వేధింపులు తాళలేక ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | Mahabubabad district incident | Sakshi
Sakshi News home page

వేధింపులు తాళలేక ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Feb 28 2026 4:52 AM | Updated on Feb 28 2026 4:52 AM

Mahabubabad district incident

ఏకలవ్య రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, వార్డెన్‌పై కలెక్టర్‌కు తండ్రి ఫిర్యాదు

కురవి: మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌/కాలేజీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, వార్డెన్‌ల వేధింపులు తాళలేక ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని బాత్‌రూంలు కడిగే ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. ఈ ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. బాలిక తండ్రి పాల్తియా కిషన్‌ జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కేసముద్రం మండలం పెద్దమోరీ తండాకు చెందిన పాల్తియా కిషన్‌ కూతురు దివ్యశ్రీ (17) ఇంటర్‌ ఎంపీసీ మొదటి సంవత్సరం కురవిలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలో చదువుతోంది.

కొద్ది రోజుల నుంచి వార్డెన్‌ సుజాత, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది లాలు, స్వప్న, నవ్య, సృజనలు సూటిపోటి మాటలు, అసభ్యకర పద జాలంతో మాట్లాడుతున్నారని దివ్యశ్రీ తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ప్రిన్సిపాల్‌కు విష యం వివరించినా వారిలో మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దివ్యశ్రీ ఈనెల 25న కాలేజీలో మధ్యాహ్నం బాత్‌రూంలు కడిగే ఫినాయిల్‌ను తాగింది.

గమనించిన సహ విద్యార్థినులు, కాలేజీ సిబ్బంది వెంటనే మహబూబాబాద్‌లోని జనరల్‌ ఆస్పత్రికి తర లించి చికిత్స అందించారు. తల్లిదండ్రులు శుక్రవారం బాలికను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. కిషన్‌ ఈ విషయమై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేశారు. విచా రణ చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక ఆరోగ్యం ప్రస్తుతం నిల కడగానే ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement