ప్రసన్న కుమార్‌ అలియాస్‌ అంజలి! | Hyderabad cybercrime police arrest fraud suspect at Chennai airport | Sakshi
Sakshi News home page

ప్రసన్న కుమార్‌ అలియాస్‌ అంజలి!

Feb 28 2026 8:21 AM | Updated on Feb 28 2026 8:21 AM

Hyderabad cybercrime police arrest fraud suspect at Chennai airport

సాక్షి,హైదారాబాద్‌: విశాఖపట్నానికి చెందిన పెదపూడి ప్రసన్న కుమార్‌ కాంబోడియాలో కూర్చుని అంజలి కందులగా మారాడు. ఈ పేరుతో మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా నగరానికి చెందిన యువకుడి పరిచయమయ్యాడు. చాటింగ్‌ చేస్తూ చీటింగ్‌ మొదలుపెట్టి క్రిప్టో ట్రేడింగ్‌లో ఇన్వెస్టిమెంట్‌ అన్నాడు. ఇలా రూ.11 లక్షలకు పైగా కాజేసి తన వాటా తీసుకున్నాడు. కాంబోడియా కేంద్రంగా సాగుతున్న భారీ సైబర్‌ క్రైమ్‌ నెట్‌వర్క్‌లో సూత్రధారిగా ఉన్న ప్రసన్న కుమార్‌ను సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ వి.అరవింద్‌ బాబు శుక్రవారం ప్రకటించారు. ఇతడిపై జారీ చేసిన ఎల్‌ఓసీ ఆధారంగా చెన్నై విమానాశ్రయంలో దిగిన వెంటనే పట్టుకుని సిటీకి తీసుకువచ్చారు. 

ప్రసన్న కుమార్‌ 2024 ఏప్రిల్‌లో విదేశీ ఉద్యోగం కోసం విశాఖలోని జాబ్‌ కన్సల్టెంట్‌ను సంప్రదించాడు. డేటా ఆధారిత ఉద్యోగం కలి్పస్తామని చెప్పి కంబోడియా పంపారు. అక్కడకు చేరుకున్న ప్రసన్నకు భారతీయులను సోషల్‌మీడియా వేదికల ద్వారా మోసం చేసే వ్యవస్థీకృత ముఠా సూత్రధారులతో పరిచయం ఏర్పడింది. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు వారితో చేతులు కలిపి వివిధ రకాలైన ఫ్రాడ్స్‌ చేయడంపై శిక్షణ పొందాడు. ఆపై నేరుగా రంగంలోకి దిగిన ప్రసన్న విశాఖకే చెందిన రవి కిరణ్, గంగ రాజుల నుంచి దాదాపు 500 సిమ్‌కార్డులను అక్రమంగా పొందాడు. ఆ నెంబర్ల ఆధారంగా వివిధ సోషల్‌మీడియా, మాట్రియోనియల్‌ సైట్లలో ఆక్షణీయమైన యువతులు, మహిళల ఫొటోలు, పేర్లతో నమోదయ్యాడు. అలా ఇక్కడి వారితో పరిచయం పెంచుకుని, పెళ్లి ప్రస్తావన తెచి్చ, చాటింగ్‌ ద్వారా బోగస్‌ క్రిప్టో, ఫారెక్స్‌ ట్రేడింగ్‌ వెబ్‌సైట్లలో పెట్టుబడులు పెట్టి స్వాహా చేయడం మొదలుపెట్టాడు. 

నగరానికి చెందిన యువకుడికి (28) ఇతగాడు అంజలి కందులగా మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా పరిచయమయ్యాడు. తాను లండన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని నమ్మించాడు. ప్రేమ, పెళ్లి అంటూ మాటలు చెప్పి ఆపై అసలు కథ మొదలుపెట్టాడు. తన మామ క్రిప్టో ట్రేడింగ్‌ నిపుణుడని ఆయన చెప్పినట్లు పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఎర వేశాడు. దీనికి బాధితుడు అంగీకరించడంతో నకిలీ క్రిప్టో ట్రేడింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టుబడి పెట్టించాడు. ఈ బోగస్‌ ప్లాట్‌ఫామ్స్‌ డ్యాష్‌బోర్డుల్లో భారీ మొత్తం బ్యాలెన్స్‌ ఉన్నట్లు చూపిస్తూ రూ.11,17,834 ఇన్వెస్ట్‌ చేయించారు. బాధితుడు ఈ మొత్తాన్ని గత ఏడాది నవంబర్‌ 13న విత్‌డ్రా చేసుకోవాలని ప్రయతి్నంచగా సాధ్యం కాలేదు. తనతో తియ్యగా మాట్లాడిన అంజలి పేరుతో ఉన్న సోషల్‌మీడియా, మాట్రిమోనియల్‌ ఖాతాలు సైతం మాయం అయ్యాయి. 

దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఫోన్‌ నెంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు తొలుత విశాఖపటా్ననికి చెందిన రవి కిరణ్, గంగ రాజులను అరెస్టు చేశారు. వీరి విచారణలో ప్రసన్న కుమార్‌ పేరు వెలుగులోకి వచి్చంది. అతడు కాంబోడియాలో ఉన్నాడని తెలియడంతో లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేసి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు పంపారు. మంగళవారం కాం»ొడియా నుంచి వచి్చన ప్రసన్న చెన్నై విమానాశయంలో దిగాడు. ఎల్‌ఓసీ ఆధారంగా పట్టుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ప్రసన్నను అరెస్టు చేసి తీసుకువచ్చింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement