పెళ్లి వేళ.. రష్మిక, విజయ్‌ విద్యార్హతలు వైరల్‌.. ఎవరెంత చదువుకున్నారు? | Rashmika Mandanna, Vijay Devarakonda Education Details | Sakshi
Sakshi News home page

చదువులో విజయ్‌ని మించిన రష్మిక.. ఎవరెంత చదువుకున్నారు?

Feb 27 2026 9:36 AM | Updated on Feb 27 2026 10:07 AM

Rashmika Mandanna, Vijay Devarakonda Education Details

టాలీవుడ్‌ ప్రేమ పక్షులు విజయ్‌ దేవరకొండ, రష్మిక భార్యభర్తలయ్యారు. ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్‌ ప్యాలెస్‌లో  వీరి వివాహం జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి ఫోటోలను అటు రష్మిక, ఇటు విజయ్‌ ఒకేసారి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో రష్మిక, విజయ్‌లకు సంబంధించిన మరో విషయంపై కూడా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారు? వీళ్ల ఎడ్యుకేషన్‌ ఎలా సాగింది? తదితర వివరాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

విజయ్‌ ఏం చదువుకున్నాడు?
విజయ్‌ దేవరకొండ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ అంతా అనంతపురం జిల్లా పుట్టపర్తిలోనే సాగింది. శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో బోర్డింగ్ విద్యార్థిగా తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత  హైదరాబాద్‌కు చేరుకున్న విజయ్, అబిడ్స్‌లోని భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుండి బీకాం (B.Com) డిగ్రీని పూర్తి చేశాడు.  ఆ తర్వాత చదువు ఆపేసి.. ప్యాషన్ వైపు అడుగులు వేశాడు. థియేటర్ ఆర్ట్స్ ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు.

చదువులోనూ రష్మిక ‘స్టారే’
రష్మిక నటిగానే కాకుండా చదవులోనూ ‘స్టార్‌’గానే కొనసాగింది. ఆమె పాఠశాల విద్య మొత్తం కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్‌లో సాగింది. ఉన్నత చదువుల కోసం బెంగళూరు వెళ్లిన రష్మిక, అక్కడ ఎం.ఎస్. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. కేవలం ఒకే సబ్జెక్టులో కాకుండా, రష్మిక సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో ట్రిపుల్ మేజర్ డిగ్రీని పూర్తి చేయడం గమనార్హం.

మొత్తంగా విజయ్‌, రష్మిక ఇద్దరూ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినప్పటికీ.. డిగ్రీల పరంగా చూస్తే మాత్రం విజయ్‌ కంటే రష్మికనే కాస్త ముందంజలో ఉంది.  ఆమె సైకాలజీ, జర్నలిజం లాంటి కీలక రంగాలలో డిగ్రీ పట్టాపొందింది. 

Advertisement
 
Advertisement
Advertisement