చిత్తూరు జిల్లా: సీఎం హోదాలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు దిగజారి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. జెండా పండుగ రోజు సీఎం చంద్రబాబు మహిళల్ని అవమానించారన్నారు. మహిళలు డబ్బులకు ఆశలపడేవాళ్లుగా చిత్రీకరించడం సిగ్గుచేటన్నారు. మహిళలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘డర్టీ పోటీషియన్ చంద్రబాబు అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు. ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి సందేశాలు చెబితే ఎలా నవ్వుకుంటారో, చంద్రబాబు నీతి వాఖ్యలు చెబితే అలాగే నవ్వుకుంటారు. ఎమ్మెల్యేలు కొనుగోలు చేసింది మీరు, ఓటుకు నోటు ఆడియో,వీడియో అడ్డంగా దొరికిపోయారు. డబ్బుతో వ్యవస్థల్ని మోసం చేయడం చంద్రబాబు వెన్నతో పెట్టిన విద్య. చెప్పిన హామీలు అమలు చేయకుండా, ఓటుకు నోటు అని మహిళలకు నీతులు చెప్తున్నారు చంద్రబాబు. రెండు ఎకరాలు ఆసామి లక్ష కోట్లకు ఎదిగారు అంటే మీపై, మీ ఆస్తులు పై విచారణ చేయాలి.
డబ్బులు ఇచ్చి ఓట్లు కొన్నాము అని మహిళలతో చెప్పడం సిగ్గుచేటు. నగరి ఎమ్మెల్యే పిల్లికి భిక్షం వేయడు, ఇసుక, క్వారీ, గ్రావెల్ దోచుకుంటున్నారు. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే నాయకుడు చంద్రబాబు. ఎన్నికలు ముందు అమ్మ, చెల్లి ,తల్లి అంటూ చేతులు పట్టుకుంటారు. డబ్బులు ఇవ్వకుండా, హామీలు అమలు చేయకుండా ఇన్ని కుంటిసాకులు చెప్తున్నారు చంద్రబాబు. తన రాజకీయ భవిష్యత్తు కోసం పక్కపార్టి వాళ్లను కొనుగోలు చేయడం నేర్పింది చంద్రబాబు. సిగ్గు లేకుండా నీతులు చెబుతున్నారు. ఇస్తామని చెప్పిన హామీలు ముందు అమలు చేయండి’ అని రోజా పేర్కొన్నారు.


