సాక్షి, హైదరాబాద్: నగరంలోని సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు అడ్వాన్స్‌డ్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్(ఏఎస్ఎస్జీపీ) అనే నూతన వ్యవస్థకు హైదరాబాద్ సిటీ పోలీస్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఎంపవరింగ్ యూవర్ ఎవరీడే సేప్టీ(ఐస్) బృందాలను ఏర్పాటు చేసింది. సీసీటీవీల వ్యవస్థను విస్తరించడంతో పాటు, అవి నిరంతరం సజావుగా పనిచేసేలా ఈ బృందాలు చర్యలు చేపడుతాయి.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో గురువారం అడ్వాన్స్‌డ్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్ తో పాటు ఐస్ బృందాలను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ప్రారంభించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో కలిసి లోగో ను ఆవిష్కరించారు. నూతనంగా ఏర్పాటైన ఐస్ బృందాలకు రిపేర్ కిట్ లను అందించి వారికి కేటాయించిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

సిటీలో ప్రస్తుతం 16 వేలకు పైగా వీధి సీసీటీవీ కెమెరాలు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఉన్నాయి. 50 వేలకు పైగా కమ్యూనిటీ, ప్రైవేట్ ఫీడ్లు, లక్షకు పైగా నేనుసైతం సీసీటీవీ కెమెరాలున్నాయి. వాటితో పాటు అదనంగా బాడీ-వోర్న్ కెమెరాలు, పోలీస్ డ్రోన్లు వంటి ఆధునిక పరికరాలు కూడా త్వరలో ఈ నెట్‌వర్క్‌లో భాగం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విస్తృత వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఐస్ అనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

టెక్నాలజీ డ్యూ డిలిజెన్స్ టీమ్:
పరికరాలకు కనీస ప్రమాణాలు నిర్ధారించడం, ఇన్నోవేషన్ హబ్‌లు, ప్రధాన టెక్ సంస్థలతో కలిసి నూతన పరిష్కారాలను అన్వేషించడం వంటి పనులు చేపడుతుంది.
కెమెరా సపోర్ట్ కాల్ సెంటర్:
ఫీల్డ్ ఆపరేషన్లకు మద్దతుగా లోపాలను సరిచేయడం, నష్ట నివారణ, సర్వీస్ టికెట్ జనరేషన్–క్లోజర్ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. దర్యాప్తు అధికారులకు కావాల్సిన వీడియో ఫుటేజ్ సంబంధిత ప్రశ్నలకు మొదటి స్పందన కేంద్రంగా పనిచేస్తుంది.
ఐస్ ఫీల్డ్ టీమ్స్ – ప్రతి జోన్‌కు 2 బృందాలు
దీనిలో లోపం గుర్తించిన వెంటనే కేసు ఫీల్డ్ టీమ్‌కి వెళ్తుంది. సాంకేతికంగా శిక్షణ పొందిన ఈ బృందాలు అత్యవసర బ్రేక్‌డౌన్‌లకు స్పందించి, సీసీటీవీ మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తాయి. అవసరమైతే సివిల్, స్ట్రక్చరల్ కాంట్రాక్టర్లతో సమన్వయం చేస్తాయి.

స్టోర్స్ టీమ్
రేడియో ఫ్రీక్వేన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారంగా ట్యాగింగ్, వ్యవస్థీకృత ఇన్వెంటరీ ప్లానింగ్, విలువైన స్పేర్ పార్ట్స్ నిర్వహణ ద్వారా ఫీల్డ్ బృందాలకు బలమైన లాజిస్టికల్ మద్దతు ఇస్తుంది.
రిపేర్ సెంటర్
ప్రధాన భాగాల సాంకేతిక తనిఖీలు, ఇన్-హౌస్ రిపేర్లు, Original Equipment Manufacturer(OEM)లతో కలిసి వారంటీ ఆధారిత భర్తీలు నిర్వహిస్తుంది.
సీఎస్ఆర్ డెస్క్
Hyderabad City Security Council (HCSC) తో అనుసంధానమై “Adopt a Camera”, “Share a Live Feed” వంటి ప్రచారాలను నిర్వహిస్తూ కమ్యూనిటీ, కార్పొరేట్ భాగస్వామ్యాలను విస్తరించేందుకు పనిచేస్తుంది.
డేటా అనలిటిక్స్ టీమ్
రియల్-టైమ్ డాష్‌బోర్డులు రూపొందించడం, డేటా ఆధారిత నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం, కాల్ సెంటర్ టెలిఫోనీ–వర్క్‌ఫ్లోలను పర్యవేక్షించడం వంటి వాటిని నిర్వహిస్తుంది. పరిశీలన కార్యకలాపాలను రియాక్టివ్ నుండి ప్రోయాక్టివ్ స్థాయికి తీసుకెళ్లడంలో ఇది కీలకంగా నిలుస్తుంది.
ఐస్ ఆవిష్కరణ నగర భద్రతలో మైలురాయిగా నిలుస్తుందని హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, అన్నారు. టెక్నాలజీ డ్యూ డిలిజెన్స్, వేగవంతమైన ఫీల్డ్ స్పందన, బలమైన లాజిస్టిక్స్, అనలిటికల్ ఇంటెలిజెన్స్, సహకార ఫండింగ్ మోడల్ ఇవన్నీ నగరంలోని సీసీటీవీ నిర్వహణ విధానాన్ని పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తాయని ఆయన తెలిపారు.
ప్రతి జోన్ లో రెండు ఐస్ టీములను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి సీసీటీవీ సమస్యను ఇవి పరిష్కరిస్తాయన్నారు. ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి సీసీటీవీ కెమెరాలను దానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎస్ఆర్ లో భాగంగా క్రిస్టియన్ లీడర్స్ ఫోరమ్ ఇచ్చిన రూ.4 లక్షల చెక్ ను సీపీ వీసీ సజ్జనర్కి సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి శిల్పావల్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు.


