నేను చెప్పినట్టే తీర్పు వచ్చింది | Kalvakuntla Kavitha has welcomed recent judgment in Delhi Liquor Case | Sakshi
Sakshi News home page

నేను చెప్పినట్టే తీర్పు వచ్చింది

Feb 28 2026 5:28 AM | Updated on Feb 28 2026 9:01 AM

Kalvakuntla Kavitha has welcomed recent judgment in Delhi Liquor Case

ఢిల్లీ లిక్కర్‌ కేసులో కోర్టు తీర్పుపై కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇది నాకు ఆశీర్వాదమే 

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని గతంలో తాను చెప్పినట్లుగానే కోర్టు తీర్పు వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. మద్యం పాలసీ కేసులో నిందితులుగా పేర్కొన్న వారందరికీ కోర్టు క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. లిక్కర్‌ కేసులో శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలో కవిత మీడియాతో మాట్లాడారు. ‘ఈ కేసు మూలంగా ఐదున్నర నెలల పాటు పిల్లలు, కుటుంబానికి దూరంగా ఉంటూ బాధ, అవ మానాలు, వ్యక్తిత్వ హననం ఎదుర్కొన్నా. ఎన్ని కోట్లు ఇచ్చినా నేను పొందిన అవమానానికి, కోల్పోయిన సమయానికి వెలకట్టలేరు. కుటుంబం ఇచ్చిన ధైర్యంతోనే కన్నీళ్లు దిగమింగుకుని ముందుకు సాగా. ప్రజా సేవ చేసేందుకు ఈ కేసులు నాకు ఎంతమాత్రం అడ్డంకి కాబోవు..’ అని కవిత పేర్కొన్నారు.

కేసులు నేను ఒంటరిగా ఎదుర్కొన్నా..
‘కోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించి ఓ వైపు అభినందనలు తెలు పుతూనే మరోవైపు ఎన్నికల్లో పార్టీ ఓటమికి నేనే కారణం అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌పై కక్ష సాధింపులో భాగంగా నాపై కేసు పెట్టారు. నేను జైలుకు వెళ్లిన తర్వాత కేసీఆర్, కేటీఆర్‌తో సహా పార్టీ పెద్ద నాయకులు ఎవరూ ప్రెస్‌మీట్‌లు పెట్టలేదు. కేసులు నేను ఒంటరిగా ఎదుర్కొన్నా. కనీ సం పార్టీ సోషల్‌ మీడియా కూడా మద్దతు ఇవ్వలేదు. తప్పుడు ప్రచారా లను ఎదుర్కొని ఉంటే బీఆర్‌ఎస్‌కు ఈ తరహా గతి పట్టేది కాదు.

ఉద్యో గాలు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వకపోవడం, దోపిడీదార్లకు టికెట్లు ఇవ్వ డం, పార్టీ నేతల అహంకారం వల్లే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైందనే విమర్శ ఉంది. కానీ కోర్టు తీర్పును తమకు అనుకూలంగా మలుచు కుని బీఆర్‌ఎస్‌ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. కేటీఆర్‌ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి తప్పులను సమీక్షించుకోవాలి.  ఒక వ్యక్తి తప్పు చేస్తే ఓటమి పాలయ్యే స్థితిలో బీఆర్‌ఎస్‌ ఉందా. అసెంబ్లీ ఎన్నికల సమ యంలో నా పేరు ఎక్కడా చర్చల్లో లేదు. మద్యం పాలసీ కేసు విష యంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకే రీతిలో మాట్లాడుతున్నాయి. నేను పార్టీ పెట్టాలని అనుకుంటున్న సమయంలో కోర్టు తీర్పు నాకు ప్రకృతి సహకరించి ఇచ్చిన ఆశీర్వాదంలా భావిస్తున్నా..’ అని కవిత వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement