వెంకీ మామ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. మరోసారి ఆ రెండు సినిమాలు! | Venkatesh Nuvvu Naaku Nachav And Pelli chesukundam Movies Re Release Details | Sakshi
Sakshi News home page

వెంకీ మామ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. 18 రోజుల గ్యాప్‌లో రెండు రీరిలీజ్‌లు!

Nov 30 2025 12:28 PM | Updated on Nov 30 2025 12:49 PM

Venkatesh Nuvvu Naaku Nachav And Pelli chesukundam Movies Re Release Details

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా కొనసాగుతుంది. స్టార్‌ హీరోల బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. ఆధునిక సాంకేతికతో 4K ఫార్మాట్‌లో రీమాస్టర్ చేసి, డాల్బీ అట్మాస్ సౌండ్ తో థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇలా రీరిలీజ్‌ చేసిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన చిత్రాలన్నీ వరుసగా రీరిలీజ్‌ అవుతున్నాయి. 

విక్టరీ వెంకటేశ్‌ నటించిన రెండు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు త్వరలోనే మరోసారి థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. అందులో ఒకటి ‘పెళ్ళి చేసుకుందాం’. సుప్రసిద్ధ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని సి.వెంకట్రాజు - శివరాజు సంయుక్తంగా నిర్మించారు. పోసాని కృష్ణమురళి సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రాన్ని సాయిలక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై  వరప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 కె లో భారీ స్థాయిలో డిసెంబర్‌ 13న  విడుదల చేస్తున్నారు.

ఈ మూవీ రిలీజ్‌ అయిన 18 రోజులకే టాలీవుడ్‌ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయిన “నువ్వు నాకు నచ్చావ్” కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కల్ట్‌ క్లాసిక్‌  జనవరి 1, 2026న 4k వెర్షన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రీరిలీజ్‌ కానుంది.

శ్రావంతి రవికిషోర్ గారి నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా,  త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ, డైలాగ్స్ అందించారు. ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ఫ్లోరా షైనీ కీలక పాత్ర పోషించింది. 2001 సెప్టెంబర్ 6న విడుదలై ఈ సినిమా.. బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement