breaking news
pelli chesukundam
-
వెంకీ మామ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మరోసారి ఆ రెండు సినిమాలు!
ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్‌ల హవా కొనసాగుతుంది. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. ఆధునిక సాంకేతికతో 4K ఫార్మాట్లో రీమాస్టర్ చేసి, డాల్బీ అట్మాస్ సౌండ్ తో థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇలా రీరిలీజ్ చేసిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాలన్నీ వరుసగా రీరిలీజ్ అవుతున్నాయి. విక్టరీ వెంకటేశ్ నటించిన రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు త్వరలోనే మరోసారి థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. అందులో ఒకటి ‘పెళ్ళి చేసుకుందాం’. సుప్రసిద్ధ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని సి.వెంకట్రాజు - శివరాజు సంయుక్తంగా నిర్మించారు. పోసాని కృష్ణమురళి సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రాన్ని సాయిలక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై వరప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 కె లో భారీ స్థాయిలో డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు.ఈ మూవీ రిలీజ్ అయిన 18 రోజులకే టాలీవుడ్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయిన “నువ్వు నాకు నచ్చావ్” కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కల్ట్ క్లాసిక్ జనవరి 1, 2026న 4k వెర్షన్లో ప్రపంచ వ్యాప్తంగా రీరిలీజ్ కానుంది.శ్రావంతి రవికిషోర్ గారి నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ, డైలాగ్స్ అందించారు. ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. ఫ్లోరా షైనీ కీలక పాత్ర పోషించింది. 2001 సెప్టెంబర్ 6న విడుదలై ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. -
వచ్చే నెల పెళ్లి చేసుకుందాం
వెంకటేశ్ హీరోగా నటించిన ‘పెళ్లి చేసుకుందాం’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబరు 13న వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సూపర్ హిట్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. వెంకటేశ్, సౌందర్య జోడీగా లైలా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెళ్లి చేసుకుందాం’. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో సి. వెంకట్రాజు, జి. శివరాజు నిర్మించిన ఈ సినిమా 1997 అక్టోబరు 9న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది.28 ఏళ్ల తర్వాత ఈ మూవీని రీ–రిలీజ్ చేయనున్నట్లు సాయిలక్ష్మీ ఫిలిమ్స్ అధినేత వరప్రసాద్ తెలిపారు. ‘‘పెళ్లి చేసుకుందాం’ హక్కులను మూడేళ్లకు పొందాం. ఈ చిత్రాన్ని 4కె వెర్షన్లో ఆంధ్ర, తెలంగాణలో భారీ స్థాయిలో రీ–రిలీజ్ చేస్తున్నాం. వెంకటేశ్ అభిమానులతో పాటు రెగ్యులర్ సినీ అభిమానులు కూడా ‘పెళ్లి చేసుకుందాం’ను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని వరప్రసాద్ తెలిపారు. -
గీత స్మరణం
నేడు కె.జె.ఏసుదాస్ పుట్టినరోజు పల్లవి : నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా (2) చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూపే దీపం కాదా ధైర్యం ॥ చరణం : 1 జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం దేహానికైనా గాయం ఈ మందుతోను మాయం విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే ఇల్లాళ్ల దేహాలలో శీలమే ఉండదనా భర్తన్న వాడెవ్వడూ పురుషుడే కాదు అనా శీలం అంటే గుణం అనే అర్థం ॥ చరణం : 2 గురివింద ఈ సమాజం పరనింద దాని నైజం తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం తన కళ్ల ముందు ఘోరం కాదనదు పిరికి లోకం అన్యాయమన్న నీపై మోపింది పాప భారం పడతి పరువు కాచే చేవలేని సంఘం సిగ్గు పడకపోగా నవ్వుతోంది చిత్రం ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్లది అంతేగాని నీలో లేదే దోషం ॥ చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997), రచన : సిరివెన్నెల సంగీతం : కోటి. గానం : కె.జె.ఏసుదాస్


