భారీగా పెరిగిన కరివేపాకు ధరలు | Another Shock to Common People Curry Leaves Prices Surge Sharply | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన కరివేపాకు ధరలు

Feb 28 2026 6:56 AM | Updated on Feb 28 2026 6:57 AM

 Another Shock to Common People Curry Leaves Prices Surge Sharply

కిలోకు రూ.100– 120     

రెండు నెలల్లో ధర రెట్టింపు

హైదరాబాద్‌: నగర మార్కెట్లలో కిలో కరివేపాకు రూ.100–120 వరకు పలుకుతోంది. చిన్న కట్ట కావాలన్నా రూ.10 పెట్టాల్సిందే. రెండు నెలల క్రితం కిలో కరివేపాకు ధర రూ.50–60 ఉండగా.. ప్రస్తుతం రెండింతలైంది. చలి కారణంగా ఆకులు రాలిపోవడంతో నగరానికి కరివేపాకు దిగుమతి భారీగా తగ్గిపోయింది.

అరకొరగా వచ్చే దిగుమతులతో ధరలకు రెక్కలొచ్చాయి. గుడిమల్కాపూర్, మాదన్నపేట్, బోయిన్‌పల్లి, మీరాలంమండి, శంషాబాద్‌ తదితర హోల్‌సేల్‌ మార్కెట్లలో కిలో రూ.80–100 వరకు పలుకుతుండగా.. వారాంతపు సంతలు, ఇతర లోకల్‌ మార్కెట్లలో కిలో రూ.100–120 ధర పలుకుతోంది.  నెల రోజుల్లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement