకుమార్ సీఎం అనే ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్యనే సీఎంను చేసింది. కర్ణాటకలో ఎటువంటి మార్పులు లేకుండా సీనియర్ అయిన సిద్ధరామయ్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అప్పట్నుంచి డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య కాస్త దూరం పెరిగిందనేది జనాల్లో వినిపిస్తున్న మాట. అయితే సిద్ధరామయ్య కోసం తన చివరి శ్వాస వరకూ నిలబడతా అనే వ్యాఖ్య కూడా డీకే శివకుమార్ ఒకానొక సందర్భంలో చేసి తమ మధ్య ఏమీ విభేదాల్లేవని సంకేతాలిచ్చారు. ఈ ఏడాది శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది. ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే డీకే శివకుమార్ తనపై వచ్చిన ఆరోపణలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఎవరు ఏమనుకున్నా తాను చివరి శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానని తేల్చి చెప్పారు.మరింత పటిష్టం చేసే దిశగా పావులు..!కర్ణాటకలో కాంగ్రెస్‌ను మరింత పటిష్టం చేసి.. బీజేపీకి ధీటుగా నిలబడాలంటే డీకే శివకుమార్ సీఎం పగ్గాలు అప్పజెప్పాలని గత కొద్దికాలంగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఆలోచన చేసే దిశగా ముందుగా సాగుతున్నట్లు ఖర్గే వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ఉన్న సారాంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ందేళ్లు జీవించాల్సిన పిల్లలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో బలికావడాన్ని తట్టుకోలేకపోతున్నా. ఈ ఘటనతో బెంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చింది’అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. 14–15 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోవడం కళ్లారా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సదాశివనగరలోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. -
‘ఖర్గేజీ.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉందా?.. మీరు హైకమాండ్ కాదా?
బెంగళూరు: కాంగ్రెస్‌లో హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకే కట్టుబడి ఉండాలనేది ఎప్పట్నుంచో వస్తుంది. రాష్ట్రాల్లో ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలొ అది హైకమాండ్ ఫైనల్ చేస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర సీఎంలు కూడా హైకమాండ్ మాటకు ఎదురుచెప్పకూడదు. ఈ తరహా పరిణామాలను తరుచూ చూస్తూనే ఉన్నాం. మరి హైకమాండ్ అంటే ఎవరు?, ఏఐసీసీ అధ్యక్షుడే కాంగ్రెస్ హైకమాండ్ కదా.. మరి పార్టీ చీఫ్ అయిన మల్లిఖార్జున ఖర్గే నోట నుంచే హైకమాండ్ చూసుకుంటుంది అనే మాట వస్తే ఏమనాలి?ఇప్పుడు అదే జరిగింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే.. ‘హైకమాండ్ చేతుల్లో ఉంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లొ ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా> సీఎంను మార్చబోతున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే ఒక్క ముక్కలో తెగ్గొట్టి చెప్పేశారు. అది హైకమాండ్ చేతుల్లో ఉంది అంటూ దాటవేత ధోరణి అవలంభించారు. ఇది బీజేపీకి మంచి టానిక్‌లా దొరికింది. అటు కాంగ్రెస్‌ను, ఇటు ఖర్గేపై విమర్శలు చేయడానికి అవకాశం దొరికినట్లయ్యింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సెటైర్లతో విరుచుపడ్డారు. ‘ ఇక్కడ హైకమాండ్ అంటే ఎవరు? మీరు కాదా?, కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న మీరు హైకమాండ్ కాదా?, మరి ఇంకా హైకమాండ్ ఎవరు? అని తేజస్వి సూర్య పంచ్‌లు వేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కనపడదు.. అది మనకు కనిపించదు.. వినిపించని దెయ్యంలా ఉంటుందేమో. మనం మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఉందని ఫీలవుతూ ఉండాలి’ అని సెటైరికల్ పంచ్‌లు విసిరారు.The Congress High Command is like a ghost. It is unseen, unheard, but always felt. Even the Congress President, who people thought is the high command, whispers its name and says it’s not him. So eerie! https://t.co/GpcdHWQbSs— Tejasvi Surya (@Tejasvi_Surya) June 30, 2025 -
ఖర్గే చురకలు.. శశిథరూర్ కౌంటర్!
కాంగ్రెస్ అధిష్టానంతో సీనియర్ నేత శశిథరూర్‌కు ఉన్న విభేదాలు ఇవాళ మరోసారి అధికారికంగా బయటపడ్డాయి. శశిథరూర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. కాసేపటికే థరూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాకు ఇంగ్లీష్ చదవడం అంత బాగా రాదు. కానీ, శశిథరూర్ భాష చాలా బాగుంటుంది. అందుకే ఆయన ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నారు. మేము మాకు వచ్చిన భాషలో ‘‘దేశమే ముందు(మా తొలి ప్రాధాన్యం) అంటాం’’. భారత సైన్యానికి మద్దతుగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ కోసం ఐక్యంగా నిలబడ్డాం. కానీ కొంతమంది ‘‘మోదీనే ముందు.. ఆ తర్వాతే దేశం అంటారు. అలాంటప్పుడు మేమేం చేయాలి?’’ అని నవ్వుతూ అన్నారాయన. మోదీని ప్రశంసించినందుకు థరూర్‌పై చర్యలు ఉంటాయా? అని ఎదురైన ప్రశ్నకు.. ఆ వ్యాఖ్యలకు పార్టీ దూరంగా ఉంటుందని, చర్యలు తీసుకునే ఉద్దేశమేదీ లేదని అన్నారు. అదే సమయంలో పార్టీ ఐక్యతే అధిష్టానానికి ముఖ్యం అని ఖర్గే పేర్కొన్నారు. #WATCH | #Congress President #MallikarjunKharge says #ShashiTharoor’s strong language skills earned him a spot in the party's working committee and emphasizes that the entire opposition stands united in support of the #IndianArmy.@kharge @ShashiTharoor pic.twitter.com/kiJLpcwE8K— The Federal (@TheFederal_News) June 25, 2025మరోవైపు.. ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తన ట్విటర్లో ఓ పోస్ట్ ఉంచారు. ‘‘ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. రెక్కలు నీవి.. ఆకాశం ఎవరి సొంతం కాదు’’ అంటూ ఓ పోస్ట్‌ను ఉంచారాయన. దీంతో ఇది ఖర్గేకు సెటైరే అంటూ ఆయన కామెంట్ సెక్షన్లో చర్చ నడుస్తోంది. pic.twitter.com/dNkwZb721E— Shashi Tharoor (@ShashiTharoor) June 25, 20252020 – G-23 లేఖ దగ్గరి నుంచి శశిథరూర్‌కు, అధిష్టానం మధ్య గ్యాప్ మొదలైంది. థరూర్ సహా 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) తిరుగుబాటు లాగా భావించారంతా. ఆపై 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇది మరోసారి బయటపడింది. శశిథరూర్ మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఖర్గే గెలిచినా, థరూర్‌కు 1,000కి పైగా ఓట్లు వచ్చాయి. అయితే పార్టీలో అంతర్గతంగా థరూర్‌కు మద్దతు ఉన్నట్లు ఈ ఎన్నిక సూచించింది.2023–24.. శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్‌పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.2025.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్‌కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్ నేతలతో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్ తాజాగా స్పష్టత ఇచ్చారు. -
11 ఏళ్లలో 33 తప్పులు
కలబురిగి: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో 33 తప్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేవలం అబద్ధాలు, మోసాలతో మోదీ కాలం గడిపే స్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక యువతను నిలువునా దగా చేశారని, ఓట్ల కోసం పేదలను వాడుకున్నారని మోదీపై మండిపడ్డారు. ప్రధానమంత్రి మోసాలపై పార్లమెంట్‌లోనూ తాను గళమెత్తానని తెలిపారు. తాను 65 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఇందులో 55 ఏళ్లు పదవుల్లో ఉన్నానని, నరేంద్ర మోదీ లాంటి మోసకారి ప్రధానమంత్రిని ఏనాడూ చూడలేదని ధ్వజమెత్తారు. బుధవారం కర్ణా టకలోని కలబురిగిలో మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. చెప్పింది మోదీ ఏనాడూ చేయలేదని, అదేమిటని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం ఉండదని విమర్శించారు. ఆయనకు అబద్ధాలు తప్ప మరొకటి తెలి యదన్నారు. మోదీ తప్పుల జాబితాలో పెద్దనోట్ల రద్దు, ఉద్యోగాల సృష్టి జరగకపోవడం, పంటలకు కనీస మద్దతు దక్కపోవడం వంటివి ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ తప్పులన్న విషయం ప్రధాని అంగీకరించడం లేదని విమర్శించారు. చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పకపోగా మాటలతో మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. 11 ఏళ్లు గడిచిపోయానని, ఇప్పటిదాకా చేసిందేమీ లేదని ఆక్షేపించారు. డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలి లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా కొనసాగిస్తుండడాన్ని ఖర్గే తప్పుపట్టారు. రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలని సూచిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశానని చెప్పారు. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాల న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉన్న దాఖలాలు ఏనాడూ లేవని వెల్లడించారు. -
‘డిప్యూటీ స్పీకర్ పదవి’పై ప్రధానికి మల్లికార్జున ఖర్గే లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేవనెత్తింది. డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ పదవిని ఖాళీగా ఉంచడం భారత ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని, ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. జూలై 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఖర్గే ఈ డిమాండ్ చేశారు.‘లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీకి సంబంధించిన ఆందోళనకరమైన విషయంపై మీ దృష్టిని ఆకర్షించడానికే నేను ఈ లేఖ రాస్తున్నాను’అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధానికి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరినీ ఎన్నుకోవడానికి వీలు కల్పిస్తుంది. రాజ్యాంగపరంగా, డిప్యూటీ స్పీకర్ లోక్‌సభ స్పీకర్ తర్వాత రెండవ అత్యున్నత ప్రిసైడింగ్ అధికారి. సంప్రదాయంగా లోక్‌సభ రెండవ లేదా మూడవ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికవుతారని... లోక్‌సభలో కార్యనిర్వహణ, విధాన నియమాలలోని 8(1) నిబంధన ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు అనేది ఒకే తేడా అని ఖర్గే తెలిపారు.మొదటి లోక్‌సభ నుంచి పదహారవ లోక్‌సభ వరకు ప్రతి సభలో ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నారని ఖర్గే అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుల నుంచి డిప్యూటీ స్పీకర్‌ను నియమించడం ఒక ఆనవాయితీ అని... స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఈ పదవి వరుసగా రెండు లోక్‌సభ పర్యాయాలు ఖాళీగా ఉందని ఖర్గే విమర్శించారు. పదిహేడవ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కాలేదని.. ఇదే విధా నం పద్దెనిమిదవ లోక్‌సభలో కూడా కొనసాగుతోందన్నారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని.. ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఖర్గే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల సభ సంప్రదాయాలను, పార్లమెంటు ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో ఉంచుకుని, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు. -
‘ప్రధాని మోదీ దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’
న్యూఢిల్లీ: ఇటీవల పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సైతం ఫైటర్ జెట్స్‌ను కోల్పోయిందంటూ సీడీఎస్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ తన మాటల యుద్ధాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటివరకూ ఎన్ని ఫైటర్ జెట్స్ కోల్పోయాయో చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న కాంగ్రెస్.. సీడీఎస్ వ్యాఖ్యల అనంతరం తన స్వరాన్ని మరింత పెంచింది. సీడీఎస్ వ్యాఖ్యలను కోడ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ప్రెసిడెంట్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్ పూర్తయిన వెంటనే తాము ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేసి ఆ యుద్ధం వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేస్తే, మోదీ మాత్రం అలా చేయకుండా ఆపరేషన్ సిందూర్ సక్సెస్ ను మాత్రమే బహిరంగ సభల్లో చెప్పుకొస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి చాలా విషయాలను మాట్లాడిల్సి ఉందని, ఇందులో ట్రంప్ ట్వీట్ పై కూడా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే తాము ప్రత్యేక పార్లమెంట్ సెషన్ కోసం పట్టుబట్టామని, అది కేంద్ర ప్రభుత్వం చేయలేదంటూ మండిపడ్డారు. యుద్ధంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజలకు వివరించి దాని ముసుగు తొలగించాలని, ఇప్పటికైనా పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు మల్లిఖార్జున ఖర్గే. 1999లో కార్గిల్ వార్ సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిటీని సమీక్ష కోసం ఏర్పాటు చేశారని, ఇప్పుడు అదే తరహాలో ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: మన ఫైటర్ జెట్స్‌ను కోల్పోయాం: సీడీఎస్ -
‘మీరే చెప్పండి.. ఇది అచ్చేదిన్ కాదా?’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే విషం చిమ్ముతున్నారరంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మోదీ తన పాలనలో చేసిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా ఖర్గే జీ.. అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియా సమావేశం నిర్వహించారు లక్ష్మణ్,‘మోదీ పదకొండు ఏళ్ల పాలనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విషం చిమ్ముతున్నారు. ప్రపంచంలో పదవ స్థానంలో ఉన్న భారత్ ను మోదీ నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేశారు. మోదీ విధానాలు, కులం, వస్త్రాలపై రాహుల్ గాంధీ అవహేళన చేశారు. స్టాండప్, స్టార్టప్, మేక్ ఇన్ ఇండియాగా మోదీ తీర్చిదిద్దారు. ఉద్యోగాలు ఇవ్వడమే కాదు.. ఉద్యోగాలు కల్పించే వ్యవస్థలుగా యువతను తీర్చిదిద్దారు. జాతీయ రహదారులు, రైల్వే, వైమానిక రంగాలను అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ పాలన కన్నా వంద రెట్ల అభివృద్ధి మోదీ చేసి చూపించారు. నకిలీ విత్తనాలు అరికట్టి, కనీస మద్దతు ధరలు, సబ్సిడీలు మోదీ ప్రభుత్వం కల్పించింది. ఇది అచ్చేదిన్ కాదా ఖర్గే చెప్పాలి. ఓబీసీలపైన రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారు. మోదీ గ్లోబల్ లీడర్ గా ఎదిగారు.. ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో మోదీ తరహాలో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పారా?, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ దేశ రక్షణ రంగ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మల్లిఖార్జున్ ఖర్గే వాస్తవాలు గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. ముఖ్యమంత్రి డిల్లీలో మూడు రోజులు పడిగాపులు కాశారు. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే. కుటుంబ కలహాలు, ఆస్తుల పంపకాలు, వారసత్వ రాజకీయాల వల్లే బీఆర్ఎస్ లో కొట్లాట. బీజేపీ వెన్నుపోటు రాజకీయాలు చేయదు. ఆయుదాలు చేతిలో పట్టుకొని చర్చలు అంటే ఎట్లా?, ఆపరేషన్ సిందూర్ ను విమర్శిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు’ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది.. కేంద్రం ప్రకటన
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆపరేషన్ సిందూర్‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు ఆపరేషన్ సిందూర్ వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇక, వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.అఖిలపక్ష సమావేశంలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని అన్నారు. అనంతరం, కేంద్రమంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌ను అన్ని పార్టీలు సమర్థించాయి. కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఆపరేషన్ సిందూర్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతం. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేం. పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు’ అని చెప్పుకొచ్చారు.పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట భారత్ గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశమంతా ఐక్యంగా నిలబడాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని వినిపించింది. ఈ భేటీకి ముందు ప్రధాని మోదీ నివాసానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చారు. ప్రస్తుత భద్రతా పరిస్థితులను ప్రధానికి వెల్లడించారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరఫున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించారు.#WATCH | Centre holds all-party meeting to brief all political parties on #OperationSindoor pic.twitter.com/q96NZnhUY6— ANI (@ANI) May 8, 2025 -
ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే: ఖర్గే
ఢిల్లీ: సైనికులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భారత్ చేపట్టిన దాడుల నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ బుధవారం అత్యవసరంగా సమావేశం నిర్వహించింది.‘‘పీవోకే నుంచి ఉగ్రవాదులు పనిచేస్తున్నారనేది స్పష్టమైంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే. దేశ రక్షణ విషయంలో మనమంతా కలిసి ఉండాలి. సైనికులు తీసుకునే ప్రతి నిర్ణయానికీ మద్దతిస్తాం’’ అని ఖర్గే పేర్కొన్నారు.పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సైనిక దళాలను చూసి తాము గర్విస్తున్నామని ఖర్గే అన్నారు.కాగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూడు రోజుల ముందే తెలుసునంటూ నిన్న(మంగళవారం) మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పర్యాటకులపై దాడి జరగబోతున్నట్లు మోదీకి ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని.. అందుకే ఆయన జమ్మూకశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. నిఘా వైఫల్యం వల్లే పహల్గాంలో ఉగ్రదాడి జరిగినట్లు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, మోదీ సైతం స్వయంగా ఒప్పుకున్నారంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. -
పహల్గామ్ ఘటన: ‘మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?’
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందిందని, . నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది భద్రతా దళాల నైతిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నమంటూ జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఆ వాదనకు ఎటువంటి ఆధారం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబులాల్ మరాండ్ సైతం స్పందించారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. అసలు కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ నిలదీశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్‌పై పోరాటం కీలక దశలో ఉన్నప్పుడు ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిగా ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదంపై, పాకిస్తాన్ పై పోరులో దేశం మొత్తం కలిసే ఉందని ఒకవైపు చెబుతూనే, మరొకవైపు ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న ఖర్గే ఇలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటన్నారు.కాగా, జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. -
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు
-
‘పహల్గాం ఉగ్రదాడి గురించి కేంద్రానికి ముందే తెలుసు’.. ఖర్గే సంచలన ఆరోపణలు
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు.పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. Watch: Congress President Shri @kharge addresses the Samvidhan Bachao Rally in Ranchi, Jharkhand. https://t.co/wRfrg2XD99— Congress (@INCIndia) May 6, 2025 -
ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం: మల్లికార్జున ఖర్గే
ఢిల్లీ : దేశ భద్రత విషయంలో మొత్తం విపక్షం కేంద్రానికి మద్దతుగా నిలుస్తుందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రపంచానికి కూడా ఇదే సందేశం ఇచ్చామన్నారాయన. ఈరోజు(శుక్రవారం) జరిగిన సీడబ్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన వ్యూహం కనిపించలేదు. రాహుల్ గాంధీ కాన్పూర్ లో చనిపోయిన శుభం ద్వివేదీ కుటుంబాన్ని కలిశారు. చనిపోయిన వారికి ‘అమరుల’ హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.దేశ భద్రత విషయంలో మొత్తం విపక్షం కేంద్రానికి మద్దతుగా నిలుస్తుంది. ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం. మోదీ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. ఇది రాహుల్ గాంధీ దీర్ఘకాలిక ఉద్యమ ఫలితమే. ఆయన “భారత్ జోడో న్యాయ యాత్ర” ద్వారా దీనిని ప్రధాన అజెండాగా మార్చారు. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటికే కుల సర్వే పూర్తి చేశాయి.50% రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేయాలి. గణన నుండి వచ్చిన సమాచారాన్ని ప్రభుత్వం మంచి పాలన కోసం ఉపయోగించాలి.కులగణన కచ్చితంగా జరగాలి. ఫలితాలను అమలు చేయాలి. పాలసీలు, చట్టాలు దానికి అనుగుణంగా ఉండాలి. 2021 సాధారణ జనగణన కూడా జరగలేదు. ఇప్పటికీ 2011 డేటానే ఉపయోగిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క రిజర్వేషన్ వ్యతిరేక దృక్పథమే ఈ ఆలస్యం వెనుక కారణం’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. -
ఐక్యత చాటాల్సిన తరుణమిది.. మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ
న్యూఢిల్లీ: పహల్గాం దాడి నేపథ్యంతో ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. ఇటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వేర్వేరు ఈ ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)కి లేఖలు రాశారు.2025 ఏప్రిల్ 22న పహల్గాం ఘటన(Pahalgam Incident)లో అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ తరుణంలో ఐక్యత, సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్ ఉభయ సభలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించండి. తద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే మన సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది అని ఖర్గే(Kharge) తన లేఖలో ప్రస్తావించారు.Congress President and Leader of the Opposition in the Rajya Sabha Shri Mallikarjun Kharge has written to the PM last night requesting that a special session of both Houses of Parliament be convened at the earliest to demonstrate a collective will to deal with the situation… pic.twitter.com/v3F5unn6I8— Jairam Ramesh (@Jairam_Ramesh) April 29, 2025ఇక తన లేఖలో రాహుల్ గాంధీ.. ప్రియమైన ప్రధానిగారూ.. పహల్గాం ఉగ్రదాడితో ప్రతీ భారతీయుడు రగిలిపోతున్నాడు. ఇలాంటి క్లిష్టతరుణంలో ఉగ్రవాదానికి మనమెంత వ్యతిరేకమో చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. ఐక్యత ప్రదర్శించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. అది పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మాత్రమే సాధ్యపడుతుందని ప్రతిపక్షంగా మేం భావిస్తున్నాం. ఇక్కడే ప్రజాప్రతినిధులు తమ ఐక్యతను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించగలరు. కాబట్టి వీలైనంత త్వరగా సమావేశం నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అని రాహుల్ గాంధీ(Rahul gandhi) రాశారు. My letter to PM Modi requesting a special session of both houses of Parliament to be convened at the earliest. At this critical time, India must show that we always stand together against terrorism. pic.twitter.com/7AIXGqBqTl— Rahul Gandhi (@RahulGandhi) April 29, 2025ఇదిలా ఉంటే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4వ తేదీల మధ్య రెండు దఫాలుగా జరిగాయి. ఇక తరువాత జులైలో వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రతిపక్ష విజ్ఞప్తికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.పహల్గాం దాడి తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో.. విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పార్టీ లైన్ దాటొద్దు.. కాంగ్రెస్ నేతలకు అధిష్టానం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం దాడులపై పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని స్పష్టం చేసింది. తాజాగా కొందరు కాంగ్రెస్ నేతలు దాడులపై చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేవి ఉన్నాయని పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నాం 2.30గం. ప్రాంతంలో సైన్యం దుస్తుల్లో వచ్చిన ఐదారుగురు ఉగ్రవాదులు.. పహల్గాం బైసరన్లోయ పిక్నిక్ స్పాట్లో పర్యాటకుల్ని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఒక స్థానికుడితో సహా 25 మంది టూరిస్టులు కన్నుమూశారు. అయితే ఈ దాడిని పార్టీలకతీతంగా రాజకీయ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదమే చోటు చేసుకుంది. పహల్గాం దాడి వెనుక నిఘా వర్గాల వైఫల్యం ఉండొచ్చని, ఏ దేశం కూడా వంద శాతం ఇలా దాడులను పసిగట్టకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ శశిథరూర్‌పై తీవ్రంగా స్పందించారు. థరూర్ కాంగ్రెస్‌లో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘సూపర్ బీజేపీ మ్యాన్’గా మారేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే..ఈ పరిణామాలను అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇతర నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఇద్దరు నేతలను మందలించినట్లు కూడా ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. -
KSR Live Show: మాయ మాయ అంతా మాయ.. ఈవీఎంలపై కొత్త రగడ
-
అంబేడ్కర్‌కు బీజేపీ–ఆర్ఎస్ఎస్ శత్రువులు: ఖర్గే
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై ఎటువంటి అభిమానం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వం అంబేడ్కర్ కృషిని ప్రశంసించడం కేవలం మాటలకే పరిమితమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. వాస్తవానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అంబేడ్కర్‌కు శత్రువులని ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందంటూ ప్రధాని మోదీ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఈ మేరకు స్పందించారు. 1952 ఎన్నికల్లో తన ఓటమికి కమ్యూనిస్ట్ నేత ఎస్ఏ డాంగే, హిందుత్వ వాది వీడీ సావర్కర్లే కారణమంటూ బీఆర్ అంబేడ్కర్ రాసిన ఒక లేఖను ఈ సందర్భంగా ఖర్గే మీడియాకు చూపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దక్కేలా డాక్టర్ అంబేడ్కర్ పౌరులకు రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారని కొనియాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కులగణనను వెంటనే చేపట్టాలన్నారు. ప్రభుత్వం పథకాలను అమలు చేసేందుకు ఇప్పటికీ 2011 జనగణనే ఆధారంగా చేసుకుంటోందని తెలిపారు. 2021లో చేపట్టాల్సిన జనగణన ప్రస్తావనను ప్రభుత్వం తేవడం లేదన్నారు. జనగణన, కులగణనను చేపట్టి సమాజంలోని అన్ని వర్గాలకు సమ న్యాయం చేయాలన్నారు. -
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్! -
పనిచేయండి లేదా వైదొలగండి
అహ్మదాబాద్: అత్యంత కీలకమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) జాతీయ సమావేశం వేళ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టీలో సంస్కరణల ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతూ పనిచేయని నేతలు పక్కకు తప్పుకోవాలని హితవు పలికారు. అప్పగించిన బాధ్యతలను విస్మరిస్తున్న నేతలు రాజకీయ సన్యాసం చేయాలని కటువుగా మాట్లాడారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతీ నదీ తీరంలో బుధవారం జరిగిన 84వ ఏఐసీసీ జాతీయ సమావేశంలో ఖర్గే సుదీర్ఘ ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీకి సాయపడకపోతే తప్పుకోండి ‘‘పార్టీకి ఉపయోగపడని నేతలు తప్పుకోవాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. పదవుల్లో అలంకారప్రాయంగా తిష్టవేసిన నేతలు రాజకీయ సన్యాసం చేయాలి. పార్టీని బలోపేతం చేయడంలో జిల్లా కాంగ్రెస్ కమిటీలది ఇకపై అత్యంత క్రియాశీలక పాత్ర. డీసీసీ అధ్యక్షులకు అదనపు అధికారాలను కట్టబెడతాం. కొత్త డీసీసీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు అత్యంత ప్రతిభావంతులైన నేతలతో బూత్ కమిటీ, మండల్ కమిటీ, బ్లాక్ కమిటీ, జిల్లా కమిటీలను ఎన్నుకోవాలి. ఈ ప్రక్రియలో వివక్షకు తావులేదు. అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియలో జిల్లా అధ్యక్షులనూ భాగస్వాములను చేస్తాం’’ అని అన్నారు. ‘‘ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ ఇలాగే అక్రమంగా గెలిచింది. అందుకే మళ్లీ బ్యాలెట్ పేపర్‌కు మారడం ఉత్తమం. పార్టీలు ఎన్నికల ప్రక్రియలో అవకతవకలను ఎత్తిచూపితే వాటిని ఆపాల్సిన ఎన్నికల సంఘం ఆ పార్టీలనే తప్పుబడుతోంది. 500 ఏళ్లనాటి పాత విషయాలను తవి్వతీసి మతవిద్వేషాలను బీజేపీ ప్రభుత్వం రాజేస్తోంది’’ అన్నారు. ‘‘మరో స్వాత్రంత్య్ర పోరాటానికి వేళైంది. అన్యాయం, అసమానత, వివక్ష, పేదరికం, మతతత్వం అనే శత్రువుల చెర నుంచి దేశానికి స్వాతంత్య్రం తీసుకొద్దాం. గతంలో విదేశీపాలకులు ఈ అన్యాయం, అసమానత, వివక్షలను ఎగదోస్తే ఇప్పుడు సొంత(బీజేపీ) ప్రభుత్వమే ఈ దారుణాలకు ఒడిగడుతోంది. నాడు విదేశీయులు మతతత్వాన్ని అనుకూలంగా మల్చుకున్నారు. ఇప్పటి(బీజేపీ) ప్రభుత్వాలూ అదే పనిచేస్తున్నాయి. నాడు గెలిచాం. నేడూ గెలిచి తీరతాం’’ అని ఖర్గే అన్నారు. ప్రైవేటీకరణపై.. ‘‘మోదీ సర్కార్ ఇటీవలికాలంలో అవకాశం చిక్కిన ప్రతిసారీ కొత్త నినాదం ఇస్తోంది. ప్రజల దృష్టి మరల్చడమే వాళ్ల అసలు ఉద్దేశం. ప్రజాస్వామ్యాన్ని చాలా నెమ్మది నెమ్మదిగా అంతంచేస్తున్నారు. దేశ సంపదను కొద్దిమంది బడా వ్యాపారవేత్తలకే ధారాదత్తం చేస్తున్నారు. మొత్తం ప్రైవేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను నిరుపయోగంగా మారుస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మోదీ ప్రభుత్వం, మోదీ కలసి ఏకంగా దేశాన్నే అమ్మేయడం ఖాయం. లోక్‌సభలో విపక్షనేతకే పార్లమెంట్లో మాట్లాడే అవకాశం దక్కకపోతే ఇక ప్రజల వాణి ఎలా పార్లమెంట్లో ప్రతిధ్వనించగలదు?’’ అని లోక్‌సభ స్పీకర్‌ను పరోక్షంగా ఖర్గే విమర్శించారు. తొలిసారిగా ‘గుజరాత్’ తీర్మానం సాధారణంగా ఏఐసీసీ సమావేశంలో జాతీయ అంశాలపై కాంగ్రెస్ నేతలు తీర్మానాలు చేస్తారు. కానీ పార్టీ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రం(గుజరాత్)ను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేక తీర్మానం చేయడం గమనార్హం. గుజరాత్లో దాదాపు 30 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పునర్వైభవమే లక్ష్యంగా ‘‘ గుజరాత్లో కాంగ్రెస్ ఎందుకు ఆవశ్యమంటే?’ పేరిట ఈ తీర్మానం చేశారు. ‘నూతన గుజరాత్, నూతన కాంగ్రెస్’ నినాదంతో ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నిర్ణయించింది. పార్టీకి గెలిపిస్తే గుజరాత్లో సామాజిక న్యాయమే ధ్యేయంగా దళితులు, గిరిజనులు, ఓబీసీలు, మైనారిటీల్లో కులగణన చేపడతామని పార్టీ హామీ ఇచ్చింది. న్యాయపథ్ పేరిట మరో కీలక తీర్మానాన్నీ పార్టీ ఆమోదించింది. ‘‘ ప్రజలందరి ఐక్యత సాధనే కాంగ్రెస్ జాతీయత. ప్రభుత్వం ముస్లింలు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ వర్గాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేయడంతోపాటు ఘోర నేరానికి పాల్పడుతోంది’’ అని తీర్మానించారు.క్రైస్తవులు, సిక్కుల హక్కులనూ హరిస్తారు: రాహుల్ సమావేశంలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడారు. ‘‘ వక్ఫ్ చట్టం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. మతస్వేచ్ఛపై దాడి ఇది. బీజేపీ–ఆర్ఎస్ఎస్లు త్వరలోనే క్రైస్తవులు, సిక్కుల మత హక్కులనూ హరించబోతున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ మేగజైన్లో వ్యాసం చదివితే మీకూ ఈ విషయం అర్థమవుతుంది. ట్రంప్ సృష్టించిన సుంకాల సునామీ భారత్‌ను చుట్టేయనుంది. వైట్‌హౌస్‌లో మోదీ, ట్రంప్ ఫొటో సెషన్ గమనించారా?. ఈసారి ప్రేమగా హత్తుకోవడానికి బదులు సుంకాలతో సరిపెడతానని మోదీ ముఖంమీదే ట్రంప్ చెప్పారు. అయినా మోదీ ఒక్కమాట మాట్లాడలేకపోయారు. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్ మోదీ ఎదుటే భారత్‌పై అభాండాలు మోపుతుంటే ప్రధాని నోట మాట రాలేదు. 56 అంగుళాల ఛాతీ ఎటుపోయింది?’’ అని మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ పొగిడారు. ‘‘ కులగణన ద్వారా దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచీగా మారింది. ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల ఫలాలు ఇస్తోంది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి గోడను కేంద్రంలో మేం బద్దలుకొడతాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు. -
ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు రావాల్సిందే: ఖర్గే
అహ్మదాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలతో మునుపెన్నడూ లేనివిధంగా బీజేపీ మోసానికి పాల్పడి గెలిచిందని, ఈరోజు కాకపోయినా రేపైనా వాస్తవాలు బయటపడతాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. ఈ క్రమంలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను తిరిగి తీసుకురావాల్సిందేనని గట్టిగా గళం వినిపించారాయన. బుధవారం ఏఐసీసీ సమావేశంలో పార్టీ కేడర్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఖర్గే.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ల వైపు మళ్లుతోంది. కానీ, మనం ఇంకా ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాం. ఇదే అతి పెద్ద మోసం. టెక్నాలజీని ఉపయోగించుకుని ఈవీఎంలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మళ్లీ.. ఈవీఎంల మోసాల్ని నిరూపించాలని వాళ్లే మమ్మల్ని అడుగుతున్నారు. ఈ విషయంలో యువతరం మేల్కొవాలి. బ్యాలెట్ పేపర్లు కావాలని ముందుకు వచ్చి పోరాడాలి. మహారాష్ట్రలో ఏం జరిగింది?. ఈవీఎంలతో అతిపెద్ద మోసం జరిగింది. అక్కడ ఎలాంటి ఓటర్ల జాబితాను రూపొందించారు?. బీజేపీ 90 శాతం సీట్లు ఎలా నెగ్గింది?. ఎన్నికల చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరగలేదు. అసలు మహారాష్ట్ర ఎన్నికలే పెద్ద మోసం. ఈ అంశాన్ని మేం దాదాపు ప్రతీ చోటా ప్రస్తావించాం. రాహుల్ గాంధీ గట్టిగా గళం వినిపించారు. హర్యానాలోనూ అదే జరిగింది. మా లాయర్లు, నేతలు.. ఆ దొంగలను దొరకబట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఏదో ఒకనాటికి వాస్తవాలు బయటపడక తప్పదు.చట్టసభల్లో ప్రతిపక్షంగా మన గళం వినిపించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏకపక్షంగా కేంద్రం బిల్లులను ఆమోదించుకుంటోంది. అలాంటప్పుడు ప్రజల గొంతుకను ఎలా వినిపిస్తాం?. అమెరికా టారిఫ్‌ల మీద చర్చకు అవకాశం ఇవ్వలేదు. మణిపూర్‌పై వేకువ జామున 4 గంటలకు చర్చిస్తామన్నారు. ఉదయం చర్చించాలని నేను అడిగితే తిరస్కరించారు. ప్రభుత్వం ఏదో దాస్తుందో కాబట్టే ఇలాంటి పనులు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నెమ్మది నెమ్మదిగా అంతం చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగం మీద గత 11 ఏళ్లు దాడి జరుగుతూనే ఉంది. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం పలు సంస్థలను స్థాపించింది. కానీ, ప్రభుత్వ సంస్థలను మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేట్ వ్యక్తులపరం చేసింది. జాతి ప్రయోజనాల కంటే.. ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలే ముఖ్యంగా ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఆఖరికి.. రిజర్వేషన్లనూ ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నంలో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే దేశాన్ని అమ్మేసే ప్రమాదం లేకపోలేదు. బీజేపీ ఆరెస్సెస్‌లు మతపరమైన అంశాలతో వివాదాలు సృష్టించాలనుకుంటున్నాయి. మసీదుల కింద శివలింగాలను వెతకడం లేదంటూనే ఆ పని చేస్తున్నారు. ప్రధాని మోదీ మంట పెడితే.. ఆరెస్సెస్ దానికి ఆజ్యం పోస్తోంది. రాజస్థాన్ ఆల్వార్ ఘటనతో బీజేపీ దళిత వ్యతిరేక ధోరణి బయటపడింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సౌజ్ డ్యూటీ సుంకాలు పెంచడం, గ్యాస్ ధరలను పెంచడం ద్వారా ప్రజల నడ్డి విరుస్తున్నారు. దేశంలో అత్యాచారాలు పెరిగిపోతుంటే.. అమిత్ షా కఠిన చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు?. పలు రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారు. తమిళనాడు గవర్నర్‌పై సుప్రీం కోర్టు తీర్పు ఒక చెంపపెట్టు. ప్రజాహితం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు పలు చట్టాలు చేశాయి. భూసేకరణ చట్టం, నిర్భంద విద్య, అటవీ రక్షణ చట్టాలు చేసింది. ఈ అంశాలపై మనం పోరాడాల్సిన అవసరం ఉంది.ఇక డీసీసీలదే పవర్ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పవర్స్ కట్టబెట్టింది. ఇక నుంచి అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీలదే నిర్ణయమని వెల్లడించింది. ఇది ఏఐసీసీ నిర్ణయంగా ఖర్గే బుధవారం ప్రకటించారు. -
‘ప్లీజ్ సార్.. నాకూ అవకాశం ఇవ్వండి’
న్యూఢిల్లీ, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో.. తెలంగాణ రాజకీయం హైదరాబాద్ నుంచి హస్తినకు మారింది. త్వరలో కేబినెట్ విస్తరణ ఉండనున్న నేపథ్యంలో మంత్రి పదవుల కోసం ఆశావహులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తో అధిష్టానం చర్చలు పూర్తి చేసినప్పటికీ ‘చివరి అవకాశం’గా భావిస్తున్న కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో.. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడిగా చర్చ నడుస్తోంది. తెలంగాణ కేబినెట్లో చోటు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తోంది. ఎలాగైనా మంత్రిపదవిని ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ పెద్దల ఇల్లు, కార్యాలయాల చుట్టూ కొందరు ఎమ్మెల్యేలు పదే పదే చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, బాలు నాయక్ , మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహా పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు కేబినెట్లో చోటు కల్పించాలని మాధవరెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల సమావేశం తర్వాత ఆయన అధిష్టాన పెద్దలను కలుస్తారని సమాచారం. మరోవైపు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ ముసాయిదాపై జరగున్న సమావేశంలో పాల్గొననున్న భట్టి.. జాతీయ నేతలను కలసి మంత్రివర్గంలో తన వారి కోసం ప్రయత్నాలు చేస్తారనే ప్రచారం నడుస్తోంది. మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో నాలుగు నుంచి ఐదు భర్తీ చేస్తారని తెలుస్తోంది. అతిత్వరలోనే(ఏప్రిల్ 3వ తేదీ అని ప్రచారం) మంత్రివర్గ విస్తరణ ఉండనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
పార్లమెంట్‌ను కుదిపేసిన డీకే శివకుమార్ వ్యాఖ్యలు
బెంగళూరు/న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు.. సోమవారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేశాయి. డీకేఎస్ వ్యాఖ్యలతో రాజ్యాంగాన్నే మార్చేయాలన్న కాంగ్రెస్ మనస్తత్వం బయటపడిందని బీజేపీ విమర్శించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి కౌంటరే ఇచ్చింది. ఈ క్రమంలో రాజ్యసభ 2గం.దాకా కార్యకలాపాలకు దూరంగా ఉండగా, లోక్‌సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది.కర్ణాటక ప్రభుత్వం మైనారిటీ కోటా కింద కాంట్రాక్టులలో నాలుగు శాతం ముస్లింలకు కేటాయించడంపై బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలతో పార్లమెంట్‌ను వేడెక్కించాయి. ప్రత్యేకించి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డా అన్నారు. ‘‘మతం పేరుతో రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించలేదు. మైనార్టీలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది. ఇలాంటి చట్టాలను(కర్ణాటక తెచ్చిన చట్టం గురించి ప్రస్తావిస్తూ..), విధానాలను ఉపసంహరించుకోవాలి. బీఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరు’’ అని నడ్డా అన్నారు.అయితే.. నడ్డా వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తానని డీకే శివకుమార్ అనలేదని.. ఆ మాటకి వస్తే బీజేపీ నేతలే రాజ్యాంగంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతేకాదు.. గతంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భారత రాజ్యాంగాన్ని మారుస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.ఈ అంశం ఇటు లోక్‌సభలోనూ దుమారం రేపగా.. సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజ్జు డీకేఎస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ ఎంపీలు కౌంటర్లతో సభ హీటెక్కింది. మతపరమైన రిజర్వేషన్లు.. ప్రత్యేకించి ముస్లింల కోసం రాజ్యాంగానికి కొన్ని మార్పులు అవసరం అని శివకుమార్ అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను అనలేదని తాజాగా నడ్డా విమర్శల నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. బీజేపీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. నేను JP నడ్డా కంటే ఎక్కువ సెన్సిబుల్, సీనియర్ పొలిటీషియన్ అని అన్నారు. నేను గత 36 ఏళ్లుగా అసెంబ్లీలో ఉన్నాను. నాకు ప్రాథమిక ఇంగితజ్ఞానం ఉంది. వివిధ నిర్ణయాల (కోర్టు ద్వారా) తర్వాత మార్పులు ఉంటాయని క్యాజువల్‌గా చెప్పాను. రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని నేను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. మాది జాతీయ పార్టీ. మా పార్టీ ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకువచ్చింది అని అన్నారాయన. -
‘పెద్దల’ సభలో మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఈరోజు(మంగళవారం) చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆయన ఎట్టకేలకు దిగిచ్చారు. తాను చేసినవ్యా ఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, అందుకు క్షమాపణలు తెలుపుతున్నానని అన్నారు. దీనిలో భాగంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్కఉ క్షమాపణలు చెప్పారు.జాతీయ ఎడ్యుకేషన్ పాలసీపై తాము చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మంత్రి ధర్మంద్ర ప్రదాన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే ప్రభుత్వాని తోసి వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు అవమానకంగా ఉన్నాయని, అసభ్య పదజాలాన్ని వాడారని, అది క్షమించరానిదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.ఆ వ్యాఖ్యలకు కచ్చితంగా ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు అదే సమయంలో ఆయన వాడిన పదాన్ని కూడా రికార్డులనుండి తొలగించాలన్నారు. దాంతో దిగి వచ్చిన ఖర్గే.. రాజ్యసభ చైర్మన్ కు క్షమాపణలు తెలియజేశారు. ‘నేను ఇక్కడ సభను ఉద్దేశించో, లేక మిమ్మల్ని( రాజ్యసభ చైర్మన్ చైర్)ను ఉద్దేశించో ఆ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ప్రభుత్వ విధానాలపైనే ఆ వ్యాఖ్యలను చేశాను. ఆ వ్యాఖ్యలు మీకు అభ్యంతరకరంగా ఉంటే వెనక్కి తీసుకుంటాను. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని ఖర్గే పేర్కొన్నారు.ఇదిలా ఉంటే, తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తమిళిలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది మా ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. -
TG: తుది దశకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
ఢిల్లీ ; తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎంఎల్సీ అభ్యర్థుల ఖరారు అంశం తుది దశకు వచ్చింది ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరూ గంటన్నర పాటు సమావేశమై తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేశారు. దీనిలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో వీరు ఫోన్ లో మాట్టాడారు. ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ్ ల చర్చలు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ బరిలో ఓసీ వర్గం నుంచి పరిశీలను నరేందర్ రెడ్డి, కుసుమ కుమార్, కుమార్ రావ/ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, బీసీల నుండి ఇరపత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్సీటీ జైపాల్, గాలి అనిల్ లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఎస్సీల నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మడి సాంబయ్య, రాచమల్లు సిద్దేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. -
మల్లికార్జున్ ఖర్గే (ఏఐసీసీ ప్రెసిడెంట్) రాయని డైరీ
ఇందిరా భవన్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉన్నాం అందరం. అంతా ఆలిండియా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీలు, స్టేట్ ఇంఛార్జిలు, కొత్త సీడబ్ల్యూసీ సభ్యులు, పార్టీలోని ఇతర మహామహులు. ‘చెప్పండి’ అన్నట్లు వారి వైపు చూశాను. ఎప్పటిలా, ‘మీరే చెప్పండి ఖర్గేజీ’ అన్నట్లేమీ వారునా వైపు చూడలేదు. ఎవరి వైపు వాళ్లు చూసుకుంటూ ఉన్నారు! బహుశా అది ఆత్మ పరిశీలనావస్థ కావచ్చు. పార్టీ లీడర్ రాహుల్, జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ నా పక్కనే ఇటొకరు, అటొకరు కూర్చొని ఉన్నారు. ‘‘ఎవరైనా హ్యాట్రిక్ కొట్టి హీరోలు అవుతారు. మనం ‘జీరో’లు కొట్టి హ్యాట్రిక్ సాధించాం!’’ అన్నాను అందర్నీ యాక్టివేషన్ మోడ్‌లోకి తీసుకొస్తూ. వెంటనే రాహుల్ స్పందించారు. ‘‘ఖర్గేజీ, ఐపీఎల్లో ఆర్సీబీ ఎంత గొప్పగా ఆడుతుందో మీకూ తెలుసు. కానీ ఒక్కసారైనా ఆ జట్టు గెలిచిందా?’’ అన్నారు మెల్లగా నా చెవిలో. ఆర్సీబీ జట్టుది కర్ణాటకే, కాంగ్రెస్ అధ్యక్షుడిదీ కర్ణాటకే అనే భావన నాలో కలిగించటం ద్వారా ఆయన నాకు ఊరటనివ్వ దలిచారా!‘‘గొప్పగా ఆడటం గెలుపౌతుందా రాహుల్ బాబు. గెలిస్తేనే కదా గొప్పగా ఆడినట్లౌతుంది’’ అన్నాను రాహుల్ చెవిలో. ఇలా చెవుల్లో మాట్లాడుకునే సంప్రదాయం కాంగ్రెస్‌లో గాంధీ, నెహ్రూ, పటేల్‌ల కాలం నుంచే ఉన్నా, నలుగురి ముందు చెవుల్లో చెవులు పెట్టటం నాకు ఇష్టం ఉండదు. రాహుల్ నా చెవిలో మాట్లాడారు కాబట్టి ఆయన్ని రెస్పెక్ట్ చెయ్యటం కోసం నేనూ ఆయన చెవిలో మాట్లాడానంతే. ‘‘అంకుల్...’’ అని చెయ్యి లేపారు ప్రియాంక. ‘‘చెప్పమ్మా ప్రియాంకా...’’ అన్నాను.‘‘అంకుల్... మనమూ కొట్టాం కదా హ్యాట్రిక్. షీలా దీక్షిత్ ఆంటీ వరుసగా మూడుసార్లు ఢిల్లీ సీఎంగా ఉండలేదా?’’ అన్నారు.‘కానీ సీఎంగా హ్యాట్రిక్ కొట్టటం వేరు, వరుసగా ఒక్క సీటైనా గెలవకుండా హ్యాట్రిక్ కొట్టటం వేరు కదా తల్లీ’ అని నేను ప్రియాంకతో అనలేదు. ఈలోపు – జైరాం రమేశ్ యాక్టివేట్ అయ్యారు!‘‘హ్యాట్రిక్‌గా మనం ఎందుకు ఓడిపోతూ వచ్చామో ఎంతగా అంతర్మథనం చేసుకున్నా అర్థం కావటం లేదు ఖర్గేజీ. ఢిల్లీకి షీలా దీక్షిత్ ఎన్నెన్ని చేశారు! అసలు ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అంతు చిక్కటం లేదు’’ అన్నారు జైరాం రమేశ్, సహనం కోల్పోయిన సాధువులా!‘‘అంతా బాగున్నా ఎందుకీ ప్రజలు మార్పు కోరుకుంటారో!’’ అన్నారు వేణుగోపాల్, తనూ ఆశ్చర్యపోతూ. ‘‘అంతా బాగుండబట్టే మార్పును కోరుకుంటారు వేణూజీ. అన్ని పార్టీలూ అన్నీ ఇస్తున్నప్పుడు అన్నీ ఇచ్చే అవకాశాన్ని ఎప్పుడూ ఒకే పార్టీకి ఎందుకివ్వాలి అని ప్రజలు అనుకుంటారు. ఢిల్లీ ప్రజలు 26 ఏళ్ల తర్వాత మళ్లీ బీజెపీని ఎన్ను కున్నారు. ఏమో, వచ్చే ఎన్నికల్లో బీజేపీని మార్చి మనల్ని గెలిపించినా గెలిపించవచ్చు’’ అని వెనుక సీట్లోలోంచి ఎవరో అన్నారు!‘‘ఎవరతను గోపాల్జీ... ఆశలు చిగురించేలా మాట్లాడాడు’’ అని అడిగాను... సాయంత్రం కాన్ఫరెన్స్ ముగిశాక వేణుగోపాల్‌తో పాటుగా ఇందిరా భవన్ నుంచి బయటికి నడుస్తూ. ‘‘కుర్రాడు కమిటీలోకి కొత్తగా వచ్చాడు ఖర్గేజీ. గ్రాస్రూట్స్ నుంచి తెచ్చాం’’ అన్నారు వేణుగోపాల్.ఒక్క క్షణం అలా నిలబడి పోయాను. ‘‘ఏంటి ఖర్గేజీ?’’ అని అడిగారు వేణుగోపాల్.‘‘ఏం లేదు గోపాల్జీ. మన లీడర్స్ అందరినీ వెంటనే ఏ ఫ్లయిట్ దొరికితే ఆ ఫ్లైట్‌లో గ్రాస్రూట్స్కి పంపించండి’’ అని చెప్పి, వచ్చేశాను. -
అండగా ఉన్నోళ్లనే అక్కున చేర్చుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ భావజాలానికి కట్టుబడి, ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీకోసం నిలబడిన వ్యక్తులను ప్రోత్సహించాలని, కష్ట సమయాల్లో పార్టీని వీడిన నేతలను దూరం పెట్టాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ‘పార్టీకి సైద్ధాంతికంగా కట్టుబడి ఉన్న వ్యక్తులను ప్రోత్సహించండి. కష్ట సమయాల్లో పారిపోయే బలహీనులకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా కష్టకాలంలో పార్టీని వీడిన నేతలను తొందరపడి చేర్చుకుంటారు. మనం అలాంటి వ్యక్తులను దూరం పెడదాం’ అని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జీలతో ఖర్గే సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టత, భవిష్యత్ ప్రణాళికలపై ఆ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. ‘పార్టీని బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతంం చేసే బాధ్యతను ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు తీసుకోవాలి. ఈ పని కోసం మీరే బూత్‌కు వెళ్లాలి. కష్టపడి పనిచేయాలి. కార్మికులతో సంభాషించాలి. పార్టీ విభాగాలతో చర్చించాలి. సంస్థ పునర్ నిర్మాణంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) ని భాగస్వామ్యులను చేయండి’’ అని ఖర్గే సూచించారు. ‘‘రాష్ట్రాల్లో పార్టీ నిర్వహణ, భవిష్యత్తు ఎన్నికల ఫలితాలకు ఆయా రాష్ట్రాల ఇన్‌ఛార్జీలే బాధ్యత వహించాలి. ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల సమయంలో మన పార్టీ మద్దతుదారుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడమో లేక ఆ పేరును మరో బూత్‌లోకి మార్చడమో చేస్తున్నారు. ఈ రిగ్గింగ్‌ను ఎలాగైనా మనం ఆపాలి’’ అని ఖర్గే పిలుపునిచ్చారు. -
కులగణనే కొలమానం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వంలోగానీ, పార్టీలోగానీ ఇకముందు తీసుకునే విధానపర నిర్ణయాలన్నింటికీ కులగణనే(caste census) ప్రాతిపదికగా ఉండాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(mallikarjun kharge)తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జరిపిన భేటీలో నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, నిధుల కేటాయింపుల్లో కులగణన లెక్కలను కొలమానంగా తీసుకుని ముందుకెళ్లాలని.. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు నామినేటెడ్ పోస్టులు, పీసీసీ పదవుల భర్తీ దాకా ఇదే ఫార్ములాను అనుసరించాలని నిశ్చయానికి వచ్చినట్టు తెలిపాయి.రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు శుక్రవారం ఖర్గేతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఖర్గే కార్యాలయంలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం పీసీసీ కూర్పుపై కేసీ వేణుగోపాల్‌తోనూ నేతలు విడివిడిగా భేటీ అయి తమ అభిప్రాయాలను వెల్లడించారు. కులగణన దేశానికి నమూనా కావాలి రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణలకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన అంశాన్ని రాష్ట్ర నేతలు ఖర్గేకు వివరించారు. దీనిపై రాష్ట్రంలోని నిమ్న వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి మూడు, నాలుగు జిల్లాలకు కలిపి ఒక సభను ఏర్పాటు చేస్తామని.. ఆ సభలకు హాజరుకావాలని ఖర్గేను కోరారు. ఇందులో ఎస్సీ వర్గీకరణ అంశంపై గజ్వేల్‌లో నిర్వహించే సభకు వచ్చేందుకు ఖర్గే ఒకే చెప్పినట్టు తెలిసింది.‘‘జనాభా ప్రాతిపదికన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నది నాతోపాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రధాన ఉద్దేశం. కులగణనతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం. విద్య, ఉద్యోగం, ఉపాధి, నిధుల కేటాయింపులలో ఓబీసీ, గిరిజన, దళితులు, మైనార్టీలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు ఉండాలి...’’అని ఖర్గే సూచించారని సమాచారం.తెలంగాణలో కులగణన, దాని ఆధారంగా అమలు చేసే అంశాలు దేశానికే దిక్సూచిగా నిలవాలని పేర్కొన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సైతం ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణను పూర్తి చేసిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు ఖర్గే సూచించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రానివ్వొద్దు.. ఇటీవల కొందరు ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ అంశం కూడా ఖర్గే వద్ద ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఒకరిద్దరు మంత్రుల తీరు నచ్చక జరిగిన ఈ భేటీతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దీన్ని ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చకు పెట్టిందని నేతలు ప్రస్తావించారని సమాచారం. అయితే దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యేలతో మాట్లాడామని... ఏ విషయమైనా నేరుగా తమతోగానీ, అధిష్టానం పెద్దలతోగానీ మాట్లాడొచ్చని సూచించామని దీపాదాస్ మున్షీ, రేవంత్‌రెడ్డి వివరించినట్టు తెలిసింది.ఈ క్రమంలో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రానివ్వొద్దని, వారితో ఎప్పటికప్పుడు చర్చించుకోవాలని, రెండు, మూడు నెలలకోసారి సీఎల్పీ భేటీలు నిర్వహించుకోవాలని ఖర్గే సూచించారని సమాచారం. బీఆర్ఎస్ బలంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి వదంతులు, తప్పుడు సంకేతాలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేసినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు పాలనకు పరీక్ష అని.. ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఖర్గే పేర్కొన్నట్టు తెలిసింది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు.. 20మందికిపైగా వైస్ ప్రెసిడెంట్లు.. పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో రాష్ట్ర నేతలు జరిపిన భేటీలలో కొంతమేర స్పష్టత వచ్చినట్లు తెలిసింది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను, 20 నుంచి 25 మంది వరకు వైస్ ప్రెసిడెంట్లను నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లలో బీసీ, రెడ్డి, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు ఉండాలనే భావనకు వచ్చినట్టు సమాచారం. ఇక జిల్లా నేతల ఆమోదం ఉన్న చోట్ల డీసీసీ అధ్యక్షులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం వివరించారు. ఈ అంశాలపై నిర్వహించే సభలకు రావాలని ఖర్గేను ఆహ్వానించారు.కాగా, నిన్న (గురువారం) హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. సుమారు ఐదుగంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో సీఎంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు తదితర అంశాలపై చర్చించారు.ఇదీ చదవండి: గీత దాటితే వేటే..!సూర్యాపేటలో కులగణన సభకు రాహుల్ గాంధీని, మెదక్ ఎస్సీ వర్గీకరణ సభకు ఖర్గేను ఆహ్వానిస్తామని తెలిపారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా వ్యయం చేస్తున్న అంశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నెన్ని నిధులిచ్చారనే అంశాన్ని కూడా భట్టి ఇందులో వివరించినట్టు సమాచారం. -
రాజ్యసభలో నోరుపారేసుకున్న ఖర్గే.. బీజేపీ ఎంపీ సీరియస్!
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహంతో కంట్రోల్ తప్పారు. ఖర్గే ఆవేశంలో బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. నేను మీ తండ్రి సహచరుడిని.. మీరు నాకు చెప్పేదేంటి.. నోరు మూసుకుని కూర్చోండి అంటూ కౌంటరిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తున్న సమయంలో మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనై, సహనం కోల్పోయిన ఖర్గే.. ఆయనపై విరుచుకుపడ్డారు. అనంతరం, ఖర్గే మాట్లాడుతూ..‘నేను మీ తండ్రి సహచరుడిని. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్?. నేను నిన్ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. నోరు మూసుకుని కూర్చో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఖర్గే వ్యాఖ్యల కారణంగా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కల్పించుకున్నారు. ఇరు వర్గాలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి గురించి తన ప్రస్తావనను ఉపసంహరించుకోవాలని ఖర్గేకు సూచించారు. అలాగే, చంద్రశేఖర్ ఎంతో ప్రజాదరణ కలిగిన నేత అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నీరజ్ శేఖర్ 2019లో బీజేపీలో చేరారు. ఆయన తండ్రి చంద్ర శేఖర్ దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన సోషలిస్ట్ నాయకులలో ఒకరిగా పరిగణించబడతారు. చంద్ర శేఖర్.. అక్టోబర్ 1990 నుండి జూన్ 1991 వరకు ఆరు నెలలు ప్రధానమంత్రిగా పనిచేశారు.Kharge ji 🤣🤣🔥pic.twitter.com/7YKfvkwgad— Darshni Reddy (@angrybirdtweetz) February 3, 2025 -
ఆ లోపాలే తొక్కిసలాటకు కారణం: మల్లికార్జున ఖర్గే
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం మౌని అమావాస్య పుణ్యస్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.‘మహా కుంభమేళా సందర్భంగా తీర్థరాజ సంగమం ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారనే వార్త వినడం హృదయ విదారకంగా ఉంది’ అని మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ లో రాశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. महाकुंभ के दौरान, तीर्थराज संगम के तट पर हुई भगदड़ से कई लोगों की जान गई है और अनेकों लोगों के घायल होने का समाचार बेहद हृदयविदारक है। श्रद्धालुओं के परिजनों के प्रति हमारी गहरी संवेदनाएँ और घायलों की शीघ्रातिशीघ्र स्वास्थ्य लाभ की हम कामना करते हैं। आधी अधूरी व्यवस्था,…— Mallikarjun Kharge (@kharge) January 29, 2025ఇదే పోస్టులో ఆయన మహా కుంభమేళా ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన నిలదీశారు. విస్తృత ఏర్పాట్లు, విఐపిల కదలిక, నిర్వహణ కంటే స్వీయ ప్రమోషన్‌పై అధికంగా దృష్టి పెట్టడం, నిర్వహణలో లోపాలే తొక్కిసలాటకు కారణమని ఆయన పేర్కొన్నారు.వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, అటువంటి బలహీన వ్యవస్థను కలిగి ఉండటం ఖండించదగినది. ఇంకా కొన్ని రాజ స్నానాలు మిగిలి ఉన్నాయి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడే మేల్కొని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏర్పాట్లను మెరుగుపరచాలని ఖర్గే సూచించారు. భక్తుల వసతి, ఆహారం, ప్రథమ చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లను మరింతగా విస్తరించాలని, సాధువులు కూడా ఇదేకోరుకుంటున్నారని అన్నారు. బాధితులకు సాధ్యమైనంత త్వరగా సహాయం అందించాలని మల్లిఖార్జున ఖర్గే ప్రభుత్వాన్ని కోరారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం సీఎం యోగి వినతి -
మోదీ, అమిత్ షా, కుంభమేళాపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ: బీజేపీ నేతలు, మహా కుంభమేళాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో తప్పులు చేసిన బీజేపీ నేతలు కుంభమేళాలోని గంగా నీటిలో మునిగితే విముక్తి కలగదు అన్నారు. ఇదే సమయంలో మోదీ, అమిత్ షా కచ్చితంగా నరకానికే వెళ్తారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘గంగా నదిలో స్నానం చేయడం వల్ల పేదరికం తొలగిపోతుందా?. అది ఆహారాన్ని అందిస్తుందా?. నేను ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీయాలని అనుకోవడం లేదు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే నేను క్షమాపణలు కోరుతున్నాను. కానీ, పిల్లలు ఆకలితో చనిపోతున్నప్పుడు, పాఠశాలకు వెళ్లలేకపోతున్నప్పుడు, కార్మికులకు జీతం అందనప్పుడు, బీజేపీ నాయకులు గంగలో స్నానం చేయడానికి పోటీ పడుతున్నారు. వారు టీవీల్లో పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల నుండి దేశం ప్రయోజనం పొందదు. అలాగే.. ప్రధాని మోదీ(Modi), అమిత్ షా(Amit Shah) ఎన్నో తప్పులు చేశారు. అలాంటి వ్యక్తులు కుంభమేళాలో స్నానాలు చేస్తే విముక్తి రాదు. మోదీ, అమిత్ షా కచ్చితంగా నరకానికి వెళ్తారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందిస్తూ ఖర్గే వ్యాఖ్యలను సనాతన ధర్మంపై దాడిగా అభివర్ణించారు. ఆయన మరే ఇతర మతం గురించి అలాంటివి చెప్పగలరా? అలాంటి ప్రకటనలు ఖండించదగినవి. దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలి. ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Indore, MP | Congress National President Mallikarjun Kharge says, "On one hand Narendra Modi salutes the Constitution and on the other, he does everything against it... Don't be fooled by Narendra Modi's false promises. Does taking a dip in Ganga alleviate poverty?...… pic.twitter.com/lgCJW4HYtY— ANI (@ANI) January 27, 2025మరోవైపు.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ మాలవీయా స్పందిస్తూ.. కుంభమేళాపై ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆయనవి కాదు. ఆ మాటలు గాంధీ కుటుంబానికి చెందినవి. కాంగ్రెస్ హిందువులను ఎందుకు అంతగా ద్వేషిస్తుంది?. మహా కుంభామేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ప్రజల నమ్మకాలను కాంగ్రెస్ అవమానిస్తోంది. కాంగ్రెస్ నేతలు కావాలనే కుంభమేళాను అవమానిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా.. ఈరోజు కేంద్రహోం మంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులు మహా భమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి అమిత్ షా అర్చన చేసి గంగా హారతి ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో ఇది 15వ రోజు. ఇప్పటికే కుంభమేళాకు 13 కోట్లకుపైగా భక్తులు హాజరయ్యారు. ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళాకు ప్రధాని మోడీ రాబోతున్నారు. దానికి ముందే ఇవాళ ప్రయాగ్‌రాజ్‌కు అమిత్ షా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, సహా 73 దేశాల దౌత్యవేత్తలు సైతం ఫిబ్రవరి 1న కుంభమేళాలకు వస్తున్నారు.बोल खड़गे जी रहे हैं, पर शब्द गांधी परिवार के हैं। आखिर कांग्रेस को हिंदुओं से इतनी नफरत क्यों है? 144 साल में एक बार महाकुंभ आता है, लेकिन कांग्रेस के नेता इस तरह बौखला गए हैं कि हिंदुओं को कोस रहे हैं। पहले कांग्रेस के हुसैन दलवी ने कुंभ को बुरा-भला कहा, और अब स्वयं कांग्रेस… pic.twitter.com/UAqLNMVLzZ— Amit Malviya (@amitmalviya) January 27, 2025 -
జెండాకు నమస్కరించని వారు దేశం గురించి మాట్లాడతారా?: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన కాంగ్రెస్(congress Office) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ కార్యాలయ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) పార్టీ జెండా ఎగురవేశారు. ఆరు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఇక, కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul Gandhi) మాట్లాడుతూ.. దేశాన్ని విచ్చిన్నం చేసే వారిని ఆపగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. జాతీయ జెండాకు నమస్కరించరని వారు దేశం గురించి మాట్లాడుతున్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని కించపరిచే విధంగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో పోరాడుతూనే ఉంటాం. బ్రిటీష్ వారితో పోరాడిన యోధులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ భవనం ప్రతీ కార్యకర్తకు చెందుతుంది. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "The Constitution was essentially attacked yesterday by Mohan Bhagwat when he said that the Constitution was not the symbol of our freedom, but also after that, thousands of our workers died in Punjab, Kashmir,… pic.twitter.com/ghK13PDOk2— ANI (@ANI) January 15, 2025ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ భవనంలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులోనే కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహించింది. 1978 నుంచి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా ఉంది.9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. కోట్లా మార్గ్‌కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా.. అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2008లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్నారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలు పెట్టారు. 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం సాగింది.#WATCH | Congress MP Sonia Gandhi inaugurates 'Indira Bhawan', the new headquarters of the party in Delhi Congress president Mallikarjun Kharge, MP Rahul Gandhi and other prominent leaders of the party also present pic.twitter.com/9X7XXNYEOn— ANI (@ANI) January 15, 2025 -
ఈ నెల 27న రాష్ట్రానికి ఖర్గే, రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఈనెల 27వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించనున్న జైబాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సంవిధాన్ బచావో బహిరంగ సభకు వీరు హాజరవుతారని చెప్పారు. ఈనెల 27న వీలుకాకుంటే వచ్చే నెల మొదటి వారంలో ఖర్గే, రాహుల్‌లు వస్తారని అన్నారు.శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్టి మాట్లాడుతూ, ఈనెలాఖరుకల్లా మిగిలిన కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి చేస్తారని, ఈ మేరకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. దీంతో పాటు పార్టీ కార్యవర్గాన్ని కూడా ఈ నెలాఖరుకు ప్రకటిస్తామని చెప్పారు. ఈసారి టీపీసీసీకి ముగ్గురు లేదా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారని, ఎంతమందికి ఆ పదవి ఇవ్వాలన్న విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా మారుస్తామని, సమర్థులైన నాయకుల కోసం చూస్తున్నామని చెప్పారు.పార్టీ కార్యవర్గం నియామకంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏం మాట్లాడారన్నది పరిశీలించాల్సి ఉందని, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నుంచి త్వరలోనే చేరికలుంటాయని, ఎమ్మెల్యేలు కూడా చేరతారని మహేశ్‌గౌడ్ వెల్లడించారు. ఈనెల 14వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నామని, 15వ తేదీన ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటామన్నారు.


