సూర్య హీరోగా నటించిన తెలుగు–తమిళ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.
మమిత బైజు హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న (శుక్రవారం) విడుదలైంది.
శనివారం నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌కి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, యూనిట్‌కి అభినందనలు తెలిపారు.


