హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టింది పోలీస్ శాఖ. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రబాకర్, డీజీపీ శివధర్‌రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. ముందుగా అరైవ్ అలైవ్” థీమ్ సాంగ్‌ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు.
దీనిలో భాగంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే అరైవ్ అలైవ్ కార్యక్రమం ఉద్దేశం. అరైవ్ అలైవ్ అనేది ఒక కార్యక్రమం కాదు ఇది ఒక ఉద్యమం. ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం మరింత ఉత్తేజం ఇస్తోంది. ప్రజలందరు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలి. రాష్ట్రంలో సుమారు 30 వేల కిలోమీటర్ల రహదారి నెట్‌వర్క్ ఉంది. ఏడాదికి 27 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
గత ఏడాది 800 హత్యలు జరిగితే 7500 మంది రోడ్ల ప్రమాదాల్లో మరణించారు. హత్యలో కన్నా రోడ్డు ప్రమాదాల్లో నే ఎక్కువగా మరణించారు.2025 మరణాలు తగ్గాయి యాక్సిడెంట్లు పెరిగాయి. రోడ్డు ప్రమాదాల పై చాలా మందికి సీరియన్ నెస్ ఉండటం లేదు. 72 శాతం ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నరు.. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే అరైవ్ అలైవ్ లక్ష్యం నెరవేరుతుంది. హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి.. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ పోన్ వాడకూడదు. రేపటి నుండి 10 రోజుల వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం జరుగుతుంది’ అని స్పష్టం చేశారు.


