పాట్నా: ఆ మహిళ తన భర్తకు రోజ్‌డే సందర్భంగా ఓ సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేసింది. సెలబ్రేషన్స్ చేసి ఆ రోజును తనకు తీపి జ్ఞాపకంలా మలచుకోవాలని భావించింది. అనుకున్న విధంగానే చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె రోజ్‌డే కోసం చేసిన సెలబ్రేషన్స్ఇప్పుడు ఆమెకు చట్టపరంగా చిక్కులు తెచ్చిపెట్టాయి.
బీహార్ ముంగూర్ జిల్లాకు చెందిన కంచనా దేవి అనే మహిళ రోజ్‌డేను తన భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా తన భర్తకు రోజాపూలను ఇచ్చింది. అయితే అంతకు ముందు తన భర్తకు గ్లాసులో మద్యం పోసి ఇచ్చింది. ఈ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఆ వీడియోలలో ఆమె మద్యం ఇవ్వడం వివాదాస్పదమైంది. ఎందుకంటే అక్కడ 2016నుంచి మధ్యంపై బ్యాన్ విధించారు. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ముంగేర్ జిల్లా ఎస్పీ సయ్యద్ ఇమ్రాన్ మసూద్ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఆ వీడియాలో పిస్తోల్ ఉన్నట్లు గుర్తించామని విచారణలో అది లైసెన్స్‌డ్ రివాల్వార్ అని తేలినట్లు పేర్కొన్నారు.
రోజ్‌డే సందర్బంగా భర్తతో కలిసి సరదాగా గడుదామనుకుంటే ఇప్పుడు తనకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రోజ్ డే (Rose Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న జరుపుకునే వాలెంటైన్ వారంలో మొదటి రోజు. ఇది ప్రేమ, ఆప్యాయత మరియు స్నేహానికి చిహ్నంగా భావిస్తారు. ప్రియమైన వారికి గులాబీలను బహుమతిగా ఇచ్చి తమ మనసులోని భావాలను వ్యక్తపరుస్తారు.


