శారదా పీఠాన్ని కూల్చడానికి రేవంత్‌ సర్కార్‌ కుట్ర: హరీష్‌ రావు | BRS Harish Rao Key Comments On Sharada Peetham In Telangana | Sakshi
Sakshi News home page

శారదా పీఠాన్ని కూల్చడానికి రేవంత్‌ సర్కార్‌ కుట్ర: హరీష్‌ రావు

Feb 28 2026 10:33 AM | Updated on Feb 28 2026 10:48 AM

BRS Harish Rao Key Comments On Sharada Peetham In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇళ్లు కూల్చడం అయిపోయింది.. దేవాలయాలు కూల్చడానికి కాంగ్రెస్‌ నేతలు బయలుదేరారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం రేవంత్‌కు ఇష్టం లేదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. దేవాలయ భూమి జోలికి రావొద్దు అని హితవు పలికారు. 

మాజీ మం‍త్రి హరీష్‌ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు రేవంత్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆలయ నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయింపు జరిగింది. ఇప్పుడు దేవాలయ స్తలాన్ని లాక్కునేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ పోలీసులను ప్రయోగించింది. పీఠం నిర్వాహకులను భయాందోళనలకు గురిచేయడం సరికాదు. శారద పీఠం ఆధ్వర్యంలో  16 దేవాలయాలు ఉన్నాయి. వేదం, గోశాల, నిత్య అన్నదాన కార్యక్రమాలు జరిగితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. దేవాలయాలు కూల్చడమే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమా?. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం రేవంత్‌కు ఇష్టం లేదా?.

గుళ్లు, ఇల్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నారు. సర్వే నెంబర్  239, 240లలో పది ఎకరాలు భాగ్యలక్ష్మి మైన్స్ మినరల్స్ కంపెనీలు ఉన్నాయి. పక్కన 17 ఎకరాల స్థలం కబ్జా చేశారు. రేవంత్ అల్లుడికి ఇవ్వడానికి భూములు ఉన్నాయి. రాత్రి 11 గంటలకు పోలీసులు, ఎమ్మార్వో వచ్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చాలని చూస్తున్నారు. మేము రాగానే పోలీసులు, అధికారులు పారిపోయారు. చట్టపరంగా పద్ధతులు పాటించరా?. దేవాలయాల భూమి కూల్చడానికి శ్రీధర్ బాబు ఎలా ఒప్పుకున్నారు?. స్థలం లేక కాదు.. కక్షతో చేస్తున్నారు. గుడిని, మఠాన్ని కూడా వదలరా?. బ్రహ్మణులు పూజలు చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయాల్లో పూజలు ఆపే మూర్ఖత్వమా?. ఇదేం సంస్కృతి?. క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుని కూల్చేస్తారా?. దేవాలయ భూమి కాపాడడానికి మేం పోరాటం చేస్తాం. దేవాలయ భూమి జోలికి రావొద్దు అని హితవు పలికారు. 

Advertisement
 
Advertisement
Advertisement