breaking news
Mamitha Baiju
-
ఓటీటీలోకి మమిత సూపర్ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన
రీసెంట్ టైంలో మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ట్రెండింగ్ హీరోయిన్ మమిత బైజు.. అన్నింటితోనూ వందల కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఈమె నటించిన జన నాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేయగా.. లేటెస్ట్ సెన్సేషనల్ మలయాళ ఫీల్ గుడ్ రొమాంటిక్ హిట్ మూవీ కూడా స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.(ఇదీ చదవండి: శోభనం రాత్రి ఏం జరిగింది? ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)'ప్రేమలు' దర్శకుడు గిరీష్ ఏడీ తీసిన లేటెస్ట్ సినిమా 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్'. ఓనం సందర్భంగా ఆగస్టు 21న మలయాళం వరకు థియేటర్లలో రిలీజైంది. రెండు వారాల తర్వాత అంటే ఈ నెల 04వ తేదీన తెలుగులోనూ విడుదలై హిట్ అయింది. చిన్న చిత్రమే అయినప్పటికీ ఓవరాల్‌గా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది.లెక్క ప్రకారం ఈ పాటికే ఓటీటీలోకి వచ్చేయాలి. కానీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న కారణంగా కాస్త లేటుగా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే శుక్రవారం(అక్టోబరు 02) నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' విషయానికొస్తే.. ఆష్లే (మమిత బైజు) కాలేజీ చదివే అమ్మాయి. తండ్రి తాగుడుకు బానిసవ్వడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈమె కుటుంబం సొంత ఊరు వదిలి అంగమాలికి వచ్చేస్తుంది. అక్కడే స్థానిక చర్చికి సంబంధించిన ఓ పార్థనా బృందం బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ పరిచయమవుతుంది. ఆష్లే అద్దెకి దిగిన ఇంటి పక్కనే జస్టిన్ (నివిన్ పౌలీ) తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. ఊరిలో కేటరింగ్ బిజినెస్ చేసుకుంటూ అందరితో కలివిడిగా, మంచిగా ఉండే సాదాసీదా బ్యాచిలర్ ఇతడు. చదువుకునే రోజుల్లో ఎదురైన ఓ బ్రేకప్ వల్ల పెళ్లి వద్దనుకుంటాడు.ఇతడికీ ఆష్లేకి మధ్య 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంటుంది. కానీ జస్టిన్ మంచితనం, వ్యక్తిత్వం, అభిరుచులు నచ్చి తనపై ఆష్లే మనసు పారేసుకుంటుంది. ఈ విషయం తెలిశాక జస్టిన్ కూడా ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. అనుకోని సంఘటన వల్ల వీళ్ల రహస్య ప్రేమ ఇంట్లోని పెద్దలకు తెలుస్తుంది. తర్వాత ఏమైంది? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా)The entertainer everyone’s been waiting for! ❤️Bethlehem Kudumba Unit, streaming from October 2 on JioHotstar.@NivinOfficial @MamithaBaiju_ @BhavanaStudios @iDileeshPothan @BhavanaRelease @PharsFilm @PicturesPVR @MythriRelease @FutureRunup @PrimarkProd#BethlehemKudumbaUnit… pic.twitter.com/WcEqPKd61K— JioHotstar Malayalam (@JioHotstarMal) September 27, 2026 -
మమితా బైజు మూవీ.. బాక్సాపీస్ వద్ద మరో రికార్డ్
సినిమాల సక్సెస్ కావాలంటే కంటెంట్ మాత్రమే కింగ్ అని మరోసారి రుజువైంది. ఇటీవల మలయాళంలో రిలీజైన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా వచ్చిన బెత్లెహమ్ కుటుంబ యూనిట్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా మరో మైలురాయి చేరుకుంది. ఈ సినిమా రిలీజైన 27 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ మలయాళ రొమాంటిక్ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి గిరీష్ ఎ. డి. దర్శకత్వం వహించగా.. భావనా స్టూడియోస్ బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ కీలక పాత్రల్లో నటించారు. హీరోయిన్ మమితా బైజు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సైతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయాలతో మమితా బైజు పట్టిందల్లా బంగారమే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నుంచి ఆమె డైరెక్టర్లకు లక్కీ హీరోయిన్గా కనిపించడం ఖాయమని తెలుస్తోంది. -
భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు
-
ఈ తార పట్టిందే బంగారం.. ఏడాదిలో 1000 కోట్లు..
ఒకప్పుడు చిన్న పాత్రలతో మెప్పించిన ఈ మలయాళ భామ..ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. వరుస విజయాలు.. భారీ వసూళ్లతో మమిత బైజు క్రేజ్ ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. పట్టింది ప్రతీదీ బంగారం అన్నట్లుగా.. వరుసగా ఆమె నటించిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ల రేంజ్లో డిమాండ్ పెరిగిపోయింది. అసలు ఆ ఐదు సినిమాలు ఏంటి..? మమిత బైజు కేరీర్‌ను మలుపు తిప్పిన ఆ విజయాలు ఏంటో చూద్దాం..!‘కర’తో 50 కోట్లు..తమిళ హీరో ధనుష్ కథానాయకుడిగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన చిత్రం ‘కర’ ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటించింది. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాయి. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. తండ్రి-కొడుకుల ఎమోషన్‌తో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం అంతగా మెప్పించలేకపోయింది. దీంతో కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.‘డ్యూడ్’తో100 కోట్లుప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ నెల 17 విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లుకు పైగా వసూళ్లు సాధించింది. ఇదీ చదవండి: ’మండాడి‘పై రజినీకాంత్ రివ్యూ.. నటుడు ఎమోషనల్‘జననాయగన్’తో 300కోట్లకు పైగా.. తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్( తెలుగులో జన నాయకుడు). హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ నిర్మించారు. ఈ చిత్రం జులై 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగులో అంత విజయం సాధించనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూళ్లు రాబెట్టింది.బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ 300 కోట్లుబాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ కూడా ఒకటి. మమితా బైజు, నివీన్ పౌలీ నటించిన ఈ చిత్రం మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లను సాధించింది. ఓనమ్ పండగ సందర్భంగా ఆగస్టు 21న మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.300ల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సెప్టెంబర్ 4న ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ‘ప్రేమలు’ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. ఇదీ చదవండి: ఓటీటీ తర్వాత థియేటర్లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?విశ్వనాథ్ అండ్ సన్స్ 260 కోట్లుసూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులనూ అలరిస్తోంది. సెప్టెంబర్11 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
చిన్న సినిమా.. సరికొత్త బాక్సాఫీస్ రికార్డ్..!
చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భారీ తారాగణం, బడ్జెట్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సైతం అదరగొడుతున్నాయి. ఇటీవలే రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి కేవలం మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. అలా మరో సినిమా సైతం కోట్లు కొల్లగొట్టింది. మలయాళంలో రిలీజైన బెత్లెహెం కుటుంబ యూనిట్ అనే మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది.తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ కేవలం 24 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.304.9 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లతో మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన కొత్త లోకా(రూ.302 కోట్లు) వసూళ్లును ఈ మూవీ దాటేసింది. దీంతో మలయాళ బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది బెత్లెహెం కుటుంబ యూనిట్.కాగా.. ఈ చిత్రంలో నివిన్ పౌలీ, మమితా బైజు కీలక పాత్రల్లో నటించారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ ఏడాది థియేటర్లలో భారీ విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని భావన స్టూడియోస్ బ్యానర్లో ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. ఈ సినిమాలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, వినయ్ ఫోర్ట్, సురేష్ కృష్ణ, బిందు పనికర్, శ్రీంద కీలక పాత్రలు పోషించారు.Congratulations to the entire team of #BethlehemKudumbaUnit on achieving INDUSTRY HIT status in Malayalam ❤️🔥A truly deserving feat for a film that gave us one of the most beautiful cinematic experiences in recent times ❤️@BhavanaStudios, Fahadh garu congratulations on backing… pic.twitter.com/Gx3xaGR4d8— Mythri Movie Makers (@MythriOfficial) September 14, 2026 -
ఓటీటీలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
సూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు రెడీ అయింది. సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ కథేంటంటే.. సంజయ్ విశ్వనాథ్(సూర్య) ఓ వ్యాపారవేత్త, ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి చేసుకోడు. అమెరికాకి వెళ్లి సరోగసి ద్వారా మగబిడ్డని కని స్వదేశానికి తిరిగొస్తాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లాడు ఓ అరుదైన వ్యాధి బారిన పడతాడు. బోన్ మారో(ఎముక గుజ్జు) ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవసరం ఏర్పడుతుంది. అమెరికాకు తిరిగెళ్లి సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని వెతికి భారత్‌కి తీసుకొస్తాడు. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు.20 ఏళ్ల మ్యాడీ.. సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా తన కొడుకును పెంచుకోగలిగాడా? మ్యాడీ ప్రేమని సంజయ్ ఎందుకు తిరస్కరించాడు? చివరకు పెళ్లి విషయంలో సంజయ్ తన ఆలోచన మార్చుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ. -
ఆరేళ్లకే తొలి సంపాదన! ఆ ఒక్క నిర్ణయంతో మారిన మమితా రేంజ్
ఒకట్రెండు హిట్లు రాగానే స్టార్డమ్ వచ్చేసిందంటూ హడావుడి చేసే హీరోయిన్లు చాలామందే. కానీ.. వరుసగా మూడు భారీ విజయాలతో తన స్థాయినే మార్చేసుకుంటే? ఇప్పుడు మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు చేస్తున్నది అదే. ఈ ఏడాదిలో విజయ్, సూర్య, నివిన్ పౌలీ వంటి అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించిన ఆమె.. వరుస విజయాలతో సౌత్ ఇండియాలో తన మార్కెట్‌ను ఒక్కసారిగా పెంచుకుంది. తెరపై కనిపించే ఆ పక్కింటి అమ్మాయి ఇమేజ్ వెనుక.. కోట్ల రూపాయల విలువైన బ్రాండ్ కూడా తయారవుతోంది.మమితా బైజు కెరీర్లో 2026 ఓ ప్రత్యేక అధ్యాయం. జూలై 23న విజయ్ నటించిన జన నాయగన్ విడుదలైంది. ఆ తర్వాత ఆగస్టు 14న సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటి తర్వాత.. ఆగస్టు 21న నివిన్ పౌలీతో కలిసి నటించిన బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ థియేటర్లలోకి వచ్చింది. ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో.. ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగింది. బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ జస్ట్.. 11 రోజుల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. ముఖ్యంగా.. ఈ మూడు చిత్రాల విడుదల మధ్య వ్యవధి కేవలం 29 రోజులు. దీంతో ఒకే ఏడాదిలో(ఇప్పటివరకు..) మూడు రూ.200 కోట్ల సినిమాల్లో నటించిన భారతీయ నటిగా మమితా రికార్డు సృష్టించినట్లైంది. ఈ మధ్యకాలంలో మరేయితర హీరోయిన్ ఖాతాలో ఇలాంటి అరుదైన రికార్డు నమోదు కాలేదు.‘ప్రేమలు’తో మారిపోయిన కెరీర్అయితే ఈ స్థాయికి ఆమె ప్రయాణం ఒక్కరోజులో మొదలైనదేమీ కాదు. బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన మమితా.. ఆపరేషన్ జావా, ఖో ఖో, సూపర్ శరణ్య వంటి చిత్రాల్లో కనిపించింది. కానీ 2024లో వచ్చిన ప్రేమలు ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అందులో రీనూ పాత్రలో ఆమె చూపించిన సహజమైన నటన, ఎక్స్ప్రెషన్స్ యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత తమిళం, తెలుగు చిత్రసీమల్లోనూ అవకాశాలు వరుసకట్టాయి. అక్కడి నుంచి మమితా ఎంచుకున్న సినిమాలూ ఆమె మార్కెట్‌ను పెంచాయి. డ్యూడ్, కరా వంటి తమిళ చిత్రాలతో పాటు విజయ్ జన నాయగన్, సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్‌లో నటించడం ఆమెకు మరింత క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు సొంత భాషలో బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ సక్సెస్‌తో ఆ జాబితాలో మరో భారీ హిట్ చేరింది.డాక్టర్ కావాలనుకుని.. హీరోయిన్గామమితా జీవితంలో ఆసక్తికరమైన మలుపు స్కూల్లో ఉండగానే జరిగింది. ఆమె స్వస్థలం కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్. మె తండ్రి డాక్టర్ బైజు కృష్ణన్.. తల్లి మినీ బైజు. అన్నయ్య మిథున్ కెనడాలో చదువు పూర్తి చేశారు. చిన్నతనంలో ఆమెకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేదట. అయితే తొమ్మిదో తరగతిలో ఉన్న సమయంలో ఓ ఆడిషన్‌కు వెళ్లడం ఆమె జీవితాన్నే మార్చింది. ఆ తర్వాత చదువుతో పాటు నటనపైనా దృష్టి పెట్టింది. చివరకు వైద్య వృత్తికి బదులు సినీ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకుంది.ఫ్యాన్స్ ముద్దుగా ‘SSMB’..మమితకు ఉన్న క్రేజ్ సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది. ఆమె షార్ట్ వీడియోలు, డ్యాన్సింగ్ క్లిప్పులు వైరల్ అవుతుంటాయి. సాదాసీదాగా ఉంటూ అభిమానులతోనూ ఆమె అంతే హుందాగా వ్యవహరిస్తుంటారు. ఫ్యాన్స్ సరదాగా ‘SSMB’ సూపర్‌స్టార్ మమితా బైజు అనే ట్యాగ్ కూడా ఇస్తున్నారు. ‘సూపర్‌స్టార్’ అనే అర్థంలో ఈ పేరును వాడుతూ.. మలయాళ సినీ పరిశ్రమకు మమ్ముట్టి, మోహన్‌లాల్ తర్వాత మరో ఎం(M) దొరికిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమెకున్న క్రేజ్, వరుస అవకాశాలను చూసి సోషల్ మీడియాలో ఈ సరదా పోలికలు వైరల్‌గా మారుతున్నాయి.రెమ్యునరేషన్ విషయంలో.. ఇక సంపాదన విషయానికొస్తే.. ఆరేళ్ల వయసులో పాల్గొన్న ఫ్యాషన్ షోలో తొలిసారి రూ.500 సంపాదించిన విషయాన్ని ఆమె తరచూ చెబుతుంటారు. అలాగే తొలి సినిమా ‘సర్వోపరి పాలక్కారన్’కు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని, రెండో సినిమాకు మాత్రం రూ.6,000 అందుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన ఇన్నేళ్ల శ్రమకు ఆమెకు అవకాశాలు, సక్సెస్‌లు దక్కుతున్నాయి. వరుస విజయాలతో మమితా బైజు పారితోషికం కూడా గణనీయంగా పెరిగినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆమె సుమారు రూ.2–3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలే కాకుండా ఫ్యాషన్, స్కిన్‌కేర్, జ్యువెలరీ తదితర బ్రాండ్లకు ఆమె ప్రచారం చేస్తోంది. దీంతో నటనతో వచ్చే ఆదాయానికి అదనంగా ఎండార్స్మెంట్లు, పెట్టుబడులు కూడా ఆమె సంపాదనలో భాగమవుతున్నాయి.కోచిలో కోట్ల విలువైన ఇల్లు.. కార్లు కూడామమితా బైజు ఆస్తుల గురించి కూడా మాలీవుడ్ వెబ్సైట్లు ఆసక్తికర విషయాలు షేర్ చేస్తుంటాయి. కోచిలో ఆమెకు సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. షూటింగ్స్ ఎక్కువగా ఉండటంతో కోచినే ఆమెకు ప్రధాన నివాసంగా మారినట్లు సమాచారం. కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూరులో కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇల్లు కూడా ఉంది.కార్ల విషయానికొస్తే.. మమితా బైజు గ్యారేజీలో వోక్స్వాగెన్ టైగన్, మారుతి సుజుకీ జిమ్నీ ఉన్నాయి. అయితే ఆమె మొత్తం ఆస్తుల విలువపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. మాలీవుడ్ మూవీ సర్కిల్స్ వెబ్సైట్లు మాత్రం.. ఆమె నికర ఆస్తుల విలువను సుమారు రూ.20–30 కోట్లుగా అంచనా వేస్తున్నాయి.ఇష్టాలుఫేవరెట్ యాక్టర్: ధనుష్ ఇష్టమైన హాబీస్: డ్యాన్స్, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, ట్రావెలింగ్. ఇష్టమైన ఆహారం: చైనీస్ ఫుడ్ ఇష్టమైన రంగు: బ్లాక్ఇష్టమైన సింగర్: ఆంథోనీ దాసన్ఇష్టమైన పెర్ఫ్యూమ్: చానెల్ఇష్టమైన హాలిడే డెస్టినేషన్: దుబాయ్ఇష్టమైన ఆట: క్రికెట్ఇకపై మమితా రేంజ్ మరింత పెరిగేనా?ప్రేమలుతో వచ్చిన గుర్తింపు.. ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోల సినిమాలు.. ఇప్పుడు మూడు రూ.200 కోట్ల చిత్రాలతో వచ్చిన రికార్డు. మమితా బైజు కెరీర్ గ్రాఫ్ చూస్తే.. తక్కువ సమయంలోనే ఆమె ఎంత వేగంగా ఎదిగిందో అర్థమవుతుంది. పాతికేళ్ల వయసులోనే ఇలాంటి మార్కెట్ రావడం ఆమెకు కలిసొచ్చిన మరో అంశం. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథ, పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగితే.. మమితా బైజు దక్షిణాది చిత్రసీమలో మరో బలమైన హీరోయిన్గా ఎదగడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఇదీ చదవండి: ఆమె దోసె వేస్తే లక్షలు కురవాల్సిందే! -
‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
టైటిల్: బెత్లెహోమ్ కుటుంబ యూనిట్నటీనటులు: నివిన్ పౌలి, మమిత బైజు, సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ తదితరులునిర్మాతలు: దిలీష్ పోతన్, ఫహద్, ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ తెలుగు విడుదల: మైత్రీ మూవీ రిలీజ్దర్శకత్వం: గిరీశ్ ఏడీసంగీత: విష్ణు విజయ్సినిమాటోగ్రాఫర్: అజ్మల్ సాబువిడుదల తేది: సెప్టెంబర్ 4, 2026మలయాళ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఈ మధ్య అక్కడ సినిమాలన్నీ ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ వారం తెలుగులో రిలీజ్ అయిన మలయాళ చిత్రమే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’. ఓనమ్ పండగ సందర్భంగా ఆగస్టు 21న మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. నేడు(సెప్టెంబర్ 4) ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ‘ప్రేమలు’ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. జస్టిన్ (నివిన్ పౌలీ) ఊర్లో క్యాటరింగ్ బిజినెస్ రన్ చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదు. ఊర్లో వాళ్లంతా హేళన చేస్తున్న పెద్దగా పట్టించుకోడు. అలాంటి వ్యక్తిని పక్కింట్లోకి కొత్తగా వచ్చిన ఓ కుటుంబంలోని అమ్మాయి ఆష్లే(మమితా బైజు) ప్రేమిస్తుంది. తొలుత స్నేహం చేసి ఆ తర్వాత అతని మంచితనం చూసి ప్రేమలో పడిపోతుంది. అయితే ఆమెకు జస్టిన్‌కి మధ్య 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంటుంది. కాలేజీకి వెళ్లే అమ్మాయి ఆష్లే తనను ప్రేమించిందన్న విషయం తెలిసి జస్టిన్ కూడా ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ప్రేమ విషయం కొన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచుదామని చెప్పి..ఎవరి కంటా పడకుండా తిరుగుతుంటారు. అయితే ఓ సంఘటన వీరి రహస్య ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరి కుటుంబ సభ్యలు ఎలా రియాక్ట్ అయ్యారు? చివరకు వీరిద్దరి ప్రేమ..పెళ్లి వరకు ఎలా వెళ్లింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే.. చారానా కోడికి బారానా మసాలా అన్నట్లుగా.. చిన్న కథకు కూడా కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి, భారీ హంగులతో సినిమాలు తెరకెక్కిస్తున్న రోజులివి. కానీ సినిమా గొప్పదనం ఎన్ని కోట్లు ఖర్చు చేశామన్నదానిలో లేదు.. తెరపై ఆ కథను ఎంత సహజంగా ఆవిష్కరించామన్నదానిలో ఉంటుంది. ప్రేక్షకుడు కథతో కనెక్ట్ అవ్వాలి.. పాత్రల్లో తనను తాను చూసుకోవాలి.. అప్పుడే ఆ సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా విజయం సాధిస్తుంది. ఈ సూత్రాన్ని మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడో ఒంటబట్టించుకుంది. స్టార్ హీరోలు, భారీ సెట్లు, కోట్ల బడ్జెట్ల కంటే.. కథ, కథనానికే అక్కడ పెద్దపీట. అందుకే అక్కడి నుంచి వచ్చే సినిమాలు భాషల్ని దాటి ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్తుంటాయి. అలాంటి సహజత్వానికి అద్దం పట్టే మరో మలయాళ ఆణిముత్యమే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ సినిమా. ఈ సినిమా కథ కొత్తదేమి కాదు. చాలా సింపుల్ లవ్ స్టోరీ. ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్‌తో వచ్చిన సింపుల్ లవ్‌స్టోరీ.కథలో కొత్తదనమేమి లేకున్నా..దాన్ని తెరపై కొత్తగా చూపించడంలో మాత్రం దర్శకుడు గిరీశ్ వందశాతం సక్సెస్ అయ్యాడు. ప్రేమలు సినిమా మాదిరే ఇందులో కూడా సహజత్వానికి పెద్ద పీట వేశాడు దర్శకుడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు ప్రతి సన్నివేశం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆహ్లాదకరంగా కథనం సాగుతుంది. ప్రారంభం కాస్త నెమ్మదిగా సాగినా..జస్టిన్, ఆష్లే పరిచయం తర్వాత మనం ఆ పాత్రలతో కలిసి ప్రయాణం చేస్తుంటాం. హీరోహీరోయిన్ల పరిచయం..స్నేహితుల మాటలు.. లవ్ ప్రపోజల్.. ప్రతీది మన చుట్టుపక్కల చూసిన కథనే తెరపై చూపించిన అనుభూతి కలుగుతుంది. షార్ట్‌ఫిల్మ్ మేకింగ్‌తో జస్టిన్ తమ్ముడు రచ్చ నవ్వులు పూయిస్తుంది. ఆష్లే లవ్ ప్రపోజల్ సీన్ కూడా ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల లవ్ చుట్టునే తిరుగుతుంది. ఊర్లో వాళ్లుకి, స్నేహితులకు తెలియకుండా రహస్యంగా కలుసుకోవడం.. చిన్న చిన్న గొడవలు..అలకలు.. కాలేజీ ఎపిసోడ్.. అన్ని ఆకట్టుకుంటాయి. ఇక వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత అసలు సంఘర్షణ మొదలవుతుంది. అయితే అక్కడ నుంచి కథను ఎమోషనల్‌గా నడిపించే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మళ్లీ హాస్యాన్నే ఎంచుకున్నాడు. తన తమ్ముడి లవ్‌స్టోరీ తెలిసిన తర్వాత.. ఆ జంటను కలిపేందుకు జస్టిన్ గ్యాంగ్ చేసే హంగామా అంతా నవ్వులు పూయిస్తుంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ... అటు వైపు ఎక్కువ వెళ్ళలేదు. అలాగే హీరో లవ్ఫెయిల్యూర్ని పైపైనా చూపిస్తూ .. అతని తమ్ముడి లవ్‌స్టోరిని హైలెట్ చేస్తూ హాస్యం పండించాడు. హీరోహీరోయిన్ల ప్రేమలో డెప్త్ లేకున్నా.. కామెడీ సీన్లతో ఆలోటుని పూడ్చేశాడు. క్లైమాక్స్ కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మాత్రం ఓ మంచి సినిమా చూశామనే ఫిలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారంటే.. నివిన్ పౌలీ పాత్రలో నివిన్ పౌలీ నటించలేదు..జీవించేశాడని చెప్పాలి.తెరపై హీరోలా కాకుండా కామన్ మ్యాన్‌గా కనిపించాడు. ముఖ్యంగా హీరోయిన్ ప్రపోజ్ చేసినప్పుటు ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా ఉంటాయి. తన ప్రేమను వ్యక్తం పరిచేందుకు పడే సిగ్గు, ఇన్ సెక్యూరిటీ.. ప్రతీది చాలా అద్భుతంగా పండించాడు. ఇక ఆష్ల పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది మమిత. ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది.నివిన్, మమితల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. హీరో తమ్ముడిగా సంగీత్ ప్రతాప్, అతని స్నేహితుడిగా రోషన్ షనవాస్ తమదైన కామెడీతో నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. విష్ణు విజయ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు కూడా బాగుంటాయి. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కేరళ పల్లెటూరి అందాలనే కాదు గోవా అందాలను కూడా తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నెల గ్యాప్‌లో మూడు సినిమాలు.. హీరోయిన్‌కి అనారోగ్యం
గత నెల గ్యాప్‌లో జన నాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహోమ్ కుడుంబ యూనిట్ అని తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ మమిత బైజు ఆస్పత్రిపాలైంది. తీవ్ర జ్వరంతో ప్రస్తుతం బాధపడుతోంది. ఈ శనివారం ఆస్ట్రేలియాలో జరిగే 'క్లైడ్ ఓనం' వేడుకల్లో ఈమె పాల్గొనాలి. అనారోగ్యం కారణంగా ఈ టూర్ రద్దయింది. ఈ విషయాన్ని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ వెల్లడించింది. మమిత వీడియోని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలో మాధవన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)'డాక్టర్స్ సలహా మేరకు ప్రయాణం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి. త్వరలోనే అభిమానులని కలుసుకుంటాను' అని మమిత బైజు సదరు వీడియోలో చెప్పుకొచ్చింది. ఈమె చేసిన మలయాళ మూవీ 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' తెలుగు డబ్బింగ్ ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు) View this post on Instagram A post shared by Clyde Malayalee Community Inc (@clyde_malayalee) -
'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మమితా బైజు హ్యాట్రిక్.. తొలి హీరోయిన్గా రికార్డ్..!
మలయాళ బ్యూటీ మమితా బైజుకు మహర్దశ పట్టినట్టు ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనిపిస్తోంది. అందుకు సజీవ సాక్ష్యం ఇప్పుడు రిలీజైన సినిమాలే. ఇటీవల ఆమె నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో నెల రోజుల్లోనే మూడు సినిమాలు రూ.200 కోట్లు సాధించిన హీరోయిన్గా మమితా బైజు రికార్డ్ సృష్టించింది.జూలై 23న ఆమె నటించిన జన నాయగన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ చిత్రంలో దళపతి విజయ్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత సూర్య సరసన హీరోయిన్గా కనిపించింది. విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల రిలీజైన మలయాళ మూవీ బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ సైతం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో హ్యాట్రిక్ కొట్టిన మమితా బైజు అరుదైన ఫీట్ సాధించింది. ఈ విషయంలో తొలి హీరోయిన్గా ఘనతను సొంతం చేసుకుంది. -
మమిత సూపర్ డ్యాన్స్.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రెండు వారాల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలో హీరో సూర్యతో పాటు చాలామందికి హీరోయిన్ మమిత బైజు కూడా తెగ నచ్చేసింది. యాక్టింగ్ అంటూ ఈమె చేసిన అల్లరికి చాలామంది ఫ్లాట్ అయిపోయారు. ఇదే మూవీలో హిట్ గీతం 'నేనో బటర్ ఫ్లై' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడీ సాంగ్ పూర్తి వీడియోని రిలీజ్ చేసేశారు.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి)సూర్యపై ప్రేమ పుట్టే సందర్భంలో మమిత ఈ పాట పాడుతూ క్యూట్, సూపర్ డ్యాన్స్ చేస్తుంది. ఈ మూవీకి ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. తమిళ చిత్రంగా దీన్ని తీశారు. అయితే సొంత భాషలో పెద్దగా ఆడలేదు గానీ తెలుగు, ఓవర్సీస్లో మంచి వసూళ్లు దక్కించుకుంది. వచ్చే నెల రెండో వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: మమిత మరో ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్) -
మమిత మరో ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
రెండు వారాల క్రితం 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాతో వచ్చి హిట్ కొట్టిన మమిత బైజు.. మరో వారం తిరిగేసరికల్లా కొత్త మూవీని థియేటర్లలోకి తీసుకురానుంది. గతవారం మలయాళంలో మమిత హీరోయిన్గా చేసిన 'బెత్లెహోమ్ కుడుంబ యూనిట్' రిలీజైంది. ఫీల్ గుడ్ స్టోరీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు దీన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.(ఇదీ చదవండి: దీపిక సంచలన వ్యాఖ్యలు.. ప్రభాస్ 'స్పిరిట్'ని ఉద్దేశించా?)సెప్టెంబరు 4న రిలీజవుతున్న ఈ సినిమాకు తెలుగులో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'గా తీసుకొస్తున్నారు. సూర్య మూవీలానే దీన్ని కూడా ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీగానే తెరకెక్కించారు. జస్టిన్(నివీన్ పౌలీ) పక్కింట్లోకి ఆష్లే(మమిత) కుటుంబం అద్దెకు దిగుతుంది. జస్టిన్ కంటే ఆష్లే 12 ఏళ్లు చిన్నది. అలాంటి వీళ్లిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? చివరకు ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ అని తాజాగా వదిలిన తెలుగు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. 'ప్రేమలు' తీసిన గిరీష్ ఏడి దీనికి దర్శకుడు.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి) -
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ లోని సీన్‌పై మీమ్స్ వైరల్
ప్రేక్షకులకు సినిమాల్లోని కొన్ని సీన్లు అలరించడమే కాదు.. కొన్ని మీమ్ మెటీరియల్‌గా కూడా మారుతుంటాయి. తాజాగా సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ప్రతి నెల 27వ తేదీ రాగానే సూర్య పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు.27న విశ్వనాథ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటూ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సూర్య పోషించిన సంజయ్ విశ్వనాథ్ పాత్రకు సంబంధించిన ఓ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి నెల 27న వ్యక్తిగత కారణాలతో అతడు విదేశాలకు వెళ్తుంటాడు. దీంతో ఆ తేదీరాగానే సంజయ్ విశ్వనాథ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటూ అభిమానులు సరదాగా మీమ్స్ పెడుతున్నారు. గతంలో దృశ్యం2’ సినిమాలోనివి కూడా..మొన్నటి వరకు వెంకటేశ్ నటించిన ‘దృశ్యం2’ సినిమాలోని కొన్ని తేదీలు కూడా ఇలాగే వైరలయ్యాయి. ఆగస్టు 3 అంటే రాంబాబు విజయనగరం నుంచి వచ్చిన రోజు అని ఇలా ఆగస్టు నెలకు సంబంధించిన తేదీలు మీమ్‌గా మార్చి సోషల్‌మీడియాలో పోస్ట్చేసేవారు.కాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు రాబెట్టింది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, భవానీ శ్రీ, నాజర్, ఆది, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
వంద కోట్ల క్లబ్లో మమితా బైజు లేటేస్ట్ మూవీ
కంటెంట్ ఉంటే చాలు ఏ సినిమాకైనా కాసుల వర్షమే. అదే నిజమని ప్రతిసారి రుజువవుతోంది. ఇటీవలే విడుదలైన రవితేజ ఇరుముడి సైతం ఇదే నిరూపించింది. తండ్రీ కూతుళ్లు సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ ఇప్పటికే వసూళ్లపరంగా సెంచరీ కొట్టేసింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.ఇటీవలే మలయాళంలో విడుదలైన మరో మూవీ సైతం కంటెంట్‌తో అదరగొడుతోంది. మమితా బైజు, నివిన్ పౌలీ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా బెత్లెహెమ్ ఫ్యామిలీ యూనిట్. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మలయాళ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం విడుదలైన 6 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేరళలో ఓనం పండుగకు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.(ఇది చదవండి: సడన్‌గా ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయకపోయినా కూడా.. కేవలం మలయాళం వర్షన్‌తోనే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. మలయాళ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పోటీ లేకపోవడం బాగా కలిసొచ్చింది. ఓనం పండుగ కూడా రావడంతో ఈ సినిమాకు ప్లస్ అయింది. ఈ చిత్రాన్ని భావన స్టూడియోస్ బ్యానర్లో నిర్మించారు. ₹100 CRORE Gross Worldwide in 6 days🔥Phenomenal for a Malayalam only version film 💯#BethlehemFamilyUnit is a genuine blockbuster and is the clear Onam2026 winner by a mile 💥✨A big thumbs up to @NivinOfficial @mamitha_baiju #GirishAD @BhavanaStudios and rest of the #BKU… pic.twitter.com/DwaaIyZMpg— Sreedhar Pillai (@sri50) August 27, 2026 -
అందాల భామ అదిరిపోయే లుక్ మమితా బైజు..(ఫొటోలు)
-
విజయ్, సూర్యతో చేసి ఇప్పుడు కమెడియన్‌తో కొత్త సినిమా
సాధారణంగా స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన తర్వాత హీరోయిన్లు చాలామంది.. చిన్న హీరోలతో కలిసి పనిచేసేందుకు పెద్దగా ఇష్టపడరు. మరీ ముఖ్యంగా కమెడియన్ల పక్కన నటించాలంటే ఆలోచిస్తారు. కానీ ట్రెండింగ్ హీరోయిన్ మమిత బైజు మాత్రం ఎలాంటి భేషజాలకు పోకుండా 'ప్రేమలు' ఫేమ్ సహయ నటుడితో కలిసి మూవీ చేసేందుకు రెడీ అయింది. ఈ ప్రాజెక్టుని అధికారికంగానూ ప్రకటించారు.'ప్రేమలు' మూవీతో హీరోయిన్గా మమితకు దక్షిణాదిలో మంచి క్రేజ్ వచ్చింది. ఇందులోనే హీరో ఫ్రెండ్ అమూల్ అనే పాత్రలో చేసిన సంగీత్ ప్రతాప్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు. 'హలో డియర్' అనే టైటిల్‌తో సినిమాని కూడా ప్రకటించారు. డినో పావులోజ్ అనే కొత్త దర్శకుడు దీన్ని తీస్తున్నాడు.మమిత విషయానికొస్తే మలయాళంలో 2016లో బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. సూపర్ శరణ్య, కోకో, ప్రణయ విలాసం తదితర మూవీస్‌లో సహాయ నటిగా చేసింది. ఎప్పుడైతే 'ప్రేమలు' హిట్ అయిందో ఈమె దశ తిరిగిపోయింది. తర్వాత తమిళంలో చేసిన 'డ్యూడ్' హిట్ కావడంతో ఈమెకు మరింతలా కలిసొచ్చింది. రీసెంట్ టైంలో దళపతి విజయ్ చివరి మూవీ 'జన నాయగన్', సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో అదరగొట్టింది. ఈమె చేసిన 'బెత్లహమ్ కుడుంబ యూనిట్' అనే మలయాళ మూవీ తాజాగా థియేటర్లలో రిలీజైంది. ఇంతలా స్టార్డమ్ వచ్చినప్పటికీ ఓ కమెడియన్ పక్కన హీరోయిన్గా నటించేందుకు అంగీకరించి హాట్ టాపిక్ అయిపోయింది. -
కథ వినగానే సూర్య అలా అన్నారు!: వెంకీ అట్లూరి
‘‘ఒకప్పుడు అన్ని రకాల జానర్ సినిమాలు వచ్చేవి. కానీ, కొంతకాలంగా ఫ్యామిలీ సినిమాలు తగ్గిపోయాయి. అందుకే మంచి ఫ్యామిలీ సినిమా వస్తే, ప్రేక్షకులు థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. కోవిడ్ టైమ్‌లో ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారని తెలుసుకున్నాను. ఇందుకు తగ్గట్లే జానర్స్ షిఫ్ట్ చేస్తూ, కథలు రాస్తూ సినిమాలు చేస్తున్నాను’’ అని వెంకీ అట్లూరి చెప్పారు. సూర్య, మమిత బైజు హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది.ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, విజయవంతంగా ప్రదర్శితమవుతోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు... ⇒ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు మేం ఊహించినదానికంటే ఎక్కువ స్పందన లభిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సూర్యగారు ఈ సినిమా కథ వినగానే కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే కథలోని ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్తలు వహించాను. అలాగే క్లైమాక్స్‌లో కూడా చాలా కేర్ తీసుకున్నాం. ⇒ నా దృష్టిలో ఏ మనిషి చెడ్డవారు కాదు. పరిస్థితుల వల్ల ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవరిస్తుంటారు. ఇదే ఈ విషయాన్ని ఈ సినిమాలో చెప్పాను. వయసు వ్యత్యాసం ఉన్న బంధంపై కథ రాయాలనుకున్నప్పుడే హీరోకు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉండాలనుకుని, ఈ అంశం చుట్టూ ఈ కథ అల్లాను. వయసు వ్యత్యాసం కూడిన అంశాన్ని తమిళనాడు సీఎం విజయ్‌గారి జీవితంతో పోల్చుతూ కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారని అంటున్నారు. కానీ నిజానికి ఈ కథను 2022లోనే అనుకుని, క్యారెక్టర్ పేరు సంజయ్ అని రాసుకున్నాను. కాకపోతే హీరోగా సూర్యగారిని ఊహించుకోలేదు. సూర్యగారికి కథ చెప్పిన తర్వాత ఆయన బాడీ ల్యాంగ్వేజ్కి తగ్గట్లు కొన్ని మార్పులు చేయడం జరిగింది. ⇒ సూర్యగారికి తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈ సినిమాను తమిళంలో తీసి, తెలుగులో డబ్ చేశాం. అయితే తమిళంలో కన్నా, తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి కదా అంటున్నారు. కానీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తున్నారు. తమిళనాడు ఒక రాష్ట్రం మాత్రమే. పైగా మన దగ్గర థియేటర్స్ సంఖ్య ఎక్కువ. అలాగే టికెట్ ధరల్లో కూడా వ్యత్యాసం ఉంది. అయితే అక్కడి సిని మాలకు థియేటర్స్‌లో లాంగ్ రన్ ఉంటుంది.⇒ సితార బ్యానర్లో నిర్మితమయ్యే సినిమాలకు త్రివిక్రమ్‌గారి పర్యవేక్షణ ఉంటుంది. దీంతో ఆయన సినిమాలు చూసి కొన్ని చిన్న చిన్న మార్పులు చెబుతుంటారు. కానీ ఈ సినిమాకి ఆయన ఏ మార్పులు చెప్పలేదు. డబ్బు, అగ్రిమెంట్లను మించిన అతీతమైన బంధం సితార బ్యానర్‌తో నాకు ఏర్పడింది. నా నెక్ట్స్ చిత్రం కూడా ఇదే బ్యానర్లో ఉండొచ్చు. ఇటీవలి కాలంలో తెలుగు హీరోతోనే సినిమా చేయాలనుకున్నాను. ఏంటో... అనుకుంటే కుదరడం లేదు. ఈసారి అనుకోకుండా ముందుకు వెళ్తాను (నవ్వుతూ). -
అదృష్టం అంటే ఈ హీరోయిన్నే..పాతికేళ్లకే తిరుగులేని క్రేజ్
ప్రస్తుతం కోలీవుడ్‌లో నటి మమిత బైజు టైమ్ నడుస్తుందనే చెప్పవచ్చు. వరుస విజయాలతో ఈ మాలీవుడ్ చిన్నది దూసుకుపోతోంది. కేరళ రాష్ట్రం ,కొట్టాయం సమీపంలోని కిడంగూర్ అని గ్రామానికి చెందిన డిగ్రీ కూడా పూర్తి చేయని మమిత బైజు ఇప్పుడు మలయాళం, తమిళం , తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా దూసుకుపోతోంది.బాల్యంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె మొదట్లో బాలనటిగా కొన్ని చిత్రాలు నటించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే 2024 ఈ అమ్మడికి లక్కీ ఇయర్ అనే చెప్పాలి. ఆ ఏడాదిలో మలయాళం లో కథానాయకిగా నటించిన ప్రేమలు చిత్రం మమిత బైజు జీవితాన్నే మార్చేసింది. ఆ చిత్రం అనూహ్య విజయం తో మలయాళం లోనే కాకుండా తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమంలోనూ ఈమె పేరు మారుమ్రోగింది. ఇకపోతే అదే సంవత్సరంలో మమిత బైజు రెబల్ అని చిత్రంతో కోలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మమిత బైజు కు మాత్రం ఇక్కడ మంచి సక్సెస్ఫుల్ బాటను అమర్చింది.నటుడు ధనుష్ ,విజయ్ ,ప్రదీప్ రంగనాథన్ ,సూర్య వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలను పొందింది. తాజాగా జంటగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో శుక్రవారం విడుదలై సక్సెస్ఫుల్ టాక్ తో ప్రదర్శింపబడుతుంది. ఈ చిత్రంలో మమిత బైజు నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ప్రతిభకు లక్కు తోడైతే అది మమిత బైజు లా ఉంటుంది అని కూడా అంటున్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రను ఎంపిక చేసుకుంటూ ఆయా పాత్రలో లీనమై నటించడం వల్లే ఈమె వరసగా సక్సెస్ అందుకుంటుందనే భావన సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తమిళం మలయాళం భాషలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ పాతికేళ్ల పరువాల భామ తమిళంలో నటుడు కార్తీకి జంటగా నటిస్తున్న చిత్రం నిర్మాణ దశలో ఉంది. -
‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ.! థియేటర్ దగ్గర ఫ్యాన్స్ రచ్చ రచ్చ
-
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ
మూడు నెలల క్రితం 'కరుప్పు'(తెలుగులో వీరభద్రుడు)తో హిట్ కొట్టిన సూర్య.. ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో వచ్చేశాడు. దీనికి తెలుగువాడైన వెంకీ అట్లూరి దర్శకుడు కాగా, నాగవంశీ నిర్మాత. మమిత బైజు హీరోయిన్. రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సంజయ్ విశ్వనాథ్(సూర్య) ఓ వ్యాపారవేత్త, ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి చేసుకోడు. అమెరికాకి వెళ్లి సరోగసి ద్వారా మగబిడ్డని కని స్వదేశానికి తిరిగొస్తాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లాడు ఓ అరుదైన వ్యాధి బారిన పడతాడు. బోన్ మారో(ఎముక గుజ్జు) ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవసరం ఏర్పడుతుంది. అమెరికాకు తిరిగెళ్లి సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని వెతికి భారత్‌కి తీసుకొస్తాడు. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు.20 ఏళ్ల మ్యాడీ.. సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా తన కొడుకును పెంచుకోగలిగాడా? మ్యాడీ ప్రేమని సంజయ్ ఎందుకు తిరస్కరించాడు? చివరకు పెళ్లి విషయంలో సంజయ్ తన ఆలోచన మార్చుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ. ఎలా ఉందంటే?కుటుంబ నేపథ్యంలో సాగే సినిమా ఇది. సాంప్రదాయాలు, బంధాలు, తల్లి-కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాల చుట్టూ కథ తిరుగుతుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా దాని చుట్టూ అల్లిన సన్నివేశాలు, మానవ సంబంధాలని హృదయాలను హత్తుకునేలా తీర్చిదిద్దాడు. కాసేపు నవ్విస్తూ మరి కాసేపు భావోద్వేగానికి గురిచేస్తూ బోర్ కొట్టకుండా కథనాలు నడిపించాడు.సంజయ్ విశ్వనాధ్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే సన్నివేశంతో మూవీ ప్రారంభమవుతుంది. తర్వాత సంజయ్ ఫ్యామిలీ నేపథ్యం, మంచి వ్యాపారవేత్తగా ఎదిగిన తీరు చూపించారు. ఆ వెంటనే బిడ్డ కోసం సరోగసి మార్గం ఎంచుకోవడం... కొడుకు సర్జరీ కోసం సరోగసి మదర్ మ్యాడీ ఇండియాకు రావడంతో కథ కామెడీ టర్న్ తీసుకుంటుంది. మ్యాడీ చేసే అల్లరి థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. అదే సమయంలో తల్లితో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు గుండెని బరువెక్కిస్తాయి.టీవీ షో ఎపిసోడ్ అయితే కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. ద్వితీయార్థంలో కథనం చాలావరకు ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. మదర్ ఎపిసోడ్లో తెరపై సూర్య కన్నీళ్లు పెట్టుకుంటే సీట్లో ఉన్న ప్రేక్షకుడి గుండె బరువెక్కుతుంది. ఆ తర్వాత కథనం కొంతవరకు నెమ్మదిగా సాగుతుంది. పెళ్లి ఎపిసోడ్ అయితే కొంత సాగదీత అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంది.ఎవరెలా చేశారంటే?సంజయ్ విశ్వనాధ్ పాత్రల్లో సూర్య ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన కన్నీళ్లు తెప్పిస్తుంది. మమితకు మంచి పాత్ర లభించింది. మ్యాడీగా ఆమె చేసే అల్లరి నవ్వులు పూయిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మమిత పాత్రను మర్చిపోరు. తల్లిగా రాధిక చక్కగా నటించింది. మిగిలిన వాళ్లు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.సాంకేతిక విషయాలకొస్తే మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి సీన్ తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.అంజి శెట్టే , సాక్షి వెబ్ డెస్క్ -
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో సూర్య.. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీతో కలిసి చేసిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమిత బైజు హీరోయిన్ కాగా రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. నేడు(ఆగస్టు 14) తెలుగు, తమిళంలో రిలీజైన ఈ సినిమా గురించి ట్విటర్ టాక్ ఏంటి? ఆడియెన్స్ ఏమంటున్నారు?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)45 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడటం అనే కథాంశంతో ఈ సినిమా తీశారు. ఇందులో సూర్య.. ఒలింపిక్ షూటర్ పాత్రలో కనిపించాడు. 20 ఏళ్ల చలాకీ అమ్మాయి పాత్రని మమిత బైజు చేసింది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ పర్లేదనిపించాయి.ఇక సినిమా విషయానికొస్తే కొందరికి బాగా నచ్చేసింది. ఆ మేరకు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఫస్టాప్ బాగుందని, సెకండాఫ్ తేలిపోయిందని అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత మెలోడ్రామా ఎక్కువైందని, క్లైమాక్స్ ఇంకా బాగా తీసి ఉండొచ్చని రాసుకొస్తున్నారు. ఓవరాల్‌గా డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. మరికొందరు మాత్రం తమకు ఒక్క సీన్ కూడా నచ్చలేదని అంటున్నారు.(ఇదీ చదవండి: 'అగధ' మూవీ రివ్యూ)#VishwanathAndSons – One of the BEST FAMILY ENTERTAINERS in Recent Times…!!This one is a breezy, light hearted family entertainer from #Suriya and Director #VenkyAtluri.The lead performances and writing are the biggest strengths of the film.Don’t expect a #LuckyBhaskar kind…— Rangasthalam (@RangasthalamIN) August 14, 2026Disaster Review for #VishwanathAndSons 💔Weakest Movie from #VenkyAtluri #VishwanathAndSons pic.twitter.com/HUfsTQhJCr— 𝗕𝗵𝗮𝗿𝗮𝗻𝗶🥃🎲 (@Anirudhoff_) August 14, 2026#VishwanathAndSons Review: “A Decent Family Entertainer”👉Rating : 2.75/5Positives:⁰👉#Suriya performance⁰👉#MamithaBaiju & Radhika are well cast⁰👉Venky Atluri’s dialogues work well⁰👉A few good emotional momentsNegatives:⁰👉Uneven 2nd half⁰👉Some subplots don’t work…— PaniPuri (@THEPANIPURI) August 14, 2026🔥 #VishwanathAndSons — OVERALL REVIEW 🔥When the story was leaked and the trailer dropped, I was worried that the film might have nothing more to offer. But the 2nd half has a major surprise that wasn’t revealed in any publicity material! 🔥The director shows two sides of… pic.twitter.com/JizKxv2OBu— Kollywood Wire (@KollywoodWire) August 14, 2026#VishwanathAndSons - VATCHABLE ONES!Good 1st Hlf & Avg 2nd Half.OKayish Feel Good Family Entertainer!— Christopher Kanagaraj (@Chrissuccess) August 14, 2026#VishwanathAndSons First half - Excellent 👌- Took 15 Mins to setup the plot and Conflict !!- Once #MamithaBaiju entered, the film took off and totally entered into the fun mode. Mamitha & her mannerisms was super cute🥰😀 - #Suriya's Screen presence and performance was… pic.twitter.com/A4x9vB0HPn— AmuthaBharathi (@CinemaWithAB) August 14, 2026#VishwanathAndSons A Watchable, Clean Family Entertainer With a Good 1st Half but a Weak 2nd Half!After a slow start, the first half feels refreshing and stays focused on the core plot with a good mix of fun and emotion. Just when you expect that flow to continue, the second…— Venky Reviews (@venkyreviews) August 14, 2026 -
విశ్వనాథ్ అండ్ సన్స్.. రిలీజ్‌కు ముందే బిగ్ డీల్స్
సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలకు ముందే రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో దూసుకెళ్తోంది. ‘కరుప్పు’ విజయంతో సూర్య మార్కెట్ మరింత బలపడటంతో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ విలువ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి అడ్వాన్స్ బుకింగ్స్‌పైనే పడింది.తమిళనాడులో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో కాకపోయినా మోస్తరు స్థాయిలో కొనసాగుతున్నాయి. సాక్నిల్క్ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ చిత్రం తమిళనాడులో రూ.7.23 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌ను నమోదు చేసింది. ‘కరుప్పు’ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లుఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ మొత్తం సుమారు రూ.215 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు ఉన్నాయి. తమిళనాడు థియేట్రికల్ హక్కుల విలువ రూ.45 కోట్లు కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లు, కర్ణాటకలో రూ.5 కోట్లు, ఇతర ప్రాంతాల్లో రూ.5 కోట్లు, ఓవర్సీస్లో రూ.15 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. దీంతో మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లకు చేరింది. ఓటీటీ, శాటిలైట్, సంగీత హక్కులతో కూడిన నాన్-థియేట్రికల్ బిజినెస్ విలువ రూ.125 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్ల పరంగా ఈ చిత్రం విజయవంతం కావాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ.175 కోట్ల గ్రాస్‌ను సాధించాల్సి ఉంటుంది.ఆగస్టు 14న రాబోతోంది..వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య, మమితా బైజు జంటగా నటించారు. రాధికతో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, వినోదం ప్రధాన అంశాలుగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఒకే రోజు ఐదు సినిమాలు.. గెలిచేదెవరో..?
ఒక్కో సినిమాది ఒక్కో కథ. ఒక్కో దర్శకుడిది ఒక్కో కాన్సెప్ట్. ఫ్యామిలీ డ్రామా నుంచి యాక్షన్ వరకు, హారర్ నుంచి పీరియాడిక్ కథల వరకు విభిన్న జానర్లతో ప్రేక్షకులను అలరించేందుకు ఐదు సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమాలపై అంచనాలను పెంచేశాయి. మరి ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం.విశ్వనాథ్ అండ్ సన్స్: సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమితా బైజు కథానాయికగా నటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.పళ్ళ బురుసు: ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పళ్ళ బురుసు'. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్‌లు నిర్మించిన ఈ సినిమా కూడా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.మకుటం: విశాల్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'మకుటం'. ఆర్బీ చౌదరి నిర్మించిన ఈ సినిమాలో దుషార విజయన్, అంజలి కథానాయికలుగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.అగధ: ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో శ్రవణ్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అగధ'. కామాక్షీ భాస్కర్ల, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయ రాణి రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కూడా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆవారాపన్ 2: 'ఆవారపన్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన సినిమా 'ఆవారపన్ 2'. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్ హష్మీ సరసన దిశా పటాని నటించింది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.బట్వారా 1947: సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బట్వారా 1947'. ఈ చిత్రంతో ప్రీతి జింటా మళ్లీ వెండితెరపై కనిపించనుంది. షబానా ఆజ్మీ, అలీ ఫజల్, కరణ్ డియోల్, సర్గమ్ సింగ్‌లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మించారు. ఈ సినిమా కూడా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇలా విభిన్న కథాంశాలతో వస్తున్న ఈ సినిమాల్లో ఏ చిత్రం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరో కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. -
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు)
-
తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.. ఎమోషనల్ అయిన సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. గత 28 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అన్నారు. శివకుమార్ కుమారులైన తమను తెలుగు ప్రజలు దత్త పుత్రుల్లా గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. విశ్వనాథ్ అండ్ సన్స్’లో హ్యూమన్ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాకు మొదట్నుంచి త్రివిక్రమ్‌గారి సపోర్ట్ ఉంది. ఈ సినిమా నాకు మంచి జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు.‘గజినీ’లో సంజయ్ రామస్వామి పాత్రను ఎలా ఆదరించారో.. అదే వింటేజ్ మ్యాజిక్‌ను మళ్లీ తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ఈ కథను రూపొందించారని సూర్య చెప్పారు. హైదరాబాద్‌లో ఆరు నెలల షూటింగ్ అనుభవం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. వెంకీ అట్లూరి రైటింగ్, సిన్సియారిటీని ప్రశంసిస్తూ.. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని తెలిపారు.‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’కు అందించిన ప్రేమనే ఆగస్టు 14న విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’కు కూడా అందించాలని తెలుగు ప్రేక్షకులను కోరారు.‘‘రాధికగారు ఈ సినిమాలో ఒక మ్యాజిక్. ఇక లైఫ్‌లో మీకు డబ్బు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే... మమితలా ఇంత మంచి పొజిషన్లో ఉంటారు. జూనియర్ ఆర్టిస్టు కుమార్తె నుంచి ఇప్పుడు ఆమె ఈ వేదికపై ఉన్నారు. మిమ్మల్ని మీరు నమ్మండి. వెంకీ ఈ సినిమాలో మూడు అందమైన మహిళా క్యారెక్టర్స్ రాశారు. వెంకీతో నేను ఓ బయోపిక్ చేయాల్సింది. కానీ ఈ సినిమా చేశాం. ఈ సినిమాలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. ఈ చిత్రం మా అందరికీ స్పెషల్’’ అని సూర్య అన్నారు.వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల ముఖంపై ఒక చిరునవ్వు ఉంటుంది. సూర్య నటించిన చాలా సినిమాలు ఫ్రై డే రోజునే నేను చూశాను. కానీ నేను ఆయన్ను డైరెక్ట్ చేసిన సినిమా ఈ ఫ్రై డే రిలీజ్ కానుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో ప్రేక్షకులను 90 శాతం ఎంటర్టైన్ చేస్తానని చెప్పగలను’’ అని అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత స్టేజ్‌పై ధైర్యంగా చెబుతున్నా... ఈ సినిమా చాలా బాగుంది. ఇందులో మదర్ అండ్ సన్స్ రిలేషన్ అద్భతంగా ఉంటుంది. అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు నాగవంశీ. ‘‘కొత్త పాయింట్‌తో వెంకీ అట్లూరి మంచి కథ రాశారు. ఈ సినిమాలో మూడు పాటలు రాశాను’’ అన్నారు రామజోగయ్య శాస్త్రి. ఈ వేడుకలో పాల్గొన్న నిర్మాతలు వై. రవిశంకర్, కేఎల్ నారాయణ, జూబ్లీహిల్స్ ఎమ్ఎల్ఏ నవీన్ యాదవ్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హిట్ కావాలని ఆకాంక్షించారు. సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. -
మమితా బైజు సంచలన నిర్ణయం.. కారణం ఇదే!
మలయాళ నటి మమితా బైజు వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ‘డ్యూడ్’, ‘జన నాయకన్’ వంటి చిత్రాలతో బిజీగా మారారు. త్వరలో స్టార్ హీరో సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.‘సోషల్ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. నా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను వ్యక్తిగతంగా కాకుండా పీఆర్ టీమ్ ద్వారా వెల్లడిస్తా’ అని స్పష్టం చేశారు. తన అభిమాన హీరో గురించి మాట్లాడుతూ.. తాను అల్లు అర్జున్‌కు వీరాభిమానినని మమితా తెలిపారు. ఆయన నటించిన సినిమాల్లో ‘ఇద్దరమ్మాయిలు’ సినిమా ఇష్టమన్నారు. ఆ సినిమాలో ఉపయోగించిన వాచ్, ధరించిన టీషర్ట్ స్టైల్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు. తాను కూడా ఆ స్టైల్‌ను కాపీ చేసేదాన్నని చెబుతూ నవ్వులు పూయించారు. -
అప్పుడు కలవనివ్వలేదు.. ఇప్పుడు అదే హీరోతో!
మలయాళ నటి మమితా బైజు ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘డ్యూడ్’ ‘జన నాయకన్’ చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. సూర్యతో కలిసి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఈ శుక్రవారం(ఆగస్టు 14) ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కేరళలో శనివారం జరిగింది. ఇందులో మాట్లాడిన మమిత తన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుచేసుకుంది.‘2015లో సూర్య ఓ కార్యక్రమం కోసం కొచ్చి వచ్చారు. అప్పుడు నేను ఎనిమిది, మా అన్నయ్య ఇంటర్ చదువుతున్నాం. సూర్యని చూసేందుకు అన్నయ్య తన స్నేహితులతో కలిసి కొచ్చి వెళ్లాడు. నేనూ వెళ్తానంటే మా తల్లిదండ్రులు పంపించలేదు. అన్నయ్య సూర్యతో ఫొటో దిగి చూపించాడు. నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు అదే హీరోతో కలిసి నటించే అవకాశం దక్కింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్యతో కలిసి ఒకే వేదికపై నిలబడటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని మమిత చెప్పుకొచ్చింది. అభిమానిగా సూర్యని చూడాలనుకున్న తనకు.. ఇప్పుడు ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప ఆశీర్వాదమని పేర్కొంది.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 45 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఇందులో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు. -
సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్
-
హీరో సూర్య పాడిన పెళ్లి పాట రిలీజ్
హీరో సూర్యకి తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఓ సినిమా చేశాడు. అదే 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వచ్చే నెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కొన్నాళ్ల క్రితం 'బటర్ ఫ్లై' పాట విడుదల చేయగా.. ఇప్పుడు సూర్య పాడిన పాటని వదిలారు.(ఇదీ చదవండి: 'విశ్వనాథ్ అండ్ సన్స్' తెలుగు సినిమా కాదు)'వెడ్డింగ్ సాంగ్' అంటూ సాగే ఈ పాట కలర్ఫుల్గా ఉంది. ఇందులో సూర్య 40 ఏళ్ల వ్యక్తిగా, మమిత బైజు 20 ఏళ్ల అమ్మాయిగా నటించారు. వీళ్లిద్దరూ ప్రేమలో పడితే ఏమైంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: 45 ఏళ్లకు తల్లయిన టాలీవుడ్ హీరోయిన్) -
ఇది తెలుగు సినిమా కాదు.. డబ్బింగ్ చేశామంతే
సూర్య స్వతహాగా తమిళ హీరోనే కానీ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో బోలెడంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అందుకు తగ్గట్లే దాదాపు ప్రతి మూవీ ఒకేసారి ఇక్కడ కూడా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ టైంలో అయితే 'కరుప్పు'ని 'వీరభద్రుడు' పేరుతో రిలీజ్ చేస్తే పర్లేదనిపించింది. వచ్చే నెలలో 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం గురించి దర్శకుడు వెంకీ అట్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ.. సూర్యతో చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచి అంతా ఇది.. ఈ హీరో తెలుగులో చేస్తున్న తొలి సినిమా అనుకున్నారు. కానీ స్ట్రెయిట్ తమిళ చిత్రం అని, తెలుగులో డబ్బింగ్ చేశామని స్వయంగా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతి బయటపెట్టాడు.'గతంలో ధనుష్‌తో 'వాతి'(సార్) సినిమా టైంలో ప్రయోగం చేయాలనుకున్నాం. ఓటీటీల కారణంగా ధనుష్‌కి తెలుగులో భారీగా అభిమానులు పెరిగారు. దీంతో ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాం. కానీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్టోరీ దృష్ట్యా ముందుగా తమిళంలో పూర్తిచేసి తర్వాత తెలుగులో డబ్బింగ్ చేశాం. సూర్యతో ముందుగా ఓ బయోపిక్ చేయాలనుకున్నాను. కానీ దానికి హక్కుల విషయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది. సూర్యతో సినిమా చేయాలనేది నా చిరకాల కోరిక. భవిష్యత్తులో ఆయనతో తప్పకుండా మరో సినిమా చేయాలనుంది' అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.40 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడటం అనే స్టోరీతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా తీశారు. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో సూర్య సరసన మమిత బైజు హీరోయిన్గా చేసింది. రాధిక, రవీనా టండన్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: రిలీజ్ రోజే 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?)#VishwanathAndSons is not a bilingual like #Vaathi. The film was shot in Tamil only and dubbed into Telugu.It made more sense to me as a director and my actors were comfortable.- #VenkyAtluri pic.twitter.com/oF0Q73eCbx— telugucinema.com (@thetelugucinema) July 24, 2026 -
'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?
స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేసిన చివరి సినిమా 'జన నాయగన్'. లెక్క ప్రకారం సీఎం కాకముందే అంటే ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు నిన్న(జూలై 23) థియేటర్లలో రిలీజైంది. తమిళంలో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు గానీ తెలుగులో మాత్రం డిజాస్టర్ టాక్ వచ్చింది. మరి ఈ మూవీకి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసిన 'జన నాయగన్' చిత్రానికి తొలిరోజు రూ.78.27 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.41 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. గ్రాస్ రూ.48.27 కోట్లుగా తేలింది. ఓవర్సీస్ నుంచి రూ.30 కోట్లు వచ్చాయి. ఇలా ఓవరాల్‌గా రూ.78.27 కోట్ల గ్రాస్ అని టాక్. ఇందులో హిందీ నుంచి రూ.1.75 కోట్లు తెలుగు నుంచి రూ.2.75 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. మిగతాది అంతా తమిళ ప్రేక్షకుల నుంచే వచ్చింది.అయితే విజయ్ చివరి సినిమా అని హడావుడి చేసినప్పటికీ గతంలో వచ్చిన 'గోట్' తొలిరోజు కలెక్షన్స్‌ని 'జన నాయగన్' అధిగమించలేదని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న నంబర్స్ మాత్రమే. నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తే వసూళ్లపై క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: చివరి నిమిషంలో షాకిచ్చిన 'రామాయణ' మేకర్స్)'జన నాయగన్' విషయానికొస్తే.. దళపతి వెట్రి కొండాన్ (విజయ్) జైలులో ఉంటాడు. తనతో పాటు ఖైదీగా ఉన్న ఓ వ్యాపారవేత్తని కాపాడి జైలర్ (గౌతమ్ మేనన్) దృష్టిలో పడతాడు. ఆ అధికారి సాయంతోనే క్షమాభిక్ష కింద వెట్రి బయటకొస్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఆయన కూతురు విజ్జి (మమిత బైజు)ని పెంచే బాధ్యతని వెట్రి తీసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యని కళ్లారా చూసిన విజ్జి ప్రతి చిన్న విషయానికీ భయంతో వణికిపోతుంటుంది. ఆమెను ధైర్యవంతురాలిగా మార్చి, సైన్యంలో చేర్పించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు.మరోవైపు జాన్ హిమ్లర్ (బాబీ దేవోల్) విజ్జిని లక్ష్యంగా చేసుకుని ఆమెని చంపాలని తన ముఠాని పంపుతాడు. అసలు విజ్జిని జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి కారణమేంటి? ఆఫ్రికా దేశాల్ని వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతడిని వెట్రి కొండాన్ ఎలా ఎదిరించాడు? విజ్జిలోని భయాన్ని పోగొట్టి ఆమెని ధైర్యవంతురాలిగా మార్చాడా?లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
సీఎం విజయ్‌తో సినిమా ట్రెండింగ్ లో మమితా బైజు (ఫొటోలు)
-
‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : జన నాయకన్(జన నాయకుడు)నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు తదితరులునిర్మాణ సంస్థ: కేవీఎన్ ప్రొడక్షన్స్నిర్మాత: వెంకట్ కె. నారాయణ (కేవీఎన్)దర్శకత్వం: హెచ్. వినోద్సంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ఎడిటింగ్: ప్రదీప్ ఇ. రాఘవ్విడుదల తేది: జులై 23, 2026జన నాయకన్.. తమిళనాడు ఎన్నికల ముందు ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయ్ చివరి చిత్రం అని చెప్పడంతో అప్పటికే ‘జన నాయకన్’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఎన్నికల సమయంలో సెన్సార్ అడ్డంకులు ఏర్పడి, సినిమా రిలీజ్ కాకపోవడం.. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు పెట్టడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎలాంటి అడ్డకుంలు లేకుండా నేడు (జులై 23) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి విజయ్ చివరి చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..దళపతి వెట్రి కొండన్(విజయ్) పోలీసు ఆఫీసర్. ఓ నేరం కింద ఆయన మధురై సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు.కొత్తగా వచ్చిన జైలు వార్డెన్(గౌతమ్ వాసుదేవ్ మీనన్),దళపతి మంచి తనం చూసి.. అనారోగ్యంతో ఉన్న తన తల్లి(రేవతి)ని చివరి సారిగా చూసేందుకు అనుమతి ఇస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 15న వచ్చే సాధారణ క్షమాభిక్ష ద్వారా జైలు నుంచి విడుదలయ్యేలా చేస్తాడు. ఈ క్రమంలో జైలు జైలర్ కూతురు విజ్జి(మమితా బైజు)తో దళపతికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. రోడ్డు ప్రమాదంలో జైలర్ చనిపోవడంతో విజ్జికి అన్ని తానై చూసుకుంటాడు. తండ్రి కోరిక మేరకు ఆమెను ఆర్మీలో జాయిన్ చేయించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే విజ్జికి ఫియర్ ఫోబియా ఉండడంతో..ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకొని సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. అలాంటి విజ్జిని ఓ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఆమెను చంపేందుకు ప్లాన్ చేస్తుంది. దీని వెనుక గ్యాంగ్‌స్టర్ హిమ్లర్(బాబీ డియోల్) ఉన్నాడని దళపతి తెలుసుకుంటాడు. అసలు హిమ్లర్ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతని మనుషులు విజ్జిని ఎందుకు టార్గెట్ చేశాడు? ఆఫ్రికాలో అల్లకల్లోలం సృష్టించిన హిమ్లర్..ఇండియాకు ఎందుకు వచ్చాడు? భారత్‌పై ఆయన చేసిన కుట్ర ఏంటి? దాన్ని దళపతి ఎలా అడ్డుకున్నాడు? ఈ విషయంలో జర్నలిస్ట్ కాయల్(పూజా హెగ్డే)..దళపతికి ఎలా తోడుగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా కథని బేస్‌గా తీసుకొని, దానికి రాజకీయఅంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమే ఈ ‘జన నాయకన్’. హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి.. ఆయనకు ఉపయోగపడేలా పొలిటికల్ సీన్లను పేర్చి.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తీర్చి దిద్దారు.అయితే ఆయా సీన్లు విజయ్ ఫ్యాన్స్‌ని అలరిస్తాయేమో కానీ.. జనరల్ ఆడియన్స్‌ని మాత్రం అంతగా ఆకట్టుకోలేవు. ఇక తెలుగు ప్రేక్షకుల్లో అల్రేడీ భగవంత్ కేసరి చూసినవారైతే..ఓపికతో ఈ సినిమా చూడాల్సిందే.విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. కేవలం అభిమానుల కోసమే అన్నట్లుగా చాలా చోట్ల హీరోకి ఎలివేషన్ ఇచ్చారు. యాక్షన్ సీన్స్ కూడా అదే రేంజ్లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న..గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్..ఎలివేషన్స్.. భారీ యాక్షన్ సీన్స్..అన్ని ఈ సినిమాలో ఉంటాయి. కానీ ఏ ఒక్కటి కూడా కొత్తగా అనిపించవు. పైగా క్లైమాక్స్‌లో రోబోలతో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే సహనానికి పరీక్షగా మారుతుంది. హీరో పరిచయ సన్నివేశం నుంచి మొదలు ఫస్టాఫ్ మొత్తం దాదాపు ‘భగవంత్ కేసరి’ చూసినట్లుగానే అనిపిస్తుంది. అయినా కూడా కొంతమేర ఎంటర్టైన్ కావొచ్చు. కానీ సెకండాఫ్ మాత్రం మరీ హింసాత్మకంగా మారుతుంది. లాజిక్ లేని సీన్లు ఒకవైపు.. అనవసరమైన పొలిటికల్ డైలాగులు మరోవైపు.. సీట్లో కూర్చున్న ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా పెడతాయి. ఇదంతా ఏం వద్దు..ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్ ఉంటే చాలు అనుకునే వాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఎవరెలా చేశారంటే.. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఎంచుకున్నాడు. దళపతి పాత్రకు తగిన న్యాయం చేశాడు. యాక్షన్‌తో పాటు ఓ పాటలో డ్యాన్స్ కూడా ఇరగ దీశాడు. బాబీ డియోల్ విలనిజం బాగానే పండింది. ఆయన పాత్రకు కూడా భారీ ఎలివేషన్స్ ఉంటాయి. విజ్జు పాత్రకి మమితా బైజు న్యాయం చేసింది. అయితే శ్రీలీలతో పోలిస్తే మాత్రం కాస్త వెనకే ఉందని చెప్పాలి. పూజా హెగ్డే తెరపై అందంగా కనిపించింది కానీ.. నటనకు పెద్దగా స్కోప్ దక్కలేదు. ప్రకాశ్ రాజ్ పాత్ర బాగుంది. కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం దారుణంగా ఉంది. నాజర్, ప్రియమణి, రేవతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.టెక్నికల్ విషయాలకొస్తే..అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ తగ్గలేదు. -
వయసుతో పని లేదు... మనసు ముఖ్యం
‘నేను నీకన్నా పెద్దవాణ్ణి... నాతో నీకు ప్రేమ సెట్ కాదు’... అంటాడు హీరో. ‘అయినా ఓకే... నేనేమైనా తప్పు చేస్తే... చిన్నమ్మాయి అని క్షమిస్తావ్... నువ్వేమైనా అంటే.. పెద్దోడు అని సర్దుకుపోతా’ అంటుంది హీరోయిన్. ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్‌కి మధ్య జరిగే సంభాషణ ఇది. హీరో వయసు ఫిఫ్టీ ప్లస్... హీరోయిన్‌కి 25 ప్లస్. హీరోని వెంటపడి ప్రేమిస్తుంది హీరోయిన్. అప్పుడు హీరో ‘ఏజ్ గ్యాప్’ గురించి మాట్లాడితే... ‘లవ్‌కి ఏజ్‌తో సంబంధం లేదు... మనసు ముఖ్యం’ అంటుంది. ఇలా హీరో–హీరోయిన్ మధ్య 15–20 ఏళ్లు గ్యాప్ ఉన్న కథతో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్వరలో మరో మూడు చిత్రాలు రానున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం...నాకన్నా ఇరవైయేళ్లు చిన్నది... ‘నాకన్నా ఇరవైయేళ్లు చిన్నది...’ అంటూ సూర్య చెప్పడం... ‘నాకు ప్రాబ్లం లేదు’ అని మమితా బైజు అనడం వంటి డైలాగులు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ట్రైలర్లో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కాగా ఏజ్ గ్యాప్ నేపథ్యంలో రూపొందిందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సూర్య హీరోగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న తెలుగు–తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో మమిత, సూర్యఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే సంజయ్ విశ్వనాథ్ అనే పిస్టల్ షూటర్ పాత్రని సూర్య పోషించారని అర్థం అవుతోంది. మ్యాడీ అనే పాత్రలో మమిత బైజు నటించారు. ప్రేమ... ప్రేమించమంటూ సంజయ్ విశ్వనాథ్ వెంట మ్యాడీ పడటం.. ‘నాకన్నా ఇరవైయేళ్లు చిన్నది... ఎలా’, ‘నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది వచ్చి ఇలా పడిపోతారు’ అంటూ సంజయ్ విశ్వనాథ్ అనగానే... ‘కావాలంటే ఇంకో నాలుగు చిటికెలు వేస్తా... నువ్వు పడు చాలు’ అని మ్యాడీ అనడం వంటి డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తనను ప్రేమించమంటూ మ్యాడీ వెంటపడటం.. వయసు తేడా వల్ల ఆమె ప్రేమని సంజయ్ విశ్వనాథ్ కాదనడం ట్రైలర్లో కనిపిస్తోంది. మరి... వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది తెలియాలంటే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. మరోసారి... హీరోయిన్ నయనతార మరోసారి ఏజ్ గ్యాప్ మూవీలో నటించారు. శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘వల్లవన్’ (తెలుగులో ‘వల్లభ’) చిత్రంలో తనకన్నా వయసులో చిన్నవాడైన శింబుని ప్రేమించిన పాత్రలో నటించి, మెప్పించారామె. తాజాగా నయనతార మరోసారి అలాంటి పాత్ర పోషించిన చిత్రం ‘హాయ్’. విష్ణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ హీరో కెవిన్ హీరోగా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.‘హాయ్’లో కెవిన్, నయనతార ఈ మూవీ కూడా ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. వయసులో పెద్దదైన మహిళ... యువకుడి మధ్య జరిగే ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. ‘‘టైటిల్‌కు తగ్గట్టుగానే ‘హాయ్’ సింపుల్, హార్ట్ వార్మింగ్, ఫీల్‌గుడ్ సినిమా. ప్రతి కుటుంబం కలిసి చూసేలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని యూనిట్ పేర్కొంది.తొలి ప్రేమే మలి ప్రేమ కూడా! ప్రేమకథా చిత్రాలను సరైన రీతిలో తెరకెక్కిస్తే హిట్ గ్యారంటీ. అందుకు ఓ ఉదాహరణ మలయాళ దర్శకుడు గిరీష్ ఏడీ తెరకెక్కించిన ‘ప్రేమలు’ (2024). ఇప్పుడు ఈ దర్శకుడి నుంచి రానున్న ఎమోషనల్ లవ్‌స్టోరీ మూవీ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో ఆష్లీ (మమిత బైజు) అనే యువతి విదేశాల నుంచి తన స్వగ్రామానికి తిరిగి వస్తుంది. తన పక్కింట్లో జరుగుతున్న పెళ్లి వేడుకను చూసినప్పుడు ఆమెకు మొదటి ప్రేమికుడు జస్టిన్ (నివిన్ పౌలీ) గుర్తుకు వస్తాడు. ఆ జ్ఞాపకాలతో ఆమె జీవితంలో మళ్లీ భావోద్వేగాలు మొదలవుతాయి. అనుకోకుండా ఆష్లేకు జస్టిన్‌కి మళ్లీ ఎదురుపడే అవకాశం వస్తుంది.‘బెత్లెహెం కుడుంబ యూనిట్’లో నితిన్ పౌలీ, మమిత తొలి ప్రేమికుడితోనే మలి ప్రేమ మొదలవుతుంది. ఈ లవ్‌స్టోరీలో నితిన్ పౌలీ, మమిత బైజు జంటగా నటించారు. నితిన్ వయసు 40 ప్లస్... మమితకు 25. ‘‘ఈ ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అని చిత్రదర్శకుడు గిరీష్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది. ఇక ఈ దర్శకుడు తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’తో మమిత బైజుకి మంచి గుర్తింపు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే... ఇలాంటి ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్‌తో ఆగస్టు 14న రానున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లోనూ మమిత కథానాయికగా నటించారు. ఇదే తరహా కాన్సెప్ట్‌తో రూపొందిన రెండు చిత్రాలతో వచ్చే నెలలోనే వారం గ్యాప్‌లో ఆమె స్క్రీన్‌పై కనిపించనుండటం విశేషం. -
మమిత వెరైటీ చెవిదుద్దులు.. బంగారు బొమ్మలా జాన్వీ
'సూపర్ సుబ్బు' షూటింగ్ జ్ఞాపకాల్లో మిథిలా పాల్కర్సన్నగా బంగారు బొమ్మలా హీరోయిన్ జాన్వీ కపూర్వెరైటీ చెవిదుద్దులతో మలయాళ బ్యూటీ మమితతెల్లని చీరలో నాభి అందాలతో శ్రద్ధా దాస్అందానికే ఆధార్ కార్డ్‌లా మారిన విమలా రామన్బాలీవుడ్ మూవీ జ్ఞాపకాలతో కేతిక శర్మ View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by @queen.mamitha View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) -
'డ్యూడ్' కాంబో రిపీట్.. కొత్త సినిమాకు ఏకంగా ఆరుగురు డైరెక్టర్లు
లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని.. వీటన్నింటితోనూ చెరో రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్ టైంలో 'ఎల్ఐకే' మూవీతో తొలి ఫ్లాప్ చూశారు. దాని సంగతి పక్కనబెడితే తాను హీరోగా చేయబోతున్న కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఈ మేరకు అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)హీరో కాకముందు ప్రదీప్ రంగనాథన్.. షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. 'కోమలి' మూవీతో దర్శకుడిగా మారాడు. 'లవ్ టుడే' చిత్రానికి కూడా ఇతడే దర్శకుడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తన మూవీ తానే స్టోరీ రాశాడు. అదే ఈ ప్రాజెక్ట్. దీనితోనే నిర్మాతగానూ మారాడు. తన దగ్గర పనిచేసిన ఆరుగురు కుర్రాళ్లని 'ద ఆల్ఫా టీమ్' మార్చి దీనికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు.ఇకపోతే ఈ మూవీలో 'డ్యూడ్' కాంబో రిపీటైంది. ప్రదీప్ రంగనాథన్-మమిత బైజు హీరోహీరోయిన్లుగా కాగా లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తెలుగు నటుడు శివాజీతో పాటు శ్వాసిక, అశ్వత్ మారిముత్తు కీలక పాత్రలు చేయనున్నారు. అనామిక మహి అనే అమ్మాయిని ఈ మూవీతో హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్) -
సౌత్ సినిమా నయా సెన్సేషన్.. మమితా బైజు బర్త్‌డే స్పెషల్( ఫొటోలు)
-
సూర్య-మమిత బైజు.. క్యూట్ సాంగ్ రిలీజ్
ఈ మధ్యే 'వీరభద్రుడు'తో చాన్నాళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. మరో రెండు నెలల్లో మరో సినిమాతో రాబోతున్నాడు. అదే 'విశ్వనాథ్ & సన్స్'. మమిత బైజు హీరోయిన్. సర్, లక్కీ భాస్కర్ చిత్రాల ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకుడు. ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ నుంచి తొలి పాటని తాజాగా రిలీజ్ చేశారు.'నేనో బటర్ ఫ్లై' అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్.. హీరోపై తన ప్రేమని చూపించుకునే సీన్స్ చూపించారు. సరే ఇవన్నీ పక్కనబెడితే 'వీరభద్రుడు' మాస్ మూవీ కాగా.. ఇదేమో క్లాస్ చిత్రం. మరి దీంతో ఎంతవరకు ఆకట్టుకుంటాడనేది చూడాలి? -
ధనుశ్ లేటేస్ట్ మూవీ.. ఏకంగా నంబర్‌వన్‌గా ట్రెండింగ్..!
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన తాజా మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది.బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన తొలివారంలోనే దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. దీంతో మేకర్స్‌తో పాటు ధనుశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కర అసలు కథేంటంటే..ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి అలియాస్ కర(ధనుష్) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర డబ్బు దొంగిలించి.. ఇంట్లో నుంచి పారిపోతాడు. చివరిగా ఒక దొంగతనం చేసి మానేయాలనుకొని స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బులు తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోవాళ్లు పట్టుకొని..పోలీసులకు అప్పగిస్తారు. ఈ కేసు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న డీఎస్పీ భరతన్(సూరజ్ వెంజర్మూడు) చేతికి వెళ్లగా.. కర అతన్ని కొట్టి స్టేషన్ నుంచి పారిపోతాడు. ఇకపై దొంగతనాలు చేయనని చెప్పి ప్రియురాలు మల్లి(మమిత బైజు) పెళ్లి చేసుకొని ఓ హోటల్లో పని చేస్తారు. కొన్నాళ్ల తర్వాత సొంతంగా హోటల్ పెట్టుకోవాలనుకుంటారు.లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే.. షూరిటీ అడుగుతారు. పొలం కాగితాలు పెట్టి లోన్ తీసుకుందామని ఊరికి వెళ్లగా.. తండ్రి అప్పటికే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకుంటాడు. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తి చేస్తామని బ్యాంకు నోటీసులు పంపడం.. కొడుకు డబ్బుల కోసమే తన దగ్గరకు వచ్చాడనే బాధతో కోదండం చనిపోతాడు. తండ్రి చివరి కోరిక మేరకు పార్థివదేహానికి పొలంలోనే పూడ్చేందుకు వెళ్లగా..బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి చివరి కోరిక నెరవేర్చడం కోసం కర ఏం చేశాడు? బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ భరతన్ తిరిగి కరను పట్టుకున్నాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మేనేజర్(జయరాం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఎల్లమ్మలో..?
‘ఎల్లమ్మ’ చిత్రంలో భాగం కానున్నారట యువ హీరోయిన్ మమితా బైజు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎల్లమ్మ’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చేయనున్నారని తొలుత కీర్తీ సురేష్ పేరు వినిపించింది. కానీ ఆమె భాగం కాలేదు. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్‌తో ‘ఎల్లమ్మ’ టీమ్ చర్చలు జరిపారనే టాక్ వినిపించింది. అయితే మృణాల్ ఇంకా ఫైనల్ కాలేదు. తాజాగా యంగ్ హీరోయిన్ మమితా బైజుతో ‘ఎల్లమ్మ’ సినిమా మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి... ‘ఎల్లమ్మ’ చిత్రంలో మమితా బైజు ఫైనల్ అవుతారా? లేక మరో హీరోయిన్ పేరు ఏమైనా వినిపిస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. -
సాయిపల్లవి, కీర్తి సురేశ్.. ఇప్పుడు మమిత?
తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అనగానే అయితే ముంబై నుంచి వస్తారు లేదంటే మలయాళ భామలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లే సాయిపల్లవి, కీర్తి సురేశ్ లాంటి కేరళ కుట్టీలు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు మమిత బైజు లాంటి యంగ్ బ్యూటీస్ కూడా అవకాశాలు చేజిక్కుంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే మమిత దగ్గరకు ఓ ఊహించని అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్)'బలగం'తో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు.. అద్భుతమైన హిట్ కొట్టాడు. ఇది జరిగి చాన్నాళ్లయిపోయింది. తర్వాత 'ఎల్లమ్మ' పేరుతో ఓ సినిమా తీయాలి. అయితే ఇందులో నటించే హీరో ఎవరనే దగ్గర ఏళ్లు గడిచిపోయాయి. తొలుత నాని అనుకున్నారు కుదర్లేదు. తర్వాత నితిన్, శర్వానంద్ పేర్లు వినిపించాయి. చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇతడు ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.హీరో ఎవరో తేలిపోయింది ఇక హీరోయిన్ సంగతి చూద్దాం అని మూవీ టీమ్ అనుకున్నారు. సాయిపల్లవి, కీర్తి సురేశ్, మృణాల్ ఠాకుర్, భాగ్యశ్రీ.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడీ లిస్టులోకి మలయాళ లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు వచ్చి చేరింది. ఒకవేళ ఈ పాత్ర గనుక ఈమె చేస్తే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'ఎల్లమ్మ'లో హీరోయిన్ పాత్రకు ఫెర్మార్మ్ చేసే స్కోప్ ఎక్కువుంది. మరి ఆ ఛాన్స్ మమితకు దక్కుతుందా? వేరే ఆప్షన్ ఏమైనా చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. దిల్ రాజు దీనికి నిర్మాత.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) -
డ్యూడ్ హీరోయిన్‌తో ప్రదీప్ మూవీ.. కాకపోతే ఓ ట్విస్ట్!
ఇప్పుడు దర్శకులు, నటులు నిర్మాతలుగా మారుతున్న తరుణం. విజయాలకు దూరమవుతున్న నటులు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. దర్శకులుగా ఉన్నత స్థాయికి చేరుకున్న వారు కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి తమ శిష్యులకు, ఇతర నూతన దర్శకులకు అవకాశాలు కల్పిస్తుంటారు. తాజాగా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 2019లో దర్శకుడిగా పరిచయమై రవిమోహన్ హీరోగా కోమాలి అనే చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు.హీరోగానూ సక్సెస్ఆ తరువాత హీరోగా రంగప్రవేశం చేసి స్వీయ దర్శకత్వంలో లవ్‌టుడే పేరుతో మూవీ చేసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత డ్రాగన్ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా ఈయన కథానాయకుడిగా నటించిన డ్యూడ్ ఘన విజయాన్ని సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఎల్ఐకే చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. నిర్మాతగా..ఇకపోతే మళ్లీ మెగాఫోన్ పట్టుకొనేందుకు రెడీ అయిన ప్రదీప్ రంగనాథన్ తానే హీరోగా ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థలో చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన సడెన్‌గా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి దర్శకుడు ఎవరు? కథానాయకుడు ఎవరు? అన్న వివరాలు వెలువడలేదుగానీ హీరోయిన్గా మమితాబైజు నటిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రదీప్ డ్యూడ్ మూవీలో మమిత హీరోయిన్ అన్న విషయం తెలిసిందే! -
ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన
థియేటర్లలో రిలీజైన చిన్నాపెద్దా సినిమాలు ఎప్పటికప్పుడు ఓటీటీలోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా సతీ లీలావతి, గాయపడ్డ సింహం, సిస్టమ్, లవ్ యూ రా, 14, రాజుగాని సవాల్, మధువిధు, టీఎన్ 2026 లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటి సంగతి పక్కనబెడితే తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)ధనుష్, మమిత బైజు జంటగా నటించిన సినిమా 'కర'. విఘ్నేశ్ రాజా దర్శకుడు. ఓ మాదిరి అంచనాలతో గత నెల 30వ తేదీన థియేటర్లలో రిలీజైంది. కానీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. దొంగతనానికి సంబంధించిన సీన్స్ బాగున్నప్పటికీ మిగిలిన సన్నివేశాలు అంతంత మాత్రంగానే మెప్పించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడీ మూవీ వచ్చే గురువారం(మే 28) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'కర' విషయానికొస్తే.. కరస్వామి(ధనుష్) ఓ దొంగ. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి(మమిత బైజు) కోసం అదంతా వదిలేసి కష్టపడాలని నిర్ణయించుకుంటాడు. ఓ హోటల్ పెట్టాలనుకుని దానికి అవసరమైన డబ్బు కోసం ఊరిలోని తమ పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టాలనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో తండ్రిని కోల్పోతాడు. మళ్లీ దొంగతనాలు చేసేందుకు సిద్ధమవుతాడు. ఒకే బ్యాంక్‌కి చెందిన బ్రాంచ్‌ల్లో డబ్బులు కొల్లగొట్టేస్తుంటాడు. కర ఇలా చేయడానికి కారణమేంటి? చివరకు పోలీసులకు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు) -
అదే తన లక్ష్యం అంటున్న డ్యూడ్ హీరోయిన్
మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో నటిస్తూ క్రేజీ కథానాయికగా రాణిస్తోంది హీరోయిన్ మమితా బైజు. మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రంతో అందరి దృష్టిని తనవైపు ఆకర్షించింది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో ట్రెండింగ్ హీరోయిన్గా వెలుగొందుతోంది. ఇటీవల డ్యూడ్ మూవీతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈమె విజయ్‌తో కలిసి నటించిన జననాయకన్ (తెలుగులో జన నాయకుడు) చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదే నా లక్ష్యంఅలాగే సూర్యకు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే అశోక్ సెల్వన్‌కు జంటగా నటించిన ఇరండు విధానం చిత్రం కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రాలు విడుదలైన తర్వాత మమితా బైజు క్రేజ్ వేరేగా ఉంటుందని భావించవచ్చు. ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా అభిమానుల గుండెల్లో నిలిచిపోయే చిత్రాలను చేయాలన్నదే నా లక్ష్యం. అలా ఒక ప్రేమైక కుటుంబాన్ని తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఏదో ఒక రోజున నా జరిగిన కాలం గుర్తుకు వస్తే ఆనందం కలగాలి. అందుకోసమే నా ఈ ప్రయాణం' అని మమిత పేర్కొంది. -
విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాడనే విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇతడి చివరి సినిమాకు కష్టాలు మాత్రం తప్పట్లేదు. నాలుగు నెలల క్రితమే రిలీజ్ కావాల్సిన మూవీ.. సెన్సార్ సమస్యలతో అలా ఉండిపోయింది. కొన్నిరోజుల క్రితం లీక్ కావడం సంచలనం రేపింది. ఇప్పుడు 'జన నాయగణ్'కి మరో కష్టం వచ్చిపడింది.(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)లెక్క ప్రకారం జనవరి 9న విజయ్ 'జన నాయగణ్' సినిమాని థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో రెండు మూడు వారాలు ఆలస్యంగా తీసుకొస్తారులే అని అంతా భావించారు. కానీ నెలలు గడుస్తున్నా రాకపోవడంతో సగటు ప్రేక్షకుడి ఈ మూవీపై ఆసక్తి సన్నగిల్లుతూ వస్తోంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్‌కి కూడా ఆసక్తి పోయినట్లు ఉంది. అందుకే రూ.120 కోట్ల డీల్ నుంచి తప్పుకొన్నట్లు వార్తలొస్తున్నాయి.అమెజాన్ సంస్థ తప్పుకోవడంతో రేసులోకి వచ్చిన జీ5 సంస్థ.. రూ.50 కోట్ల ఆఫర్ చేసిందట. ఒకవేళ దీనికి టీమ్ ఒప్పుకొంటే రూ.70 కోట్ల నష్టానికి అమ్ముకున్నట్లే అవుతుంది. చూస్తుంటే ఇదే జరిగేలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ లీకై, థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని మూవీ విషయంలో అమెజాన్ రిస్క్ చేయలేకపోతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయింది.తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' చిత్రాన్ని రీమేక్ చేసే 'జన నాయగణ్' తీశారు. కాకపోతే విజయ్ రాజకీయ అవసరాలకు తగ్గట్లు పొలిటికల్ డైలాగ్స్, ఎపిసోడ్స్ పెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని తమిళంలో మమిత బైజు చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. కెవిఎన్ నిర్మాణ సంస్థపై వెంకట్ కె నారాయణ నిర్మించారు. ఈ చిత్రం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయన.. 'టాక్సిక్' కూడా రిలీజ్ కాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.(ఇదీ చదవండి: తమన్నా మళ్లీ ప్రేమలో పడిందా?) -
‘కర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
తమిళ హీరో ధనుష్‌కి టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే నేరుగా తెలుగులో సార్, కుబేర లాంటి సినిమాలు చేసి అలరించాడు. అంతేకాదు ఆయన నటించిన తమిళ సినిమాలన్నీ ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంటాయి. ఆ మధ్య ఇండ్లీ కొట్టుతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మల్టీ టాలెంటెడ్ నటుడు..ఇప్పుడు ‘కర’తో వచ్చాడు. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటించింది. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ఈ చిత్రాన్ని తెలుగు రిలీజ్ చేశాయి. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి అలియాస్ కర(ధనుష్) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర డబ్బు దొంగిలించి.. ఇంట్లో నుంచి పారిపోతాడు. చివరిగా ఒక దొంగతనం చేసి మానేయాలనుకొని స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బులు తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోవాళ్లు పట్టుకొని..పోలీసులకు అప్పగిస్తారు. ఈ కేసు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న డీఎస్పీ భరతన్(సూరజ్ వెంజర్మూడు) చేతికి వెళ్లగా.. కర అతన్ని కొట్టి స్టేషన్ నుంచి పారిపోతాడు. ఇకపై దొంగతనాలు చేయనని చెప్పి ప్రియురాలు మల్లి(మమిత బైజు) పెళ్లి చేసుకొని ఓ హోటల్లో పని చేస్తారు. కొన్నాళ్ల తర్వాత సొంతంగా హోటల్ పెట్టుకోవాలనుకుంటారు. లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే.. షూరిటీ అడుగుతారు. పొలం కాగితాలు పెట్టి లోన్ తీసుకుందామని ఊరికి వెళ్లగా.. తండ్రి అప్పటికే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకుంటాడు. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తి చేస్తామని బ్యాంకు నోటీసులు పంపడం.. కొడుకు డబ్బుల కోసమే తన దగ్గరకు వచ్చాడనే బాధతో కోదండం చనిపోతాడు. తండ్రి చివరి కోరిక మేరకు పార్థివదేహానికి పొలంలోనే పూడ్చేందుకు వెళ్లగా..బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి చివరి కోరిక నెరవేర్చడం కోసం కర ఏం చేశాడు? బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ భరతన్ తిరిగి కరను పట్టుకున్నాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మేనేజర్(జయరాం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తండ్రి-కొడుకుల ఎమోషన్‌తో కూడిన రాబిన్‌వుడ్ కథ ఇది. అంటే హీరో దొంగ..కానీ మంచి కోసం దొంగతనం చేస్తుంటాడు. కిక్ సినిమాలో రవితేజ కోటీశ్వర్లు, రాజకీయ నాయకుల దగ్గర డబ్బులను కొట్టేస్తే.. ఇక్కడ ధనుష్ బ్యాంకుల్లోని డబ్బును మాత్రమే కొట్టేస్తాడు. అది కూడా ఒక్క బ్యాంకులోని డబ్బులు మాత్రమే. దానికీ ఓ కారణం ఉంటుంది. అదేంటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు విఘ్నేష్ రాజా ఎంచుకున్న పాయింట్ రాబిన్‌వుడ్ కథలను గుర్తు చేసినా.. దాని చుట్టు అల్లుకున్న భావోద్వేగ సన్నివేశాలు మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపించాడు. ముఖ్యంగా చదువురాని రైతులను వాళ్లు ఎలా మోసం చేస్తున్నారనేది బాగా చూపించారు. హీరో ఎమ్మెల్యే ఇంట్లో చివరి దొంగతనం చేసే యాక్షన్ సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. అతను పోలీసులకు దొరకడం.. డీఎస్పీ భరతన్ నుంచి తప్పించుకొని పారిపోవడం.. ఇదంతా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే కథ 6 నెలల ముందుకు జరిగిన తర్వాత కొంత నెమ్మదిగా సాగుతుంది. హీరోహీరోయిన్లు కలిసి హోటల్ పెట్టాలనుకోవడం.. ఈ క్రమంలో హీరో సొంతూరుకి తిరిగిరావడం.. తండ్రి-కొడుకుల బాండింగ్..ఇదంతా కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాంక్ చోరీ ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ద్వితియార్థం ఆసక్తికరంగా సాగుతుంది. వరుస బ్యాంకు రాబరీలు.. డీఎస్పీ ఇన్వెస్టిగేషన్..మరోవైపు బ్యాంకు మేనేజర్ ఇచ్చే ట్విస్టు..ఇవన్నీ ఉత్కంఠభరితంగా సాగుతాయి. హీరో దొంగతనం కోసం బ్యాంకుకు వెళ్లిన ప్రతిసారి..ఎలా బయటపడతాడా? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా బలమైన స్క్రీన్‌ప్లేతో సెకండాఫ్ కథను రాసుకున్నారు. రైతు కష్టాలతో పాటు తండ్రి కొడుకుల ఎమోషన్‌తో కథను ముగించిన తీరు బాగుంది. ఎవరెలా చేశారంటే..ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. తనదైన సహజ నటనతో కరస్వామి పాత్రకు ఆయన వందశాతం న్యాయం చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ధనుష్ వన్ మ్యాన్ షో ఇది. మమిత బైజు తెరపై కనిపించేంది కాసేపే అయినా.. చక్కగా నటించింది. హీరో తండ్రి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన కంటతడి పెట్టిస్తుంది. డీఎస్పీ భరతన్‌గా సూరజ్ వెంజర్మూడు, బ్యాంకు మేనేజర్‌గా జయరాంతో పాటు , కరుణాస్, పృథ్వీ రాజన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలతో పాటు తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. తెరపై తెలుగు సినిమానే చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇషారి కె గణేష్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ధనుశ్ కర.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్... తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. 'ఆరు నెలలుగా కొనసాగుతున్న గల్ఫ్ దేశాల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది.. కువైట్‌లో ఉన్న వందలాది ఆయిల్ వనరులపై ఇరానా దాడులు చేసింది' అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. కర ట్రైలర్ చూస్తుంటే డబ్బు కోసం ఓ సామాన్యుడు చేసే పోరాటంగానే ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకులను కొల్లగొట్టి కోట్ల రూపాయలను దోచుకునే వ్యక్తిగా ధనుశ్ ఇందులో కనిపించారు. డబ్బు కోసం ఏదైనా చేసే దొంగ పాత్రలో ధనుశ్ కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
నన్ను ఎగతాళి చేశారు.. నేషనల్ అవార్డ్‌తో సమాధానం చెప్పా
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుష్‌కు ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమాలో ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేట్‌ను జ్ఞాపికగా అందించారు. దాంతో ధనుష్ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ మలుపు తిరిగిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పొల్లాదవన్' నా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాకు ముందు నన్ను చూసి చాలా మంది చాలా బక్కగా ఉన్నావని ఎగతాళి చేసేవారు. కానీ 'పొల్లాదవన్'లో నేను మొదటిసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించినప్పుడు ప్రేక్షకులు చప్పట్లతో, ఈలలతో నన్ను స్వాగతించారు. నా జీవితంలో అది మర్చిపోలేని క్షణం. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. భగవద్గీతలో చెప్పినట్లుగా 'యద్భావం తద్భవతి'. మనం ఏదైనా బలంగా నమ్మితే, దాన్ని సాధించగలం.నా కెరీర్ ప్రారంభ రోజులైన "2002-03 సమయంలో నాకు జాతీయ అవార్డు వస్తుందని ఎవరైనా అంటే అందరూ నవ్వుకునేవారు. కానీ నాకు నా మీద నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు ఆ అవార్డు నా చేతిలో ఉంటుందని గట్టిగా నమ్మాను. చివరకు అదే జరిగిందని ధనుష్ అన్నారు. తన పట్టుదల, కృషికి ప్రతిఫలంగా 2010లో ఆడుకాలం, 2019లో అసురన్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు, నిర్మాతగా కూడా కాక ముట్టై, విసారణై వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇక 'కర' సినిమా విషయానికి వస్తే ధనుశ్, మమిత బైజు జంటగా నటించారు. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
'తాను నాటింది తానే నరుక్కోవాలి'.. ఆసక్తిగా కర తెలుగు టీజర్
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తుంటే అన్యాయంపై పోరాడే పాత్రలో ధనుశ్ నటించినట్లు తెలుస్తోంది. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే ఈ ఫుల్ అగ్రెసివ్‌గా కథ ఉండనున్నట్లు అర్థమవుతోంది. 'తాను నాటింది తానే నరుక్కోవాలి.. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోతకు వచ్చింది. అంతకంటే ముందు నా మీద పడ్డ మచ్చను తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
కర వస్తున్నాడు
ధనుష్, మమితా బైజు జంటగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘కర’. డా.ఇషారి కె.గణేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది.ఏపీ, తెలంగాణ రాష్ట్రాలో ‘కర’ సినిమాను సీహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు. కేఎస్ రవికుమార్, జయరామ్, సూరజ్ వెంజరమూడు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
స్టార్ హీరోతో మమితా బైజు.. ఎందుకు తీసుకున్నామంటే: దర్శకుడు
మలయాళ నటీమణులు కోలీవుడ్‌లో మంచి అవకాశాలను తన్నుకు పోతున్నారు. అదేసమయంలో తమిళ చిత్రాల్లో తమిళ నటీమణులకు అవకాశాలు ఇవ్వడం లేదు వంటి ఆరోపణలు ఇటీవల ఎక్కవగా వస్తున్నాయి. ఇకపోతే ఇటీవల కోలీవుడ్‌లో మంచి క్రేజీ అవకాశాలను అందుకుంటున్న మాలీవుడ్ నటి మమితా బైజు(Mamitha Baiju). ఈమె సూర్యకు జంటగా విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలోనూ, ధనుష్‌కు జంటగా కర చిత్రంలోనూ నటించారు. అదేవిధంగా విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ప్రస్తుతం మరిన్ని తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర చిత్రంలో పరభాషా నటి మమితా బైజును నటింపజేయడం గురించి ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌రాజా ఒక ఇంటర్వ్యూలో వివరిస్తూ సినిమాల్లో నటీనటులను ఎంపిక చేయడం అనేది వారి భాష, ప్రాంతీయత ఆధారంగా ఎంపిక చేయడం ఉండదన్నారు. వారి నటనా ప్రతిభ, పాత్రలకు నప్పడం, ఉండే మార్కెట్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తామన్నారు. కర చిత్రం విషయంలో మమితా బైజును ఎంపిక చేయడానికి కారణం ఆమె పోషించిన పాత్రకు అంతకుముందు 20–25 మందిని ఆడిషన్ చేసినట్లు చెప్పారు. వారెవరూ తగిన ప్రతిభను పదర్శించలేదన్నారు. అందరికంటే మమిత బైజు స్పష్టంగా బెటర్‌గా ఉండడంతో ఆమెను ఎంపిక చేసినట్లు విఘ్నేశ్‌రాజా వివరించారు. కాగా ధనుష్, మమితా బైజు జంటగా నటించిన కర చిత్రం 1990లో రామనాథపురంలో జరిగిన ఒక బ్యాంకు దోపిడీ ఇతివృత్తంతో రూపొందిందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఈనెల 30న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోందన్నది గమనార్హం. -
సినిమా లీక్‌పై జన నాయగన్ హీరోయిన్ల కామెంట్స్
నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా, చివరి చిత్రం జన నాయకన్. పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమిత బైజు, ప్రియమణి తదితరులు నటించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కెవిఎన్ పిక్చర్స్ సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సి ఉంది. అయితే, సెన్సార్ సమస్యల కారణంగా విడుదల ఆగిపోయిన ఈ చిత్రం ఇటీవల ఇంటర్నెట్లో లీక్ కావడం యావత్ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. భాషా భేదం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు ఈ సంఘటనను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర కథానాయకుడు విజయ్ మాత్రం ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా మౌనం వహిస్తున్నారు. అయితే చిత్ర కథానాయకి పూజహెగ్డే, మమిత బైజు జననాయకన్ చిత్రం ఇంటర్నెట్ లో లీక్ అయిన ఘటన గురించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పూజా హెగ్డే సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ “ ప్రియమైన అభిమానులారా ఒక చిత్ర నిర్మాణం అనేది ఎంతోమంది ఎన్నో రోజుల శ్రమ. ధైర్యంతో కూడిన ప్రయత్నాలు, వ్యక్తిగత త్యాగాలు. అదే విధంగా మీకు మంచి అనుభవాన్ని అందించాలన్న నమ్మకంతో ప్రతిరోజూ క్రమం తప్పకుండా షూటింగ్లో పాల్గొనే యూనిట్ సభ్యుల సమష్టి ప్రయత్న ఫలితం. అలాంటి మా జననాయక్ చిత్రం ఇంటర్నెట్లో రావడం నాకు మాత్రమే కాకుండా ఈ చిత్రంలో పనిచేసిన యూనిట్ సభ్యులు అందరికీ తీవ్ర మనోవేదనను కలిగించింది. ఈ చిత్రాన్ని మనందరం థియేటర్లో చూడటానికి కొంచెం వేచి చూద్దాం. జననాయకన్ చిత్రం కచ్చితంగా థియేటర్లో సరైన సమయంలో విడుదలవుతుంది. పైరసీని ఎప్పటికీ ప్రోత్సహించవద్దు ‘‘ అని పేర్కొన్నారు. నటి మమిత బైజు కూడా ఇలాంటి అభిప్రాయానే వ్యక్తం చేశారు. ’’ పలువురి శ్రమ, కృషితో రూపొందిన చిత్రాన్ని చట్టవిరుద్ధంగా చూడటం వేదనను కలిగిస్తోంది. కాబట్టి జననాయకన్ చిత్రాన్ని అధికారిక పూర్వంగా విడుదలయ్యే వరకు వేచి చూద్దాం “ అని నటి మమిత బైజు పేర్కొన్నారు. కాగా జననాయకన్ చిత్రం ఇంటర్నెట్లో లీక్ కావడానికి సెన్సార్ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఇకపోతే ఈ విషయం గురించి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారులు తీవ్రం విచారణను చేపట్టారు. -
సూరి సినిమాలో హీరోయిన్గా 'డ్యూడ్' బ్యూటీ!
సినిమా ఎవరిని ఎప్పుడు? ఏ స్థాయిలో నిలబెడుతుందో చెప్పలేం. అప్పటివరకు ప్రయత్నలోపం లేకుండా శ్రమిస్తూనే ఉండాలి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సహాయనటుడి నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు నటుడు సూరి. విడుదలై మూవీతో హీరోగా ట్రాక్ ఎక్కిన ఈయన ఇటీవల విడుదలైన మామన్ మూవీ వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.కమెడియన్ నుంచి హీరోగా..ప్రస్తుతం ఇతడు మండాడి సినిమా చేస్తున్నాడు. సముద్రతీరంలో జాలర్ల పడవల పోటీ నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రమిది. మదిమారన్ పుహళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఇది నిర్మాణంలో ఉండగా మరో సినిమాకు కమిటయ్యాడు సూరి.రియల్ స్టోరీ ఆధారంగా మూవీరవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మించనుంది. 2015లో చెన్నైలో బీభత్సం సృష్టించిన వరదల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం. ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో సూరికి జంటగా మమిత బైజు హీరోయిన్గా నటించనున్నట్లు వినికిడి. ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ డ్యూడ్ సినిమాతో మరో హిట్ అందుకుంది. హీరోయిన్ ఎవరంటే?విజయ్ హీరోగా నటించిన జననాయకన్లోనూ కీలక పాత్ర పోషించింది. సూర్యకు జంటగా విశ్వనాథ్ అండ్ సన్స్, ధనుష్‌తో కర సినిమాలు చేసింది. ఇవన్నీ త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సూరితో మమిత బైజు జోడీ కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
40 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమకథ.. ఆసక్తిగా టీజర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజైన టీజర్ చూస్తుంటే 20 ఏళ్ల అమ్మాయితో 40 ఏళ్ల వ్యక్తి ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దగా ఉన్న వ్యక్తితో హీరోయిన్ ప్రేమలో పడడం ఈ చిత్రం ఆసక్తిని మరింత పెంచుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. -
మమితా బైజు కొత్త సినిమా.. నిర్మాతగా మారిన స్టార్ హీరో
నటి మమితా బైజు క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పదహారేళ్ల ప్రాయంలోనే నటిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత ఎనిమిదేళ్లగా మలయాళం, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ సక్సెస్ రేట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తను నటించిన మలయాళం చిత్రం ప్రేమలు మాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ ల్లోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెబల్ చిత్రంతో జివీ.ప్రకాష్ కుమార్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా నటించిన డ్యూడ్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది.తాజాగా విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ చిత్రంలోనూ మమితా బైజు కీ రోల్ చేశారు. కాగా ప్రస్తుతం ధనుష్ సరసన నటిస్తున్న కారా చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. అదేవిధంగా బెత్లెహేమ్ కుడుంబ అనే మలయాళం చిత్రంలోని నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆయనకు జంటగా కాకుండా ఆయన నిర్మించనున్న చిత్రంలో మమితా బైజు నాయకిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. చాలామంది నటుల మాదిరిగానే ప్రదీప్ రంగనాథన్ కూడా నిర్మాతగా మారిపోతున్నారు. ఈ చిత్రానికి ఆయన అసోసియేట్ డైరెక్టర్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలుతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
Premalu Movie: రూ. 3 కోట్లతో.. రూ. 130 కోట్లు సీక్వెల్ లేనట్టేనా..?
-
ఆ ఆనందమే వేరు!
మనసును తాకే అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న నటి మమితా బైజు. ఆమె మనసులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి. అవన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే, మీ కోసం...⇒ అసలు పేరు నమిత. ‘మమిత’ అనే పేరు సినిమాలు ఇచ్చిన బహుమతి. ఇంట్లో మాత్రం ఇప్పటికీ పొన్నుమణి, మమ్మే అని పిలుస్తారు. ‘సూపర్ శరణ్య’ తర్వాత ‘సోనా’ కూడా అయ్యాను.⇒ నటనకంటే ముందే నాట్యం నా జీవితంలో ఉంది. చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నాను. స్టేజ్‌పై అడుగులు వేస్తే వచ్చే ఆనందం వేరే ఏదీ ఇవ్వలేదు.⇒ సినిమాల మధ్యలోనూ సైకాలజీ చదవాలని ప్రయత్నించాను. షూటింగ్స్ వలన క్లాసులు మిస్ అయ్యాయి. కాని, నేర్చుకోవాలనే కోరిక ఇంకా అలాగే ఉంది.⇒ మేకప్ లేకుండా, సింపుల్ దుస్తుల్లోనే ఎక్కువ హ్యాపీగా ఉంటాను. డిజైనర్ డ్రెస్సులు కాదు, నా అల్మరాలో ఉన్న వాటితోనే ఎక్కువగా స్టయిలింగ్ చేసుకుంటాను.⇒ నేనొక ఫూడీ. అందులోనూ నాన్‌వెజ్‌కి నో చెప్పలేను. పంచకర దోశ, బాషి బిర్యానీ నా ఫేవరెట్స్. మలయాళీ వంటకాలంటే ఇల్లు గుర్తు వస్తుంది. కాని, తమిళ సెట్ దోశ, నెయ్యి ఇడ్లీలకు కూడా పెద్ద ఫ్యాన్‌ను. వంకాయ మాత్రం నాకు చాలా బోరింగ్ కూర.⇒ మలయాళం నా మాతృభాష. కాని, ఇతర భాషా చిత్రాల్లో నటించాలంటే భాషను గౌరవించాలి అనిపించింది. ఒక్కో పదం నేర్చుకుని ఇప్పుడు తమిళం, తెలుగు చదవడం, రాయడం కూడా వస్తోంది.⇒ స్క్రీన్‌పై కెమిస్ట్రీ చూసి వచ్చే డేటింగ్ రూమర్స్ నాకు కొత్త కాదు. అవన్నీ సోషల్ మీడియా కథలే! నా రియల్ రిలేషన్ షిప్ నాకు మాత్రమే తెలుసు.⇒ సెట్లో ఉన్నప్పుడు చాలా కామ్‌గా ఉంటాను. కెమెరా ఆన్ అయితే పూర్తిగా మారిపోతాను. ఆ మాయే నన్ను నటన వైపు తీసుకొచ్చింది. పెద్ద కమర్షియల్ హిట్స్ కంటే, మనసును తాకే పాత్రలే నాకు నిజమైన విజయం.⇒ రాబోయే ఒక సినిమా నన్ను కొత్తగా పరిచయం చేస్తుంది. ఆ పాత్ర తర్వాత ‘మమిత’ను మరో కోణంలో చూడబోతున్నారు. -
'జన నాయకుడు' ట్రైలర్ రిలీజ్.. రీమేక్‌పై క్లారిటీ
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. తెలుగులో దీన్ని 'జన నాయకుడు' పేరుతో ఈ నెల 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది బాలకృష్ణ 'భగవంత్ కేసరి' చిత్రానికి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మొన్నీమధ్య డైరెక్టర్ హెచ్.వినోద్ మాట్లాడుతూ ఇది దళపతి మూవీ అని చెప్పాడు గానీ అసలు విషయం బయటపెట్టలేదు. ఇప్పుడు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది.అంతా అనుకుంటున్నట్లు ఇది 'భగవంత్ కేసరి' రీమేకే. మెయిన్ పాయింట్‌ని ఉన్నది ఉన్నట్లు దింపేశారు. శ్రీలీల పాత్ర పేరునే ఇక్కడ మమిత బైజు పాత్రకు కూడా పెట్టేశారు. ట్రైలర్ అయితే సాలిడ్‌గా ఉంది. కాకపోతే చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అలానే విజయ్ రాజకీయ ఎంట్రీకి పనికొచ్చేలా కూడా ఈ మూవీ ఉండబోతుందని.. ట్రైలర్లో డైలాగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ఒరిజినల్ సినిమాని చూసేశారు. మరి ఇప్పుడు రాబోతున్న 'జన నాయకుడు' తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కి ఎలాంటి ఆదరణ దక్కనుందో చూడాలి? ఇదే రోజున ప్రభాస్ 'రాజాసాబ్' కూడా థియేటర్లలోకి రానుంది. -
దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
అతడికి 45.. ఆమెకు 20 ఏళ్లు.. ఇద్దరి మధ్య ప్రేమ
పేరుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ సూర్యకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఇతడికి చాలా ఫాలోయింగ్ ఉంది. గతంలో 'రక్తచరిత్ర 2' అనే తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో నటించాడు గానీ పూర్తిస్థాయిలో తెలుగు మూవీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు 'సార్', 'లక్కీ భాస్కర్' దర్శకుడు తీస్తున్న సినిమా చేస్తున్నాడు. షూటింగ్ జరుగుతుందని తెలుసు గానీ కాన్సెప్ట్ ఏంటనేది బయటకు రాలేదు. ఇప్పుడు స్వయానా నిర్మాత నాగవంశీ.. స్టోరీ కాస్త రివీల్ చేశారు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్)ఈ మూవీలో హీరో సూర్య.. 'గజిని'లో సంజయ్ రామస్వామిలా ఓ ధనవంతుడు. అతడి వయసు 45 ఏళ్లు. అలాంటి ఇతడు 20 ఏళ్ల అమ్మాయి(మమిత)తో ప్రేమలో పడతాడు. వీళ్ల మధ్య స్నేహం, ప్రేమ, కోపం.. ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ల మధ్య ఉన్నది ప్రేమా కాదా అనేది స్టోరీ పాయింట్ అని నాగవంశీ చెప్పుకొచ్చారు. చూస్తుంటే సూర్య.. ఈసారి ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.సూర్య గత కొన్నేళ్లుగా చేస్తున్న సినిమాల చూస్తే చాలావరకు యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఓ లవ్ స్టోరీ అని తెలిసి తెలుగు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. వెంకీ అట్లూరి తీస్తున్న ఈ సినిమాలో సూర్య, మమిత బైజుతో పాటు రవీనా టండన్ కూడా కీలక పాత్ర చేస్తోంది. మరో రెండు మూడు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వచ్చే వేసవిలో లేదంటే వేసవి చివరలో థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలైతే ఉన్నాయి.(ఇదీ చదవండి: 'పుష్ప-2' తొక్కిసలాట కేసు: ఏ-11గా అల్లు అర్జున్) -
హిట్ దర్శకుడితో ధనుష్ సినిమా.. షూటింగ్ పూర్తి
వరుస విజయాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్. ఈయన నటించిన ద్విభాషా చిత్రం కుబేర మంచి విజయంతోపాటు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదేవిధంగా ధనుష్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఇడ్లీ కోడై చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఇటీవల ఆయన నటించిన హిందీ చిత్రం తేరే ఇష్క్ మే చిత్రం సక్సెస్ అయ్యింది. తాజాగా ధనుష్ నటిస్తున్న చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇది ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 54వ చిత్రం అన్నది గమనార్హం. తమిళ హిట్ మూవీ 'పోర్ తొళిల్'తో గుర్తింపు పొందిన దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై డి.ఐసరిగణేష్ నిర్మిస్తున్నారు. మమితాబైజూ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్.రవికుమార్, కరుణాస్, పృథ్వీ పాండిరాజన్, జయరాం, సురాజ్ వెంజరముడు ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను చెన్నై, రామనాథపురం, దిండిక్కల్, పరమకుడి ప్రాంతాల్లో పూర్తిచేసినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధనుష్, మమితాబైజూ చిత్ర యూనిట్ శనివారం కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఓటీటీలోకి 'డ్యూడ్'.. డేట్ ఫిక్సయిందా?
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. ఇతడి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'డ్యూడ్'. దీపావళి సందర్భంగా గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. అలాంటిది ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయిందట. ఈ మేరకు డేట్ వైరల్ అవుతోంది.'డ్యూడ్' చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించారు. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. పరువు హత్యల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో ఆర్య సినిమా పోలికలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. దర్శకుడు కూడా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. ఈ కథకు ఆర్య-2 సినిమా స్పూర్తి అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ మూవీ.. నవంబరు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుందని సమాచారం.(ఇదీ చదవండి: రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ)విడుదలకు ముందు 'డ్యూడ్' ఓటీటీ హక్కుల డీల్ జరిగిపోయింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ క్రమంలోనే ఈనెల 14 నుంచి సినిమాని స్ట్రీమింగ్ చేసే అవకాశముంది. తెలుగు, తమిళ భాషలతో పాటు మిగతా దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి రావొచ్చు.'డ్యూడ్' విషయానికొస్తే.. గగన్ (ప్రదీప్ రంగనాథన్).. ఆముద(నేహాశెట్టి)ని ఇష్టపడతాడు. కానీ ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. మరోవైపు మేనమామ కూతురు కుందన (మమిత బైజు)కి చిన్నప్పటినుంచి గగన్ అంటే ఇష్టం. కానీ గగన్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. కుందన పెళ్లి ప్రపోజల్ తెచ్చినా రిజెక్ట్ చేస్తాడు. ఆ బాధలో పార్ధు(హృదయ్)ని కుందన ఇష్టపడుతుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో కుందన, గగన్కి పెళ్లవుతుంది. కానీ ఆమె మనసులో పార్ధు ఉన్నాడని గగన్కి తెలుసు. దీంతో కుందన, ఆమె ప్రియుడిని కలిపే పనిలో ఉంటాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సందీప్ రెడ్డి వంగా దెబ్బకు బాలీవుడ్ గల్లంతు.. ఇప్పటికీ) -
'డ్యూడ్' హీరోయిన్ మమితా బైజుకు బిగ్ ఛాన్స్
ధనుష్‌తో నటి మమితా బైజుకు(Mamitha Baiju) జత కుదిరింది. రీసెంట్గా డ్యూడ్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మొదట మలయాళం మూవీతో తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ తమిళం, తెలుగు అంటూ చుట్టేస్తోంది. ప్రేమలుతో దక్షిణాది చిత్ర పరిశ్రమనే తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం రెబెల్ నిరాశపరచడంతో అక్కడ ఈ భామ పప్పులు ఉడకవు అనే విమర్శలను ఎదుర్కొంది. బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రంలో కొన్ని రోజులు నటించి వైదొలగింది. దీంతో కోలీవుడ్‌లో చిన్న గ్యాప్ కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రదీప్ రంగనాథన్‌తో జతకట్టిన ద్విభాషా ( తమిళం, తెలుగు) చిత్రం డ్యూడ్ దీపావళి సందర్భంగా తెరపైకి వచ్చి ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన జననాయకన్ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా కీలక పాత్రను పోషించింది. ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 9న తెరపైకి రానుంది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలో కథానాయికిగా నటిస్తోంది. అదేవిధంగా ఇరెండు వారమ్ అనే మరో చిత్రంలో నటించిన మమితబైజు మలయాళంలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. కాగా తాజాగా మరో లక్కీచాన్స్ ఈ అమ్మడిని వరించింది. ధనుష్ సరసన నటించడానికి మలయాళీ బ్యూటీ రెడీ అవుతోంది. నటుడు ధనుష్ ప్రస్తుతం తేరే ఇష్క్మేన్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఈయన నటించే 54వ చిత్రం అవుతుంది. దీనికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించనున్నారు. దీనికి జీవీ.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించిన అధికారిక పోస్టర్‌ను నిర్మాతల వర్గం విడుదల చేసింది. వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో మమితబైజు నాయకిగా నటించనుందని సినీ వర్గాల సమాచారం. -
డ్యూడ్ @ రూ.100 కోట్లు.. తెలుగు ప్రేక్షకుల వల్లే సాధ్యం!
‘‘డ్యూడ్’(Dude) సినిమా రూ. 100 కోట్లు వసూళ్లు దాటేసింది. నేను నటించిన ‘లవ్ టుడే, డ్రాగన్’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంత ఆదరించారో... ‘డ్యూడ్’కి అంతకంటే ఎక్కువ ఆదరణ అందించారు. మీరు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan ) చెప్పారు. ఆయన హీరోగా మమితా బైజు(Mamitha Baiju) హీరోయిన్గా నటించిన చిత్రం ‘డ్యూడ్’. శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 కోట్ల జర్నీ’ ఈవెంట్లో వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘డ్యూడ్’ విజయం చాలా ఆనందాన్నిచ్చింది. మా సినిమాకి అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. మా సంస్థలో దర్శకులుగా పరిచయమైన భరత్ కమ్మ, నితీష్ రానా, బుచ్చిబాబు పెద్ద దర్శకులు అయ్యారు. ఈ జాబితాలో కీర్తీశ్వరన్ ఉండటం ఆనందంగాఉంది’’ అని తెలిపారు. ‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు’’ అని కీర్తీశ్వరన్ అన్నారు. నిర్మాత ఎస్కేఎన్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, రచయిత కృష్ణ మాట్లాడారు. -
‘డ్యూడ్’ మూవీ 100 కోట్ల జర్నీ ఈవెంట్ (ఫొటోలు)
-
'డ్యూడ్'పై కేసు.. ఇళయరాజాకు కోర్టు అనుమతి
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) డ్యూడ్ సినిమా యూనిట్‌పై దావా వేశారు. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Raganathan) హీరోగా నటించిన ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ చిత్రాన్ని దర్శకుడు కీర్తిశ్వరన్ తరెకెక్కించారు. అయితే, డ్యూడ్ సినిమాలో ఇళయరాజా సంగీతం అందించిన 'పుదు నెల్లు పుధు నాతు' చిత్రంలోని 'కరుతమచ్చన్'(Karutha Machan song) పాటను ఉపయోగించారు. మూవీలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు పెళ్లి సమయంలో ఈ సాంగ్ రన్ అవుతుంది.ఏదైనా ఒక పాత సినిమాకు సంబంధించి డైలాగ్స్, పాటలు వంటివి రీక్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలి. ఈ మధ్య చాలామంది మేకర్స్ అనుమతి లేకుండా తీసుకోవడంతోనే ఇలాంటి సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డ్యూడ్ మేకర్స్‌తో పాటు సోనీ మ్యూజిక్‌పై ఇళయరాజా దావా వేశారు. గతంలో కూడా అజిత్ సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై ఇళయరాజా దావా వేసిన విషయం తెలిసిందే. అయితే, తాము అనుమతి తీసుకున్న తర్వాతే సాంగ్స్‌ను ఉపయోగించుకున్నామని మైత్రీ మూవీ మేకర్స్ అన్నారు. ఇప్పుడు డ్యూడ్ సినిమా పరంగా కూడా వారు మరోసారి చిక్కుల్లో పడ్డారు. డ్యూడ్ సినిమా విషయంలో దావా వేసేందుకు ఇళయరాజాకు కోర్టు అనుమతి ఇచ్చింది. -
సెంచరీకి చేరువలో డ్యూడ్.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం డ్యూడ్(Dude Collections). కోలీవుడ్ హీరో నటించిన ఈ సినిమాకు తెలుగులోనూ రిలీజైంది. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలకు తెలుగు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైంది.అయితే తొలి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా అదరగొట్టింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. గతంలో రిలీజైన డ్రాగన్ కంటే ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.83 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లోనే సెంచరీకి చేరువలోకి వచ్చేసింది. వరల్డ్ వైడ్‌గా ఐదు రోజుల్లో రూ.95 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించగా.. ఆర్. శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. DUDE continues the festivities at the box office 💥💥✨#DUDE grosses over 95 CRORES in 5 days worldwide ❤🔥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️ https://t.co/4rgutQNl2n⭐ing 'The Sensational' @pradeeponelife🎬 Written and… pic.twitter.com/Jo9f1ukrW8— Mythri Movie Makers (@MythriOfficial) October 22, 2025 -
ఆ రెండు చిత్రాల కంటే ‘డ్యూడ్’కే ఎక్కువ కలెక్షన్స్: ప్రదీప్ రంగనాథన్
‘‘డ్యూడ్’ సినిమాను అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మీరు అందిస్తున్న ప్రేమ మర్చిపోలేనిది. నేను హీరోగా నటించిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు మించిన ఆదరణ, అభిమానం ‘డ్యూడ్’ సినిమాకి చూపిస్తున్నారు. నా గత చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కంటే తొలి, మలి రోజుల్లోనే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’ సినిమాకు వచ్చాయని మా నిర్మాతలు చెబుతుంటే ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని ప్రదీప్ రంగనాథన్ అన్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా, ఆర్. శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా ‘డ్యూడ్ దివాళి బ్లాస్ట్’ పేరిట నిర్వహించిన సమావేశంలో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ– ‘‘తమిళనాడులోనూ నా గత చిత్రాలకంటే ‘డ్యూడ్’కు ఎక్కవ కలెక్షన్స్ వస్తున్నాయి’’ అని తెలిపారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘ప్రదీప్‌గారి గత సినిమాలతో పోల్చుకుంటే కొన్ని ఏరియాల్లో నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’కు వస్తున్నాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ వచ్చింది. ‘డ్యూడ్’ దివాళి బిగ్ విన్నర్’’ అని ప్పారు. ‘‘జెన్ జి కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ ఎమోషన్స్ బ్లెండ్ అయిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’’ అని తెలి΄ారు వై. రవిశంకర్. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. -
'డ్యూడ్' రివ్యూ.. ప్రదీప్‌కు హ్యాట్రిక్ విజయం దక్కిందా
టైటిల్: డ్యూడ్నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, శరత్ కుమార్, రోహిణి,హృదు హరూన్,నేహా శెట్టినిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్సంగీతం: సాయి అభ్యంకర్సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిఎడిటర్: బరత్ విక్రమన్విడుదల తేది: అక్టోబర్ 17, 2025లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో తెలుగులో కూడా మంచి విజయాలు అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్.. తాజాగా ఆయన నటించిన సినిమా డ్యూడ్ విడుదలైంది.. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి యూత్న్ టార్గెట్ చేస్తూనే ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్గా నటించగా.. శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. డ్యూడ్ సినిమాతో మలయాళ నటుడు హృదు హరూన్ టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించారు. గతంలో ఆయన సుధా కొంగర వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.కథ ఏంటి..?ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్‌గా కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. రాష్ట్రంలో ఎంతో పేరు పొందిన మంత్రిగా ఆదికేశవులు (శరత్ కుమార్) ఉంటాడు. తన రాజకీయ భవిష్యత్ కోసం ఏమైనా చేయగలిగే వ్యక్తి. తన కులానికి చెందిన వాడినే అల్లుడిగా చేసుకోవాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తికి కుమార్తె కుందన (మమితా బైజు) ఉంటుంది. ఆమెకు మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్).. ఇద్దరి మధ్య చిన్నతనం నుంచే మంచి బాండింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే గగన్‌ను కుందన ప్రేమిస్తుంది. కానీ, అతను మాత్రం మరో అమ్మాయిని ఇష్టపడుతాడు. వారిద్దరి మధ్య బ్రేకప్ కాగానే కుందన తన ప్రేమ విషయాన్ని గగన్తో పంచుకుంటుంది. అయితే, గగన్ ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. దీంతో కుంగిపోయిన కుందన ఒంటరిగా ఉండేందుకు బెంగళూరు వెళ్లిపోతుంది. ఆమె దూరమే గగన్‌కు తన ప్రేమను అర్థమయ్యేలా చేస్తుంది. అయితే, తన ప్రేమ విషయాన్ని మొదట తన మామ (శరత్ కుమార్)తో చెప్తాడు. సంతోషంగా పెళ్లికి ఒప్పుకొని ఏర్పాట్లు కూడా చేస్తాడు. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన కుందన తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. అలా కుందన సడెన్‌గా నిర్ణయం మార్చుకోవడానికి ఉన్న కారణం ఏంటి.. గగన్- కుందన పెళ్లికి ఉన్న చిక్కులు ఎవరి వల్ల వచ్చాయి.. కుందన ఎలాంటి కారణాలు చెబుతుంది... ప్రియురాలి కోసం గగన్ చేసిన త్యాగం ఏంటి.. గగన్ తల్లి (రోహిణి), కుందన తండ్రి (శరత్ కుమార్) అన్నాచెల్లెలు.. అయినప్పటికీ ఎందుకు మాట్లాడుకోరు.. ఫైనల్‌గా కుందనతో గగన్ పెళ్లి జరిగిందా లేదా అనేది తెలియాలంటే డ్యూడ్ చూడాల్సిందే.ఎలా ఉందంటే..?డ్యూడ్ సినిమా ప్రమోషన్లో ఈ కథకు స్ఫూర్తి అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 చిత్రమేనని దర్శకుడు చెప్పారు. ఆయన ఈ మాట ఎందుకు చెప్పారనేది చిత్రం చూసిన తర్వాత తెలుస్తోంది. ఆర్య కాన్సెప్ట్నే డ్యూడ్‌లో చూపించారు. లవ్ ఫెయిల్ అయితే దేవదాస్‌లు కానక్కర్లేదు.. ప్రేయసి కోసం ప్రేమికుడిగా ఏం చేయవచ్చో డ్యూడ్ చెప్తాడు. కథలో పెద్దగా కొత్తదనం ఉండదు. కానీ, ఫుల్ ఫన్‌తో ఈ చిత్రం ఉంటుంది. కథ చాలా రొటీన్‌గా ఉన్నప్పటికీ తెరపై దర్శకుడు చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ విషయంలో కీర్తిశ్వరన్ విజయం సాధించాడు. కాన్సెప్ట్ అంతా పాతదే అయినప్పటికీ నేటి యూత్ కోసం కొత్తగా చూపించాడు. నిజమైన ప్రేమకు ఎమోషన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ పాయింట్‌నే డ్యూడ్‌లో చూపించారు. డ్యూడ్ మూవీ చూస్తున్నంత సేపు అక్కడక్కడ ఆర్య-2 గుర్తకు వస్తుంది. అయితే, ఇక్కడ ఆ సీన్లు చాలా ఫ్రెష్‌గానే ఉంటాయి. ఈ మూవీలో డైలాగ్స్ చాలా చోట్ల యూత్‌తో విజిల్స్ వేపించేలా ఉంటాయి. అయితే. క్లైమాక్స్‌లో మినహా ఎక్కడా కూడా భావోద్వేగంతో కూడిన సీన్స్ కనిపించవ్.. కానీ, కుందన ప్రేమను గగన్ తిరస్కరించిన సమయంలో వచ్చే సీన్ ప్రతి ప్రేమికుడిని గుచ్చేస్తుంది. సినిమా ఎండింగ్ కూడా ప్రేక్షకుడిని సంతృప్తి పరిచేలా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..?డ్యూడ్‌కు ప్రధాన బలం ప్రదీప్ రంగనాథ్.. గత సినిమాల మాదరే ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు తన ఎక్స్‌ప్రెషన్స్‌తో దుమ్మురేపాడు. ఆ తర్వాత శరత్ కుమార్ అద్భుతంగా నటించారు. ఇందులో ఆయన కాస్త ఫన్నీగా కనిపించడమే కాకుండా అవసరమైన చోట సీరియస్‌గా కనిపించి తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. అయితే, మమితా బైజు వారిద్దరితో పోటీ పడుతూ నటించింది. నటన పరంగా మంచి స్కోప్ ఉన్న పాత్రనే ఆమెకు దక్కిందని చెప్పవచ్చు. మలయాళ నటుడు హృదు హరూన్, రోహిణి తమ పరిదిమేరకు నటించారు. తమిళ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసి కీర్తిశ్వరన్.. డ్యూడ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే మెప్పించాడని చెప్పవచ్చు. డ్యూడ్ చిత్రానికి మరో ప్రధాన బలం సంగీతం. సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకుడిలో జోష్ నింపుతుంది. పైనల్గా పుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు. యూత్న్ మాత్రం నిరాశపరచదని చెప్పవచ్చు. -
డ్యూడ్ X రివ్యూ: టాక్ ఎలా ఉందంటే?
లవ్‌టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన సినిమా డ్యూడ్ (Dude Movie X Review). కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శుక్రవారం (అక్టోబర్ 17న) డ్యూడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో ప్రదీప్ హిట్టు కొట్టాడా? మూవీకి ఏది ప్లస్ అయింది? ఏది మైనస్ అయిందని ఎక్స్ (ట్విటర్)లో నెటిజన్లు చర్చిస్తున్నారు. డ్యూడ్ చాలా బాగుందని కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం సెకండాఫ్ పోయిందని చెప్తున్నారు. మరింకా ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయో కింద చూసేద్దాం.. మంచి సందేశంకీర్తిశ్వరన్ ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టాడు. ఇది అసలుసిసలైన జెన్ జెడ్ మూవీ. సాయి అభ్యంకర్ ఇచ్చిన బీజీఎమ్ సినిమాకు ప్రధాన బలం. హీరోహీరోయిన్లు వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. మంచి సందేశాన్ని వినోదాత్మకంగా అందించారు అని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డాడు. Dude - Winner 🏆 What a fabulous debut for @Keerthiswaran_ 💯👏 A proper Gen Z rom-com ❤️🔥 @SaiAbhyankkar BGM & songs are a major plus ✨ Both PR & Mamitha were perfect in their roles 🤩 Much needed social message said in the most entertaining way 🔥#Dude #DudeDiwali #DudeReview pic.twitter.com/SdCJTKqxWD— Alex (@callmeajas) October 17, 2025సెకండాఫే..ఫస్టాఫ్ బాగుంది.. సెకండాఫ్ పోయింది. కథ నెమ్మదిగా మొదలై ప్రీ ఇంటర్వెల్‌కు వేగం పుంజుకుంటుంది. కానీ ఆ వేగం సెకండాఫ్‌లో ఎక్కడా కనిపించదు. సెకండాఫ్‌ను ఇంకాస్త బాగా ఎడిట్ చేయాల్సింది అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. #Dude A Mid Rom-Com with a Fairly Engaging First Half but a Lackluster Second Half!The film hits all the familiar beats of a typical rom-com. The first half starts off a bit slow but picks up well toward the pre-interval, ending with a well-executed interval block. However, the…— Venky Reviews (@venkyreviews) October 17, 2025సూపర్ ఎంటర్టైనర్డ్యూడ్తో ప్రదీప్ మళ్లీ అదరగొట్టాడు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అదిరిపోయింది. సంగీతం, విజువల్స్ అన్నీ బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీసినట్లు అనిపించినా ఓవరాల్‌గా సూపర్ ఎంటర్టైనింగ్గా ఉంది అని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు.Just watched #Dude 🎬🔥Pradeep strikes again with youthful energy & emotions!Fun, fresh & emotional ride!💥Pradeep & #MamithaBaiju chemistry 💯🎧 Music & visuals top-notch😅 Few scenes feel stretched, but overall super entertainer!⭐⭐⭐⭐☆ #DudeReview #PradeepRanganathan pic.twitter.com/NRwyKYDHhx— Dragon (@yours_dragon) October 17, 2025మిక్స్డ్ ఫీలింగ్డ్యూడ్ మూవీ చూశాక మిక్స్డ్ ఫీలింగ్ వస్తోంది. కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. పర్ఫామెన్స్ అయితే బాగుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.#Dude Might work / Might not....!!Mixed feeling after watching film, Performances are good, 1st half is Good, and 2nd half moves to the different pattern and completes with okayish watch. Might work for some people. Pradeep with performance 🔥OKAYISH ENTERTAINER 🌟🌟.5/5— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) October 17, 2025 #Dude - PR’s Style, his combo with Mamitha Nice. Sarathkumar shines in versatile role. Hridhu Gud addition. Music ok. Slow start, Interval block 20Mins ROFL. Final act could have been better. Though less emotional connect, Humour drives d narration to an extent. ONE TIME WATCH!— Christopher Kanagaraj (@Chrissuccess) October 17, 2025VERY GOOD first half. Right from the first scene, there’s entertainment and the screenplay is engaging. The chemistry of @pradeeponelife and @_mamithabaiju is EXCELLENT. The storyline is good, the moments are cute, emotions land and the music is great. If this holds for the… pic.twitter.com/IrbdKWSbNw— Sharat Chandra (@Sharatsays2) October 17, 2025 First half is simply excellent #Dude 2nd half idey range lo untey good... https://t.co/YGO1ih1SCq— Ajayvinay (@Ajayvinay1) October 17, 2025#Dude is a partly engaging effort with fine performances but limited emotional resonance.written and directed by Keerthiswaran, #Dude is a modest romantic drama that blends light humor with emotional undertones. The film begins on a slow note but gradually finds its energy,…— Thyview (@Thyview) October 17, 2025#Dude 🌟🌟🌟 /5A very Pradeep Ranganathan coded film. The hidden conflict was a great strategic move. The first and second halves sit on completely opposite sides of the spectrum. Though predictable at times.#BiggBossTamil9 #Bisonpic.twitter.com/EMpTj7TGBQ— Cine News (@cinema_online2) October 17, 2025#Dude #Dudefirsthalf Neither good nor Bad .... Just ok !!!No story !! Routine scenes only music n bgm fresh 🔥🔥🔥🔥#SaiAbhyankkar killed it with BGM N songs..... @Chrissuccess @Karthikravivarm @itisprashanth— Movie Addict 😈 (@Madraspayen) October 17, 2025#Dude - 3.5/5🎯 Hat-trick hero! After Love Today and Dragon, #PradeepRanganathan delivers yet another blockbuster with #Dude! Three in a row — the young sensation is on fire! 🔥— Box Office (@Box_Office_BO) October 17, 2025 -
సినీ ఇండస్ట్రీలో వివక్ష? ప్రేమలు బ్యూటీ ఆన్సరిదే!
హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకోవడం అంత సులభం కాదు. అలాగే ఏ మూవీ కెరీర్‌ను ఎటు మలుపు తిప్పుతుందో చెప్పలేని పరిస్థితి. మలయాళంలో అనేక సినిమాలు చేసిన మమిత బైజు (Mamitha Baiju) 'ప్రేమలు' అనే ఒక్క మూవీతో సెన్సేషన్ అయింది. ఈ ఒక్క చిత్రంతోనే తమిళంలో అవకాశాలు వచ్చాయి. అలా జి. ప్రకాష్ కుమార్ సరసన రెబల్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ, ఈ మూవీ పూర్తిగా నిరాశపరిచింది. సాధారణంగా తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోతే అవకాశాలు మందగిస్తాయి. కానీ, మమిత బైజు విషయంలో ఇది రివర్స్ అయిందనే చెప్పాలి. తమిళంలో అవకాశాలుప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్లో ముఖ్య భూమిక పోషిస్తోంది. అదేవిధంగా క్రేజీ నటుడు ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా డ్యూడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా నటి నమిత బైజు మాట్లాడుతూ.. తమిళ సినిమాల్లో నటించాలని తాను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదని తెలిపింది. అయినప్పటికీ తమిళంలో పలు వైవిద్యభరిత పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేసింది. అలా వచ్చిన వాటిలో మంచి కథలను ఎంపిక చేసుకొని నటిస్తున్నట్లు చెప్పింది.తమిళం వచ్చేసిందిఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వివక్ష ఎదుర్కొన్నారా ? అన్న ప్రశ్నకు.. అలాంటి పరిస్థితులు తనకు ఎదురవ్వలేదని స్పష్టం చేసింది. మొదట్లో తమిళ భాష మాట్లాడటం తనకు ఛాలెంజింగ్ అనిపించినా, తన యూనిట్లో మేకప్ మాన్, హెయిర్ స్టైలిస్ట్ వంటి వారు తమిళులు కావడంతో వారి మాటలే తాను తమిళం నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యాయంది. ఇప్పుడు తాను తమిళ భాషలో మాట్లాడటం, రాయడం కూడా నేర్చుకున్నానంది. డ్యూడ్ చిత్రంలో నటుడు ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన ఫ్రెండ్లీగా ఉంటారని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని మమిత బైజు పేర్కొంది.చదవండి: ముచ్చటగా మూడోసారి! -
స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లి, జుట్టు పట్టుకుని లాగిన హీరో!
'లవ్‌టుడే', 'డ్రాగన్' సినిమాలతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఇతడు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ప్రేమలు బ్యూటీ మమిత బైజు (Mamitha Baiju) హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 17న రిలీజవుతోంది. ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్ 15న) స్వాగ్ ఈవెంట్ నిర్వహించారు.హీరోయిన్ జుట్టు పట్టుకుని లాగి..ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. డ్యూడ్ చిత్రంలో హీరోను బుగ్గగిల్లి క్యూట్‌గా ఫీలవుతుంది మమిత. ఈ సీన్‌ను స్టేజీపై రివర్స్ రోల్స్‌లో చేశారు. మమిత బుగ్గలు గిల్లి, జుట్టు పట్టుకుని లాగి, కొడుతున్నట్లుగా సీన్లో లీనమైపోయాడు ప్రదీప్. ఇది క్యూట్‌గా లేదు అని మమిత డైలాగ్ చెప్పింది. వీళ్ల యాక్టింగ్ చూసేవారి ఫీలింగ్ కూడా అదే! అదే విషయాన్ని యాంకర్ బయటకు చెప్పేసింది. ఇది నిజంగానే క్యూట్‌గా లేదమ్మా.. ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి? అని నవ్వేసింది. ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదే వేడుకలో మమిత ఎంతో గ్రేస్‌తో డ్యాన్స్ చేసింది. చదవండి: యూత్‌కి ప్రేమ సలహాలు.. అబ్బాయిలు.. ఏడ్చినా పర్లేదు, కానీ! -
ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ మూవీ SWAG ఈవెంట్ (ఫొటోలు)
-
డ్యూడ్‌లో అందమైన భావోద్వేగాలు ఉంటాయి
‘‘డ్యూడ్’ వైవిధ్యమైన ప్రేమకథ. అందమైన భావోద్వేగాలు ఉంటాయి. కీర్తీశ్వరన్గారు చెప్పిన కథకంటే 20 శాతం ఎక్కువగానే సినిమా తీశారు. మా మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ చెప్పిన విశేషాలు. → ‘డ్యూడ్’ యూత్‌తో పాటు ఫ్యామిలీ కూడా చూసే కంటెంట్. చాలా కొత్తగా ఉంటుంది. చెప్పాలంటే ‘సఖి’ లాంటి ఫ్యామిలీ మూవీ. ప్రదీప్‌గారి ‘లవ్ టుడే, డ్రాగన్’ సినిమాలు తెలుగులో దాదాపు రూ. 12 కోట్లు కలెక్షన్స్ తెచ్చుకున్నాయి. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి కాబట్టి ‘డ్యూడ్’ కచ్చితంగా రూ. 15 కోట్లు వసూలు చేస్తుందని నమ్ముతున్నాం. → ‘డ్యూడ్’ని తమిళంలో ఏజీఎస్ సంస్థ ద్వారా తమిళంలో మేమే విడుదల చేస్తున్నాం. తమిళ్‌తో సమానంగా తెలుగులోనూ మా సినిమా ఆడుతుందనే నమ్మకం ఉంది. → మేము హిందీలో తీసిన ‘జాట్’ మాకు మంచి వెంచర్. ‘జాట్ 2’ కూడా ఉంటుంది. ప్రభాస్‌గారితో, ఎన్టీఆర్‌గారితో మేం నిర్మిస్తున్న సినిమాలు 2026లోనే వస్తాయి. రామ్‌తో తీస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ బాగుంటుంది. ‘పెద్ది’ చిత్రం 2026 మార్చ్ 27న కచ్చితంగా విడుదలవుతుంది. ఆ తర్వాత సుకుమార్‌గారితో సినిమా ఉంటుంది. -
రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను: మమిత బైజు
‘‘డ్యూడ్’ సినిమాలోని కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు నాకు సవాల్‌గా అనిపించాయి. ఆ సన్నివేశాల కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. అలా చేయడం నాకు సవాల్‌గా, ఉత్సాహంగా అనిపించింది’’ అని హీరోయిన్ మమిత బైజు తెలి పారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ అవుతోంది.మమిత బైజు మాట్లాడుతూ– ‘‘డ్యూడ్’లో నేను చేసిన కురల్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. ఈ సినిమాని కీర్తీశ్వరన్ అద్భుతంగా తీశారు. ప్రదీప్ రంగనాథ్ సెట్స్‌లో చాలా హెల్ప్ ఫుల్‌గా ఉంటారు. శరత్ కుమార్‌గారి లాంటి సినియర్తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి అభ్యంకర్ మ్యూజిక్ మా సినిమాకి బిగ్ ఎసెట్. నవీన్ , రవిశంకర్‌గార్లు చాలా ప్యాషనేట్ ప్రోడ్యూసర్స్. సినిమాని చాలా గ్రాండ్‌గా తీశారు. మా చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
హీరో ప్రదీప్ డేంజర్ అన్న బ్యూటీ.. బిగ్‌బాస్ స్టేజీపై దివ్వెల మాధురి డ్యాన్స్
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై నెల రోజులవుతోంది. మొదట్లో ఊపు మీదున్న షో తర్వాత కాస్త గాడితప్పింది. దీంతో బిగ్‌బాస్ షోకు సరికొత్త హంగామా తీసుకొచ్చేందుకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను దింపుతున్నారు. ఈ రోజు రాత్రి ఆరుగురు సెలబ్రిటీలు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్‌గా ఉంటాయని హెచ్చరించాడు నాగ్. తమిళ, కన్నడ, మలయాళ బిగ్‌బాస్‌ల హోస్ట్లతోనూ నాగ్ ముచ్చటించాడు. డ్యూడ్ సినిమా హీరోహీరోయిన్ ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు స్టేజీపైకి అతిథులుగా విచ్చేశారు. ప్రదీప్ చాలా డేంజర్పనిలో పనిగా రెండు స్టెప్పులు కూడా వేశారు. ఈ సందర్భంగా.. ప్రదీప్ ప్రమాదకరమైన వ్యక్తి అని నాగార్జునకు కంప్లైంట్ చేసింది మమిత. అది విని అవాక్కైన ప్రదీప్.. నేనేం చేశాను? అని నోరెళ్లబెట్టాడు. అందుకు మమిత చిరునవ్వుతోనే అయినా నువ్వు కొంచెం డేంజరసే అని మరోసారి నొక్కి చెప్పింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ఆయేషా జీనత్‌లు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. దివ్వెల మాధురి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. మరి మిగతావాళ్ల ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి! చదవండి: బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి -
హీరో ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమా ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్రేజీగా ప్రదీప్-మమిత 'డ్యూడ్' ట్రైలర్
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ హిట్స్ కొట్టిన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు మరో మూవీతో వచ్చేస్తున్నాడు. అదే 'డ్యూడ్'. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు హీరోయిన్ కాగా కీర్తిశ్వరన్ దర్శకుడు. దీపావళి కానుకగా ఈనెల 17న మూవీ థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!)ప్రదీప్ స్వతహాగా దర్శకుడు. కానీ హీరోగా లవ్ టుడే, డ్రాగన్ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేశాడు. 'డ్యూడ్' కూడా అదే జానర్ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది. అయితే ఈసారి కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా చూపించబోతున్నారనే విషయాన్ని ట్రైలర్‌తో చెప్పకనే చెప్పారు. ప్రదీప్-మమిత ప్రేమించుకుంటారు. కానీ పెళ్లి అనేసరికి మమిత నో చెప్పేస్తుంది. తర్వాత ప్రదీప్.. నేహాశెట్టితో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్లో కథని చెప్పి చెప్పనట్లు చూపించారు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 'డ్యూడ్'తో పాటు దీపావళికి తెలుగులో మిత్రమండలి, తెలుసు కదా, కె ర్యాంప్ మూవీస్ వస్తున్నాయి. వీటితో పోటీలో మరి 'డ్యూడ్' ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు) -
డ్యూడ్ 'సింగారి చిన్నదాని' గురించి విన్నావా?
తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) టాలీవుడ్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే లవ్‌టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో మెప్పించాడు. అయితే, ఆయన తాజాగా డ్యూడ్(Dude) అనే కొత్త సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. ప్రేమలు సినిమాతో గుర్తింపు పొందిన మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్గా నటిస్తుంది. సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. -
స్టార్ హీరోతో నటించే ఛాన్స్.. చేజారడంతో ఏడ్చేశా: ప్రేమలు బ్యూటీ
ప్రేమలు సినిమాతో సెన్సేషన్ అయింది మమిత బైజు (Mamitha Baiju). ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్‌తో, దళపతి విజయ్‌తో సినిమాలు చేస్తోంది. అయితే ఓ స్టార్ హీరోతో నటించే అవకాశం చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందంటోందీ బ్యూటీ. నాకు పెద్దగా గుర్తింపు లభించని సమయంలో హీరో సూర్య సర్‌తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఎగిరి గంతేశాను. కానీ, దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. అప్పుడు చాలా బాధపడ్డాను, ఏడ్చాను. కానీ ఇప్పుడు సూర్య సర్‌తో ఓ సినిమా చేస్తున్నందుకు చాలా థ్రిల్ ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చింది.అప్పుడు మిస్సయిన ఛాన్స్..బాలా డైరెక్ట్ చేసిన వణంగాన్ మూవీలో మొదట సూర్య, మమిత బైజును సెలక్ట్ చేశారు. కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారు. కానీ పలు కారణాల వల్ల సూర్య, మమిత బైజు ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దీంతో దర్శకుడు బాలా.. అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) చదవండి: ‘మారీశన్’ మూవీ రివ్యూ: ఒక్క సీన్ కూడా ఊహించలేరు! -
నాగార్జునతో మలయాళ యంగ్ బ్యూటీస్.. ఫొటో వైరల్
నాగార్జున.. రీసెంట్‌గానే 'కూలీ' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇన్నాళ్లు హీరోగా చేసిన నాగ్.. ఈ సినిమాలో విలన్‌గా కనిపించాడు. రైటింగ్ పరంగా ఈ పాత్రపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ నాగ్ లుక్స్ మాత్రం తెలుగు-తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. తమిళ యూత్ అయితే నాగ్ హెయిర్ స్టైల్ అనుకరిస్తూ తెగ రీల్స్ చేస్తున్నారు. సరే ఇవన్నీ పక్కనబెడితే నాగ్ క్రేజ్ ఇప్పటితరం హీరోయిన్లలోనూ గట్టిగానే ఉందండోయ్.సందర్భం ఏంటో తెలీదు గానీ మలయాళ యంగ్ హీరోయిన్లు అయిన మమిత బైజు, అనస్వర రాజన్, ప్రియ వారియర్, దీప్తి సతితో నాగ్ కలిసున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గ్లామర్ విషయంలో ఈ బ్యూటీస్‌తో నాగ్ కలిసిపోయి యంగ్‌గా కనిపిస్తున్నాడని చెప్పొచ్చు. ఒకప్పటి తరం హీరోయిన్లతో చేసిన నాగ్.. 2010ల్లో అప్పటి క్రేజ్ హీరోయిన్లతోనూ సినిమాలు చేశాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో చూస్తుంటే వీళ్లతోనూ మూవీస్ చేస్తాడేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: సింగర్‌తో తిరుమలకు హీరో జయం రవి)నాగ్ జనరేషన్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తదితరుల సినిమాల్లో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీపై అప్పుడప్పుడు ట్రోల్స్ లాంటివి కనిపిస్తుంటాయి కానీ నాగ్ విషయంలో మాత్రం అలాంటి కంప్లైంట్స్ పెద్దగా వినిపించవనే చెప్పొచ్చు. అదన్నమాట విషయం. త్వరలో తన 100వ సినిమా గురించి నాగ్ నుంచి ప్రకటన రావొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. తమిళ యువ దర్శకుడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు వచ్చే నెల 7వ తేదీ నుంచి మొదలయ్యే బిగ్‌బాస్ 9వ సీజన్ కోసం నాగార్జున సిద్ధమైపోతున్నాడు. 3వ సీజన్ నుంచి హోస్టింగ్ చేస్తున్న నాగ్.. ఈసారి కూడా హోస్ట్‌గా కొనసాగబోతున్నాడు. ప్రస్తుతం బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులని ఎంపిక చేసేందుకు గేమ్ నడుస్తోంది. ఇది అయిపోయిన వెంటనే.. అసలు షో షురూ కానుంది. ఈసారి ఇమ్మాన్యుయేల్‌తో పాటు పలువురు టీవీ యాక్టర్స్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి దేవరకొండ 'కింగ్డమ్'.. అధికారిక ప్రకటన) -
స్టైలిష్ డ్యూడ్
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ సినిమా ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘బూమ్ బూమ్’పాట లిరికల్ వీడియోను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించి, పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ప్రదీప్, మమితా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్. -
డిష్యుం.. డిష్యుం
డిష్యుం.. డిష్యుం.. అంటూ విలన్లను రఫ్ఫాడిస్తున్నారు సూర్య. ఆయన హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, కొన్ని సన్నివేశాల్లో నెగటివ్ షేడ్స్ కూడా కనిపిస్తాయనే టాక్ తెరపైకి వచ్చింది. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే?
స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్ (Jana Nayagan Movie). ఇదే ఆయన చివరి చిత్రమని, దీని తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అది అబద్ధమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. జన నాయగన్.. విజయ్ ఆఖరి సినిమానా? అని అందరి మనసులో ఉన్న ప్రశ్నని హీరోయిన్ మమితా బైజు నేరుగా దళపతినే అడిగేసింది. భావోద్వేగం..అందుకాయన 2026లో జరిగే ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పారంది. సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచినా.. చిత్రీకరణ చివరి రోజు మాత్రం విజయ్ సహా అందరూ భావోద్వేగానికి లోనయ్యారట! అందుకనే విజయ్ టీమ్‌తో కలిసి సరిగా ఫోటోలు కూడా దిగలేకపోయారని చెప్తోంది మమితా (Mamitha Baiju). జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.చదవండి: మహేశ్‌బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
హైదరాబాద్ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
'ప్రేమలు' బ్యూటీ రెమ్యునరేషన్.. రేటు పెంచేసిందా?
హీరోయిన్లు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం. కొందరు ఏళ్లకు ఏళ్లు కష్టపడినా గుర్తింపు రాదు. మరికొందరు ఒక్క మూవీకే ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంటారు. 'ప్రేమలు' బ్యూటీ మమిత ఈ కోవలోకే వస్తుంది. తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ఈమె ఇప్పుడు రెమ్యునరేషన్ గట్టిగానే పెంచేసినట్లు తెలుస్తోంది.మలయాళంలో తొలుత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన మమితకు 'ప్రేమలు' మూవీతో హీరోయిన్ గా బ్రేక్ దొరికింది. అటు సొంత భాషతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న 'డ్యూడ్', దళపతి విజయ్ లేటెస్ట్ చిత్రాల్లో నటిస్తోంది. (ఇదీ చదవండి: మోనాలిసాకు మరో ఛాన్స్.. ఈసారి స్పెషల్ సాంగ్) ఇదివరకు హీరోయిన్ గా ఒక్కో సినిమాకు రూ.50 లక్షల్లోపే రెమ్యునరేషన్ అందుకున్న మమిత.. ఇప్పుడు 'డ్యూడ్' కోసం రూ.70 లక్షలకు పైనే అందుకుంటోందట. దళపతి విజయ్ తో చేస్తున్న జన నాయగణ్ కోసమైతే ఏకంగా రూ.కోటి పారితోషికం అందుకుందట.ఒకవేళ ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజ్ రావడం గ్యారంటీ. అప్పుడు ఇంకాస్త రెమ్యునరేషన్ పెంచినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ రెండు కాకుండా మరో తమిళ మూవీ కూడా మమిత చేతిలో ఉంది. (ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
'డ్రాగన్' హీరో.. 'ప్రేమలు' హీరోయిన్
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భాషాభేదం లేకుండా పలు భాషల్లోనూ యాక్టర్స్ తెలుగులోనూ హీరోహీరోయిన్లుగా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరేందుకు ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు రెడీ అయిపోయారు. ఇంతకీ వీళ్ల కొత్త సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) 'కోమలి' సినిమాతో దర్శకుడిగా మారిన ప్రదీప్ రంగనాథన్.. 'లవ్ టుడే' మూవీతో అటు దర్శకత్వం చేస్తూనే హీరోగా మారిపోయాడు. రీసెంట్ గా 'డ్రాగన్' మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇతడిని హీరోగా పెట్టి తెలుగు నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమాని ప్రకటించారు. 'డ్యూడ్' పేరుతో తీస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి కానుకాగ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రేమలు' మూవీతో ఫేమ్ తెచ్చుకున్న మలయాళ హీరోయిన్ మమిత బైజు.. డ్యూడ్ చిత్రంలో ప్రదీప్ కి జోడీగా నటిస్తోంది. ఈ మేరకు వీళ్లిద్దరూ కలిసున్న లుక్ ని రిలీజ్ చేశారు. షర్ట్ లేకుండా ప్రదీప్ ఉండటం చూస్తుంటే ఇది కూడా కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో) -
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
చీరలో అందమైన యువరాణిలా నిధి అగర్వాల్ఫొటోలతో మత్తెక్కించేస్తున్న ఆషికా రంగనాథ్నిషా కళ్లతో మాయ చేసేస్తున్న నేహాశెట్టిక్యూట్ రీల్ తో కిర్రాక్ అనిపించేలా మమిత బైజునాభి అందాలతో షాకిచ్చిన హీరోయిన్ వేదికమేకప్ వీడియో పోస్ట్ చేసిన శ్రుతి హాసన్హిమాచల్ ప్రదేశ్ ట్రిప్ లో యాంకర్ విష్ణుప్రియ View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
ఆ పని చేయడం బాగా అలవాటైపోయింది: మమితా బైజు
ఒకే ఒక్క డబ్బింగ్ సినిమా ‘ప్రేమలు’తో తెలుగు ఆడియన్స్‌లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న మమితా బైజు (Mamitha Baiju) గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. తండ్రి బైజు కృష్ణన్– డాక్టర్. తల్లి హోమ్ మేకర్. మిథున్ అనే అన్నయ్య ఉన్నాడు. తన పదహారవ ఏట– ‘సర్వోపకారి పాలక్కారన్’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సైకాలజీ చదువుతూ, మధ్యలో ఆపేయడం వల్ల ఏమో.. కనబడ్డ ప్రతి ఒక్కరి సైకాలజీ స్టడీ చేయడం అలవాటైపోయింది తనకు.మలయాళంలోనే..తెలుగులో మమితా డైరెక్ట్ సినిమా ఎప్పుడు చేస్తుందని ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రవితేజ సరసస నటిస్తుందని వార్తలు వచ్చాయి కాని, అవన్నీ వట్టి రూమర్లే అని తేలిపోయింది. ‘ప్రేమలు’ సినిమాతో ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. కాని, మలయాళంలో తప్ప మిగిలిన భాషల్లో చేయడానికి ఇష్టపడటం లేదు మమితా. శ్రీలీల పాత్రలో..తమిళంలో విజయ్ చిట్టచివరి సినిమా ‘జన నాయగన్’లో మమితా బైజు ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే కూతురిలాంటి పాత్ర. ఈ సినిమా ‘భగవంత్ కేసరి’ రీమేక్ అంటున్నారు. తెలుగులో శ్రీలీల చేసిన పాత్ర తమిళంలో మమితా బైజు చేస్తోంది. మొదటి రోజు షూటింగ్లో విజయ్‌ని చూడగానే చాలా థ్రిల్ ఫీలయ్యానంటుంది మమితా. విజయ్ డైరెక్ట్‌గా తన దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని, ‘ఏమ్మా ఎలా ఉన్నావు’ అని పలకరించినప్పుడు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది అని చెప్పింది. ప్రేమలు పారితోషికం ఎంతంటే?తన బ్యాగ్‌లో ఎప్పుడూ రంగు రంగుల మట్టి గాజులు , ఓ జత స్పేర్ డ్రెస్, చాక్లెట్లు ఉంటాయని చెప్పింది. రోజూ జిమ్ చేయడం అలవాటు. ‘హెలెన్’, ‘కప్పెలా’ మలయాళ సినిమాలతో పాపులర్ అయిన అన్నా బెన్ జిమ్ మేట్. ఇద్దరూ కలిసి వర్కవుట్స్ చేయడం ఫన్నీగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తాను అని చెప్పింది. ‘ప్రేమలు’ సినిమాకి రూ. 30 లక్షలు ఇచ్చారు. సినిమా సూపర్ హిట్ కావడంతో తన పారితోషికం రూ. 50 లక్షలకు పెంచింది. వేరే లాంగ్వేజెస్‌కి వెళ్తే, ఇంకా పెరుగుతుంది కాని, మలయాళంలో కంఫర్ట్ లెవెల్ ఎక్కువ అంది. ఆ హీరోనే ఫేవరెట్యూత్కి ఫేవరెట్ క్రష్ అయిన మమితాకి మాత్రం హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ అంటే పిచ్చి. తమిళ డైరెక్టర్ బాలతో ఓ సినిమా కమిట్ అయింది మమితా. కాని మధ్యలోనే సినిమా నుంచి బయటికి వచ్చింది. షూటింగ్లో బాల మమితాని బూతులు తిట్టి కొట్టాడని, అందుకే మానేసిందని వార్తలు వచ్చాయి. మమితా మాత్రం తన పర్సనల్ రీజన్స్ వలన ఆ సినిమా మానేసిందని చెప్పింది. తనని బాల కొట్టలేదని, అది మీడియా క్రియేషన్ అని కామెంట్ చేసింది. బాల మాత్రం మమితా తన కూతురులాంటిదని, తన డ్రెస్ సెన్స్ నచ్చక తీసేశానని చెప్పాడు.చదవండి: సినిమాల్లోకి రావాలని చాన్నాళ్లుగా వెయిటింగ్. అంటోన్న ఖుష్బూ కూతురు -
సీనియర్ హీరోతో 'మమితా బైజూ' రొమాన్స్
కాలాల మాదిరి హీరోయిన్లకు ఒక సీజన్ ఉంటుందనిపిస్తోంది. తెలుగు పరిశ్రమలో మాదిరే కోలీవుడ్‌లో కూడా ఇప్పుడు యువ హీరోయిన్ల సీజన్ నడుస్తోందనే చెప్పవచ్చు. ప్రేమలు చిత్రానికి ముందు మమితా బైజూ(Mamitha Baiju) చిన్న చిన్న పాత్రల్లోనే నటించింది. ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది మాత్రం ప్రేమలు చిత్రమే. ఆ చిత్రం తరువాత కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా రెబల్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు నాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశపరిచినా, ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న జననాయకన్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది. అదేవిధంగా విష్ణువిశాల్‌కు జంటగా ఇరండు వానం చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా డ్రాగన్ చిత్ర హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన ఒక చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడి తలుపు తట్టినట్లు సమాచారం. కాగా తాజాగా ధనుష్‌తో రొమాన్స్ చేసే లక్కీచాన్స్ మమితా బైజూను వరించినట్లు తెలిసింది. కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ బాటలో పయనిస్తున్న నటుడు ధనుష్. కాగా ప్రస్తుతం ఇడ్లీ కడై చిత్రంలో కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న కుబేర చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో నాగార్జున ప్రధాన పాత్రను పోషించగా, రష్మిక మందన్నా నాయకిగా నటించారు. ఒక హిందీ చిత్రంలో నటిస్తున్న ధనుష్ మరో తమిళ చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. దీన్ని పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించినున్నారని, ఈ క్రేజీ భారీ యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రాన్ని డా.ఐసరి గణేశ్ తన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో కథానాయకుడికి దీటుగా కథానాయకి పాత్ర ఉంటుందని, ఈ పాత్రకు నటి మమితాబైజూను ఎంపిక చేసినట్లు ప్రచారం సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం -
ప్రదీప్ రంగనాథన్‌తో టాప్ బ్యానర్లో సినిమా.. ముగ్గురు హీరోయిన్లకు ఓకే
కోలీవుడ్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. ఈయన కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు విజయం సాధించాయి. అందులో రెండు చిత్రాలకు ప్రదీప్ రంగనాథన్‌నే దర్శకుడు కావడం విశేషం. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్. బక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంది. అశ్వద్ మారి ముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై రూ. 150కోట్ల వరకు రాబట్టింది . కాగా ప్రస్తుతం నటుడు ప్రదీప్ రంగనాథన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'ఎల్కే' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈయన తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తదుపరి ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న భారీ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారన్నదే ఆ ప్రచారం. మహిళా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు తెలిసింది. కాగా ఇందులో ప్రేమలు చిత్రం ఫేమ్ మమిత బైజూ నాయకిగా నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా తాజాగా నటి అనూ ఇమాన్యుల్, సీరియల్ నటి ఐశ్వర్య శర్మ కూడా కథానాయికలుగా నటించబోతున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ!
ఒక్క సక్సెస్ కోసం పోరాడితే చాలు. ఆ తరువాత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇది అందరికీ జరగకపోయినా, చాలా మంది విషయంలో జరిగేది ఇదే. నటి మమిత బైజు(Mamitha Baiju ) ఇందుకు ఒక ఉదాహరణ. ప్రేమలు అనే మలయాళం చిత్రంతో మాలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించిన కథానాయకి ఈ బ్యూటీ. ఆ తరువాత మాతృభాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్‌కు జంటగా రెబల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ మరిన్ని అవకాశాలు అందుకుంటున్నారు. అలా రెండో అవకాశమే దళపతి విజయ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. అదీ ఆయన నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్లో కావడం విశేషం. ఇందులో చాలా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అదే లక్కు అనుకుంటే తాజాగా మరో క్రేజీ అవకాశం ఈమెను వరించింది. అవును దర్శకుడు, కథానాయకుడిగా వరుసగా విజయాలను అందుకుంటున్న నటుడు ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రంలో కథానాయికిగా మమిత బైజూ నటించబోతున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రం ద్వారా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే పూర్తి వివరాలతో వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద డ్రాగన్ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్‌తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకున్న నటి మమిత బైజు నిజంగా లక్కీనే. -
ప్రేమలు బ్యూటీ మమితా బైజు క్యూట్ లుక్స్..(ఫొటోలు)
-
లవ్ అని చెప్పు...
అక్షయ్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా, మరో హీరోయిన్ మమితా బైజు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డియర్ కృష్ణ’. దినేష్ బాబు దర్శకత్వంలో పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా చేసిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్–నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ‘లైక్ ఎందుకు లవ్ అని చెప్పు’, ‘ఎల్లప్పుడూ విశ్వాసంతో నన్ను పూజిస్తుంటారో... వారికి నేనెప్పుడూ అండగా ఉంటాను’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. మొదటి వంద టికెట్లు బుక్ చేసిన వారిలో ఒకర్ని ఎంపిక చేసి, క్యాష్ బ్యాక్ కింద రూ. పదివేలు బహుమతి ఇవ్వడం జరుగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
హీరోయిన్ని లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. నిజమెంత?
మలయాళ మూవీ‘ప్రేమలు’సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది మమిత బైజు(Mamitha Baiju). తెలుగులోనూ ఈ బ్యూటీకి ఫుల్ పాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడీయోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రేమలు తర్వాత ఈ బ్యూటీ ఆ స్థాయి విజయాన్ని అయితే అందుకోలేదు కానీ వరుస అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. తమిళ్లోనూ హీరో సూర్య సరసన నటించే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ దర్శకుడు మమితను లాగిపెట్టి కొట్టాడని, దీంతో ఆమె ఆ సినిమా నుంచే తప్పుకుందనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.బాల చేతిలో దెబ్బలు?తమిళ దర్శకుడు బాల వణంగాన్ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య హీరోగా, కృతిశెట్టి, మమిత హీరోయిన్లుగా నటించాల్సింది. కానీ కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కృతి, మమిత కూడా ఈ చిత్రం నుంచి వైదొలిగారు. అయితే సూర్య, కృతి శెట్టి ఎందుకు తప్పుకున్నారనే విషయం చెప్పకుండా సైలెంట్‌గా వారి పనిలో బిజీ అయిపోయారు. మమిత మాత్రం దర్శకుడు బాల తనను కొట్టాడని, అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత మమిత మాట మార్చింది. మీడియా తన మాటలను వక్రీకరించిందని చెప్పింది.నా కూతురు లాంటిది: బాలతాజాగా ఈ విషయంపై దర్శకుడు బాల కూడా స్పందించారు. మమితను కొట్టానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. షూటింగ్ సమయంలో ఓవర్ మేకప్ వేసుకొని వస్తేఏ.. ‘ఎందుకు మేకప్ వేసుకున్నావ్?’ అంటూ కొట్టేలా చేయి పైకిఎత్తేవాడినని..అంతేకాని ఆమెపై చేయి చేసుకోలేదని చెప్పారు. మమితా తనకు బిడ్డలాంటిదని..ఒక మహిళను నేను ఎందుకు కొడతాను ’ అని బాల అన్నారు. -
సమంత, సాయి పల్లవి బాటలోనే మమితా బైజూ
ఒక్క చాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగిన నటీనటులు కష్టపడి అవకాశాలు పొందుతారు. తరువాత ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ కోసం పరితపిస్తారు. అలా ఒక్క సక్సెస్ వస్తే చాలు దాన్ని పట్టుకుని పరుగులు తీస్తుంటారు. ఆ ఒక్క సక్సెస్ వారికి పెద్ద గుర్తింపుగా మారిపోతుంది. ఈ తరువాత ఫ్లాప్స్ వచ్చినా వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. హిట్ చిత్రం గురించే చెప్పుకుంటారు. అలా తెలుగులో సమంతకు ఏమాయ చేసావే చిత్రం కెరీర్లో పెద్ద హిట్‌గా నిలిచింది. అదేవిధంగా మలయాళంలో ప్రేమమ్ చిత్రం సాయిపల్లవికి చిరునామాగా మారింది. ఇలా చాలామందికి తొలి చిత్రం హిట్ పెద్ద ప్లస్‌గా మారుతుంది. దాంతోనే చాలా వరకు కాలాన్ని లాగించేస్తారు. తాజాగా మమితా బైజూ పరిస్థితి అంతే. ఈమె మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాకుండా మమితా బైజూకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అంతే ఆ తరువాత ఇతర భాషల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా ఈమె తమిళంలో నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా రెబల్ అనే ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం నిరాశపరిచినా, ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఆయన చివరి చిత్రంలో నటించే అవకాశాన్ని మమితా బైజూ కొట్టేసింది. ఇప్పుడు ఆ చిత్రంలో విజయ్‌తో దిగిన ఫొటోలను వాడుకుంటోంది. ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ కేరళ కుట్టి మరో తమిళ చిత్ర అవకాశాన్ని దక్కించుకుందన్నది తాజా సమాచారం. యువ క్రేజీ దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్‌తో జతకట్టే చాన్స్‌ను కొట్టేసిందని తెలుస్తోంది. కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఈ తరువాత లవ్‌టుడే చిత్రంతో కథానాయకుడిగానూ, దర్శకుడిగానూ సూపర్‌హిట్ కొట్టారు. ప్రస్తుతం విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. దీంతో పాటు డ్రాగన్ అనే మరో చిత్రం చేస్తున్నారు. తాజాగా ఈయన నటించనున్న చిత్రంలో మమితా బైజూ నాయకిగా నటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
హీరో జీవితంలో జరిగిన మిరాకిల్ ఆధారంగా 'డియర్ కృష్ణ'
అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'డియర్ కృష్ణ'. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజుతో పాటు ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. దినేష్ బాబు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్‌ను ప్రేరణగా తీసుకొని, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోమవారం నాడు నిర్వహించిన ప్రెస్ మీట్లో శ్రీ కృష్ణుడిని ముఖ్య అతిథిగా భావిస్తూ, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీని ఏర్పాటు చేయడం విశేషం.రచయిత, నిర్మాత పి.ఎన్. బలరామ్ మాట్లాడుతూ.. "నేను ఈ సినిమాకి నిర్మాతగా భావించట్లేదు. కృష్ణుడి సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న వ్యక్తిగానే భావిస్తున్నాను. మా కుటుంబమంతా శ్రీ కృష్ణుడిని ఎంతగానో ఆరాధిస్తాము. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. కృష్ణుడి వల్ల మా కుటుంబంలో జరిగిన మిరాకిల్‌నే కథగా తీసుకొని డియర్ కృష్ణ సినిమా రూపొందించాం. అదేంటంటే మా కుమారుడు అక్షయ్ అత్యంత రేర్ డిసీజ్ నుంచి, డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సినిమాలో అక్షయ్‌నే హీరోగా నటించాడు. ఈ చిత్రం కోసం మేము స్టార్స్‌ను తీసుకోవాలనుకోలేదు. ఎందుకంటే కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్. మమ్మల్ని, మా సినిమాని కృష్ణుడే నడిపిస్తాడు" అన్నారు.కథానాయకుడు అక్షయ్ మాట్లాడుతూ, "మా నాన్న నాకు జన్మని ఇవ్వడమే కాదు, పునర్జన్మను కూడా ఇచ్చారు. ఆయన వల్లే నేనీ రోజు మీ ముందున్నాను. దళపతి విజయ్ గారి 69 వ సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల మమిత ఈ ప్రెస్ మీట్ కి రాలేకపోయింది. త్వరలో జరిగే ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఆమె పాల్గొంటుంది" అన్నారు.గీత రచయిత గిరిపట్ల మాట్లాడుతూ.. " ఈ సినిమాలో మూడు పాటలు రాసే లభించింది. అందులో ఒక పాటను లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు. హరి ప్రసాద్ సంగీతం అందించగా, దినేష్ బాబు సినిమాటోగ్రాఫర్‌గా, రాజీవ్ రామచంద్రన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట ఈ సినిమాలోనిదే కావడం విశేషం. 'చిరుప్రాయం' అంటూ సాగే ఈ పాట ఇప్పటికే విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. -
ఓనం స్పెషల్.. మలయాళ బ్యూటీస్ మామూలుగా లేరు!
మలయాళీలు ఎంతో ఇష్టంగా జరుపుకొనే ఓనం వచ్చేసింది. కేరళలో అందరూ వేడుకగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరీ మలయాళ బ్యూటీస్ ఊరుకుంటారా? పద్ధతైన చీరల్లో మెరిసిపోయారు. అందమే అసూయపడేలా ధగధగాలాడిపోయారు. అనుపమ, అమలాపాల్, కల్యాణి ప్రియదర్శన్, మాళవిక మోహనన్, హనీరోజ్, మమిత బైజు.. ఇలా అందరూ తమ అందంతో మాయ చేసేస్తున్నారు. ఆ ఫొటోలపై మీరు లుక్కేసేయండి.(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by @studio.omal View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by NAMITHA PRAMOD (@nami_tha_) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) View this post on Instagram A post shared by Sanjana Singh (@actresssanjana) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Anjali Nair (@ianjali.nair) View this post on Instagram A post shared by Anna Ben 🌸 (@benanna_love) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) View this post on Instagram A post shared by Ammu_Abhirami (@abhirami_official) View this post on Instagram A post shared by Saniya Iyappan (@_saniya_iyappan_) View this post on Instagram A post shared by Femina⚡️George (@feminageorge_) -
కాబోయే అక్కినేని కోడలు శోభిత స్టన్నింగ్ లుక్స్.. పెళ్లికూతురిలా ప్రేమలు హీరోయిన్!
కాబోయే అక్కినేని కోడలు శోభిత స్టన్నింగ్ లుక్స్ పెళ్లికూతురిలా ముస్తాబైన ప్రేమలు హీరోయిన్ బ్లూ శారీలో కీర్తి సురేశ్ హోయలు.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
విజయ్ 69వ చిత్రంలో మలయాళ బ్యూటీ?
నటుడు విజయ్ కథానాయకుడిగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం గోట్. ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రాన్ని సెపె్టంబర్ 5న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో విజయ్ తన 69వ చిత్రంపై దృష్టి పెడుతున్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్‌కి ఇదే చివరి చిత్రం అనే ప్రచారం చాలాకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం తన రాజకీయ జీవితానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని ఆయన భావించినట్లు సమాచారం. కాగా దర్శకుడు హెచ్.వినోద్ నటుడు కమలహాసన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. అందుకు కథను కూడా తయారు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం డ్రాప్ అయ్యిందని తెలిసింది. అయితే అదే కథతో విజయ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి హెచ్.వినోద్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కథ సమకాలీన రాజకీయలు ఇతి వృత్తంగా ఉంటుందని, అందుకే విజయ్ ఈ చిత్రం చేయడానికి అంగీకరించినట్లు టాక్. ఏదేమైనా ఈ చిత్రానికి సంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను దర్శకుడు హెచ్.వినోద్ ప్రారంభించారనీ నవంబర్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంలో లుక్ కోసం నటుడు విజయ్‌తో ఇటీవల ఫొటో సెషన్ చేసినట్లు తెలిసింది. దీంతో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా ఇందులో సంచలన నటి సమంత ప్రధాన పాత్రను పోషించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మలయాళ కుట్టి మమితా బైజూ ఇందులో విజయ్‌తో కలిసి నటించనున్నారనే టాక్ వైరల్ అవుతోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కేరళ కుట్టి ప్రేమలు అనే మలయాళ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. కాగా విజయ్ సరసన నటించే అవకాశం వచ్చిందంటే నిజంగా ఆమె లక్కే అని చెప్పాలి. కాగా కేవీఎన్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. -
విజయ్ చివరి సినిమాలో మలయాళ బ్యూటీకి ఛాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- వెంకట్‌ప్రభు కాంబినేషన్లో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం గోట్. ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రాన్ని సెప్టెంబర్ 5న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో విజయ్ తన 69వ చిత్రంపై దృష్టి పెడుతున్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్‌కి ఇదే చివరి చిత్రం అనే ప్రచారం చాలాకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.దీంతో ఈ చిత్రం తన రాజకీయ జీవితానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని ఆయన భావించినట్లు సమాచారం. కాగా దర్శకుడు హెచ్.వినోద్ నటుడు కమలహాసన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. అందుకు కథను కూడా తయారు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం డ్రాప్ అయ్యిందని తెలిసింది. అయితే అదే కథతో విజయ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి హెచ్.వినోద్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కథ సమకాలీన రాజకీయలు ఇతి వృత్తంగా ఉంటుందని, అందుకే విజయ్ ఈ చిత్రం చేయడానికి అంగీకరించినట్లు టాక్. ఏదేమైనా ఈ చిత్రానికి సంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను దర్శకుడు హెచ్.వినోద్ ప్రారంభించారనీ నవంబర్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం.ఈ చిత్రంలో లుక్ కోసం నటుడు విజయ్‌తో ఇటీవల ఫొటో సెషన్ చేసినట్లు తెలిసింది. దీంతో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా ఇందులో సంచలన నటి సమంత ప్రధాన పాత్రను పోషించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మలయాళ కుట్టి మమితా బైజూ ఇందులో విజయ్‌తో కలిసి నటించనున్నారనే టాక్ వైరల్ అవుతోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కేరళ కుట్టి ప్రేమలు అనే మలయాళ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. కాగా విజయ్ సరసన నటించే అవకాశం వచ్చిందంటే నిజంగా ఆమె లక్కే అని చెప్పాలి. కాగా కేవీఎన్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. -
విష్ణు విశాల్‌కు జంటగా.. 'మమిత బైజూ'
ఏ యాక్టర్‌కైనా బ్రేక్ అనేది ఒక చిత్రంతోనే వస్తుంది. ఆ తరువాత వారి లైఫే మారిపోతుంది. ఇలా చాలా మంది హీరోహీరోయిన్ల జీవితంలో జరిగింది. అలా ప్రేమలు అనే మలయాళ చిత్రంతో నటి మమిత బైజూ లైఫే మారిపోయింది. ఆ చిత్రం మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు వంటి దక్షిణాది భాషల్లోనూ అనువాదం అయ్యి మంచి వసూళ్లను సాధించింది.ఆ విషయం పక్కన పెడితే అందులో నాయకిగా నటించిన మమిత బైజూకు పిచ్చ క్రేజ్ వచ్చింది. దీంతో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా తమిళంలో ఇప్పటికే జీవీ ప్రకాశ్ కుమార్‌కు జంటగా రెబల్ చిత్రంలో నటించారు. తాజాగా విష్ణు విశాల్‌తో రొమాన్స్ చేస్తున్నట్లు సమాచారం. విష్ణు విశాల్ ప్రస్తుతం రామ్‌కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన రాక్షసన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.దీంతో తాజాగా దర్శకుడు రామ్‌కుమార్, విష్ణు విశాల్ కలిసి మరో చిత్రం చేస్తున్నారు. ఇందులోనే నటి మమిత బైజూ నాయకిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇది నటుడు విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్న 21వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటి మమిత బైజూ దీంతో పాటు మరో తమిళ చిత్రంలోనూ నటిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ కేరళా కుట్టి కోలీవుడ్‌లో బాగానే పాగా వేస్తున్నారన్న మాట. -
'ప్రేమలు' బ్యూటీ బర్త్ డే స్పెషల్.. రేర్ అండ్ క్యూట్ ఫొటోలు
-
ప్రదీప్ రంగనాథన్‌తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
ఏ రంగంలోనైనా లక్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. సహాయ దర్శకుడిగా ఎలాంటి కష్టాలు పడ్డారో తెలియదుగానీ, దర్శకుడైన తరువాత ప్రదీప్ రంగనాథన్‌కు లక్ తేనె తుట్టులా పట్టుకుంది. ఈయన జయంరవి కథానాయకుడిగా నటించిన కోమాలి అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెండో చిత్రంతోనే కథానాయకుడిగా అవతారమెత్తి స్వీయ దర్శకత్వంలో లవ్ టుడే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతే వరుసగా హీరో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో నటిస్తున్న ఎల్ఐసీ చిత్రం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం హోరేత్తుతోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం డ్రాగన్. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాకముందే అశ్వంత్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలోనే ఆయన సరసన ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్లు రొమాన్స్ చేయనున్నారని తాజా సమాచారం. అందులో ఒకరు అనుపమా పరమేశ్వరన్, మరొకరు మమితా బైజు అని తెలిసింది. వీరిద్దరూ ఇటీవల మంచి హిట్ కొట్టి మంచి జోరుమీద ఉన్నారన్నది గమనార్హం. అనుపమా పరమేశ్వరన్ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ చిత్ర సక్సెస్ జోష్‌లో ఉంటే మమితా బైజు మలయాళ చిత్రం ప్రేమలు చిత్ర హిట్ క్రేజ్‌లో ఉన్నారు. డ్రాగన్ చిత్రం కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ రెండో షె డ్యూల్ త్వరలో చైన్నె, హైదరాబాద్ ప్రాంతాల్లో జరగనుందని సమాచారం. -
'ప్రేమలు' హీరోయిన్‌కి చేదు అనుభవం.. ఊపిరాడనివ్వలేదు!
'ప్రేమలు' సినిమాతో మనకు బాగా నచ్చేసిన మలయాళ బ్యూటీ మమిత బైజు. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అప్పటివరకు కేరళలో మాత్రం ఈమెకు ఫ్యాన్ బేస్ ఉండేది. 'ప్రేమలు' తర్వాత దక్షిణాదిలో ఈమెకు చాలామంది అభిమానులు అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా మమిత, చెన్నై వెళ్లగా ఈమెకు ఊపిరి ఆడనివ్వకుండా చేసి పడేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న మమిత బైజు.. 'ప్రేమలు' మూవీతో లీడ్ యాక్టర్‌గా ఫేమ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలోని ఓ జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చింది. అయితే ఊహించని విధంగా చాలామంది కుర్ర అభిమానులు అక్కడికి వచ్చేశారు. కనీసం షాప్ లోపలికి కూడా మమిత వెళ్లకుండా ఇబ్బంది పెట్టేశారు.ఎలాగైతేనేం బౌన్సర్ల సహాయంతో షాప్ లోపలికి మమిత వెళ్లింది. కానీ ఆమె మొహంలో ఇదెక్కడి అభిమానం రా బాబు అనే భయం మాత్రం కనిపించింది! ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కొన్నాళ్ల ముందు కాజల్ అగర్వాల్‌కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే)'#Premalu' actress #MamithaBaiju mobbed at Chennai mall. pic.twitter.com/3TJMxHLwRL— Films Spicy (@Films_Spicy) June 3, 2024Craze for #MamithaBaiju 💥🥰 pic.twitter.com/GxoPfcqKPM— VCD (@VCDtweets) June 2, 2024 -
ప్రేమలు బ్యూటీ 'మమితా బైజూ'కు మరో ఛాన్స్
ఏ రంగంలోనైనా విజయమే కొలమానం. అది లేకపోతే ప్రతిభ ఉంత ఉన్నా శూన్యమే. అందుకే ఒక్క హిట్ కోసం పోరాటం చేస్తుంటారు. అలా మాలీవుడ్ యువ నటి మమితా బైజూ కోలీవుడ్ దృష్టిని తనపై తిప్పుకుంటోందనే చెప్పాలి. కేరళా కుట్టి తన 15వ ఏటనే నటిగా రంగప్రవేశం చేసింది. అంటే 2017 ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం సర్పోపరి పాలక్కారన్. ఆ చిత్రం సక్సెస్‌తో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా ఇటీవల ఆమె నటించిన 'ప్రేమలు' చిత్రం మలయాళంలో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ అనువాదం అయ్యి సూపర్‌హిట్ అయ్యింది. ముఖ్యంగా 22 ఏళ్ల పరువాల బ్యూటీ మమితా బైజూ నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈమె పై కోలీవుడ్ దృష్టి పడింది. అలా రెబల్ చిత్రంతో ఒక్కడ పరిచయం అయ్యింది. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ మమితాబైజూకి అవకాశాలు వస్తున్నాయి. అలా తాజాగా మరో లక్కీ ఛాన్స్‌ను ఈ కేరళా కుట్టి కొట్టేసిందని సమాచారం. ఈమె యువ నటుడు , దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాధన్, లవ్‌టుడే చిత్రంతో హీరోగానూ రంగప్రవేశం చేసి సూపర్‌హిట్ కొట్టారు. ప్రస్తుతం ఈయన ఎల్ఐసీ, డ్రాగన్ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. కాగా తదుపరి ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్న చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించనున్నారని, ఆయనకు జంటగా నటి మమితా బైజూ నటించడానికి ఎంపిక అయినట్లు సమాచారం. దీనికి దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని కోడంబాక్కం వర్గాల సమాచారం. -
ప్రేమలు హీరోయిన్ మమితా బైజు క్యూట్ పిక్స్
-
చీరలో 'ప్రేమలు' మమిత అలా.. ముక్కెరతో సుప్రీత ఇలా!
కాటన్ చీరలో 'ప్రేమలు' బ్యూటీ మమిత గ్లామర్ టచ్అందాల విందుతో అబ్బా అనిపిస్తున్న నభా నటేశ్కొంగు చాటు పోజుల్లో బిగ్ బాస్ భామ రతికా రోజ్నవ్వుతూ మాయలో పడేస్తున్న హాట్ బ్యూటీ సుప్రీతచీరకట్టులో మహాలక్ష్మిలా కనిపిస్తున్న బిగ్ బాస్ ప్రియాంకగ్లామర్ ట్రీట్ ఇచ్చిన రాగిణి ద్వివేది.. చూస్తే మెంటలే View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Karishma Kotak (@karishmakotak26) View this post on Instagram A post shared by Rathika Ravinder (@rathikaravinder) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by ESSHANYA S MAHESHWARI (@esshanya_s_maheshwari) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) View this post on Instagram A post shared by Pragya Nayan Sinha (@pragyanayans) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Sanchana Natarajan (@sanchana.natarajan) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Ragini Dwivedi (@rraginidwivedi) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Tarun Koliyot (@tarunkoliyot) -
చీరలో ప్రేమలు బ్యూటీ హుయలు
-
ప్రేమలు బ్యూటీ అసలు పేరేంటో తెలుసా? చిన్న పొరపాటు..
మమితా బైజు.. ఇప్పటివరకు 15కు పైగా సినిమాలు చేసింది. కానీ సౌత్‌లో ఒక్కసారిగా ట్రెండ్ అయింది మాత్రం 16వ సినిమా ప్రేమలుతోనే! ఇప్పటివరకు అన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ప్రేమలు మూవీతో వచ్చింది. ప్రస్తుతం రెబల్ మూవీతో తమిళంలో ఎంట్రీ ఇవ్వనుంది. అసలు పేరు అది కాదు!తెలుగులోనూ అవకాశాలు తలుపుతడుతున్నాయి. అయితే ఈమె అసలు పేరు మమిత కాదట.. నమిత! హాస్పిటల్ సిబ్బంది బర్త్ సర్టిఫికెట్లో ఎన్ అనే అక్షరానికి బదులుగా ఎమ్ అని రాసేశారు. దీంతో నమిత కాస్త మమిత అయిపోయింది. పేరెంట్స్ కూడా దీన్నసలు చూసుకోనేలేదు.ఒక్క అక్షరంబడిలో చేర్పించే సమయంలో మమిత అని పడిందని గమనించారు. అయినా ఈ పేరు కూడా బానే ఉందని అలాగే ఉంచేశారు. మమిత అంటే మలయాళంలో మిఠాయి అని అర్థం. ఈ విషయాన్ని ప్రేమలు బ్యూటీయే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక్క పొరపాటుతో తన జాతకమే మారిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారుచదవండి: ఓటీటీల్లోకి ఏకంగా 17 మూవీస్.. ఆ రెండు స్పెషల్ -
ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
హీరోయిన్ కావాలంటే గ్లామర్ చూపించాలి. డ్యాన్స్ చేయాలి. అందంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ వాటితో అవసరం లేకుండా కొందరు స్టార్స్ అవుతుంటారు. ఈ పాప కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. ఎందుకంటే సహాయ నటిగా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఈ మధ్య ఓ మూవీతో హిట్ కొట్టి కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు మమిత బైజు. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. రీసెంట్గా 'ప్రేమలు' సినిమాలో హీరోయిన్ ఈమెనే. ఇది మమిత చిన్నప్పటి ఫొటో. ఇందులో నాన్నతో కలిసి అమాయకంగా చూస్తోంది కదా! చిన్నప్పటి నుంచి అదే క్యూట్‌నెస్ మెంటైన్ చేస్తూ వచ్చింది. సేమ్ ఇలాంటి ఫొటోనే ఇప్పుడు కూడా ఒకటి తీసుకుంది. దిగువన ఉన్న ఫొటో అదే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)కేరళలోని కిడంగూర్ అనే ఊరిలో పుట్టి పెరిగిన మమిత.. ప్రస్తుతం సైకాలజీ డిగ్రీ చదువుతోంది. ఓవైపు చదువుతూ మరోవైపు సినిమాల్లో నటించేస్తోంది. 2017లో 'సర్వోపరి పాలక్కరన్' అనే మలయాళ మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. అనంతరం పలు చిత్రాలు చేసింది. కానీ 'కోకో' అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈమెకు గుర్తింపు దక్కింది. 'సూపర్ శరణ్య', 'ప్రణయ విలాసం' చిత్రాలతో హీరోయిన్ అయిపోయింది. 'ప్రేమలు'తో సోలో హీరోయిన్గా సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.మమిత బైజు వ్యక్తిగత విషయానికొస్తే.. తండ్రి డాక్టర్, తల్లి హౌస్ వైఫ్, ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈమె వయసు 22 ఏళ్లే. కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అలానే 'ప్రేమలు' హిట్ వల్ల విజయ్ దేవరకొండ కొత్త మూవీలోనూ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని అన్నారు. కానీ అందులో నిజం లేదని తెలిసిపోయింది. (ఇదీ చదవండి: క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) -
అఫీషియల్: 'ప్రేమలు' సీక్వెల్.. రిలీజ్ కూడా చెప్పేశారు
సంక్రాంతి తర్వాత అన్ని సినీ ఇండస్ట్రీల్లో డల్ ఫేజ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం, జనాల్ని మెప్పించే చిత్రాలు సరిగా రావట్లేదు. కానీ మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తున్నాయి. అన్ సీజన్ ఫిబ్రవరిలోనే ఏకంగా నాలుగు హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటే 'ప్రేమలు'. మలయాళంతో పాటు తెలుగులోనూ యువతని ఆకట్టుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ చేశారు. (ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!) అవును మీరు విన్నది నిజమే. పెద్దగా కథ కాకరకాయ లాంటిది ఏం లేకపోయినా స్క్రీన్ ప్లేలో ఫన్ ఎలిమెంట్స్ జోడించడంతో 'ప్రేమలు'.. మలయాళంలో పెద్ద హిట్టయిపోయింది. తెలుగులోనూ రిలీజ్ చేస్తే రూ.17 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. సినిమాలో కథంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ కావడం ప్లస్ ట్రెండ్‌కి తగ్గ డైలాగ్స్ అన్నీ ఉండటం మనోళ్లకు నచ్చేసింది. అయితే కొందరు తెలుగు ఆడియెన్స్‌కి మాత్రం ఇది పెద్దగా నచ్చలేదు. మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2025లో రిలీజ్ ఉంటుందని కూడా చెప్పేసింది. తొలి భాగంలా కాకుండా ఈసారి తెలుగు, తమిళ, మలయాళంలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. పోస్టర్స్ తో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే తొలి భాగం.. హీరో పాత్రధారి యూకే వెళ్లడంతో ముగుస్తుంది. మరి సీక్వెల్ స్టోరీ యూకేలో ఉంటుందా? మళ్లీ హైదరాబాద్ లోనే ఉంటుందా అనేది చూాడాలి. అలానే ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కదా అని త్వరగా సీక్వెల్ తీసేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి? (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) View this post on Instagram A post shared by Dileesh Pothan (@dileeshpothan) -
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రూ. 40 కోట్ల సినిమా
మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజు పేరు బాగా వైరల్ అయింది. ఈ సినిమాతో తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ఆమె రేంజ్ మారిపోయింది. ప్రేమలు సినిమా తర్వాత కోలీవుడ్‌లో ఈ బ్యూటీ నటించిన రెబల్ మార్చి 22న విడుదలైంది. ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్లో 'రెబెల్' అనే సినిమాను తమిళ్లో నిర్మించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్‌గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'రెబల్' చిత్రంలో మమితా బైజు- జీవీ.ప్రకాశ్‌కుమార్ జోడీగా నటించారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా రెబల్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమళ్, తెలుగులో ఈ సినిమా అందుబాటులో ఉంది. రెబెల్ సినిమా విషయానికి వస్తే.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంటి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దీంతో ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెబల్ సినిమాకు విడుదలైన మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన వినిపించినప్పటికీ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కడంతో ఫర్వాలేదు అనిపించింది. ఈ వీకెండ్లో మంచి టైమ్‌పాస్ కలిగించే సినిమాగా రెబల్ ఉంటుందని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Studio Green (@studiogreen_official) -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'ప్రేమలు' సినిమా
మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'ప్రేమలు'. అక్కడ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాను తెలుగులో అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. . తెలుగు వెర్షన్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రస్తుతం ఓటీటీ విడుదల తేదీ విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ప్రేమలు సినిమా ఓటీటీలోకి వచ్చే విషయంలో ఇప్పటికే పలుమార్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ లవ్ స్టోరీస్ ఆధారంగా నస్లేన్ కె.గఫూర్, మాథ్యూ థామస్, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఎ.డి. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం రూ. 3కోట్లతో తెరకెక్కిన ప్రేమలు చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి నిర్మించాడు. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రూ. 135 కోట్ల మార్క్‌ను చేరుకుంది. తెలుగులో కూడా ఇప్పటి వరకు రూ.17 కోట్లు రాబట్టింది. ఏప్రిల్ 12 నుంచి ఈ చిత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ప్రేమలు బ్యూటీ 'మమితా బైజు'కు రెబల్ షాక్
మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజు పేరు బాగా వైరల్ అయింది. తెలుగులో కూడా ప్రేమలు పేరుతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా భారీగానే ప్రేక్షకులను మెప్పించింది. కానీ మార్చి 22 ఈ బ్యూటీ నటించిన మరో సినిమా విడుదలైంది. ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్లో 'రెబెల్' అనే సినిమాను కోలీవుడ్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో మమితా బైజు- జీవీ.ప్రకాశ్‌కుమార్ జోడీగా నటించారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు ఉన్న విషయం తెలిసిందే. రెబెల్ సినిమా విషయానికి వస్తే.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంటి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దీంతో ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెబల్ సినిమాకు విడుదలైన మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన వినిపిస్తోంది. రెండు విద్యార్ధి వర్గాల మధ్య మొదలైన సంఘర్షణ రాష్ట్ర రాజకీయాల దాకా విస్తరించడం. ఆపై ర్యాగింగ్, కుల వివక్ష, పొలిటిక్స్ ఇలా అన్ని అంశాలు తెరపై కనిపించడం అయితే బాగుంది కానీ అందుకు తగ్గట్లు నికేష్ ఆర్ఎస్ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని చెప్పవచ్చు. ఈ చిత్రంలో మమితా బైజు పాత్రకు కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీంతో రెబెల్ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగలడం దాదాపు ఖాయం అని అప్పుడు కొందరు లెక్కలేస్తున్నారు. రెబల్ మొదటిరోజు కలెక్షన్స్ తమిళనాడులో రూ. 1.5 కోట్లు,కన్నడలో రూ. 75 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ. 30 లక్షలు మాత్రమే వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. ప్రారంభంలోనే ఇంత పేలవంగా కలెక్షన్స్ ఉంటే ఫైనల్‌గా దారుణమైన నష్టాలు రావడం ఖాయం అని చెప్పవచ్చు. -
ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్.. పారితోషికం పెంచేసిన బ్యూటీ!
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఈ తరం తారలు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. మలయాళ భామ మమితా బైజు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఈ 22 ఏళ్ల బ్యూటీ క్రేజ్ దక్షిణాది మొత్తం వ్యాపిస్తోంది. 2017లో నటిగా రంగప్రవేశం చేయగా.. ఈమె నటించిన కోకో, సూపర్ శరణ్య వంటి మలయాళ చిత్రాలు విజయం సాధించాయి. ఇటీవల ఈ అమ్మడు నటించిన ప్రేమలు మూవీ మలయాళంలోనే కాకుండా, తమిళం, తెలుగు భాషల్లోనూ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఆ సినిమా నుంచి అవుట్ కాగా ఆ మధ్య బాలా దర్శకత్వంలో సూర్యకు జంటగా వణంగాన్ చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యింది. అయితే అనివార్య కారణాల వల్ల సూర్య ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తర్వాత మమితా బైజు కూడా ఆ చిత్రం నుంచి బయటకు వచ్చేసింది. దర్శకుడు బాలా తనను కొట్టారని, చాలా సార్లు తిట్టారని ఆరోపణలు చేసింది. ఈ సంఘటన కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇది తన కెరీర్‌పై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని భయపడిందో ఏమోకానీ వెంటనే మాట మార్చేసింది. దర్శకుడు బాలా ఎప్పుడూ కొట్టలేదని, ఆయన దర్శకత్వంలో నటించిన సమయంలో చాలా నేర్చుకున్నానని, ఇతర చిత్రాల కారణంగా వణంగాన్ చిత్రం నుంచి తప్పుకోవలసి వచ్చిందని కవర్ చేసింది. క్రేజీ హీరోయిన్గా.. ప్రస్తుతం ఈమె జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా రెబల్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శుక్రవారం తెరపైకి రానుంది. తదుపరి నటుడు విష్ణువిశాల్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రేమలు మూవీ తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది. దీంతో మమితా బైజు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా మారనున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటోంది బ్యూటీ. మరిన్ని అవకాశాలు వస్తుండటంతో ఈ అమ్మడు తన పారితోషికాన్ని పెంచేసినట్లు టాక్. ఇప్పటివరకు ఒక్క సినిమాకు రూ. 30 లక్షలు పుచ్చుకుందట. దాన్ని కాస్తా రూ.50 లక్షలు చేసిందని ప్రచారం నడుస్తోంది. చదవండి: తమన్నా..పెళ్లెప్పుడో? -
అరె.. ఏంట్రా ఇదీ.. మరీ ఓవర్‌గా లేదూ..!
ఈ మధ్య జనాలకు పిచ్చి ముదురుతోంది. అందుకు ఇప్పుడు చెప్పుకునే సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రేమలు అనే మూవీ మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇంకేముంది.. ఈ చిత్రాన్ని వెంటనే తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా దీనికి మంచి స్పందన లభించింది. సినిమా క్లిక్ అవడంతో హీరోయిన్ మమిత బైజుకు బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయట. ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేస్తుండగా మరో సినిమాకు ఓకే చెప్పేసిందట! ఇకపోతే హైదరాబాద్‌లో జరిగిన ప్రేమలు సక్సెస్‌మీట్‌లో ఓ మీమర్ అతి చేశాడు. సినిమా చూసి పెద్ద అభిమాని అయిపోయానంటూ స్టేజీపైనే మమితకు హారతి ఇచ్చాడు. ఈ రకమైన అభిమానం తొలిసారి చూస్తున్నానంటూ నవ్వేసింది హీరోయిన్. అయితే ఇది చూసిన జనాలు మాత్రం.. కాస్త కాదు.. చాలా అతిగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఒక్క సినిమాకే గుండెలో గుడి కట్టేశావా? పైగా హారతి కూడా రెడీ చేసుకున్నావంటే ముందే అంతా ప్లాన్ చేసుకున్నట్లేగా.. ఎందుకింత ఓవరాక్షనో.. మరీ జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు.. ఫేమస్ అవడానికి ఇలాంటి డ్రామాలు చేయడం అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. కొందరు మాత్రం మా హీరోయిన్ ఎంత క్యూట్‌గా నవ్వుతుందో.. ఇంతటి గ్రాండ్ వెల్కమ్ మరెవరికీ దక్కలేదని మురిసిపోతున్నారు మమిత ఫ్యాన్స్. Direct ga "Aarathi" ivvatam entraaa🤣❤️🔥#MamithaBaiju craze😍🔥 pic.twitter.com/5OAtrOlJz8 — Anchor_Karthik (@Karthikk_7) March 15, 2024 చదవండి: జీవితం ఎటు పోతోందో.. హృదయం ముక్కలయ్యాక.. -
రాజమౌళి మెచ్చిన నటి మమితా బైజు గురించి ఈ విషయాలు తెలుసా?
-
మరో ఆఫర్ అందుకున్న మలయాళ సెన్సేషన్
కోలీవుడ్‌లో కథానాయకుడిగా, నిర్మాతగా తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంసాదించుకున్నాడు హీరో విష్ణువిశాల్. ఈయన ఇంతకు ముందు కథానాయకుడిగా నటించిన రాక్షసన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు రామ్‌కుమార్.. విష్ణువిశాల్‌తో మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. ఇది విష్ణువిశాల్ నటిస్తున్న 21వ చిత్రం అవుతుంది. ఇటీవలే షూటింగ్ మొదలవగా.. హీరోయిన్ ఎవరన్నది వెల్లడించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మలయాళ నటి మమితా బైజు నటించనున్నట్లు ఆమె ఫొటో వైరలవుతోంది. ఆల్రెడీ ఆమె షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఈమె ఇటీవల వచ్చిన మలయాళ చిత్రం ప్రేమలుతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇప్పటికే ఆమె కోలీవుడ్‌లో జీవీ.ప్రకాశ్‌కుమార్ సరసన రెబల్ చిత్రంలో నటించింది. ఈమె నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. ఇది ఈ నెల 15వ తేదీన తెరపైకి రానుంది. తాజాగా ఇప్పుడు విష్ణువిశాల్ సరసన నటించే అవకాశం ఈ భామను వరించిందన్న మాట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్‌కుమార్.. రాక్షసన్ చిత్రానికి భిన్నంగా ప్రేమతో కూడిన ఫాంటసీ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చదవండి: ధనుష్ మా కుమారుడే అంటూ పిటిషన్.. తీర్పు ఇచ్చిన కోర్టు -
బాధతో ఆ విషయం ఒప్పుకొంటున్నా: డైరెక్టర్ రాజమౌళి
పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి.. 'ప్రేమలు' అనే డబ్బింగ్ సినిమాను తెగ పొగిడేశారు. ఇందులో యాక్టర్స్ ఒక్కొక్కరి గురించి డీటైల్డ్‌గా మాట్లాడారు. ఈ క్రమంలోనే మలయాళ యాక్టర్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ఓ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నానని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరోయిన్ కొత్త సినిమా.. రిలీజ్‌కి రెడీ) 'కొంచెం జెలసీ, బాధతో ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్ప యాక్టర్స్‌ని ఇస్తూ ఉంటుంది. అక్కడ నటించే వాళ్లంతా చాలా బాగా నటిస్తారు. అలానే ఈ సినిమాలో చేసిన నస్లెన్, మమిత, శ్యామ్ మోహన్, సంగీత ప్రతాప్.. తమ యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. మేం యాక్షన్ సీన్స్‌తో చాలా కష్టపడుతుంటాం. కానీ వీళ్లు చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో థియేటర్లలో విజిల్స్ అందుకుంటున్నారు. హీరోయిన్ మమిత అయితే.. 'గీతాంజలి'లో గిరిజ, ఆ తర్వాత వచ్చిన సాయిపల్లవిని గుర్తు చేసింది' అని రాజమౌళి అన్నారు. ఈ సినిమాని తెలుగులో ఎంత తన కొడుకు కార్తికేయ రిలీజ్ చేసినా సరే రాజమౌళి నుంచి ఈ రేంజు ప్రశంసలు వస్తాయని మాత్రం 'ప్రేమలు' టీమ్ ఊహించి ఉండరు. అలానే రాజమౌళి కామెంట్స్‌తో మలయాళ యాక్టర్స్ కూడా గాల్లో తేలుతూ ఉంటారేమో. అయితే యాక్టింగ్ పరంగా మలయాళీస్ బెస్ట్ అయి ఉండొచ్చు కానీ ఆడియెన్స్ పరంగా తెలుగోళ్లని కొట్టేవాళ్లు ప్రపంచంలోనే లేరని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 'లవర్' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు
సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన సినిమాల గురించి కంటే కానీ కొన్నిసార్లు కొత్త లేదంటే చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. తనే స్వయంగా వెళ్లి, చూసి రివ్యూలు ఇస్తుంటాడు. గతంలో పలు తెలుగు చిత్రాల విషయంలో ఇలా చేశాడు. ఇప్పుడు ఓ మలయాళ డబ్బింగ్ చిత్రానికి తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన సినిమా 'ప్రేమలు'. గత నెలలో మలయాళంలో రిలీజ్ కాగా.. శివరాత్రి కానుకగా మార్చ 8న తెలుగు డబ్బింగ్ విడుదల చేశారు. దీన్ని స్టార్ డైరెక్టర్ కొడుకు కార్తికేయ.. తెలుగులోకి తీసుకొచ్చాడు. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తీసిన ఈ చిత్రానికి మన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ కూడా పెట్టారు. (ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఇప్పుడు ఈ సినిమాని మహేశ్ బాబు చూశారు. తనదైన స్టైల్లో ఎలా ఉందో చెప్పేశారు. ''ప్రేమలు'ని తెలుగులోకి తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ కార్తికేయ. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాం. గతంలో ఎప్పుడూ ఇంతలా నవ్వుకున్నానో గుర్తులేదు. నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ ఈ మూవీ నచ్చింది. అందరూ టాప్ క్లాస్ యాక్టింగ్ చేశారు. చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్' అని మహేశ్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన మహేశ్.. కలెక్షన్స్ అయితే సాధించాడు. సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చలేదు. ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మేలో లాంచ్ ఉంటుందని, వచ్చే ఏడాది నుంచి షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: బ్లాక్ బస్టర్ సినిమా పరువు తీసిన ప్రముఖ రచయిత) Thank you @ssk1122 for bringing #Premalu to the Telugu audience... Thoroughly enjoyed it…. Can't remember the last time when I laughed so much while watching a film… The entire family loved it 😁 Top class acting by all the youngsters 🤗🤗🤗Congratulations to the entire team!! — Mahesh Babu (@urstrulyMahesh) March 12, 2024 -
'ప్రేమలు' హీరోయిన్ కొత్త సినిమా.. రిలీజ్‌కి రెడీ
'ప్రేమలు' అనే సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన మమిత బైజు.. ఇదే మూవీ డబ్బింగ్ వెర్షన్‌తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా మాయలో పడేసింది. ఈమె హీరోయిన్గా నటించిన తమిళ సినిమా 'రెబల్'. ఇందులో జీవీ ప్రకాశ్ కుమార్ హీరో. మార్చి 22న థియేటర్లలో రిలీజ్ కానుంది. నికేశ్ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. టీమ్ అంతా పలు ఆసక్తికర విషయాల్ని చెప్పారు. (ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) తమిళం గురించి బలంగా చెప్పే చిత్రం ఇది అని, దర్శకుడు నికేశ్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఓ కథ రాసుకున్నాడని, అలా తీసిన సినిమానే 'రెబల్' అని హీరో జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పారు. ఇందులో హీరోయిన్గా మమితా బైజూ చాలా చక్కగా నటించిందని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) -
'ప్రేమలు' సినిమా రివ్యూ
సంక్రాంతి తర్వాత తెలుగులో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం రాలేదు. వచ్చిన వాటిలో ఒకటి రెండు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి గానీ మరీ అంత హిట్ కాలేదు. మరోవైపు మలయాళంలో రీసెంట్గా వరసపెట్టి మూవీస్ ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. అందులో ఒకటే 'ప్రేమలు'. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ మలయాళ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఇది ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం. కథేంటి? సచిన్(నస్లేన్) ఇంజనీరింగ్ పూర్తిచేసిన కుర్రాడు. యూకే వెళ్ళాలనేది ప్లాన్. వీసా రిజెక్ట్ అవ్వడంతో, ఇంట్లో ఉండటానికి ఇబ్బంది పడుతుంటాడు. అదే టైంలో ఫ్రెండ్ అమూల్ (సంగీత్ ప్రతాప్) చెప్పడంతో ఇద్దరు కలిసి గేట్(GATE) కోచింగ్ కోసం హైదరాబాద్‌కి వస్తారు. ఓ పెళ్ళిలో రీను(మమిత బైజు)ని చూసి సచిన్ ఇష్టపడతాడు. అనుకోకుండా వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమ విషయాన్ని రీనుకి సచిన్ చెప్పేస్తాడు. కానీ ఆమె రిజెక్ట్ చేస్తుంది. మరి ఈ ప్రేమకథ కంచికి చేరిందా? చివరకు ఏమైందనేదే 'ప్రేమలు' స్టోరీ. ఎలా ఉంది? ప్రేక్షకులకు సినిమా నచ్చాలంటే కథే ఉండాలా ఏంటి? అవును ఈ మూవీలో కథ గిదా ఏం ఉండదు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అబ్బాయి, సాప్ట్వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి.. అస్సలు పరిచయం లేని ఈ ఇద్దరూ లవ్‌లో పడితే ఏమైందనేదే 'ప్రేమలు'. చెప్పుకుంటే ఓస్ ఇంతేనా అన్నట్టు వుంటది గానీ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. ఇది మాత్రం గ్యారంటీ. తెలిసిన కథల్ని, అదీ ప్రేమ కథల్ని చెప్పడం కత్తి మీద సాము. కానీ 'ప్రేమలు' డైరెక్టర్ చాలా తెలివిగా స్టోరీ కంటే ఫన్నీ సీన్స్‌తో ఆడియెన్స్‌ని నవ్వించాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సచిన్, రీనూ పాత్రలకు యూత్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఆయా పాత్రల్లో తమని తాము చూసుకుంటారు. అమాయకత్వం, లేత లేత ప్రేమ.. వీటితో పాటు ఈ సినిమాలో చూపించిన హైదరాబాద్ అందాలకు ఇంకా ఫిదా అయిపోతారు. ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, మైండ్ స్పేస్, చార్మినార్, ఖజాగుడా లేక్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్.. ఇలా హైదరాబాద్‌లో ఉన్న చాలా ప్రదేశాల్ని అంతే అందంగా చూపించారు. తెలుగు డబ్బింగ్‌కి వచ్చేసరికి.. ఫేమస్ కుమారి ఆంటీ దగ్గర నుంచి బిగ్‌బాస్ ఫేమ్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రతీ డైలాగ్‌ని వాడేశారు. వన్ లైనర్స్, పంచ్‌లు భలే పేలాయి. సందర్భానికి తగ్గట్టు వచ్చే కామెడీ అయితే వేరే లెవెల్. కథ కావాలి అని వెళ్తే ఈ మూవీ నచ్చదు. అలానే రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో వచ్చే చూడకపోయినా సరే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అర్థం కావు. 'ప్రేమలు' మైనస్సుల విషయానికొస్తే.. ఇది యూత్‌కి మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌కి స్పేస్ లేదు. తెలుగు వెర్షన్ వచ్చేసరికి ఊరి పేర్ల విషయంలో ఒకటి రెండు సీన్లలో కన్ఫ్యూజ్ చేశారు. సో మీ గ్యాంగ్‌తో అయినా సింగిల్‌గా అయినా రెండున్నర గంటలు నవ్వుతూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే గో అండ్ వాచ్ 'ప్రేమలు'. ఎవరెలా చేశారు? సచిన్ పాత్రలో నస్లేన్.. చాలా బాగా చేశాడు. అమాయకత్వం, ప్రేమ, బిడియం, బాధ.. ఇలా అన్ని ఎమోషన్స్‌ని పండించాడు. రీనుగా చేసిన మమిత అయితే చాలా క్యూట్‌నెస్‌తో తనతో ప్రేమలో పడిపోయేలా చేసింది. ఈమె స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారీ ఈమెని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈమె హెయిర్ స్టైల్, డ్రెస్సెస్ కూడా భలే ఉన్నాయి. హీరో ఫ్రెండ్ అమూల్‌గా చేసిన సంగీత్ ప్రతాప్‌ని చూస్తే మనకు ఇలాంటి ఓ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. హీరోయిన్ ని ప్రేమిస్తూ, ఆమెతో పాటు కలిసి పనిచేసే ఆది పాత్రలో చేసిన శ్యామ్ మోహన్.. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కామెడీతో కేక పుట్టించాడు. మిగతా వాళ్ళు ఉన్నంతలో బాగా చేశారు. టెక్నికల్ విషయాలకు వస్తే ఫస్ట్ డైరెక్టర్ గిరీష్‌ని మెచ్చుకోవాలి. క్యూట్ క్యూట్ ప్రేమకథను అంతే క్యూట్‌గా తీశారు. సాధారణంగా మలయాళ సినిమాలంటే అక్కడే ఉంటాయి. కానీ హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకుని ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రాఫర్ అజ్మల్ సభు.. హైదరాబాద్‌ని రోజూ చూసే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చూడాలి అనేంత అందంగా చూపించాడు. విష్ణు విజయ్ పాటలు కథలో కలిసిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టోరీకి తగ్గట్లే ఉంది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'ప్రేమలు'.. మీ మనసు దోచే పెర్ఫెక్ట్ సినిమా. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
హీరోయిన్‌పై చేయి చేసుకున్న డైరెక్టర్.. క్లారిటీ ఇదే!
ఇటీవల యంగ్ హీరోయిన్, మలయాళ భామ మమితా బైజు పేరు వార్తల్లో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన చిత్రం ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మలయాళంలో హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ డైరెక్టర్ తనపై అనవసరంగా చేయి చేసుకున్నారంటూ మమితా ఆరోపించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ దర్శకుడు బాల తెరకెక్కించిన వనంగాన్ సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు రాసుకొచ్చారు. (ఇది చదవండి: డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్) అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై మమితా బైజు స్పందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టి పారేసింది. బాలతో ‘వనంగాన్’ సినిమా కోసం ఏడాది పాటు పని చేసినట్లు తెలిపింది. కానీ ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. నన్ను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. అతను నాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదని.. కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు మమితా వివరించింది. కాగా.. ప్రేమలు సినిమా తెలుగు రైట్స్ రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. ఈ నెల 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలై రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా.. వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
Mamitha Baiju: డైరెక్టర్ చేతిలో చీవాట్లు తిన్న హీరోయిన్ (ఫోటోలు)
-
డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్
మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది ప్రేమలు మూవీ. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రేమలు చిత్రంలో హీరోయిన్గా నటించింది మమిత బైజు. ఈ మూవీ కంటే ముందు వణంగాన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనను దూషించడంతో పాటు కొట్టాడని వెల్లడించింది హీరోయిన్. ఎక్స్పర్ట్లా యాక్ట్ చేయాలి.. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమిత బైజు మాట్లాడుతూ.. వణంగాన్ మూవీలో ఓ సంగీతపరికరాన్ని వాయించే సన్నివేశం ఉంటుంది. నేను అప్పటికే ప్రాక్టీస్ చేసిన అమ్మాయిలా నటించాలా? లేదంటే మొదటిసారి దాన్ని ప్రయత్నిస్తున్నట్లు యాక్ట్ చేయాలా? అని అడిగాను. డైరెక్టర్ బాలా.. అనుభవం ఉన్న కళాకారిణిగా నటించమన్నాడు. అప్పుడు నేను డ్రమ్స్ వాయిస్తూ అనుభవం ఉన్న అమ్మాయిగా పాట పాడాలి అంతేగా అనుకున్నాను. కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు.. కానీ ఇంతలో ఆయన నన్ను ఆపి నా వెనకాల ఉన్న అమ్మాయిని చూపించి అలా చేయమన్నాడు. ఇంతలోనే రెడీ అన్నాడు. నేను షాకయ్యాను. ఎందుకంటే వాళ్లు ఏం పాడుతున్నారో నాకసలు అర్థం కావట్లేదు. మూడు టేకులయ్యాయి. మధ్యలో కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు. అయితే సెట్లో ఎప్పుడైనా కోప్పడతానని, దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని నాకు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి నేను దానికి మానసికంగా రెడీ అయ్యే సెట్లోకి వచ్చాను. కానీ ఆయన దూషణతో ఆగిపోలేదు, కొట్టాడు కూడా! తిట్టడమే కాదు కొట్టాడు కూడా! హీరో సూర్య సర్‌కు ఇదంతా తెలుసు. వారు ఎంతోకాలంగా కలిసి పని చేస్తున్నారు. వారి మధ్య ఆ అనుబంధం ఉంది. కానీ నాకిదంతా కొత్త కదా' అని చెప్పుకొచ్చింది. కాగా వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది.


