ఫ్రీ బస్సు విషయంలో చెప్పేవన్ని అబద్ధాలే.. వరుదు కళ్యాణి | Chandrababu is lying about the free bus scheme Varudu Kalyani | Sakshi
Sakshi News home page

ఫ్రీ బస్సు విషయంలో చెప్పేవన్ని అబద్ధాలే.. వరుదు కళ్యాణి

Aug 16 2026 1:27 PM | Updated on Aug 16 2026 1:45 PM

Chandrababu is lying about the free bus scheme Varudu Kalyani

సాక్షి, విశాఖ: రాష్ట్ర మహిళలను  చంద్రబాబు మోసం చేశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఎన్నికల్లో మహిళలు రూ.  రెండు వేలు తీసుకుంటున్నారంటూ అవమానపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడారన్నారు. ఈ రోజు విశాఖలో వరుదు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు.   ఉచిత బస్సు కోసం రూ. మూడు వేల కోట్లు కేటాయించామని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. ఇదివరకే ఫ్రీ బస్సు విషయంలో చంద్రబాబు అనేక సార్లు అబద్ధాలు చెప్పారన్నారు.

ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్‌పరం చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారని ఉచిత బస్సు పథకంలో  అనేక పరిమితులు పెట్టారన్నారు. ఫ్రీ బస్ కోసం హైదరాబాదు వదిలి విశాఖ వచ్చేసానని ఒక సాప్ట్‌వేర్ ఇంజినీర్ తో అబద్ధాలు చెప్పించారు. ఓటుకు నోటుకు మూలపురుషుడు చంద్రబాబు. ఎన్నికల్లో ఓటుకి డబ్బులు ఇవ్వలేదని వెంకటేశ్వర స్వామి పై ప్రమాణం చేసి చెప్పగలరా? త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటు ఇవ్వకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పగలరా అని చంద్రబాబును వరుదు కళ్యాణి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement