యారాడ బీచ్‌లో తప్పిన పెను ప్రమాదం.. | Yarada Beach Scare, Lifeguards Rescue 55 Year Old Woman From Strong Waves, More Details Inside | Sakshi
Sakshi News home page

యారాడ బీచ్‌లో తప్పిన పెను ప్రమాదం..

Aug 16 2026 11:25 AM | Updated on Aug 16 2026 12:52 PM

Life Guards Save Women At Visaka Yarada Beach

సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని యారాడ బీచ్‌లో పెను ప్రమాదం తప్పింది. సముద్ర స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల్లో ఓ మహిళ అలల ఉధృతికి నీటిలో కొట్టుకుపోతుండగా బీచ్ లైఫ్‌గార్డ్స్ అప్రమత్తమై ఆమెను రక్షించారు.

రైల్వే న్యూ కాలనీకి చెందిన ఓ కుటుంబం యారాడ బీచ్ సందర్శనకు వచ్చింది. ఈ క్రమంలో కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సముద్రంలో స్నానానికి దిగారు. అయితే అలల ఉధృతికి సూర్యలక్ష్మి (55) నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన లైఫ్‌గార్డ్స్ వెంటనే స్పందించారు. కదిరి లావరాజ్, నొల్లి వీర్రాజు, చుట్టూరు శ్రీను, కదిరి వెంకటేష్‌లు సముద్రంలోకి వెళ్లి సూర్యలక్ష్మిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. లైఫ్‌గార్డ్స్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement