వచ్చే ఎన్నికలు మావిగన్‌ Vs అమరావతి: వైఎస్‌ జగన్‌ | YS Jagan Key Comments On MAVIGUN | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికలు మావిగన్‌ Vs అమరావతి: వైఎస్‌ జగన్‌

Jul 1 2026 1:17 PM | Updated on Jul 1 2026 1:55 PM

YS Jagan Key Comments On MAVIGUN

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. మావిగన్‌ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్‌కు మేము కట్టుబడి ఉన్నాం. వచ్చే ఎన్నికలు మావిగన్‌ వర్సెస్‌ అమరావతి. ప్రజల మద్దతు ఎవరికి ఉందో అందరికీ తెలుస్తుంది. అవినీతి జరగకుండా మావిగన్‌ రాజధాని వస్తుంది అంటూ కామెంట్స్‌ చేశారు. 

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘నేను అమరావతి వెళ్తే.. జగన్‌ అమరావతికి వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి నేను వ్యతిరేకం. అక్కడ ఉన్న రైతుల ఆవేదనను నేను చెబుతున్నాను. చంద్రబాబు అమరావతిలో చేస్తున్న స్కాంలను ప్రశ్నిస్తున్నా. అవినీతి లేని రాజధాని కావాలనేదే చెబుతున్నా. మావిగన్‌కు మద్దతు ఇచ్చే వారు వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్‌ను వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో చేరుస్తాం. ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో స్పష్టమవుతుంది. రైతులు తరఫున నేను ప్రశ్నస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.  
 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement