చిత్రపరిశ్రమలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి! | Veteran Kannada Actor MS Umesh Passed Away | Sakshi
Sakshi News home page

విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ హాస్య నటుడు మృతి

Nov 30 2025 2:57 PM | Updated on Nov 30 2025 3:35 PM

Veteran Kannada Actor MS Umesh Passed Away

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్‌ హాస్యనటుడు ఎంఎస్‌ ఉమేష్‌(80) కన్నుమూశారు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం బెంగళూరిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమేష్‌ పూర్తి పేరు.. మైసూర్ శ్రీకాంతయ్య ఉమేష్. 

1960లో చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఉమేష్‌ దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటుడిగా సేవ చేశారు .తన కెరీర్‌ మొత్తంలో 350కిపైగా సినిమాల్లో నటించారు. నాగరహోళె, గురు శిష్యుడు, అనుపమ, కమనబిల్లు, అపూర్వ సంగమం, శృతి సెరిదగ, హాలు జేను, గోల్‌మాల్ రాధాకృష్ణ వంటి చిత్రాలలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. 

'కథా సంగమం'(1975) చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. నటుడిగా  ఆయన చేసిన కృషికిగాను 2013లో కర్ణాటక నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. ఎంఎస్‌ ఉమేష్‌ మరణం పట్ల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌, కేంద్రమంత్రి కుమారస్వామితో పాటు నటీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement