సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకుందని వ్యాఖ్యానించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. సమాజాన్ని ముందుకు నడపడమే కాంగ్రెస్ ఆలోచన. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ తీసుకువచ్చిన సంస్కరణలను తక్కువ చేస్తోంది అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ 140వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. అనంతరం, మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ఏర్పాటయ్యాక, ద్వేష స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాటం చేశాం. స్వతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు, మరెన్నో బలిదానాలు జరిగాయి. దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. స్వాతంత్ర పోరాటాన్ని మహాత్మా గాంధీ ముందుండి నడిపించారు. ఆయన నేతృత్వంలో రైతులు, కూలీలు, మహిళలు కలిసి వచ్చారు. ప్రస్తుతం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయి.
కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకుంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశ స్వరూపాన్ని మార్చింది. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని దేశాభివృద్ధి కోసం కాంగ్రెస్ పని చేసింది. సమాజాన్ని ముందుకు నడపడమే కాంగ్రెస్ ఆలోచన. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ తీసుకువచ్చిన సంస్కరణలను తక్కువ చేస్తుంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రజల గురించి ఆలోచించడం లేదు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. ప్రజల హక్కులను నాశనం చేస్తున్నారు. కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్నో ఒడిదొడుకులను చూసింది. దేశ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పని చేస్తూనే ఉంటుంది. ప్రజా వ్యతిరేక విధానాలపై బలంగా సమాధానం ఇవ్వాలి.
#WATCH | Delhi: Congress National President Mallikarjun Kharge says, "... On December 28, 1885, in Mumbai, Congress was founded. For 62 years, crores of Congressmen struggled, were jailed, and fought for the country, leading to our freedom. I pay tribute to the founders of… https://t.co/vl2DOsI0bC pic.twitter.com/KqkHbnQOud
— ANI (@ANI) December 28, 2025
రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్ కేంద్ర బిందువు కానుంది. ప్రజాస్వామ్యం కాపాడేందుకు అందరూ కలిసి రావాలి, పెద్ద ఎత్తున పోరాటం జరగాలి. కాంగ్రెస్ కథమైంది అంటున్నారు, మా దగ్గర అధికారం లేకపోవచ్చు. కానీ, ఆలోచనలు ఆకాంక్షలు అలాగే ఉన్నాయి. కాంగ్రెస్ ధర్మం పేరుతో ఓటు అడగలేదు. కాంగ్రెస్ పోరాటం చేయకుంటే రాజ్యాంగాన్ని ఎవరు రక్షిస్తారు అని వ్యాఖ్యలు చేశారు.


