నల్లగొండలో భారీ దోపిడీకి పాల్పడ్డ రోహింగ్యాలు | Major robbery by Rohingyas in Nalgonda | Sakshi
Sakshi News home page

నల్లగొండలో భారీ దోపిడీకి పాల్పడ్డ రోహింగ్యాలు

Jan 12 2026 7:11 PM | Updated on Jan 12 2026 7:48 PM

Major robbery by Rohingyas in Nalgonda

నల్లగొండ: నల్లగొండలో రోహింగ్యాలు హల్‌చల్‌ చేశారు. నల్లగొండ సమీపంలో ఉన్న ఓ పైపుల కంపెనీలో చోరీకి పాల్పడ్డారు. బ్యాటరీలతో పాటు ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు రోహింగ్యాలు.  ఈ చోరీకి పాల్పడిన రోహింగ్యాలు హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫీక్ ఆలంను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

రూ. అరవై లక్షల విలువైన సామాగ్రితో పాటు ఆటో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరు 2012-2013లో హైదరాబాద్‌ నగరానికి వచ్చారని, గతంలో ఓ కేసుకు సంబంధించి జైలుకు వెళ్లొచ్చారని, అయినప్పటికీ తీరు మారలేదని పోలీసులు అంటున్నారు. ఈ దొంగతనం కేసులో మరో నలుగురు రోహింగ్యాలు పరారీ అయినట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement