దుబాయ్‌లో మిడిల్‌ కాస్ల్‌ ఫ్యామిలీ నెల ఖర్చు ఇదీ : వైరల్‌ వీడియో | Indian Couple Breaks Down Monthly Expenses In Dubai goes viral | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో మిడిల్‌ కాస్ల్‌ ఫ్యామిలీ నెల ఖర్చు ఇదీ : వైరల్‌ వీడియో

Jul 1 2026 5:41 PM | Updated on Jul 1 2026 6:13 PM

Indian Couple Breaks Down Monthly Expenses In Dubai goes viral

దుబాయ్‌లో నివసిస్తున్న ఒక భారతీయ జంట తమ నెలవారీ ఖర్చులకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ  ఇన్‌స్టాలో ఒక వీడియోను  షేర్‌ చేశారు. ఒక మధ్యతరగతి కుటుంబం సౌకర్యవంతంగా జీవించడానికి నెలకు దాదారు నెలకు సుమారుగా 13,000 నుండి 14,000 దిర్హామ్‌లు  (రూ. 3.6 లక్షలు) ఖర్చు అవుతోందని పేర్కొనడం వైరల్‌గా మారింది.

ఇటీవలి కాలంలో ఐటీ, ఇతర వృత్తి నిపుణులు తమ జీతాలు, నెలవారీ ఖర్చులు, పొదుపు గురించి వివరాలను పంచుకునే వీడియోలు, పోస్టులు చాలా కామన్‌గా మారిపోయాయి. ఇవి వైరల్‌ అవుతుంటాయి కూడా.  అలా ఇన్‌స్టాగ్రామ్‌లో @vis_and_vadapav అనే ఐడీతో పోస్ట్‌లు చేసే ఒక భారతీయ జంట తమ బడ్జెట్ కేవలం రోజువారీ జీవనానికి మాత్రమేనని, ఇందులో ప్రయాణాలు, షాపింగ్ లేదా విహారయాత్రలు చేర్చలేదని చెప్పారు. "దుబాయ్‌లో నివసిస్తున్న ఒక జంటగా మాకు అయ్యే ఖర్చు ఇదిగో... దయచేసి గమనించండి’’ అంటూ పోస్ట్‌ చేశారు. నెలకు దాదాపు రూ.3.3 లక్షల నుండి రూ.3.6 లక్షలు ఖర్చవుతుందని లెక్కలతో సహా వివరించారు. ఇందులో షాపింగ్, విహారయాత్రలు (ట్రావెలింగ్) , పండగ సెలవుల ఖర్చులు చేర్చలేదని, ఇవి కేవలం రోజువారీ ఖర్చులని పేర్కొన్నారు.

 ముఖ్యంగా ఇంటి రుణంకు లక్షన్నర; కరెంట్, నీరు,  ఇతర బిల్లుల కోసం  రూ. 39వేలు ఖర్చు చేస్తారు.  ఇక ఫుడ్‌ కోసం మరో 39వేల రూపాయలు ఖర్చవుతాయి. వీటితోపాటు కారు, పెట్రోల్‌ ఖర్చులు,  పనిమనిషి ఖర్చులు ఇలా మొత్తం  నెలకు రూ. 3.3 లక్షలు- 3.6 లక్షలవుతాయి. దీంతో పాటు భార్య ఉద్యోగ నిమిత్తం వారంలో కొన్ని రోజులు దుబాయ్ నుండి అబుదాబికి ప్రయాణించాల్సి రావడంతో ఆమె ప్రయాణానికే నెలకు రూ. 50 వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు.

ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్‌ మదర్‌ సునీత సక్సెస్‌ స్టోరీ

దీంతో దుబాయ్‌లో లైఫ్‌ స్టైల్‌, కాస్ట్‌ ఆఫ్‌  లివింగ్‌పై నెట్టింట  పెద్ద చర్చకు దారితీసింది. నిజం చెప్పినందుకు ధన్యవాదాలు అంటే కొంతమంది కామెంట్‌ చేశారు. ఎందుకంటే దుబాయ్‌లో నెలకు 400-500 దిర్హామ్‌లకే బతికేయచ్చంటూ చాలామంది తప్పుడు సమాచారం ఇస్తుంటారని, కానీ ఈ జంట దుబాయ్ జీవితం గురించిన అసలు నిజాన్ని, వాస్తవిక చిత్రాన్ని చూపించారని ఒక యూజర్ కామెంట్ చేశారు."దిర్హామ్‌లలో ఏడుపు వస్తోంది" అంటూ మరొకరు సరదాగా కామెంట్ చేయగా, మెజారిటీ నెటిజన్లు ఈ ఖర్చులు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నాయని అంగీకరించారు.
ఇదీ చదవండి: యజమాని కోసం బ్లాక్‌ ​కోబ్రాతో పెంపుడు కుక్క పోరాటం, కానీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement