టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) పెళ్లి పీటలెక్కాడు. ప్రియురాలు హరణ్య మెడలో మూడుముళ్లు వేశాడు. హైదరాబాద్‌లో గురువారం (నవంబర్ 27న) ఉదయం ఈ వివాహ వేడుక జరిగింది. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాహుల్ ప్రస్థానం
హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో మధ్య తరగతి కుటుంంలో రాహుల్ సిప్లిగంజ్ జన్మించాడు. అతడికి సంగీతంపై ఉన్న ఆసక్తి గమనించిన తండ్రి గజల్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లాడు. ఓవైపు సంగీతంలో శిక్షణ తీసుకుంటూ మరోవైపు తండ్రికి సాయంగా బార్బర్ షాప్‌లో పని చేశాడు.

ఫేమస్ సాంగ్స్
కాలేజీ బుల్లోడ.. వాస్తు బాగుందే.. ఈగ టైటిల్ సాంగ్.. సింగరేణుంది బొగ్గే పండింది, రంగా రంగా రంగస్థలానా.. బోనాలు ఇలా అనేక సాంగ్స్ పాడాడు. మంగమ్మ, పూర్ బాయ్, గల్లీకా గణేశ్, దావత్ వంటి పలు ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటునాటు పాట అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.


