breaking news
nuvvu naaku nachav
-
సంధ్య థియేటర్లో దారుణం.. వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా!
కర్ణాటక బెంగళూరులోని సంధ్య థియేటర్లో దారుణం చోటు చేసుకుంది. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల విక్టరీ వెంకటేశ్ సూపర్ హిట్ మూవీ 'నువ్వు నాకు నచ్చావ్' రీరిలీజ్ అయింది. ఆదివారం రోజు బెంగళూరులోని తెలుగువారు ఈ సినిమా చూసేందుకు దగ్గర్లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు.సీక్రెట్ కెమెరాఅయితే ఓ మహిళ లేడీస్ వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో అక్కడ ఎవరో సీక్రెట్ కెమెరా పెట్టి రికార్డు చేస్తున్నట్లు గుర్తించింది. వెంటనే విషయాన్ని బయటకు వచ్చి చెప్పింది. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒక అనుమానిత బాలుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. సదరు బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. View this post on Instagram A post shared by Namma Bengaluru (@nammabengaluroo) చదవండి: చెల్లి పెళ్లిలో హీరో డ్యాన్స్.. ఒక్క పైసా తీసుకోలే! -
అమ్మ ఒడిలో తలపెట్టుకుని బాధ.. ఉద్యోగం చేయాల్సింది!
ఈ ఏడాది బోలెడు సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ జనవరి 1న నువ్వు నాకు నచ్చావ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం 2001 సెప్టెంబర్ 1న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.అదీ నా పరిస్థితి!ఈ చిత్రానికి కథ, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన సినిమా రిలీజైనరోజు పడ్డ టెన్షన్ గురించి ఓపెనయ్యాడు. నువ్వు నాకు నచ్చావ్ మొదటిరోజు టాక్ విని భీమవరం వెళ్లిపోయాను. సంతాపసభలో ఉన్నోడిలా ఉంది నా పరిస్థితి!అమ్మ ఒడిలో తలపెట్టుకునిసినిమా చూసి బయటకు వచ్చాక ఎలా ఉందని ఓ వ్యక్తిని రివ్యూ అడిగా.. అతడు రెండు, మూడు వారాలు ఆడుతుందంతే అన్నాడు. నేను చాలా బాధపడ్డాను. ఇంటికెళ్లి మా అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను. ఈ సినిమాలకు నేను పనికిరానేమో.. నువ్వు అన్నట్లుగానే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాను. ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుండేదన్నాను. మా అమ్మ బెంబేలెత్తిపోయింది.చెమటతో ఒళ్లు తడిచిందికట్ చేస్తే నిర్మాత స్రవంతి రవికిషోర్ ఫోన్ చేసి హైదరాబాద్‌కు రమ్మన్నారు. నన్ను శాంతి థియేటర్‌కు తీసుకెళ్లారు. నాకు చెమట్లతో ఒళ్లు తడిచిపోయింది. అక్కడ టికెట్లు తెగుతుంటే అప్పుడు ధైర్యం వచ్చింది అని చెప్పుకొచ్చాడు. అయితే సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చిందని, త్రివిక్రమ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: 2025లో హీరోలు కనిపించలేదు! -
నువ్వు నాకు నచ్చావ్ రెడీ
వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ఈ సినిమా 2001 సెప్టెంబరు 1 విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ సినిమా జనవరి 1న రీ రిలీజ్ అవుతోంది. ఈ మూవీకి కథ, మాటలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత స్రవంతి రవికిషోర్ విలేకరులతో మాట్లాడారు. స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రం ఇంత బాగా రావడానికి వెంకటేష్ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. మేము 85 రోజుల్లో చిత్రీకరించాం. ఈ సినిమా చాలా మందికి స్ట్రెస్ బస్టర్. ‘ఒక్కసారి చెప్పలేవా...’ అనేపాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారిని ఎంతో ఇబ్బంది పెట్టాం(నవ్వుతూ...)’’ అని తెలి΄ారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘రామానాయుడు స్టూడియోలో నాయుడుగారి ఫ్యామిలీకి ఈ మూవీ ప్రివ్యూ వేశాం. వెంకటేష్‌గారి సతీమణి ఈ మూవీ గురించి మాట్లాడారు. ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’ గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో.. ‘నువ్వు నాకు నచ్చావ్’ గురించి రానున్న తరాలు మాట్లాడుకుంటాయన్నారు. అప్పుడు నేను నమ్మలేదు కానీ ఆ మాటలే నిజం అయ్యాయి’’ అన్నారు. -
వెంకీ మామ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మరోసారి ఆ రెండు సినిమాలు!
ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్‌ల హవా కొనసాగుతుంది. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. ఆధునిక సాంకేతికతో 4K ఫార్మాట్లో రీమాస్టర్ చేసి, డాల్బీ అట్మాస్ సౌండ్ తో థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇలా రీరిలీజ్ చేసిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాలన్నీ వరుసగా రీరిలీజ్ అవుతున్నాయి. విక్టరీ వెంకటేశ్ నటించిన రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు త్వరలోనే మరోసారి థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. అందులో ఒకటి ‘పెళ్ళి చేసుకుందాం’. సుప్రసిద్ధ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని సి.వెంకట్రాజు - శివరాజు సంయుక్తంగా నిర్మించారు. పోసాని కృష్ణమురళి సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రాన్ని సాయిలక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై వరప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 కె లో భారీ స్థాయిలో డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు.ఈ మూవీ రిలీజ్ అయిన 18 రోజులకే టాలీవుడ్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయిన “నువ్వు నాకు నచ్చావ్” కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కల్ట్ క్లాసిక్ జనవరి 1, 2026న 4k వెర్షన్లో ప్రపంచ వ్యాప్తంగా రీరిలీజ్ కానుంది.శ్రావంతి రవికిషోర్ గారి నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ, డైలాగ్స్ అందించారు. ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. ఫ్లోరా షైనీ కీలక పాత్ర పోషించింది. 2001 సెప్టెంబర్ 6న విడుదలై ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. -
కాపీ కొట్టడానికి హాలీవుడ్‌నిచ్చావ్!
ఆ సీన్ - ఈ సీన్ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై హాలీవుడ్ ప్రభావం ఎక్కువ. ‘చిరునవ్వుతో’ సినిమా దగ్గర నుంచి మొన్నటి ‘జులాయి’ వరకూ చాలా సినిమాలపై హాలీవుడ్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా సీన్లను తెచ్చు కోవడం త్రివిక్రమ్‌కు ఉన్న అలవాటు. పేరు పొందిన హాలీవుడ్ సినిమాల నుంచి తన మనసుకు నచ్చిన సీన్లను తెచ్చి మన మనసులకు నచ్చేలా తీర్చిదిద్ది తన సినిమాల్లో ప్లేస్ చేస్తుంటాడు త్రివిక్రమ్. ఇలా త్రివిక్రమ్ కలం విన్యాసం చేసిన సినిమాల్లో ఒకటి ‘నువ్వు నాకు నచ్చావ్’. ఇందులో ఎంతో పాపులర్ అయిన ఒక సీన్‌కు మూలం హాలీవుడ్ సినిమాలో ఉంది. హీరో అతిథిగా వచ్చిన ఆ ఇంట్లో అంతా మిలటరీ డిసిప్లిన్. ఇంటి పెద్ద అన్నీ నియమానుసారం జరగాలంటాడు. ఇంటి నుంచి బయటకు వెళ్తే చెప్పి వెళ్లాలి, చెప్పులేసుకు వెళ్లాలి లాంటివి ఆయన నియమాలు. అలాగే భోజనానికి ముందు కచ్చితంగా ప్రార్థన చేసి తీరాలి. ఈ విషయం తెలియక లేటుగా వస్తాడు హీరో. డైనింగ్ టేబుల్ వద్దకు వస్తూనే భోజనం మీద పడ్డ హీరో వైపు ఇంట్లో వాళ్లంతా విచిత్రంగా చూస్తారు. భోంచేసే ముందు దణ్ణం పెట్టుకునే అలవాటు లేదా అన్న ఆ ఇంటి పెద్ద ప్రశ్నతో ఇబ్బంది పడిపోయిన హీరో దాన్ని కవర్ చేసుకునేందుకు చిత్ర విచిత్రమైన ప్రార్థన ఒకటి చేస్తాడు. అప్పటికప్పుడు ఆశువుగా తనకు తోచిన ప్రార్థన చేసేసి ఇంట్లో వాళ్లకి కన్ఫ్యూజన్ను, జనాలకు కామెడీని క్రియేట్ చేస్తాడు. ‘దేవుడా ఓ మంచి దేవుడా... నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావ్, బంగాళాదుంప ఫ్రై ఇచ్చావ్, చారు కూడా ఇచ్చావ్, అదే చేత్తో స్టేట్‌లో ఉన్న ఏడు కోట్ల మందికి, కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, ప్రపంచంలో ఉన్న... నంబర్ కరెక్ట్‌గా తెలీదు, ఎంతమంది ఉంటారో అంతమందికీ ఇవ్వు. యాజిటీజ్‌గా ఇదే మెనూ కాదు, బ్రెడ్డు, బటర్.. వారు ఏం తింటారో అది. అలా ఇస్తావని కోరు కుంటున్నా. నువ్వు ఇస్తావ్. ఎందుకంటే బేసికల్లీ యు ఆర్ గాడ్, ఎ వెరీ గుడ్ గాడ్’ అంటూ సాగుతుంది హీరో ప్రార్థన. ఈ సీన్ చూసి పడీ పడీ నవ్వని ప్రేక్షకుడు లేడన్నది అందరికీ తెలిసిందే. ఇంతగా పండిన ఈ సీన్‌కు మూలం ‘మీట్ ద పేరెంట్స్’ అనే హాలీవుడ్ సినిమాలోని ఓ సన్నివేశం. 2000లో వచ్చిన ‘మీట్ ద పేరెంట్స్’ హాలీవుడ్లో నవ్వులు పూయించింది. ప్రకాశ్‌రాజ్ పాత్రలో ప్రముఖ నటుడు రాబర్ట డి నీరో, వెంకటేష్ పాత్రలో బెన్ స్టిల్లర్ కనిపిస్తారా సినిమాలో. నీరోని ఇంప్రెస్ చేయడానికి డైనింగ్ టేబుల్ వద్ద బెన్ ప్రార్థన చేస్తాడు. వెంకీ ప్రార్థనలోని కొన్ని లైన్లు.. బెన్ ప్రార్థనలోని కొన్ని లైన్లకు అచ్చంగా మ్యాచ్ అవుతాయి. రెండూ చిత్ర విచిత్రమైన ప్రార్థనలే! నిజానికి హీరో ప్రార్థన మాత్రమే కాదు... ఆ తర్వాత కొనసాగింపుగా సాగే ప్రకాష్‌రాజ్ కవిత్వ ప్రహసనం కూడా హాలీవుడ్ సినిమాలోనిదే! హీరో అన్నం తినబోయే ముందు చేసే చిత్ర విచిత్రమైన ప్రార్థన విన్నాక... ప్రకాష్‌రాజ్ పాత్రలో కూడా భావుకత్వం తన్నుకొస్తుంది. తను తన తల్లిమీద రాసుకున్న కవిత్వాన్ని వినిపిస్తాడతను. ‘‘అమ్మా అడక్కుండానే జన్మనిచ్చావ్.. ఏడిస్తే పాలిచ్చావ్.. రాసు కోవడానికి పలకనిచ్చావ్.. గీసుకోవడానికి గడ్డం ఇచ్చావ్...’’ అంటూ సాగే ఆ కవిత మామూలుగా నవ్వించలేదు. ‘మీట్ ద పేరెంట్స్’ సినిమాలోని ఇంటిపెద్ద కూడా తన తల్లి గురించి కూడా ఇలాంటి కవితే వినిపిస్తాడు. ఆ కవితలోని లైన్లు, ప్రకాష్‌రాజ్ చెప్పే కవితలోని లైన్లు కూడా బాగా మ్యాచ్ అవుతాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ప్రకాష్‌రాజ్ కవిత విన్న వెంకటేష్ ‘మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్’ అంటాడు విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ. ఆంగ్ల చిత్రంలో హీరో బెన్ కూడా నీరో కవిత విని సేమ్ డైలాగ్ వల్లిస్తాడు. దాన్ని బట్టి ఈ సీన్ మీద ‘మీట్ ద పేరెంట్స్’ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ‘నువ్వు నాకు నచ్చావ్’లోని డైనింగ్ టేబుల్ సీన్‌కు ఎన్ని పేరడీలు వచ్చాయో చెప్పలేం. ప్రత్యేకించి ప్రకాష్‌రాజ్ తల్లి గురించి చెప్పే కవితపై ఫేస్బుక్లో అనేక పేరడీలు కనిపిస్తూ ఉంటాయి. త్రివిక్రమ్ రచనా ప్రావీణ్యంతో ఈ కవిత అంతగా మనవాళ్లలోకి చొచ్చుకుపోయింది. అయితే త్రివిక్రమ్‌కు ఆ సీన్‌ని రాసేందుకు స్ఫూర్తినిచ్చింది మాత్ర ం నిస్సందేహంగా హాలీవుడ్ చిత్రం ‘మీట్ ద పేరెంట్సే’!


