ప్రముఖ ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు సందేశాత్మకంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్‌గ్యారీలో నిర్వహిస్తున్న ఇండియన్ ఫొటో ఫెస్టివల్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. జనవరి 4వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ ఫెస్టివల్‌లో జాతీయ, అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్‌లు 450 మంది పాల్గొన్నారు.
వారు తీసిన 1500 చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. కళలను ప్రజలకు చేరువ చేయడం, సామాజిక కథనాలు చెప్పడం, సమాజం, సంస్కృతి, పరిసరాలు, మానవ భావోద్వేగాలపై శక్తివంతమైన ఫొటోలు. పిల్లలు, యువ ఫొటోగ్రాఫర్‌లకు ప్రోత్సాహం కల్పించడం. భారత ఫొటోగ్రఫీ పరిశ్రమను బలోపేతం చేయడం. ఫొటో ఫెస్టివల్‌లో ఎగ్జిబిషన్‌లు, వర్క్‌షాప్‌లు, టాక్స్, ప్యానల్ డిస్కషన్లు, పోర్ట్‌ఫోలియో రివ్యూలు, ఫొటో బుక్‌లాంచ్‌లు జరుగనున్నాయి.
పాల్గొన్న దేశాలు
బ్రెజిల్, సౌత్‌కొరియా, కొస్టారికా, రష్యా, బెల్జియం, యూకే, ఫ్రాన్స్, ఇరాన్, జర్మనీ, నెదర్లాండ్స్, టర్కీ, నైజీరియా, నేపాల్ తదితర దేశాలు పాల్గొన్నాయి.
(చదవండి: అక్షరం అజరామరం..! భాగ్యనగరంలో పాతపుస్తకాలకు తరగని ఆదరణ)


