నువ్వు నాకు నచ్చావ్‌ రెడీ | Nuvvu Naku Nachav Movie Re-Release On Jan 1 | Sakshi
Sakshi News home page

నువ్వు నాకు నచ్చావ్‌ రెడీ

Dec 31 2025 2:14 AM | Updated on Dec 31 2025 2:14 AM

Nuvvu Naku Nachav Movie Re-Release On Jan 1

వెంకటేష్, ఆర్తీ అగర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్‌’. కె. విజయభాస్కర్‌ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌పై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మించిన ఈ సినిమా 2001 సెప్టెంబరు 1 విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ సినిమా జనవరి 1న రీ రిలీజ్‌ అవుతోంది. ఈ మూవీకి కథ, మాటలు అందించిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్, నిర్మాత స్రవంతి రవికిషోర్‌ విలేకరులతో మాట్లాడారు. స్రవంతి రవికిషోర్‌ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రం ఇంత బాగా రావడానికి వెంకటేష్‌ కాంట్రిబ్యూషన్‌ ఎంతో ఉంది. 

మేము 85 రోజుల్లో చిత్రీకరించాం. ఈ సినిమా చాలా మందికి స్ట్రెస్‌ బస్టర్‌. ‘ఒక్కసారి చెప్పలేవా...’ అనేపాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారిని ఎంతో ఇబ్బంది పెట్టాం(నవ్వుతూ...)’’ అని తెలి΄ారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ–‘‘రామానాయుడు స్టూడియోలో నాయుడుగారి ఫ్యామిలీకి ఈ మూవీ ప్రివ్యూ వేశాం. వెంకటేష్‌గారి సతీమణి ఈ మూవీ గురించి మాట్లాడారు. ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’ గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో.. ‘నువ్వు నాకు నచ్చావ్‌’ గురించి రానున్న తరాలు మాట్లాడుకుంటాయన్నారు. అప్పుడు నేను నమ్మలేదు కానీ ఆ మాటలే నిజం అయ్యాయి’’ అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement