
'లవ్‌టుడే', 'డ్రాగన్' సినిమాలతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఇతడు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ప్రేమలు బ్యూటీ మమిత బైజు (Mamitha Baiju) హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 17న రిలీజవుతోంది. ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్ 15న) స్వాగ్ ఈవెంట్ నిర్వహించారు.
హీరోయిన్ జుట్టు పట్టుకుని లాగి..
ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. డ్యూడ్ చిత్రంలో హీరోను బుగ్గగిల్లి క్యూట్‌గా ఫీలవుతుంది మమిత. ఈ సీన్‌ను స్టేజీపై రివర్స్ రోల్స్‌లో చేశారు. మమిత బుగ్గలు గిల్లి, జుట్టు పట్టుకుని లాగి, కొడుతున్నట్లుగా సీన్‌లో లీనమైపోయాడు ప్రదీప్. ఇది క్యూట్‌గా లేదు అని మమిత డైలాగ్ చెప్పింది. వీళ్ల యాక్టింగ్ చూసేవారి ఫీలింగ్ కూడా అదే! అదే విషయాన్ని యాంకర్ బయటకు చెప్పేసింది. ఇది నిజంగానే క్యూట్‌గా లేదమ్మా.. ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి? అని నవ్వేసింది. ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదే వేడుకలో మమిత ఎంతో గ్రేస్‌తో డ్యాన్స్ చేసింది.
చదవండి: యూత్‌కి ప్రేమ సలహాలు.. అబ్బాయిలు.. ఏడ్చినా పర్లేదు, కానీ!