వెంకటేశ్ హీరోగా నటించిన ‘పెళ్లి చేసుకుందాం’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబరు 13న వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సూపర్ హిట్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. వెంకటేశ్, సౌందర్య జోడీగా లైలా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెళ్లి చేసుకుందాం’. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో సి. వెంకట్రాజు, జి. శివరాజు నిర్మించిన ఈ సినిమా 1997 అక్టోబరు 9న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది.
28 ఏళ్ల తర్వాత ఈ మూవీని రీ–రిలీజ్ చేయనున్నట్లు సాయిలక్ష్మీ ఫిలిమ్స్ అధినేత వరప్రసాద్ తెలిపారు. ‘‘పెళ్లి చేసుకుందాం’ హక్కులను మూడేళ్లకు పొందాం. ఈ చిత్రాన్ని 4కె వెర్షన్‌లో ఆంధ్ర, తెలంగాణలో భారీ స్థాయిలో రీ–రిలీజ్ చేస్తున్నాం. వెంకటేశ్ అభిమానులతో పాటు రెగ్యులర్ సినీ అభిమానులు కూడా ‘పెళ్లి చేసుకుందాం’ను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని వరప్రసాద్ తెలిపారు.


