దేశీ మిర్చికి రికార్డు ధర | Desi variety of Chilli fetches record Rs 50000 per quintal in Warangal | Sakshi
Sakshi News home page

దేశీ మిర్చికి రికార్డు ధర

Feb 28 2026 3:53 AM | Updated on Feb 28 2026 3:53 AM

Desi variety of Chilli fetches record Rs 50000 per quintal in Warangal

క్వింటాల్‌కు రూ.50 వేలు 

వరంగల్‌: ప్రస్తుత సీజన్‌లో దేశీ మిర్చి రకానికి రికార్డు ధర క్వింటాల్‌కు రూ.50 వేలు పలికింది. వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పుల్లూరుపల్లికి చెందిన రవీందర్‌రావు 9 బస్తాల మిర్చిని తీసుకురావడంతో అంబికా కంపెనీ అడ్తి శాంతి ఇండస్ట్రీస్‌ అమ్మించగా క్వింటాల్‌కు రూ.50 వేలు చెల్లించి కొనుగోలు చేశారు.

ఇటీవల ఇదే రకం మిర్చి క్వింటాల్‌కు రూ.36 వేలు పలుకగా శుక్రవారం అత్యధికంగా రూ.50 వేలు ధర పలికిందని మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్‌.మల్లేశం తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు 300 బస్తాల దేశీ మిర్చి రకం వచ్చిందని, క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.50 వేలు కాగా కనిష్ట ధర రూ.18 వేలు, మోడల్‌ ధర రూ.30 వేలు పలికిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement